Thread Rating:
  • 216 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)
నాగుల చవితి

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా- సంహితల్లో, బ్రాహ్మణాల్లో ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి.
 
కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే.  శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.
 
నాగదేవతను పూజించే సత్సంప్రదాయం జపాన్‌, చైనా, గ్రీకు దేశాలకు సైతం వ్యాపించింది. పుట్టకు పూజ చేసే పండుగ- నాగుల చవితి. ఇందులో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు. తెల్లవారుజామునే తలంటి స్నానం, శుభ్ర వస్త్రధారణ, పూజ సామగ్రితో సమీపంలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజించడం పర్వదిన కార్యక్రమం. దీపావళినాడు కాల్చగా మిగిలిన టపాసుల్ని నాగుల చవితినాడు వెలిగించి పిల్లలు సంబరపడతారు.
 
దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.
 
వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతంనాగ పంచమిపేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో  ‘కార్తీక శుద్ధ చవితినాడు మనం  ‘నాగుల చవితిని  పర్వదినంగా ఆచరిస్తున్నాం.
 
పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు!
 
పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.
 
సర్ప హింస మంచిది కాదు. నీవు యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారంఅంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.
 
పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ!
 
నాగుల చవితి
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారుప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానేనాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
 
పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
 
మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించేశ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే!  నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడిచిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. సందర్భంగా పుట్టవద్దదీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.
నాగుల చవితి అనగానే ఉదయాన్నే బావి వద్దక వెళ్లి స్నానమాచరించి ఏమీ తినకుండా చాలా నిష్టగా ఉండాలనే తెలుసు. రోజూ చేసినట్లుగా పూజ చేసి తర్వాత మిగతా పనుల్లో నిమగ్నమవుతారు. నాగేంద్రుడుకు ప్రత్యేకమైన పూజ చేయాలి. దానికో పద్ధతి కూడా ఉంది. నాగుల చవితి రోజున చేసే పూజా విధానం మీ కోసం.
 
నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి ఐష్టెశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకని నాగుల చవితి రోజున నాగేంద్రా! మేము మా వంశములో వారం నిన్ను ఆరాధిస్తున్నాము. పోరపాటున తోక తొక్కితే తొలిగిపో. నడుం తొక్కితో నా వాడనుకో.. పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు. ఇంకా రోజు ఉదయం ఐదింటికి లేచి, శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పైజామందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్ర్తాన్ని పురుచుకోవాలి. నాగేంద్రస్వామి ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి.
 
 
పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిఇలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజ పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము. నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్రస్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
 
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపములతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. ఇకపోతే.. నాగుల చవితి నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం.
 
 
అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. అందుచేత నాగుల చవితి రోజున నాగదేవతలను నిష్టతో పూజిద్దాం.
 
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో, అగఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్నినాగముఅంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేదికాలముకావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకేకాలనాగములేదాకాలనాగుఅని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.
 
జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగానాగం’.  సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. భాగాన్నిఉరాఅంటారు కావున సర్పానికిఉరగముఅని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడాఉరగములమే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.
 
నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం :
 
పాలు స్వచ్ఛతకు ప్రతీక. పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.
 
దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్పాలయంతిఅనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.
[+] 4 users Like xyshiva's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Ek Anokhee Love Story - by Vikkh - 19-01-2020, 10:36 PM
RE: About Deleted Threads - by Tyson2215 - 06-05-2020, 11:19 AM
RE: About Deleted Threads - by sarit11 - 05-09-2020, 11:54 AM
RE: About Deleted Threads - by sharankmr - 07-05-2020, 03:19 PM
RE: About Deleted Threads - by sarit11 - 05-09-2020, 11:56 AM
RE: About Deleted Threads - by nanitiger - 08-05-2020, 04:52 PM
RE: About Deleted Threads - by sarit11 - 05-09-2020, 12:12 PM
RE: Koma కోమా లో భర్త – పుత్రుని స్వాంతన - by xyshiva - 24-07-2020, 12:17 PM
Prof bharya story kavali - by VJ Chowdary - 19-01-2022, 08:55 AM
RE: Prof bharya story kavali - by Chytu14575 - 19-01-2022, 10:05 AM
Prof bharya - by VJ Chowdary - 19-01-2022, 01:44 PM
RE: Prof bharya - by vg786 - 19-01-2022, 02:49 PM
RE: Prof bharya - by VJ Chowdary - 20-01-2022, 10:08 AM
story name please - by mbnr - 06-06-2023, 02:32 PM
నేను-నా దేవత - by mani225 - 29-08-2023, 07:59 PM
RE: నేను-నా దేవత - by sarit11 - 29-08-2023, 10:22 PM
RE: నేను-నా దేవత - by mani225 - 30-08-2023, 01:25 PM



Users browsing this thread: 5 Guest(s)