Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
ఇంటికి వెళ్లిన వినయ్ రెడీ షవర్ కింద స్నానం చేస్తూ ఉండగా ఎవరో తలుపు కోడితే వెళ్లి తీశాడు చూస్తే సెక్యూరిటీ ఆఫీసర్లు చిన్న ఎంక్వయిరీ కోసం వచ్చాము అని చెప్పారు ఆ తర్వాత లోపలికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ కుర్రాళ్లు వాడిన బైక్ నెంబర్ కాలనీ సెక్యూరిటీ గేట్ దెగ్గర రికార్డ్ అయిన వీడియో లో చూసి దాని రిజిస్ట్రేషన్ అడ్రస్ చూస్తే ఈ ఇల్లు చుపిస్తుంది దాంతో వినయ్ అర్థం కాక బయటకు వచ్చి తన గ్యారేజ్ లో ఉన్న బైక్, కార్ నెంబర్ చెక్ చేశాడు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు తెచ్చిన నెంబర్ విద్య కొత్త కార్ నెంబర్ ఒక్కటే అంటే వాడు ఎవడో విద్య నీ క్లోజ్ గా ఫాలో అయ్యి పక్క ప్లానింగ్ తో వచ్చి ఎటాక్ చేశారు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు వినయ్ బయటికి వెళ్లి వాళ్ల కాలనీ కీ వచ్చే అని రూట్ మ్యాప్ లో ఉన్న cctv, ట్రాఫిక్ కెమెరా లో ఆ బైక్ కీ సంబంధించిన ఏమైన క్లూ దొరుకుతుంది ఏమో అని అంతా వెతుకుతూ ఉన్నాడు, హాస్పిటల్ లో ఉన్న కిషన్ విద్య నీ వదిలి వెళ్లాలి అని అనుకోవడం లేదు బయట ఉన్న రామ్, మమత, శిల్పా కీ టెన్షన్ పెరిగిపోతుంది వినయ్ వస్తే ఏమీ జరుగుతుందా అని కంగారు పడుతూ ఉన్నారు.


డాక్టర్ కిషన్ కౌశ్ల చండీగఢ్ లోనే టాప్ న్యూరో సర్జన్ తను డీల్ చేసిన ప్రతి కేసు లో అతనికి కేసు ఉంది ఇంత సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఆయనకు ఉన్న ఒకే ఒక బ్లాక్ మార్క్ తన సొంత భార్య నీ కాపాడుకోలేక పోయాను అంతే కాక దానికి కారణం తనే అనే బాధ ఒక్కటీ ఎప్పుడు తన మెదడు లో తొలిచి వేస్తుంది, తన బాధ మరిచి పోవడానికి రోజు సాయంత్రం బార్ లేదా పబ్ లో రెండు పెగ్ లు తాగి తన బాధ కోపం అంతా తీర్చుకుంటాడు అలా ఒక రోజు పబ్ లో ఉండగా విద్య, శిల్పా ఇద్దరు వచ్చారు అప్పుడు విద్య డాన్స్ ఫ్లోర్ లో డాన్స్ చేస్తూ సందడి సందడిగా ఉంది ఆ టైమ్ లో కిషన్ విద్య నీ చూశాడు చూడగానే చాలా బాగుంది అనిపించింది అంతే కాకుండా ఇంత అందమైన అమ్మాయి తన జీవితంలో ఎందుకు లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు విద్య నీ చూస్తూ ఉండగా కిషన్ కీ తన వయస్సు తనకే సగం తగ్గింది అనిపించింది.

ఆ మరుసటి రోజు కిషన్ ఒక సూపర్ మార్కెట్ లో సరుకులు తీసుకుంటూ ఉండగా మళ్లీ విద్య నీ చూశాడు ఒక చిన్న పాప తో తను ఇంకో చిన్న పిల్లల అనిపించింది విద్య లోని అమాయకత్వం, cuteness, తన అల్లరి కిషన్ లో ఏదో చిలిపి కోరిక రేపింది ఆ తర్వాత బిలింగ్ దెగ్గర కిషన్ తన పర్స్ కోసం చూశాడు అది మిస్ అయ్యింది అని అర్థం అయ్యింది అప్పుడు విద్య ముందుకు వచ్చి అతని బిల్ కట్టింది ఆ తర్వాత బయట ఆటో కోసం చూస్తున్న విద్య నీ చూసిన కిషన్ "హలో రండి నేను లిఫ్ట్ ఇస్తా" అని అన్నాడు దాంతో విద్య పర్లేదు అనింది "లోపల నాకూ సహాయం చేశావు కదా నీకు ఇది హెల్ప్ అనుకో" అన్నాడు దానికి విద్య కూడా సరే అని వెళ్లి అతని కార్ ఎక్కింది ఆ తర్వాత ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత విద్య కిషన్ నీ ఇంట్లోకి పిలిచి కాఫీ ఇచ్చింది కిషన్ ఇళ్లు మొత్తం చూసి "ఇళ్లు చాలా బాగుంది నీకు మంచి టేస్ట్ ఉంది " అన్నాడు దానికి విద్య "థాంక్స్ కానీ ఇది అంతా నా హస్బెండ్ టేస్ట్" అని చెప్పింది దాంతో కిషన్ కీ పోరబోయింది దాంతో విద్య అతని తల పైన మెల్లగ కొడుతూ ఉంటే కిషన్ కీ తనలో తన భార్య కనిపించింది దాంతో వెంటనే పని ఉంది అని చెప్పి వెళ్లిపోయాడు.

కార్ లో వెళుతున్న కిషన్ కీ తన గతం తన్నుకొని వచ్చింది చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది తన అత్త కూతురు తో ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టం ప్రేమ కానీ కిషన్ గురించి ఎవరికీ తెలియనిది ఏంటి అంటే తనకు దేని మీద ఇంటరెస్ట్ ఉండదు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, అలా తన మరదలు తో పెళ్లి అయిన మూడు నెలల తరువాత నుంచి తను తన ముందు ఉంటే చిరాకు పడ్డేవాడు తనని అసహించుకుంటు ఉండేవాడు ఆ తర్వాత ఆమె తల్లి కాబోతోంది అని తెలిసి బిడ్డ పుట్టే వరకు బాగా చూసుకున్నాడు ఆ తర్వాత మెల్లగా మళ్లీ మామూలుగా అయిపోయింది వాళ్ల మధ్య బంధం ఇలా తన భర్త మనోభావాలు రోజుకు ఒకటి మారుతు ఉంటే అతని మార్చుకోలేక, అతనికి నచ్చినట్లు ఎలా ఉండాలో తెలియక సతమతం అవుతు ఉంది అందుకే ఇంక వేరే ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకుంది తనని కాపాడాలి అని అన్నిరకాల ప్రయత్నాలు చేశాడు ప్రాణం కాపాడుకోగలిగాడు కానీ తను ఎప్పటికీ మంచం కీ అతుకు పోయే పరిస్థితి లో ఉంది.

(ప్రస్తుతం)

ఆ బైక్ కోసం కాలనీ చుట్టూ పక్కల ఉన్న కాఫీ షాప్ లో cctv footage చూస్తూ ఉంటే తనకి విద్య కిషన్ ఒక కాఫీ షాప్ లో కలిసి ఉండటం కనిపించింది ఆ తర్వాత వినయ్ నవ్వుకోనీ విద్య తన జీవితం నుంచి వెళ్లిపోయింది అని సంతోష పడ్డాడు ఆ తర్వాత హాస్పిటల్ కీ వెళ్లాడు అప్పుడు కిషన్ ఒక రూమ్ లో పాయిజన్ injection ఎవరికో ఇవ్వడం చూశాడు వినయ్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి అది ఆప్పాడు. 
[+] 2 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-07-2020, 08:28 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)