21-02-2020, 10:22 PM
8th April 2016
lotuseater
సుపర్బ్!
సిరిపురపు గారూ, ఉగాదికి ఇంత తీపి పనికి రాదేమో!
నాచర్ల సూర్యనారాయణగారి గొప్ప కథ మాకు కానుకగా ఇచ్చారు. ఈ కథ లోగడ నేను చదివిన గుర్తు లేదు.
కథతోపాటు నాలాంటి వారికి వెల లేని కానుక కథ చివర మీరు అనవసమని తొలగించకుండా ఉంచిన వి.బా. పబ్లికేషన్స్ లిస్టు. బహుశా నాకోసమేనేమో!
ఇంకా నేను విజయబాపినీడుగారి నవలల పూర్తి లిస్టు కోసం ప్రయత్నిస్తూనే వున్నాను. 'రసిక రమణీయం - పూర్వరంగం' కోసం ఇదెంతో ఉపకరిస్తుంది.
ఈ లిస్టులో పేర్లన్నీ ఒకప్పుడు నాకు నోటికొచ్చేవి. ఆ సమాచారం ఎంత విలువైందో తెలీక లిస్టు నేను సేవ్ చేసుకోలేదు. కాలక్రమేణా మర్చిపోయాను.
చిత్రమేమిటంటే 'రివర్స్ గేర్' అనే పేరుగల విజయబాపినీడుగారి నవల ఉండడం! ఆ నవలకూ నేను ఇక్కడే వేరే ఫోరం లో రాస్తున్న 'రివర్స్ గేర్' అనే కథకూ ఏమీ సంబంధం లేదని మనవి చేసుకుంటున్నాను. ఆ పేరు మాత్రం ఎక్కడో మరపు పొరల్లో దాగివుండి ఒక్కసారిగా బయటికొచ్చిందేమో!
ఈ లిస్టులోని సమాచారం నేనింకా అనలైజ్ చేసుకోలేదు.
ఇంత మంచి పోస్టిచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఎలా తెలపాలో తెలియడం లేదు.