Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీనియర్‌ బుష్‌ కన్నుమూత
#1
యుద్ధరంగం నుంచి శ్వేతసౌధం దాకా అవిశ్రాంత ప్రస్థానం సాగించి, రాజనీతిజ్ఞుడిగా ప్రపంచం ప్రశంసలు అందుకొన్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యూ.బుష్‌ కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో శుక్రవారం హ్యూస్టన్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఆయన భార్య బార్బరా బుష్‌ 8 నెలల క్రితమే కన్నుమూశారు. సీనియర్‌ బుష్‌గా పేరొందిన ఆయన పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధ పడుతూ, కొంతకాలంగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో తరచూ ఆస్పత్రుల పాలయ్యారు. ఏప్రిల్‌లో భార్య బార్బరా మృతి అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. అప్పుడు ఆస్పత్రిలో చేరి బయటికి వచ్చాక జూన్‌ 12న 94వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. 94 ఏళ్లకు చేరిన మొదటి మాజీ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన తమ ప్రియమైన తండ్రి మరణించారని చెప్పేందుకు విచారిస్తున్నామని ఆయన కుమారుడు, అమెరికా 43వ అధ్యక్షుడు జార్జి బుష్‌ (జూనియర్‌) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, మాజీ అధ్యక్షులు క్లింటన్‌, ఒబామా, సోవియట్‌ మాజీనేత గోర్బచెవ్‌, భారత ప్రధాని మోదీలతోపాటు పలు దేశాల నేతలు సంతాపం తెలిపారు.
బుష్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా పరివర్తనాత్మక సంఘటనలెన్నో చోటుచేసుకున్నాయి. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. బెర్లిన్‌ గోడ ధ్వంసమైంది. జర్మనీ నాటోతో జతకట్టింది. తూర్పు ఐరోపా నుంచి బాల్టిక్‌ దేశాల వరకు, లాటిన్‌ అమెరికా నుంచి సోవియట్‌ రిపబ్లిక్‌ల వరకు నిరంకుశ ప్రభుత్వాల స్థానంలో ఉదార ప్రజాస్వామ్యాలు అవతరించాయి. ఆ సమయంలో జార్జి బుష్‌ ప్రచ్ఛన్న యుద్ధం శాంతియుతంగా ముగిసేందుకు సోవియట్‌ నేత గోర్బచెవ్‌తోపాటు పలు ఇతర నేతలతో కలిసి కృషి చేశారు.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సీనియర్‌ బుష్‌ కన్నుమూత - by krish - 02-12-2018, 07:25 AM



Users browsing this thread: 1 Guest(s)