Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
 రసిక రమణీయం - పూర్వరంగం 6

అప్పటికీ అతనేదో పరధ్యానంలోనే వున్నాడు.
అతనెందుకలా వున్నాడో ఆమెకేమాత్రం అర్థం కాలేదు.
అంతలోకే ఆమెకు అతనిమీద కోపం వచ్చింది.
‘‘మీరు మరెవర్నో ప్రేమిస్తున్నారల్లే వుంది. ఆమె వైపునుంచి మనసు తిప్పుకోలేకనే వున్నారు. ఆమెను ఇక్కడికే రప్పించుకోండి. నా మాట వింటుందంటే నేనే వెళ్ళి పిల్చుకొస్తాను. మీతోపాటే ఆమెకూ సేవచేసుకుంటాను. బానిసగానైనా పడుంటాను. నన్ను నమ్మండి. ఈ చిక్కుముళ్ళన్నీ ఇకమీదట వద్దు. కావలిస్తే నన్నెవరికైనా అమ్మేయనైనా అమ్మేయండి. మిమ్మల్ని బాధపెడుతున్నదేమిటో మాత్రం చెప్పండి.’’
ఆమె అతని పాదాలు వత్తుతూనే వుంది.
ఆమె ఎందుకలా మాట్లాడుతోందో అతనికి అర్థం కావడమే లేదు. అతని మనసునిండా ఎలాంటి అలంకరణా లేని ఆమె సౌందర్యమే అలుముకొని వుంది. నగలనీ, ఖరీదైన వస్త్రాలనీ విసర్జించి ఎలాంటి అరమరికల్లేకుండా ఆమె తనతో ప్రేమపూరితంగా రమించడమే గుర్తుంది. ఆ జ్ఞాపకాలతోనే వివశుడై వున్నాడతను.
ఆ రాత్రంతా అలాగే గడిచిపోయింది.
తెల్లారింది.
ఆమె మామూలు దుస్తుల్లో అలంకరణలేవీ లేకుండా మళ్ళీ తోటపన్లోకొచ్చింది.
అప్పుడామెను మళ్ళీ చూశాడు శాలీనుడు.
చూడగానే అతని మొహం వికసించింది.
అంతులేని ప్రేమతో ఆమెను ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు.
అప్పుడామెకు అర్థమైంది.

***

అద్భుతమైన ఈ శృంగార కథ పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’లో వుంది.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 07:44 PM



Users browsing this thread: 6 Guest(s)