Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
2nd March 2016


lotuseater


'కోలాటం'


'కోలాటం' సీరియల్ పూర్తయిన చాలా రోజులకుగానీ పుస్తక రూపంలో రాలేదు. ఈ లోగా చిరంజీవి 'ఖైదీ' సినిమా రిలీజ్ అయింది. ఆంధ్ర రాష్ట్రం యావత్తూ ఒక్కసారిగా చిరంజీవి ఫీవర్ దావానలంలా పాకిపోయింది. సుప్రసిద్ధ దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు ఆ సమయంలో ఓ గుర్తుండిపోయే మాటన్నారు - "1983లో రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి - ఎన్. టి. రామారావుగారు ముఖ్యమంత్రి కావడం. రెండు - చిరంజీవికి ఓవర్ నైట్ స్టార్ డం రావడం". ఈ మాట అక్షరాలా నిజం.
'కోలాటం' సీరియల్ కీ 'ఖైదీ' సినిమాకీ యేమిటి సంబంధం అనుకుంటున్నారా? 'కోలాటం' లో హీరో పేరు కూడా యాదృచ్చికంగా చిరంజీవి కావడం ఈ దారాన్ని ఆసక్తిగా ఫాలో అవుతున్న పాఠకులు గమనించే వుంటారు. 'ఖైదీ' లో 'రగులుతోంది మొగలిపొద' పాట కుర్రకారుని వెర్రెక్కించిపడేసింది. చిరంజీవితో కలిసి నాగినిలా నాట్యం చేసిన మాధవి ఒక్కసారిగా తిరుగులేని గ్లామర్ క్వీన్ గా అవతరించింది. ఎక్కడ చూసినా అదే పాట.
దాంతో 'కోలాటం' నవల పబ్లిషర్లు కాస్తా గమ్మున అందులో అరుంధతి పేరు మాధవిగా మార్చేశారు. వయసు రీత్యా మాధవి అనే పేరు ఆ పాత్రకు అంతగా నప్పలేదు. అంతే కాదు. సీరియల్ గా వచ్చిన 'కోలాటం' లో వున్న ఓ ముఖ్యమైన డ్రీం సీక్వెన్స్ పుస్తకరూపంలో వచ్చినప్పుడు డ్రాస్టిక్ గా ఎడిట్ చేసేశారు. సీరియల్లో అరుంధతి ఇద్దరు కుర్రాళ్ళతో ఒకేసారి చేయించుకుంటుంది. ఆ సన్నివేశాన్ని ఎంతో రంజుగా వర్ణించారు నాచర్ల గారు. సీరియల్ గా వచ్చినప్పటి పస నవలారూపంలో వచ్చినప్పుడు లేకుండా పోయింది. పాకెట్ బుక్కుగా నవల తేవడంలోని కష్టాలవి. బహుశా పేజీలు ఇన్నే రావాలని కాబోలు.
కాబట్టి సిరిపురపుగారూ, 'కోలాటం' నవల మీవద్ద పుస్తక రూపంలో లేదన్నందుకు మేం నిరాశ పడలేదు. సీరియల్ విడి భాగాలు మీ దగ్గర వున్నాయని ఆశ పడుతున్నాం. అవి కూడా లేవంటే అప్పుడు తప్పక నిరాశ పడతాం. మేమిక ఎప్పటికీ మళ్ళీ చూడలేం అనుకున్న కథలతో పాటు ఎప్పుడూ చూడని అద్భుతమైన కథలు కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు మీరు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. కథలతో పాటే సేరియల్స్ విడి భాగాలు మీ వద్ద తప్పక వుంటాయని మేం ఆశించడంలో తప్పులేదనుకుంటాను.
ఒకవేళ ప్రసాద్ గారి దగ్గరో, సరిత్ గారి దగ్గరో అవి వుంటే తప్పక మాతో పంచుకుంటారని కోరుతున్నాం. ఒక పార్టు ప్రసాద్ గారి వద్ద దొరికింది గనక మిగతా పార్టులూ తప్పక వుంటాయి. అందుకే ప్రసాద్ గారిని మళ్ళీ దయచేయమని ప్రార్థన.
ప్రసాద్ మామను కదిలించండి సరిత్ జీ! సిరిపురపుగారి సూచన గమనించండి. అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ దారం మరింత అందంగా వుంటుంది. అందులో మీ కృషి ఇప్పటికే అమోఘమైనది. 'రసికప్రియ' అరుదైన పోస్టు మీకు పంపిన ప్రసాద్ గారు ఇవి కూడా తప్పక పంపిస్తారు. ఆ నమ్మకం మాకుంది.
ఈ దారం ఇప్పటికే మీ వల్ల అందగించింది సిరిపురపు గారూ.
థాంక్స్.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 12:42 PM



Users browsing this thread: 38 Guest(s)