Thread Rating:
  • 184 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)
*మత్స్య మహాపురాణమున 170 అధ్యాయమున-

విశ్వేశం ప్రథమం తావ న్మహాతాపస మాత్మజమ్‌ l
సర్వమంత్రహితం పుణ్యం నామ్నా ధర్మం సృష్టవాన్‌. 26
దక్షం మరీచి మత్రిం పులస్త్యం పులహం క్రతుమ్‌ l
వసిష్ఠం గౌతమం చైవ భృగు మంగిరసం మునిమ్‌. 27
అథై వాద్బుత; విత్యేతే జ్ఞేయాః పైతామహర్షయః.
 
ఇచ్చట మొదటివాడు ధర్ముడు; తరువాత చెప్పబడినవారు ఇతరత్రకూడ బ్రహ్మమానస పుత్త్రులుగా చెప్పబడినవారే; కడపట చెప్పబడిన 'అద్బుత' శబ్దవాచ్యుడు పండ్రెండవ కుమారుడనుట సమంజసము; అథ- అనుటను బట్టి ఇది పై వానితోపాటు సంజ్ఞవాచకమే కాని విశేషణమయి యుండదు. కాని కన్నడానువాదమున దీనిని విశేషణముగా భావించి అనువదించుట జరిగినది.
 
అద్బుత శబ్దమును సంజ్ఞా వాచకముగా గ్రహించినచో మొదటివాడగు ధర్ముడు యజ్ఞరూపుడు కాగా అద్బుతుడు 'అపూర్వము' అను యాగజన్య సంస్కార మనుకొనవచ్చును.
 
అనంతరము దక్షుడు మరీచి అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు వసిష్ఠుడు క్రతవు గౌతముడు భృగుడు అంగిరుడు అను పదిమంది ప్రజాపతులను సృజించెను. అందరకంటె కడపట' అద్బుతుడు' అను కుమారుని కూడ సృజించెను. వీరు అందరును బ్రహ్మమానస పుత్త్రులగు ఆదిఋషులు; వీరినే పైతామహ (పితామహునినుండి మానసులుగా జనించిన) ఋషులందురు. వీరిలో ధర్ముడు పదుమూడు గుణములు (లక్షణములు) కలవాడు; (లక్షణములు) కలవాడు; అతనిని మహర్షులును ఉపాసింపసాగిరి.
 
దక్షుడు తన కుమారైలలో అదితి- దితి -దనువు-కాల-అనాయువు- సింహిక -ముని - తామ్ర- క్రోధ-సరస-వినత- కద్రూ-అను పండ్రెండుమందిని మరీచి ప్రజాపతి పుత్త్రుడగు కశ్యపునకు ఇచ్చి పెండ్లి చేసెను. కశ్యపుడు తపో మూర్తి; దక్షుడు తన కుమార్తెలలో మరికొందరుగు రోహిణి మొదలగు ఇరువది ఏడు నక్షత్రములను సోమునకు ఇచ్చెను. వీరందరును పవిత్రమూర్తులు.
 
సృష్టిప్రక్రియను బాగుగ ఆలోచించిన బ్రహ్మచే పూర్వము సృష్టింపబడిన లక్ష్మి- మరుత్వతీ -సంధ్య (సాధ్య) విశ్వేశా - సరస్వతీ అను ఐదుమందిని బ్రహ్మ శుభరూపుడగు ధర్మునకు ఇచ్చెను. ఐదుగురును పరిష్ఠలును - దేవతా శ్రేష్ఠలును;*శబ్ద స్వరూపమును అర్థమును కల ధర్ముని పత్ని (సరస్వతి) సురభియను రూపము ధరించి లోకహితము గోరి బ్రహ్మను సేవించరాగా లోకపూజితుడును లోకసృష్టి హేతువు అగు ప్రక్రియను ఎరిగినవాడు నగు బ్రహ్మ గోజాతి సృష్టి సంకల్పముతో ఆమెతో కూడెను. అమెయందు విశాలరూపులు పొగవంటివారు సంధ్యాకాలమందలి మేఘములవలె ప్రకాశించువారు తీక్ష్ణతేజము గలవారు లోకములనే కాల్చివేయునట్లున్న వారు కలిగిరి. వారు (రుదంతః-) ఏడ్చుచు (ద్రవంతః-) పరుగెత్తుచు బ్రహ్మకడకు పోయిరి. హేతువుచే వారు ( రెండు పదములందలి ప్రథమాక్షరముల కూర్చచే ) 'రుద్ర' అను పదములో వ్యవహరింపబడిరి. వీరు నిరృతి- శంభుడు - అపరాజితుడు- మృగవ్యాధుడు- కవర్ది-ఖరుడు అహిర్బుధ్న్యుడు- కపాలి- పింగళుడు- సేనాని అని పదునొకండు మంది.
 
తస్యామేవ సురభ్యాంచ గావో యజ్ఞేశ్వరాశ్చవై. 40
ప్రకృష్టాశ్చ తథా మాయా స్సురభ్యాం వశవో7క్షరాః l
అజాశ్చైవ తు హంసాశ్చ తథైవామృత ముత్తమమ్‌. 41
ఓషధ్యః ప్రవరాయాశ్చ సురభ్యా స్తా స్సముత్థితాః l
ధర్మా ల్లక్ష్మీ స్తథా కామం సాధ్యా సాధ్యా న్వ్యజాయత. 42
భవంచ ప్రభవం చైవ హీశంచాసురహంప తథా l అరుణ్యం చారుణించైవ విశ్వావసు బలధ్రువౌ. 43
హవిష్యంచ వితానంచ విధానశమితావపిl వత్సరం చైవ భూతించ సర్వాసు రనిషూదనమ్‌. 44
 
సువర్వాణో బృహత్కాన్తి స్సాధ్యా లోకవమస్కృతా l తమేవానుగతా దేవీ జనయామాస వై సురా9.
వరంవై ప్రథమం దేవం ద్వితీయం ధ్రువ మవ్యయమ్‌ l
విశ్వావసుం తృతీయంచ చతుర్థం సోమ మీశ్వరమ్‌ . 46
 
______________________________________________________________________________
 
*మత్స్య- 170 ; శ్లో. 34
 
''యారూపార్థవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ. ''
రూపం - శబ్ద స్వరూపం - అర్థశ్చ అస్యా - స్తః ఇతి రూపార్థవతీ - సరస్వతీ - ఇత్యర్థః.
రూపము - శబ్ద స్వరూపమును - అర్థమును కలది- శబ్దము; అటువంటి బ్రహ్మదేవుని పత్ని అనగా వాగ్రూపయగు సరస్వతీ.
అధ్యాయములొ అన్ని ప్రతులయందును ధర్ముని పత్నిరుందు కలిగిన సంతానము విషయమున ఎన్నో పాఠ భేదములున్నవి.
తతోనురూపమాయంచ యమ న్తస్మా దనన్తరమ్‌ l సప్తమంచ తథా వాయ మష్టమం నిరృతిం వసుమ్‌. 47
ధర్మస్యాపత్య మేతద్వై సురభ్యాం సమజాయతl విశ్వే దేవాశ్చ విశ్వాయాం ధర్మాజ్జాతా ఇతి శ్రుతిః. 48
దక్షశ్చైవ మహాబాహు పుష్కరస్వన ఏవచ l చాక్షుషశ్చ మనుశ్చైవ తథా మధుమహోరగౌ. 49
విశ్వాంతశ్చ వసు ర్బాలో విష్కమ్భశ్చ మహాయశాః l రురు శ్చైవాతిసత్త్వౌజా భాస్కర ప్రతిమద్యుతిః. 50
విశ్వాన్దేవా న్దేవమాతా విశ్వేశా7జనయత్సుతా9 l మరుత్వతీతు మరుతో దేవా నజనయత్సుతా9. 51
అగ్నిం చక్షూ రవింజ్యోతి స్సావిత్రం మిత్రమేవచ l అమరం శరపృష్టించ సుకర్షంచ మహాభుజమ్‌. 52
విరాజంచైవ వాచంచ విశ్వం వసుమతిం తథా l అశ్వమన్తంచిత్రరశ్మిం తథా నిషధనం నృప. 53
హూయన్తం బాడబంచైవ చారిత్రం మదపన్నగమ్‌ l బ్రహన్తంచ బృహద్రూపం తథావై పూతనానుగమ్‌.
మరుత్వతీ పురా జజ్ఞే ఏతన్వై మరుతాం గణా 9l
 
సురభియందే బ్రహ్మవలన యజ్ఞముపై ఆదిపత్యముగల గోవులు ఉత్తమములగు మాయులు (?) శాశ్వత యోగ్యతగల పశువులు మేకలు హంసలు ఉత్తమమగు అమృతము ఉత్తమములగు ఓషధులు జనించెను.
లక్ష్మి ధర్మనివలన కాముని కనెను; సాధ్య అను నామె ధర్ముని వలననే సాధ్యులను దేవజాతలనస కనెను. సాధ్యులు నామములు - భవుడు ప్రభవుడు ఈశుడు అసురహుడు అరుణుడు ఆరుణి విశ్వావసువు బాలధ్రువుడు హవిష్యుడు వితానుడు విధానుడు శమితుడు వత్సరుడు సర్వాసుర నాశకుడగు భూతి సుపర్వన్అనువారు మహాకాంతి శాలినియగు సాధ్యకు కుమారులైరి. మనస్‌ - మంతా - ప్రాణుడు నరుడు- అపానుడు- వీర్యవాన్‌ - వినిర్భయుడు- నయుడు- దంశుడు- నారాయణుడు- వృషుడు - ప్రముంచుడు- అని అగ్ని పురాణమునందు కలదు.
 
(సరస్వతీరూప విశేషమేయగు ) సురభి ధర్మునే అనుగమించి ఆతని వలన వసువులనెడు దేవతాగణములను కనెను వారు: వరుడు అవ్యయుడగు ధ్రువుడు ఈశ్వరుడగు సోముడు ఆయుడు యముడు వాయువు నిరృతి అనువారు ఎనిమిది మంది.
 
వసువులు సురభి (సరస్వతి) యందు ధర్ముని వలన కలిగిన సంతతి.
 
విశ్వేశా (విశ్వా) అను ధర్ముని పత్నియందు ధర్మని వలన విశ్వేదేవులను దేవగణములు కలిగిరి. వారు మొత్తము పదిమంది; వారు: మహాబాపూడగు దక్షుడు పుష్కరస్వనుడు చాక్షుషుడు మనువు (చాక్షుష మనువు) మధువు మహోరగుడు విశ్వాంతుడు వసువు బాలుడు (బాలుడగ వసువు) మహాయశశ్శాలియగు విష్కంభుడు అత్యధికమగు సత్త్వమును ఓజస్సును కలవాడు భాస్కరుడువలె కాంతిమంతుడునగు రురుడు అనువారు; దేవమాతలలో నొకతెయగు విశ్వేశయను నామె ధర్ముని వలన వీరిని జనింపజేసెను.
 
మరుత్వతి యను నామెకు ధర్ముని వలన మరుతులను గణదేవతలు కలిగిరి. వారు ; అగ్ని- చక్షుడు- రవి -జ్యోతి- సావిత్రుడు- మిత్రుడు- అమరుడు- శరవృష్టి- మహాభుజుడగు సుకర్షుడు- విరాట్‌ - వాచ్‌- విశ్వుడు- వసుమతి- అశ్వవంతుడు- చిత్ర రశ్మి- నిషధనుడు- హూయంతుడు- బాడబుడు- చారిత్రడు- మదపన్నగుడు- బ్రహద్రూపుడగు బృహత్‌ -పూతనానుగుడు అను వారు.
 
అదితిః కశ్యపా జ్జజ్ఞే ఆదిత్యా న్ద్వాదశైవ హి. 55
ఇన్ద్రో విష్ణు ర్బగ స్త్వష్టా వరుణో హ్యర్యమా రవి l పూషా మిత్రశ్చ ధనదో ధాతా పర్జన్య ఏవ . 456
ఏతేవై ద్వాదశాదితగా వరిష్ఠా స్త్రిదినౌకసామ్‌ l ఆదిత్యస్యాశ్వినౌ నాసత్యౌ జజ్ఞాతే ద్వౌ సుతౌ వరౌ. 57
తపశ్శ్రేష్ఠౌ గుణిశ్రేష్ఠౌ త్రిదివస్యాపి సమ్మతౌ l దనుస్తు దానవా న్జజ్ఞే దితి ర్దైత్యా స్వ్యజాయత. 58
కాలాతు వై కాలకేయా నసురా న్రాక్షసాంస్తువై l అనాయుషాయా స్తనయా వ్యాధయ స్సుమహాబలాః. 59
సింహికా గ్రహమాతా వై గన్దర్వ జననీ మునిః l
తామ్రా త్వప్సరసాం మాతా పుణ్యానాం భారతోద్బవా. 60
క్రోధాయా స్సర్వభూతాని పిశాచాశ్చైవ పార్థివ l జజ్ఞే యక్షగణాం శ్చైవ రాక్షసాంశ్చ విశామ్పతే. 61
చతుష్పదాని సత్త్వాని తథా గావస్తు సౌరసాః l సుపర్ణా న్పక్షితశైవ వినతాయాం వ్యజాయత. 62
మహీధరా న్త్సర్వనాగా న్దేవీ కద్రూర్వ్యజాయతః l ఏవం వృద్ధిం సమగమన్విశ్వే లోకాః పరస్పరమ్‌. 63
తదా వై పౌష్కరో రాజ న్ప్రాదుర్భావో మహాత్మనః l
ప్రాదుర్బావః పౌష్కరస్తే మహా9 ద్వైపాయనేరితః 64
పురాణః పురుషశ్చైవ మయా విష్ణు ర్హరిః ప్రభుః l కథితస్తే 7నుపూర్వేణ సంస్తుతః పరమర్షిభిః. 65
యశ్చైతదగ్య్రం శృణుయా త్పురాణం సదా నర( పర్వసు చోత్తమాంశ్చ l
అవాప్య లోకా న్త్సహి వీతరాగః పరత్రవై స్వర్గఫలాని భుజ్త్కే. 66
చక్షుషా మనసా వాచా కర్మణాచ చతుర్విధమl ప్రసాదయతి యః కృష్ణం తసై#్మ కృష్ణః ప్రసీదతి. 67
రాజాచ లభ##తే రాజ్య మధన శ్చోత్తమం ధనమ్‌ l క్షీణాయ ర్లభ##తే చాయు స్సుతకామ స్సుతాం స్తథా. 68
యజ్ఞాన్వేదాం స్తథాకామం స్తపాంసి వివిధానిచ l ప్రాప్నోతి వివిధం పుణ్యం విష్ణు భక్తో ధనాని . 69
యద్యత్కామయతే కిఞ్చి త్తత్త ల్లోకేశ్వరా ద్భవేత్‌ l ఏష పౌష్కరకో నామ ప్రాధుర్బానో మహాత్మనః.
కీర్తితస్తే మహాభాగ వ్యాస శ్రుతినిదర్శనాత్‌ l సర్వం విహాయ ఇమం పఠే త్పౌష్కృరకం హరేః. 71
ప్రాదుర్బావం మను శ్రేష్ఠ కదా7ప్యశుభం ##వేత్‌. 71 ||
ఇతి శ్రీమత్స్యమహాపురాణ పద్యోద్బవ ప్రాదుర్బావకథనే బ్రహ్మాదివకృతవేదాది
సృష్టిర్నామ ప్తత్యుత్తర శతతమో7ధ్యాయః.
 
ఇక కశ్యపుని భార్యలలో అదితియందు ఇంద్రుడు విష్ణువుభగుడు త్వష్ట వరుణుడు అర్యమన్రవి పూషన్మిత్రుడు ధనదుడు ధాత వర్జన్యుడు అను ద్వాదశాదిత్యులు కలిగిరి. వీరిలో (ద్వాదశాదిత్యాదిష్ఠాతయగు) ఆదిత్యునకు ఆశ్వినులు నాసత్యులు అని ప్రసిద్ధగల ఇద్దరు శ్రేష్ఠులగు సుతులు కలిగిరి. వారు తపములచె సద్గుణములచే గొప్పవారును స్వర్గమునకు పూజ్యులును; దనువునందు దానవులు దితియందు దైత్యులు కాలయందు కాలకేయులను అసురులు రాక్షసులు అనాయుషయందు మహాబలురగు వ్యాధులు సింహికయందు (ప్రాణులను పట్టి బాధించు) గ్రహములు ముని అనునామె యందు గంధర్ములు తామ్రయందప్సరసలు క్రోధయందు భూత పిశాచములు యక్షరాక్షసులు సురనయందు చతుష్పాత్ర్పాణులు గోజాతులు వినతయందు గరుడాది పక్షులు కద్రువయందు పర్వతములు నాగులు కలిగిరి. ఇట్లు సర్వలోకములు కలిగి పరస్పర మేళనముచే వృద్ధినందెను.
 
మనురాజా! అపుడు(ఆది కాలమున) మహాత్ముడగు బ్రహ్మకు కలిగిన పౌష్కర (పుష్కరము=జలము: పద్మము; దానినుండి కలిగిన) ప్రాదుర్బావ స్వరూపము ఇటువంటిది; మత్స్యుడు మనువునకు చెప్పినదిగా ద్వైపాయనునిచే చెప్పబడిన దానిని నేను (సూతుడు) మీకు (ఋషులకు) చెప్పితిని. పరమర్షులు స్తుతులనందుకొను ప్రభుని-పురాణ పురుషుని- గూర్చి ఆనుపూర్వితొ (క్రమముగా) మీకు తెలుపబడినది; అగ్ర్యము (మొదటిది) ఉత్తమమునగు పురాణమును వైరాగ్య దృష్టితో ఎల్లప్పుడును విశేషించి పర్వదినములందున విను నరుడు ఇహమున ఉత్తమములగు లోకముసుఖములను పొంది వరలోకమున స్వర్గసుఖమును పొందును . చక్షువుతో (దర్శించి) మనస్సుతో (ఆలోచించి) వాక్కుతో (స్తుతించి) కాయముతో (అర్చించి ) నాలుగు విధములుగ కృష్ణుని ఆరాధించి అనుగ్రహింపజేసికొను వానియందు కృష్ణుడనుగ్రహము చూపును. రాజు రాజ్యవృద్దిని ధనహీనుడు ధనమును అల్పాయుష్కుడధికాయువును సుతకాముడు సుతులను పొందును. విష్ణుభక్తుడు యజ్ఞములను వేదములను కామములను వివిధ తపస్సులను వీటిని యథావిధిగా అనుష్టించుటచే కలుగు వివిధ పుణ్యమును పొందును. పలుమాటలేల? ఏది ఏది కొంచెమో గొప్పయో కోరునో అది ఎల్ల లోకేశ్వరునివలన లభించును. మహాభాగా! మనూ! వ్యాసప్రోక్త శ్రుతి (పురాణ సంహితా ) నిదర్శించిన (నిరూపించిన) దాని ననసరించి నీకు మహాత్ముడగు చతుర్ముఖుని పౌష్కర పాధుర్భామును కీర్తించితిని. ఎవడైన ఇతర (వాజ్మయ) మంతయు విడిచియు హరివలన కలిగిన పౌష్కర ప్రాదుర్బావ మాత్రమును అధ్యయనము చేసినను వాని కశుభుములు సంభవింపకుండును; శుభములు కలుగును.
 
ఇది శ్రీమత్స్యమహాపురాణమున పద్మోద్భవ ప్రాదుర్భవ కథనమున బ్రహ్మకృత
‌--------------------------------------------------------------------------
 
[+] 1 user Likes xyshiva's post
Like Reply


Messages In This Thread
RE: About Deleted Threads - by Tyson2215 - 06-05-2020, 11:19 AM
RE: About Deleted Threads - by sarit11 - 05-09-2020, 11:54 AM
RE: About Deleted Threads - by sharankmr - 07-05-2020, 03:19 PM
RE: About Deleted Threads - by sarit11 - 05-09-2020, 11:56 AM
RE: About Deleted Threads - by nanitiger - 08-05-2020, 04:52 PM
RE: About Deleted Threads - by sarit11 - 05-09-2020, 12:12 PM
RE: Koma కోమా లో భర్త – పుత్రుని స్వాంతన - by xyshiva - 24-07-2020, 12:30 PM
Prof bharya story kavali - by VJ Chowdary - 19-01-2022, 08:55 AM
RE: Prof bharya story kavali - by Chytu14575 - 19-01-2022, 10:05 AM
Prof bharya - by VJ Chowdary - 19-01-2022, 01:44 PM
RE: Prof bharya - by vg786 - 19-01-2022, 02:49 PM
RE: Prof bharya - by VJ Chowdary - 20-01-2022, 10:08 AM
story name please - by mbnr - 06-06-2023, 02:32 PM
నేను-నా దేవత - by mani225 - 29-08-2023, 07:59 PM
RE: నేను-నా దేవత - by sarit11 - 29-08-2023, 10:22 PM
RE: నేను-నా దేవత - by mani225 - 30-08-2023, 01:25 PM



Users browsing this thread: 2 Guest(s)