Thread Rating:
  • 4 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భద్రాచలం దేవస్థానం
#2
ఈ ఆలయంలో శ్రీపాంచరత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్యపూజలు.. ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
 
దర్శనవేళలు 
* రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు. 
 
* ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.. ఈ పూజలో పాల్గొనేందుకు రూ.100 టిక్కెట్‌పై ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు. 
 
* ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చనలుంటాయి. వీటిల్లో రూ. 150 టిక్కెట్‌ ద్వారా పాల్గొనవచ్చు. 
 
* ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొనేందుకు రూ. వెయ్యి చెల్లిస్తే.. ఒకరు.. లేదా దంపతులను అనుమతిస్తారు. 
 
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ ఆలయాన్ని మూసేస్తారు. 
 
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్‌సేవ జరుగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల వరకు నివేదన. పవళింపు సేవ ఉంటుంది.
 
 
ముఖ్యమైన పూజలు
 
అభిషేకాలు 
* ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు ప్రతిరోజూ భద్రుడి మండపంలో స్వామివారి పాదాలకు అభిషేకం జరుగుతుంది. టిక్కెట్‌ ధర రూ. 100. ఒక్కరు లేదా దంపతులకు ప్రవేశం. ప్రతి ఆదివారం మూలవరులకు అభిషేకం జరుగుతుంది. ఈ సేవలో పాల్గొనేందుకు రూ. 1100 చెల్లించాలి. 
 
* ప్రతి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు లక్ష్మీతాయరు అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇందులో పాల్గొనేందుకు రూ. 100 చెల్లించాలి. ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు. 
 
* ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వారికి జరిగే అభిషేకంలో పాల్గొనేందుకు రూ. 100 చెల్లిస్తే.. ఒక్కరు లేదా దంపతులను అనుమతిస్తారు. 
 
* ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీయోగానంద లక్ష్మీనరసింహా స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో పాల్గొనేందుకు రూ. 100 చెల్లిస్తే.. ఒక్కరు లేదా దంపతులకు అవకాశమిస్తారు.
 
 
శాశ్వత సేవలు
 
* శరన్నవరాత్రుల్లో 9 రోజులపాటు శ్రీ మద్రామాయణ పారాయణ చేసేందుకు రూ. 10,000. 
* (శ్రీరామనవమి మినహా.. మిగతా రోజుల్లో) స్వామివారి శాశ్వత కల్యాణం జరిపించేందుకు... రూ. 10,000. 
 
* శరన్నవరాత్రి, ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో ఒక్కో అలంకారానికి రూ. 10వేలు. 
 
*హంస, గరుడ, అశ్వ, సూర్యప్రభ, సేవల శాశ్వత ఉభయదాతలకు... రూ.5,100 (బోయిల ఖర్చు అదనం) 
 
* ఏటా ఒక రోజు శాశ్వత భోగం చెల్లించేందుకు రూ. 1,116, శాశ్వత ఉచిత ప్రసాద వియోగానికి రూ. 1,116 
 
* ఏడాదిలో ఒక్కరోజు శాశ్వత అన్నదానం చేసేందుకు(ఆరుగురికి..) రూ. 1,116. 
 
* భద్రుని కోవెలలో శాశ్వత అభిషేకం(ఏటా ఒక్కరోజు) రూ. 1,000 
 
* (ఏటా ఒక ఏకాదశి రోజున) శాశ్వత లక్ష కుంకుమార్చనకు.. రూ. 2,500 
 
* ఆలయ చుట్టు సేవకు.. రూ. 500.. నిత్య కల్యాణంలో పాల్గొనేందుకు.. రూ. 1000 
 
* వడమాల భోగం: రూ. 200, చక్కెర పొంగలి(కేజీ) భోగంకోసం.. రూ.300, (ఆదివారం) సువర్ణ పుష్పార్చన రూ. 500 చొప్పున చెల్లించాలి.
 
 
వసతి సౌకర్యం
 
భద్రాచలం రామాలయ పరిధిలో 10 ఏసీ కాటేజీలున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 1500. నాన్‌ ఏసీ కాటేజీలు 10 ఉన్నాయి. వీటిల్లో ఒక్కో గదికి రోజుకు రూ. 800 చొప్పున చెల్లించాలి. 
* కాటేజీలు కాకుండా మరో 46 నాన్‌ ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గది ధర రూ. 300 
 
* ఏసీ గదులు 64 అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గదికి రూ. 800 నుంచి రూ. 1100 వరకూ (గిరాకీని బట్టి) చెల్లించాలి.
 
 
రవాణా సౌకర్యం
 
హైదరాబాద్‌కు సుమారు 310 కి.మీ.ల దూరంలో వుండే భద్రాచలం దట్టమైన అటవీప్రాంతంలో ఉంటుంది. జిల్లాకేంద్రం ఖమ్మం నుంచి సుమారు 115 కి.మీ.ల దూరముంది. జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ/ ప్రైవేటు బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. రాజమండ్రి.. విశాఖపట్నం.. విజయవాడ నుంచి నేరుగా బస్సు సౌకర్యముంది. ఖమ్మం వరకూ లేదా సుమారు 35 కి.మీ.ల దూరంలోని భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌ (మణుగూరు) వరకూ రైల్లో వచ్చి.. అక్కడి నుంచి బస్సు లేదా కారులో వెళ్లవచ్చు. రాజమండ్రి నుంచి 135 కి.మీ. దూరం ఉంటుంది. రాజమండ్రి నుంచి రెగ్యులర్‌గా గోదావరి పడవలు భద్రాచలం వెళ్తుంటాయి. గోదావరిలో నీటిప్రవాహం బాగుంటే.. నౌకలో.. నదిలో.. పాపికొండలు మీదుగా భద్రాచలం వెళ్లడం జీవితకాలంలో మర్చిపోలేని మధురానుభూతిని అందిస్తుంది.
 
వెబ్‌సైట్‌: http://www.bhadrachalarama.orgలో లాగిన్‌ అయి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు.
 
 
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply


Messages In This Thread
RE: భద్రాచలం దేవస్థానం - by krish - 02-12-2018, 07:34 AM



Users browsing this thread: 1 Guest(s)