20-02-2020, 06:17 PM
15th March 2016
lotuseater
‘బరితెగించిన భామ’ నేను చూసిన మొట్టమొదటి నాచర్ల సూర్యనారాయణ సీరియల్. నాచర్లవారు అంతకు ముందు మరేదైనా సీరియల్ రాశారో లేదో నాకు తెలీదు. ఇదే వారి మొదటి సీరియల్ అనుకుంటున్నాను. తెలిసినవారెవరైనా చెబితే సంతోషిస్తాను. 1980 కంటే ముందే ‘రాధిక’లో ఇది సీరియలైజ్ అయినట్టు గుర్తు. ‘రమణి’ కూడా అయ్యుండొచ్చు. ప్రసాద్ గారు గానీ, సిరిపురపువారుగానీ కరెక్ట్ గా చెప్పగలరు. అప్పటికి విజయ బాపినీడుగారు ‘రమణి’ వదిలేశారు. ‘రాధిక’ కూడా వారే నడిపారనుకుంటాను. అదీ వదిలేశారు. నాకు గట్టి అనుమానం ఏమిటంటే విజయ బాపినీడుగారి సంపాదకత్వం తర్వాత కొన్నాళ్ళపాటు నాచర్ల సూర్యనారాయణగారే ఆ రెండు పత్రికలూ నడిపారేమోనని. ఎప్పుడో సుమారు ముప్ఫయ్యేళ్ళ క్రితం ఆగిపోయిన పత్రికమీద ఇవాళ్టికీ పాఠకుల్లో ఇంత మోజుందంటే ఆ రోజుల్లో అవి కల్ట్ స్టేటస్ పత్రికలని వేరే చెప్పక్కర్లేదు. ‘బరితెగించిన భామ’ సీరియల్ వచ్చేనాటికే పాఠకుల్లో నాచర్ల సూర్యనారాయణ కథకూ, ఎన్నెస్ కుసుమ కథకూ విపరీతమైన క్రేజుంది. ‘బరితెగించిన భామ’ గురించి చెప్పేముందు ఆనాటి ఎరోటిక్ లిటరేచర్ గురించి కొంత పరిచయం చేస్తాను. మిత్రులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు.