Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#20
ఇక మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ ఏర్పరిచిన కమిటీ లాక్షణిక భాషే వాడాలనే నిర్ణయం చేసిన తరవాత జరిగిన మార్పులు చూద్దాం. హైకాలేజీ విద్య వరకు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెప్పాలనే నియమం వుండేది. చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణితం ఇవన్నీ తెలుగులో చెప్పవలసిన అవసరాన్నిబట్టి పాఠ్య గ్రంథాలు తయారయ్యేవి. ఆయా శాస్త్రాలలో సామర్ధ్యం వున్న పెద్ద ప్రొఫెసర్లకి మంచి తెలుగు రాదు. మంచి తెలుగు వచ్చిన వాళ్లకి ఆయా శాస్త్రాలలో చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు. అందుచేత కేవలం సిలబస్ మాత్రమే ఆధారంగా హైకాలేజీ పిల్లలకి పాఠ్యగ్రంథాలు తయారయ్యాయి. దాంతోపాటు ఆ భాష లాక్షణిక భాష అవాలనే నియమం వుండబట్టి అవి ఇంకా గందరగోళంగా వుండేవి. ఆ పుస్తకాలనీ ఎవరూ జాగ్రత్తగా పరిశీలించి ఆ పుస్తకాలలో వుండే భాష, విషయము ఏ స్థాయిలో వున్నాయో సరిగా చర్చించలేదు. కానీ Indian Ocean అనే మాటకి హిందూ మహాసముద్రము, Mediterranean sea అనే దానికి మధ్యధరా సముద్రము, Bay of Bengal అనే దానికి బంగాళాఖాతము లాంటి కొత్త మాటలు పిల్లల మనసుల్లోకి ప్రవేశించాయి.

ఈ విషయాలలో పరీక్షలు దిద్దేవాళ్లకి కూడా లాక్షణిక భాషలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం లేకపోవబట్టి వాళ్లకి అలవాటయిన ఆధునిక భాషనే కృతకంగా మార్చి అదే ఆధునిక భాష అనే అభిప్రాయంతో పేపర్లు దిద్దేవారు.

మద్రాసు యూనివర్శిటీ సిండికేట్ ఇంటర్‌మీడియట్ పాఠ్యగ్రంథాలలో ఏ రకమైన తెలుగు శైలి వాడాలో నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు చూస్తే అందులోని సభ్యులకు భాషని గురించి ఎటువంటి అభిప్రాయాలు వుండేవో మనకి తెలుస్తుంది. ఆ చర్చలన్నీ ఇంగ్లీషులో జరిగాయని వాళ్ల పుస్తకాలన్నీ ఇంగ్లీషులోనే రాశారని గమనిస్తే ఇంకా కొన్ని చమత్కారాలు బోధపడతాయి. ఇంగ్లీషు భాషలో తెలుగుని గురించి రాయడంలో కొన్ని పరిమితులున్నాయి.

ఆ పరిమితుల వల్ల ఇటు జయంతి రామయ్య పంతులు దగ్గర మొదలుపెట్టి అటు గురజాడ అప్పారావు వరకు ఇంగ్లీషులో తమ ఊహలు చెప్పడంలో బోలెడు ఇబ్బందులు పడ్డారు. పైగా వాళ్లు మాటమాటకి యూరోపియన్ భాషలో ఏం జరిగిందో ఉదాహరణలు ఇవ్వడం మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ శ్రమంతా ఎందుకు కలిగిందంటే ఈ వాదనలకి నిజమైన శ్రోతలు ఇంగ్లీషు మాత్రమే వచ్చిన మద్రాసు యూనివర్శిటీ సిండికేటువారు కావడం.
ఈ వాదనలలో పట్టుదలగా పాల్గొన్న వాళ్ళు ముగ్గురు: 1. గిడుగు రామమూర్తి పంతులు, 2. గురజాడ అప్పారావు, 3 జయంతి రామయ్య పంతులు. ఈ ముగ్గుర్ని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం.

గిడుగు వెంకట రామమూర్తి

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29న పుట్టారు. ఆయన పుట్టింది శ్రీకాకుళం ప్రాంతంలో పర్వతాలపేట అనే గ్రామంలో. చిన్నప్పటినుంచి ఏకసంథాగ్రాహి. సంస్కృతంలో శబ్దమంజరి అంతా ఎనిమిది సంవత్సరాలకే నేర్చుకున్నారు. బాలరామాయణంలో శ్లోకాలు, భారత, భాగవతాల్లో పద్యాలు ఆయనకు కంఠస్థంగా వచ్చేవి. 1875లో విజయనగరంలోని మహారాజావారి కళాశాలలో చేరారు. అప్పుడు ఆ కాలేజి ప్రిన్సిపాలు చంద్రశేఖరరావు మంచి సంస్కృత పండితుడు. ఆ కళాశాలలోనే, ఆ ప్రిన్సిపాలుగారి ఇంట్లోనే గిడుగు రామమూర్తికి గురజాడ అప్పారావుతో పరిచయం అయ్యింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 1879లో గిడుగు రామమూర్తి మెట్రిక్ పాసయిన తరువాత చదువు మానేయవలసి వచ్చింది. మన్యప్రదేశంలో మలేరియా తీవ్రంగా వ్యాపించే ప్రాంతంలో పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో నెలకి 30 రూపాయిలకి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో విజయనగరానికి దగ్గరలో కోనాడ అనే వూళ్ళో నెలకి 25 రూపాయలకి కాలేజీ మాస్టారి ఉద్యోగం వుంది. కానీ ఆ అయిదు రూపాయిలు ఆ రోజుల్లో ఎక్కువ డబ్బే. అంచేత గిడుగు పర్లాకిమిడి వెళ్లి అక్కడే వుద్యోగంలో చేరారు. దాదాపు 56 సంవత్సరాలు అక్కడే వుండిపోయారు. రామమూర్తి పంతులుకి పర్లాకిమిడి ప్రాంతంలో వుండే కొండజాతి సవరలతో పరిచయం యేర్పడింది. అమాయకంగా ఆధునిక పద్ధతులేమీ తెలియని ఆ జాతి సంస్కృతి మీద ఆయనకి ఆసక్తి పుట్టింది. మూడేళ్లల్లో వాళ్ల భాష బాగా నేర్చుకున్నారు. ఆ తరవాత అక్కడికి దగ్గరలోనే వున్న ముఖలింగం క్షేత్రానికి వెళ్లారు. ఆ ముఖలింగం ఆలయంలోని శాసనాలని రాసుకుని కళింగదేశచరిత్ర రాయాలనే ప్రయత్నంలో పడ్డారు. ఆ శాసనాలు ఆయన గడగడా చదువుతూ వుంటే అక్కడివాళ్లందరూ ‘ముక్కు మీద వేలు వేసుకున్నారట. ఆ శాసనాలని దేవతలే రాశారని మానవులకర్థం కాని భాష అందులో వుందని స్థానికుల నమ్మకం’.

గంజాం జిల్లాలో వున్న సవరల విద్యాభివృద్ధి మీద దృష్టి పెట్టి వాళ్ల భాషని, సంస్కృతిని నేర్చుకున్నారు. వాళ్లతో పాటు కొండల్లో తిరిగి వాళ్ల పాటలు, కథలు, ఆచార వ్యవహారాలు తెలుగు లిపిలో రాసి పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలా కొండల్లో తిరుగుతుండగా ఆయనకి మలేరియా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో మలేరియాకి క్వినైన్ ఒక్కటే తెలిసిన మందు. క్వినైన్ 40 రోజులపాటు వేసుకునేసరికి ఆయనకి చెవులు వినిపించడం మానేశాయి. అప్పటినుంచి ఆయనకు వినికిడి పూర్తిగా పోయింది. అప్పుడే గిడుగు రామమూర్తికి జె. ఎ. యేట్స్‌తో పరిచయం అయ్యింది. యేట్స్ స్కూళ్ల ఇన్స్‌పెక్టర్‌గా రావడానికి, కర్జన్ ప్రాంతీయ భాషల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనే నిర్ణయానికి ప్రత్యక్షంగా సంబంధం వుందో లేదో తెలియదు కానీ యేట్స్ తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. దానితో నేర్చుకునే భాషకి మాట్లాడే భాషకి మధ్య అంత తేడా వుండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన యేట్స్ ఆ విషయం పి. టి. శ్రీనివాస అయ్యంగార్‌తో చెప్పారు. అయ్యంగార్‌కి తెలుగు భాష నేర్పడం గురించి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ తను తమిళుడు కాబట్టి గురజాడ అప్పారావుతోను, గిడుగు రామమూర్తితోను మాట్లాడమని సలహా యిచ్చారు. అప్పటికి గిడుగు రామమూర్తికి తెలుగు సాహిత్యం గురించి తెలియదు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 05-07-2020, 11:11 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 2 Guest(s)