Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
శేఖర్ నుంచీ ఆ అమ్మాయిని ఒక అబ్బాయి తప్పించాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని ట్యాంక్ బంద్ మీద దించి "దివ్య నువ్వు నర్స్ డ్రస్ వేసుకుని రెడీగా ఉండు ఒక గంట తరువాత టివి లో ఏ హాస్పిటల్ అని చెప్తారు అప్పుడు అక్కడికి వెళ్లు నేను మిగిలిన విషయాలు అని మెసేజ్ చేస్తా" అని చెప్పి వెళ్లిపోయాడు.


రూమ్ లో ఉన్న శేఖర్ ఆలోచిస్తున్నాడు అసలు ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అని అప్పుడు కృష్ణ తో 
"మామ నువ్వు తనకు బేడీలు వేసే ఉంచావా" అని అడిగాడు దానికి కృష్ణ అవును అన్నట్లు తల ఊప్పాడు అయిన ఎలా తప్పించుకుంది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో కృష్ణ "మామ అసలు ఏమీ జరిగిందంటే నా పెళ్లాం నుంచి ఫోన్ వస్తే పొరపాటుగా తాళాలు జీప్ లో వదిలేశారా అందుకే ఆ పిల్ల తప్పించుకున్నట్లు ఉంది" అని అన్నాడు దానికి శేఖర్ కృష్ణ వైపు చూసి తన షూ తీసి విసిరేసాడు ఇంకో షూ తీస్తూ "నీ అబ్బ ఎవరు రా నీకు సెక్యూరిటీ అధికారి ఉద్యోగం ఇచ్చింది పెళ్లాం కీ భయపడే పిరికి నా కోడక" అని అన్నాడు దానికి కృష్ణ "నీ అబ్బే రా నాకూ ఉద్యోగం ఇచ్చింది" అన్నాడు "నా అబ్బ జోలికి వస్తే నీ అబ్బ గోయి పక్కన నీ గొయ్యి తిస్తా" అని అన్నాడు శేఖర్ "రేయ్ పెళ్లాం ఫోన్ చేస్తే ci ఏంటి సిఎం కీ అయిన పాంట్ లో వట్టలు షేక్ అవుతాయి" అన్నాడు కృష్ణ దానికి శేఖర్ "మరి నా బొచ్చెడు గర్ల్ ఫ్రెండ్స్ నీ వాడుకున్నా నాకూ ఎప్పుడు షేక్ అవ్వలేదే" అన్నాడు "బాబు నీది కామం నాది ప్రేమ " అన్నాడు కృష్ణ తన రెండో షూ కూడా తీసుకోని కృష్ణ మీదకీ విసురుతూ కిందకి వచ్చాడు అప్పుడే స్కూల్ లో ఏదో మ్యూజిక్ వస్తుంటే లోపలికి వెళ్ళాడు.

అక్కడ థామస్ తనకి ఇచ్చిన చర్చి ఫాదర్ పాత్ర కాకుండా ఏదో రాజు లాగా వేషం వేసుకుని స్టేజీ పైకి ఎక్కి

" So finally this is the moment Beckett,

I am glad to your visit to England after these long years,

But you never forget that this England will be mine forever and ever,

You are just a piece of this puzzle game but the end is mine,

Maybe you are light but your light is weak in front of my darkness,

The fate of you has been not written by the law of your God but it's a devil play,

You are a good man brother you are a true friend but there is end for everything,

You won't deserve this world brother just rest in paradise" అని తన డైలాగ్ పూర్తి చేసి తన డ్రస్ లో ఉన్న కత్తి తీసుకోని కిందకి వంగి పొడిచి బీకరంగా నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే లోపలికి వచ్చిన జేమ్స్ థామస్ చేస్తున్న ప్రఫార్మేన్స్ చూసి గట్టిగా థామస్ అని పిలిచాడు దాంతో థామస్ భయపడ్డాడు జేమ్స్ స్టేజీ పైకి ఎక్కి తను వేసుకున్న డ్రస్ లాగేసి.

"ఎన్ని సార్లు చెప్పినా విన్నవా నువ్వు చేయాల్సింది థామస్ బేకెట్ కారెక్టర్ లార్డ్ హెన్రీ కాదు ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ విలన్ పాత్ర నే ఎందుకు చేస్తా అంటున్నావూ" అని కోపంగా అన్నాడు జేమ్స్, "నాకూ ఆ విలన్ కారెక్టర్ నచ్చింది అందుకే అదే చేస్తా నాకూ అదే ఇష్టం విలన్ గా చేయడమే నాకూ ఇష్టం " అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు థామస్ దాంతో శేఖర్ జేమ్స్ దగ్గరికి వచ్చి "సార్ మీ అబ్బాయి లో టాలెంట్ ఉంది దానికి తోడు తనకి హీరో కంటే విలన్ పాత్ర బాగా సెట్ అయ్యింది పిల్లలకు ఏది నచ్చితే అదే జరిగేలా చేయాలి సార్ పైగా మీ అబ్బాయి విలన్ గా నటిస్తున్నప్పుడు ఒక naturality కనిపించింది 1990 లో ఒక విలన్ ఉండే వాడు హా దేవరాజ్ కన్నన్ ఆయన లాగే అనిపించాడు " అని శేఖర్ మాట పూర్తి కాక ముందే జేమ్స్ శేఖర్ నీ లాగి కొట్టి "నా కొడుకు నీ ఎలా తయారు చేయాలో ఎలా ఉండాలో నువ్వు నాకూ చెప్పకర్లేదు " అని వెళ్లిపోయాడు, ఆ తర్వాత శేఖర్ చుట్టూ చూసి "ఎవరూ చూడలేదు ఏమీ పర్లేదు "అని అనుకుంటు తన రూమ్ లోకి వెళ్ళాడు.

అప్పుడే టివి లో డిఎస్పి ఏదో మాట్లాడుతూ ఉంటే అతని చూడగానే శేఖర్ కీ తన గతం కళ్ల ముందు కదిలింది "మీ జేన్నాన ఐపిఎస్, నేను ఐపిఎస్ నువ్వు కూడా అదే దారిలో రావాలి అంతగా నీకు డిటెక్టివ్ అవ్వాలి అని ఉంటే అది ఏదో సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంట్ నుంచి అవ్వోచ్చు కదా చూడు చిన్న నాకూ ఉన్న ఒకటే ఆశ మన కుటుంబం ఎప్పుడు ఈ ఐపిఎస్ చైన్ నీ విడిచి పెట్టకుడదు" అని అన్నాడు దానికి శేఖర్ "మీ కొడుకు ఐపిఎస్ సాధించలేక పోయాడు అనే దానికంటే ఏదో ఒకటి సక్సెస్ ఫుల్ గా చేస్తున్నాడు అని అందరూ మెచ్చుకుంటే సరిపోదా "అని శేఖర్ అన్న మాట కీ వాళ్ల నాన్న రామచంద్ర లాగి కొట్టాడు దాంతో శేఖర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా ఏజెన్సీ పెట్టాడు కాకపోతే ఈ కేసు కంటే ముందు తను పూర్తి చేసిన కేసు వల్ల తను కొన్ని నెలలు జైలులో ఉన్నాడు, ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి అంతా మారిపోయింది అప్పుల పాలు అయ్యి కేసు లేక అజ్ఞాతం లో ఉన్నాడు.

అలా తన గతం గురించి తలచుకొని మళ్లీ టివి చూస్తే అక్కడ ఒక స్టార్ హీరో హాస్పిటల్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చేర్చారు అని న్యూస్ వస్తే చూస్తూ ఉన్నాడు ఆ హీరో ప్రొడ్యూసర్ ఇంటి ముందు పడిపోవడం చూసిన శేఖర్ ఏదో తప్పు జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండగా అతను హాస్పిటల్ ఉన్న ఫోటో వచ్చింది అతని చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన వాడిలా అనిపించడం లేదు శేఖర్ కీ మొత్తం శరీరమంతా బిగుసుకొని ఉంది దాంతో వెంటనే కృష్ణ కీ ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇద్దరు హాస్పిటల్ కీ బయలుదేరారు YouTube లో ఆ న్యూస్ చూస్తూ ఉండగా ఆ ఫోటో జూమ్ చేసి చూస్తే ఆ హీరో మెడ నుంచి బుజం దెగ్గర ఉండే ఎముక పైన నల్లగా మారి ఉంది.
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ - by Vickyking02 - 23-07-2020, 08:18 AM



Users browsing this thread: 1 Guest(s)