02-12-2018, 07:37 AM
టొమాటో, క్యారెట్ సూప్
Quote:కావల్సినవి: క్యారెట్లు, - రెండు, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, వేయించిన మిరియాల పొడి - అరచెంచా, జీలకర్ర పొడి - చెంచా, తరిగిన కొత్తిమీర - రెండు చెంచాలు, ఉల్లికాడల తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తయారీ: టొమాటో, క్యారెట్, ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి, పావుకప్పు నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. ఈ గుజ్జు ఉడికి, చిక్కగా అయ్యాక మిరియాలపొడీ, తగినంత ఉప్పూ, జీలకర్రపొడీ వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక కొత్తిమీర తరుగూ, ఉల్లికాడల తరుగు వేసి దింపేస్తే చాలు.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish