20-02-2020, 01:12 PM
8th March 2016
lotuseater
వెల్ కం బ్యాక్ ప్రసాద్ గారూ!
వాటె ప్లెజెంట్ సర్ప్రయిజ్!!
మా కోరిక మన్నించి మళ్ళీ దర్శనం యిచ్చినందుకు కృతజ్ఞతలు.
ప్రసాద్ గారు వట్టి చేతుల్తో రాలేదు. వస్తూ వస్తూ ‘విశాలి’ పత్రిక పట్టుకొచ్చారు.
నాచర్లగారి కథలు ప్రచురింపబడ్డ చివరి పత్రిక యిదే నాకు తెలిసి.
నాచర్లగారి సీరియల్ ‘మెరక భూములు’ ఇందులో వరసగా వచ్చింది.
ఆ తర్వాత మళ్ళీ నాచర్లగారు ఏ పత్రికలోనూ సీరియల్ రాయలేదు. అసలు అలాంటి సీరియల్ రాయడానికి వీలైన పత్రిక మరేదీ రాలేదు. తెలుగులో శృంగారకథల స్వర్ణయుగం ‘విశాలి’ పత్రికతో అంతరించింది. ఆ తర్వాత ‘చిత్ర’, ‘మాధురి’ వంటి పత్రికలు వచ్చాయిగానీ అవేవీ మునుపటి వైభవం తిరిగి తేలేకపోయాయి. నాచర్ల గారు రాయడం మానుకున్నాక ఈ కథలు ఆదరించే సీరియస్ పాఠకులు తగ్గిపోయారు. ‘రసికరమణీయం’ దారం ప్రారంభించి ప్రసాద్ గారు ఆనాటి స్వర్ణయుగాన్ని మళ్ళీ మాముందుంచారు.
ఈ ‘విశాలి’ సంచికలో ‘నిషాదేవి’ ఇకలేరు అనే వార్త వచ్చింది. అయితే ఆ వార్త అప్పట్లో మేం నమ్మలేకపోయాం.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డార్క్ ఎరోటికా - అంటే, హర్రర్ కలిపిన శృంగార కథలు ‘నిషాదేవి’గారు అప్పట్లోనే ఎన్నో రాశారు. ఆ రకమైన కథల్లో ‘నిషాదేవి’గారిది అందె వేసిన చెయ్యి.
లోగడ ప్రసాద్ గారు ‘నిషాదేవి శృంగార కథలు’ అనే పుస్తకం ఈదారంలో పోస్టు చేశారు. అందులో మొదటి కథ ‘డబుల్ గేమ్’ నిషాదేవి గారిది. అయితే రెండో కథ ‘మెయిన్ ఫైల్’ ఎన్నెస్ కుసుమగారిది. అంతకు ముందు ‘పెండింగ్ పేడ్’ పేరుతో ‘రమణి’లో వచ్చింది.
‘విశాలి’ పత్రిక మళ్ళీ చూసిన ఆనందం మాకు సగమే లభించింది ప్రసాద్ గారూ!
అది డౌన్ లోడ్ కావడంలేదు. మీడియా ఫైర్ లోకి లింకు సవరించగలరు.