20-02-2020, 06:51 PM
పురాణం అంటే ఏమిటి ?
' పురాణ ' శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోను , యాస్కుని నిరుక్తంలోను మరియు పురాణాలలో కూడా కనిపిస్తుంది.
పాణిని చెప్పిన ప్రకారం ' పురాభవమ్ ' అంటే ప్రాచీనకాలంలో జరిగినది.
యాస్కుని నిరుక్తం ప్రకారం ' పురాణం పురాణవం భవతి ' అంటే ప్రాచీనమైనదైనా క్రొత్తదిగా ఉండేది .
వాయుపురాణంలో ' పురాఅనతి ' అని వ్యుత్పత్తి , అంటే ప్రాచీన కాలంలో జీవించిఉన్నదానిని పురాణం అంటారు.
బ్రహ్మాండ పురాణంలో ' పురా ఏతద్ అభూత్ ' అంటే ప్రాచీన కాలంలో ఈ విధంగా జరిగింది అనే దానిని తెలియజేసే శాస్త్రమే పురాణం.
పురాణం లౌకిక శాస్త్రం . ఇది వేదం కంటే భిన్నమైనది. కానీ వేదానికి అనుకూలమైనట్టిది.
ఇదే వేదోపబృంహనం. ఇది ఎప్పుడూ స్థిర రూపాన్ని కలిగి ఉండదు. ఇది కాలాన్ని అనుసరించి , పరివర్తన శీలకమైనట్టిది.
కాలప్రభావంచేత మార్పులను పొందుతుంటుంది. అందుకే 'తంత్రవార్తికమనే' గ్రంధంలో వేదం ఆకృత్రిమమైనదని, పురాణం కృత్రిమమైనదని చెప్పబడింది.
అందుకే నిరుక్తంలో ' పురాపి నవం భవతి ' పాతది అయినా కొత్తగానే ఉంటుంది అని చెప్పింది.
అంటే కాలాంతరం ఉత్పన్నమయ్యే మార్పులను పురాణం తనలో లీనం చేసుకొంటుందని దీని భావం.