Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
18th February 2014

( ముందుగా నిన్ని నిన్ని గారికి నా మనః పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. )

షాడో గారూ-మధుబాబు గారూ !
Posted by సుజాత
షాడో

ఆ పేరు వింటేనే గొప్ప థ్రిల్లింగా ఉంటుంది!

ఒకప్పుడు ( ఆ మాటకొస్తే అభిమానులైన వారిని ఇప్పుడూనూ ) యువతరాన్ని ఆ డిటెక్టివ్ పుస్తకాలు ఎంతగా ఉర్రూతలూగించాయో చాలా మందికి తెలుసు! ముఖ్యంగా మా అన్నయ్య కాలేజీ రోజుల్లో ( మాకు ఆ పుస్తకాలు చదివే పర్మిషన్ ఉండేది కాదు మరి ) వాడు, వాడి స్నేహితులు,కజిన్సూ చచ్చిపోతుండేవాళ్ళు షాడో అడ్వంచర్స్ చదవడానికి! వాడు ఇంట్లో లేనపుడు రెండు నవారు మంచాల మధ్య ఒక స్థావరం తయారు చేసి అక్కడ కూచుని నేనూ, మామయ్య కూతురు విశాలీ చదివే వాళ్ళం!

కాలేజ్లో చదివే పిల్లకాయలం కాబట్టి ఎప్పటికైనా షాడోని చూస్తామంటావా అని దిగులుపడేవాళ్ళం!మా కంటే చిన్న వాళ్ళను పోగేసి షాడో వీరగాధల్ని సాయంకాలాల్లో బుర్రకథ టైపులో చెప్తుండేవాళ్ళం!

షాడో అసలు పేరు "రాజు" కావడం మాకు నచ్చేది కాదు.షాడోనే ఎందుకు కాకూడదని బాధపడేవాళ్ళం!అసలింతకీ షాడో అంటే అసలర్థం ఏమిటని ఆలోచించాలని కూడా తట్టేది కాదు మాకు! అంతగా పర్సనలైజ్ చేసేసుకున్నాం!

మా ఇంట్లో ఈ క్రేజు ఎంతవరకూ పోయిందంటే మా అన్నయ్య కి కొడుకు పుట్టినపుడు (ఇప్పుడు వాడు CA ఇంటర్ చదువుతున్నాడు)అన్నయ్య వాడికి శ్రీకర్(షాడో అసిస్టెంట్,జూనియర్ ఏజెంటు)అనే పేరు ఖాయం చేసేశాడు కనీసం వాళ్ళావిడ అభిప్రాయం కనుక్కోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా!

అంతగా క్వాలిటీ లేని పేపర్ తో ముద్రించిన ఆ పాకెట్ సైజు నవలలంటే ఇప్పటికీ క్రేజున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. విజయవాడ,గుంటూరు బస్టాండుల్లో పుస్తకాల షాపుల్లో వేలాడుతూ ఇప్పటికీ కనిపిస్తాయి.

ఇప్పుడు చదివితే కొంచెం నవ్వొస్తుంది కానీ అప్పట్లో నరాలు తెగే టెన్షన్!

బిందు,గంగారాం,కులకర్ణి,ఆయన పైపు,వీళ్లంతా ఒక ఫాసినేషన్!

అలవోగ్గా దొర్లే ఇంగ్లీషు పదాలు,సన్నగా వళ్ళు జలదరించడం, ఊపిరి బిగపట్టడం,దవడ కండరం బిగుసుకోవడం,విదేశీ వీధుల్ని సైతం స్వయంగా చూసినట్లు రచయిత వర్ణించడం, మార్షల్ ఆర్ట్స్ లో కిక్ లు, పంచ్ లను సైతం వివరించడం, ఇంకా ధృడకాయుడు, బే వంటి పదాలు ఇవన్నీ షాడో నవలల్లో మాత్రమే కనిపిస్తాయి.


అన్నట్లు మధుబాబు గారు కొన్ని దశాబ్దాలుగా ఆనాటి ఇద్దరు రచయితల ఆచూకీ గురించి ప్రయత్నిస్తున్నారట. వారి పేర్లు శ్రీ విజయాత్రేయ, శ్రీ ద్వారకానాథ్ ! మీలో ఎవరికైనా వారెక్కడ ఉన్నదీ, కనీసం చిరునామా అయినా తెలిస్తే వారికి తెలియపరిస్తే సంతోషం!
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 31-12-2019, 06:09 PM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM



Users browsing this thread: 12 Guest(s)