రాజ్మా, చిక్కుడు గింజల సూప్
Quote:కావల్సినవి: రాజ్మా - కప్పు, చిక్కుడు గింజలు - కప్పు, టొమాటోలు- రెండు, ఎండుమిర్చి - రెండు, ఉల్లిపాయ- ఒకటి, నిమ్మరసం - రెండు చెంచాలు, వేయించిన జీలకర్ర పొడి - చెంచా, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు-తగినంత.తయారీ: రాజ్మా గింజల్ని పన్నెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరవాత ఉప్పు వేసి కుక్కర్‌లో చిక్కుడు గింజలతో సహా ఐదారు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. చల్లారాక ఆ రెండింటినీ ముద్దలా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఎండుమిర్చీ, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక రాజ్మా ముద్ద, రెండు కప్పుల నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకూ ఉడికించుకోవాలి. తరవాత జీలకర్రపొడీ, నిమ్మరసం, మరికొంచెం ఉప్పు వేయాలి. ఇది కాస్త చిక్కగా అవుతున్నప్పుడు కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.

