22-02-2020, 08:05 PM
28th December 2016
lotuseater
మన గాసిప్ తెలుగు ఫోరమ్స్ లో అద్భుతమైన ప్రోగ్రెస్ జరిగింది. ప్రసాద్ గారు మిస్టర్ గిరీశం కథ ఇచ్చారు. సిరిపురపుగారు రమణీయమైన కథలు ఇవ్వడం కొనసాగిస్తూనే వున్నారు. సరిత్ గారు సరేసరి.
ఇంతలోనే లింగం గారు ఒక్కసారిగా విజృంభించారు!
మనమీ ఫోరమ్స్ లో తరచుగా ఏ రచయితలగురించయితే చర్చించుకుంటూ వస్తున్నామో, ఆ రచయితల పుస్తకాలు ఆకాశం నుంచి కామదేవత ఇచ్చిన వరాల్లా ఒక్కసారిగా వర్షించి మనల్ని ఆనందసాగరంలో ముంచెత్తాయి.
లోగడ నాక్కూడా 'మధు ' పుస్తకాలు కొన్ని మాత్రమే చదవడానికి దొరికాయి. అలాంటిది ఇప్పుడు లింగం గారి పుణ్యమా అని అరవైకి పైగా ఒకేసారి లభ్యమైపోయాయి. సరిత్*గారన్నట్టు ఇది ఒకరకంగా గొప్ప సంపద. లింగం గారి వల్ల అది మనమిప్పుడు కాపాడుకోగలిగాం.
లింగం గారు అంతటితో ఆగలేదు. కొన్ని దశాబ్దాలుగా నేను ఎవరి పుస్తకాలకోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నానో, ఆ పుస్తకాలు - నాచర్ల సూర్యనారాయణ, ఎన్నెస్ కుసుమ వంటివారి మాస్టర్ పీసెస్ ఇప్పుడు మనకు అందిస్తున్నారు. ఇటీవలే సిరిపురపుగారు 'తీర్థయాత్ర ' అందించారు. ఇప్పుడు లింగం గారు 'త్రీ టైయర్ కంపార్ట్ మెంట్ ' అందించారు. ఈ రెండు పుస్తకాలని సంపూర్ణ రూపం లో చూసుకుంటుంటే మనసు ఏమిటేమిటోగా అయిపోతోంది. ఇదంతా ప్రారంభించిన ప్రసాద్ గారికీ, కొనసాగించిన సిరిపురపు గారికీ, లింగం గారికీ, పీడీయఫ్ లతో ప్రోత్సహించిన సరిత్ గారికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో తెలియడం లేదు. 'థ్యాంక్స్ ' అనే చిన్న మాట చెప్పుకోవడం తప్ప మరింకేమీ ఇచ్చుకోలేను. మిత్రులు నాతో ఏకీభవిస్తారనుకుంటాను.
సిరిపురపుగారన్నట్టు 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' గారిది అనితరసాధ్యమైన శైలి. ప్రసాద్ గారుకూడా ఆ మాటతో ఏకీభవిస్తారు. ఆ శైలి మరెవరికీ సాధ్యం కాదు. వారి రచన ఏది చదివినా అది బాగా అర్థమవుతుంది. వారిద్దరిదీ ఒకటే శైలి. అందుకే 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' ఒకే రచయిత అని నాతో సహా చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ సరసశ్రీ గారి ఆర్గుమెంటు చూశాక నాకూ కొన్ని సందేహాలు తలెత్తాయి. ఈ చర్చ మరికొంతకాలం సాగుతుందనుకుంటాను. ఇదివరకటికీ ఇప్పటికీ తేడా యేమిటంటే వారి నవలలు ఎదురుగా లేకుండా చర్చ జరిగింది. ఇప్పుడు లింగం గారి సహృదయం వల్ల కొన్నయినా వాటిలో సంపూర్ణంగా మనకు దొరికే అవకాశం వచ్చింది. వాటి నేపధ్యంలో ఈ చర్చ జరగడం మంచిది.
ఇటీవల కొత్తరకం ఉద్యమం ఒకటి బయలుదేరింది. 'ది హండ్రెడ్ మూవీస్ యూ మస్ట్ సీ బిఫోర్ యూ డై ' అనీ 'ది హండ్రెడ్ బుక్స్ యూ మస్ట్ రీడ్ బిఫోర్ యూ డై ' అనీ కొన్ని లిస్టులు వెలువడుతున్నాయి. తెలుగు శృంగార సాహిత్యానికి సంబంధించి కూడా అలాంటి లిస్టు ఎవరైనా తయారుచేస్తే వాటిలో 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' గార్ల రచనలు తప్పనిసరిగా వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం. వీలయితే నేనే అలాంటి లిస్టు ఒకటి తయారు చేయాలని అనుకుంటున్నాను.
ప్రియపాఠకులందరూ ది గ్రేట్ 'నాచర్ల ', 'ఎన్నెస్ కుసుమ ' గార్ల నవలలు చదివి ఆనందింతురు గాక!