02-12-2018, 07:40 AM
బీరకాయ, బియ్యప్పిండి సూప్
Quote:కావల్సినవి; బీన్స్ - నాలుగు, క్యాబేజీ - చిన్న ముక్క, క్యారెట్ - ఒకటి, బీరకాయ - సగం ముక్క, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి - రెండు చెంచాల చొప్పున, నూనె - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - ఒకటి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాలపొడి - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు.
Quote:తయారీ: కూరగాయలన్నింటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పచ్చిమిర్చి తరుగూ, జీలకర్ర పొడీ, మిరియాల పొడి వేయాలి. వెంటనే తరిగిన కూరగాయ ముక్కలూ, తగినంత ఉప్పూ, కప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి. కూరగాయ ముక్కలు కాస్త ఉడికాయనుకున్నాక బియ్యప్పిండీ, మొక్కజొన్న పిండిని ఓ కప్పు లోకి తీసుకుని అరకప్పు నీళ్లు పోసి కలపాలి. దీన్ని ఉడుకుతోన్న కూరగాయ ముక్కల్లో వేసి మంట తగ్గించాలి. చిక్కగా అయ్యాక నిమ్మరసరం, కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే చాలు.

