06-07-2020, 12:55 AM
భిన్న స్వరాలు
టేకుమళ్ల కామేశ్వరరావు భారతి పత్రికలో (1936) రెండు వ్యాసాలు ప్రచురించి వాటి ద్వారా వ్యావహారిక భాషకి కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలా అన్న విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని పత్రికలు, శిష్ట వ్యావహారిక భాష అనే ఒక రకమైన భాష రాస్తున్నాయి. చాలామంది రచయితలు కూడా శిష్ట వ్యావహారికంలో కథలు, వ్యాసాలు రాస్తున్నారు. కానీ పద్యాలు మాత్రం (ఇంతకుముందే చెప్పినట్లు ఛందస్సు బలం వల్ల) లాక్షణిక భాషలోనే వస్తున్నాయి. ఈ భాషలో రకరకాల పదాలు, రకరకాల వర్ణక్రమాలు ఉన్నాయని గమనించిన మండపాక పార్వతీశ్వరరావు భాషని నాలుగు రకాలుగా విభజించవచ్చునని చూపించారు (Archaic, Classical, Standard, Dialectical). అందులో ‘స్టాండర్డ్’ అని ఆయన నిర్దేశించిన పదాలతో వున్న భాషని ప్రమాణీకరించి అదే వాడాలని చెబితే ఇంగ్లండులోని కింగ్స్ ఇంగ్లిష్ లాగా ఒక ప్రామాణికమైన తెలుగు భాష ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం. అయితే ఆయన రాసిన రెండు వ్యాసాలు చాలా చిన్నవి కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ వివరంగా అనేక ఉదాహరణలతో ఆయన వివరించలేదు. ఆ రకమైన తెలుగులో ఏకత వుంటుందని కావ్యభాషలో అలాంటి ఏకత వుంది కాని దానిలో జీవం లేదని, వ్యావహారిక భాషలో జీవం వుంది కాని ఏకత లేదని, ఇటు జీవము అటు ఏకత వున్న ఒక మధ్య మార్గమొకటి కావాలని పార్వతీశ్వరరావుగారి వాదన. (అయితే ఈ వ్యాసాలు రెండూ కూడా లాక్షణిక భాషలోనే రాశారు అన్నది గమనించవలసిన విషయం.)
ఈ పుస్తకానికి పీఠిక రాసినది గిడుగు రామమూర్తి పంతులే. ఆ పీఠికలో ఆయన కామేశ్వరరావు వ్యాసాలనే కాకుండా పార్వతీశ్వరరావు వ్యాసాలను కూడా ప్రసక్తికి తీసుకువచ్చి తమ అభిప్రాయాలని స్పష్టంగా చెప్పారు. ఈ పీఠికలో రామమూర్తి పంతులు సౌజన్యము, తన వాదన మీద పట్టుదల రెండూ కనిపిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే గిడుగు రామమూర్తి అభిప్రాయంలో వ్యావహారిక భాషకి ఏ నియమాలు అక్కరలేదు. కాలక్రమాన భాష మారుతూ వుంటుంది, కుదుటపడుతూ వుంటుంది. అంచేత ‘వ్యవహారిక భాషారచన చక్కగా అభ్యసించినవారు మంచి పుస్తకములు వ్రాసి ప్రకటిస్తే అవి సామాన్యులకు ఆదర్శములుగా ఉపచరిస్తవి.‘ అని చెప్తూ మర్యాదగా కామేశ్వరరావు సూచనలని, పనిలోపనిగా పార్వతీశ్వరరావు సూచనలని, రెండింటినీ తిరస్కరించారు.
[ఈ పుస్తకపు పీఠిక, ఈ సంచికలో చదవగలరు. పూర్తి పుస్తకపు పిడిఎఫ్ ప్రతి. వి. ఎస్. టి. శాయి, గుంటూరు గ్రంథాలయం లైబ్రేరియన్‌లకు కృతజ్ఞతలతో – సం.]
ఏ దేశంలోనూ మాట్లాడే భాషే మాట్లాడినది మాట్లాడినట్టుగా రాయరని, రాయడానికి వేరే భాష ఉంటుందనీ గిడుగు రామమూర్తి గుర్తించలేదు. ఇంగ్లీషులోనే వాట్ డిడ్ యూ డూ (What did you do), అనే నాలుగు పదాలు, ఉచ్చారణలో వాజ్జిజ్యుడూ అని వినిపిస్తాయనీ, అయినా వాళ్లు రాతలో అలా రాయరనీ ఆయన గ్రహించలేదు. నిఘంటువులూ, నిక్కచ్చిగా నిర్దేశించిన వ్యవహార నియమాల గ్రంథాలూ (Books on usage) వ్యవహర్తలు రాసేటప్పుడు అనుసరించవలసిన రచనా నియమాలని సూక్ష్మాతిసూక్ష్మంగా నిర్దేశిస్తాయని, ఈ పనిలో పత్రికలూ, ప్రచురణ సంస్థలూ పట్టుదలగా పనిచేస్తాయనీ గమనించలేదు. గాలికి వదిలేసిన వ్యవహారంలో వున్న భాష దానంతట అది రచనా భాష అయిపోదని ఆయనకి బోధపడలేదు.
టేకుమళ్ల కామేశ్వరరావు తమ దృష్టిలో వ్యవహారిక భాషకి వుండవలసిన నియమాలు రాసేనాటికే గిడుగు రామమూర్తి పంతులుకి చాలా పెద్ద పేరు వచ్చింది, ఆయన సభల్లో పెద్దగొంతుకతో గర్జించేవారట. ఇంతకుముందే చెప్పినట్టు ఆయనకి గొప్ప జ్ఞాపక శక్తి వుండేది. కొన్ని వందల గ్రంథాలనుంచి కొన్ని వేల మాటలు దేనికైనా ఉదాహరణగా తడుముకోకుండా ఆయన చూపించేవారు. దీనికి తోడు ఆయనకు విపరీతమైన చెముడు కారణంగా ఎవరు ఏమి మాట్లాడినా వినిపించేది కాదు. ఆయన అనర్గళమైన ఉపన్యాస ధోరణికి, పుంఖానుపుంఖాలుగా యిచ్చే ఉదాహరణల ప్రవాహానికి శ్రోతలందరూ ముగ్ధులైపోయేవారు. అంత పేరున్న మహా పండితుణ్ణి ఎదుర్కోగలిగిన శక్తి టేకుమళ్ల కామేశ్వరరావు వంటి యువకులకి ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఆంధ్ర సాహిత్య పరిషత్తు 1911లో ఏర్పడి అందులో వున్న పెద్ద పండితులంతా ఎందుకంత పట్టుదలగా లాక్షణిక భాషనే వాడాలి అని అంటున్నారో కొంతసేపు సానుభూతితో చూసి వుంటే గిడుగు రామమూర్తి వాదన అంత వ్యతిరేకంగా కాకుండా కొంత సానుకూల దృష్టితో వుండి వుండేది. గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, వాళ్లందరూ రాసేది వ్యవహారంలో వున్న మాటలకి కృతకరూపంలో తయారు చేసిన మాటలతో ఒక కృతక గ్రాంథికం మాత్రమే అని గిడుగు రామమూర్తి బలంగానే వాదించారు. సరిగ్గా ఆ పనే అంతకన్నా సున్నితంగా గురజాడ అప్పారావు చేశారు. అసలు గ్రాంథికమనేది స్కూళ్లలో తెలుగు పండితులు తయారు చేసిన భాష అని, అది అంతకు ముందు లేదని ఆయన గట్టిగానే చెప్పారు. అయితే వీళ్లిద్దరూ గమనించని విషయం ఒకటి వుంది. వీళ్లు చెప్పే వ్యావహారానికి ఏ నియమాలు అక్కరలేదా, ఎవరికి తోచిన వర్ణక్రమంతో వాళ్లు మాటలు వాడుతుంటే అవన్నీ రచనలో ఉపయోగపడాలా, వాటన్నిటినీ ఒప్పుకోవాలా? ఈ ప్రశ్నని వాళ్లు వేసుకోనూ లేదు, దానికి సమాధానం వెతకనూ లేదు.
లాక్షణిక భాష నిర్బంధంగా నేర్పకపోతే మన పాత పుస్తకాలు చదివి అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ వుండరని, భాషకు ఒక నియమం లేకపోతే అవ్యవస్థ పాలవుతుందని పండితుల వాదన. నిజానికి ఉభయులూ పూనుకుని–
1. అవును. భాషకి నియమం కావాలి, నిత్య వాడుకలో భాష ఎన్ని రకాలుగా వున్నా రచనలో ఒక నియమితమైన భాషే వుండాలి.
2. వచనం ఇప్పటి వైజ్ఞానిక అవసరాలకు పనికొచ్చేది కావాలి. కాబట్టి, ఒక ఆధునిక రచనా భాషని మనం తయారు చేసుకోవాలి. అంటే ఆధునిక గ్రాంథికం కావాలి.
3. మాట్లాడేటట్లుగా ఏ భాషా ఎవరూ రాయడానికి ఉపయోగించరు; అనే సంగతులు ప్రతిపాదనకి తెచ్చి ఒక అంగీకారానికి వచ్చివుంటే ఏ రకమైన సమస్య వుండేది కాదు.

Quote:‘వాడుక భాషలో ఏకత కలిగింపవలసినదని నా ఉద్దేశము కాదు. కావ్యభాషకు నానాత్వము కలిగింపవలసినదని రామమూర్తిపంతులుగారి ఉద్దేశమును కాదు. విశ్వవిద్యాలయము, శాసన సభలు — ఈ సంస్థలలో ఉపయోగింపవలసిన భాష, ఈ సంస్థలతో సంబంధించిన వచనరచనలలో ఉండవలసిన భాష – కేవల కావ్యములు మాత్రమే కాదు, చరిత్ర, గణితము, భౌతికాదులగు శాస్త్రములు, కళలు, వీటితో సంబంధించిన రచనలు, ఉపన్యాసములు — వీటిలోని భాష — ఈ భాషలో ఒక ఏకత ఉండవలసి ఉన్నదనిన్నీ, ఈ ఏకతయే ఆంధ్రత్వమును నిలుపగలదనిన్నీ, ఈ నూతనాను శాసనము ప్రాచీనాంధ్రమునకున్ను, అభినవాంధ్రమునకున్ను కొంతకొంత భేదించి ఉన్నను ఈ రెంటిని కలుపగలిగిన అనుసంధానమై యుండవలసినదనిన్నీ దానికి వర్తమానాంధ్ర మనవలసియున్నదనిన్నీ నా అభిప్రాయము.’పార్వతీశ్వరరావు వర్తమానాంధ్రభాష అన్నప్పుడు ఆయన ఉద్దేశించినది ఆధునిక రచనాభాషనే. దీన్ని గురించి ఈ వ్యాసంలో తర్వాత చెప్తాం. పార్వతీశ్వరరావు చెప్పిన దానికన్నా ఎక్కువ వివరంగా, ఎక్కువ స్పష్టంగా టేకుమళ్ల కామేశ్వరరావు వాడుక భాష: రచనకి కొన్ని నియమాలు పుస్తకంలో చెప్పారు.అందులో అప్పటి కాలంలో తాము రాస్తున్నది వ్యావహారికం అనే అభిప్రాయంతో తెలుగు రాస్తున్న వాళ్ల ప్రచురణల్లోని మాటలనే ఉదాహరణలుగా చూపించి వాటిలో ఏకత్వం వుండటానికి, స్పష్టత ఉండటానికి కొన్ని సూచనలు చేశారు. అందులో ఉన్న సూచనలు ఇప్పటికీ అనుసరణ యోగ్యంగానే వున్నాయి.