Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
9th March 2016
lotuseater

థ్యాంక్యూ సరిత్!
'విశాలి' ఇప్పుడు బాగా డౌన్లోడ్ అవుతోంది.
ఈ ఫోరంలో ఎప్పుడే అవాంతరం వచ్చినా వెనువెంటనే స్పందించడానికి సూపర్ సరిత్ సిద్ధంగా వుంటారని మాకెప్పుడో తెలుసు.
థ్యాంక్స్ వన్సెగైన్!
ప్రసాద్ గారు పెట్టిన ‘విశాలి’ సంచిక ఇంకా చాలా వుంది. ‘నిషాదేవి’ గారి గురించి విపులంగా మనకిప్పుడు తెలియజేయడానికి అందులో కొంత భాగం మాత్రమే ఇచ్చారు ప్రసాద్ గారు. మిగతా భాగం త్వరలో ఇస్తారని ఆశించవచ్చు.
ప్రసాద్ గారూ! ఈ ‘విశాలి’ సంచిక ఒక్కసారిగా గతం కళ్ళముందుంచింది. మళ్ళీ ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. నిన్ననో మొన్ననో ఈ సంచిక చూసినంత స్పష్టంగా ఆ జ్ఞాపకాలు మనసులో మెదలుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్య. పొద్దునకల్లా దేశమంతా ఉలిక్కిపడి నిద్రలేచింది. మరి కొద్ది రోజులకే ఈ సంచికలో ‘నిషాదేవి’ మరణవార్త!
అయితే ఈ సంచికలో వచ్చిన వార్తగురించి ఎన్నో అనుమానాలు మా మనసుల్లో తలెత్తాయి. అసలు ‘నిషాదేవి’ మరణవార్త నిజంకాదేమో అని కూడా అనుకున్నాం. ‘నిషాదేవి’ని ఈ వార్తలో రచయిత్రిగా చెప్పారు. అయితే ‘నిషాదేవి’ని మేం రచయితగానే భావిస్తూ వచ్చాం. మరొక అనుమానం ఏమిటంటే ఈ సంచికపైన వున్న ముఖచిత్రం ‘నిషాదేవి’ అని చెప్పారు. కానీ, ఆ ముఖచిత్రం ఒక సినిమా తార. అంచేత ఈ వార్త నిజం కాకూడదని ఆశ పడ్డాం. ఆ సందేహాలేవీ ఇప్పటికీ నివృత్తి కాలేదు.
ఇప్పుడాలోచిస్తే ఈ వార్త నిజమే ఎందుకయ్యుండకూడదనిపిస్తుంది. ఈ ప్రకటన వచ్చింతర్వాత ‘నిషాదేవి’ కొత్తకథ ఏదీ మళ్ళీ రాలేదు. ‘నిషాదేవి’ రచయిత్రి ఎందుకు కాకూడదు? ముఖచిత్రం చివరి నిమిషంలో మార్చి వుండొచ్చు.
ఏది ఏమైనా ఈ సంచికలో ప్రకటించిన ‘నిషాదేవి’ సీరియల్ ‘సంకురాతిరి కాదు రంకు రాతిరి’ రానేలేదు. పన్నెండు రూపాయల వెలతో రావలసిన నూటఅరవైరెండు పేజీల ‘నిషాదేవి శృంగార కథల’ పుస్తకం ఎనిమిది రూపాయల వెలతో తక్కువ పేజీలతో కేవలం రెండు కథలతోనే వచ్చింది. అందులో ఒకటి ఎన్నెస్ కుసుమ కథ. అది ఇదివరకే ప్రసాద్ గారు ఈ దారంలో పోస్టు చేసివున్నారు. ఎందుచేతనో పబ్లిషర్స్ అనుకున్న విధంగా చేయలేక పోయారు.
ప్రసాద్ గారూ! మిగతా సంచిక కూడా ఇవ్వండి. అలాగే ‘విశాలి’ సంచికలన్నీ మీవద్ద వుంటే మాతో పంచుకోగలరు.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 01:19 PM



Users browsing this thread: 34 Guest(s)