19-11-2019, 06:26 PM
Quote:8th September 2012
sarasasri
"సరస-శృంగార కాథా పరిచయ పితామహు" లనదగ్గ ప్రసాద్ గారికీ, రసఞ్ఙులకూ.. ప్రేమతో......
సరసశ్రీ అందించే వందనాలందుకోమ్మని మనవి!
చలనచిత్ర పరిశ్రమకీమల్లే, కథాస్రవంతికీమల్లే, చతుషష్టి కళా స్రవంతికీ ప్రతిప్రక్రియకీ స్వర్ణయుగమనదగ్గ కాలాన్ని ఎంచడం రసఞ్ఙులకు అలవాటు.
అలాగే శృంగార సాహిత్యానికీ స్వర్ణయుగమనేదేదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎనభయ్యో దశకమే ! విశాలంగా ఆలోచిస్తే 75 నుండి 95 వరకు చెప్పుకోవచ్చును. ముందూ-తర్వాతా అడపాదడపా మంచివీ వస్తున్నా ఎక్కువశాతం సాధారణకథలమధ్య మంచివీ మరుగునపడిపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే పాత-కొత్త సినీమాలకీమల్లేనే.
కాలగర్భంలో కలిసిపోయాయనుకున్న అలాంటి పత్రికల్ని మనందరికోసం, ప్రతిఫలమాశించకుండా ప్రసాద్ గారు మనకి ప్రసాధించే సంకల్పం .... మనందరి సౌభాగ్యం!
వీటిని సేకరించడానికాయన ఎన్ని వ్యయప్రయాసలకోర్చుంటారో...చెప్పడానికలవిగాదు. సేకరించదానికిమించి ... సం రక్షించడం అన్నిటికంటే కష్టతరమైన విషయం కదూ!
జగత్ సృష్టికే మాతాపితరులైన పార్వతీ-పరమేశ్వరుల శృంగారాన్ని బాహాటంగా రచించి, మహాకవులనిపించుకునీ కీర్తినందినవారికి భోగభాగ్యాలందించి, సూటిగా శృంగార కథల్ని అందించే వారికరదండాలిచ్చీ అభాసుపాల్జేసే మన ద్వందవైఖరీ దేశంలో(శృంగార రచనల్నిగనక చట్టబద్దం చేసుంటేగనక పసలేని , పక్కా మక్కీకి-మక్కీ కొట్టే మన పేరున్న నవలారచయితలు ఎప్పుడో రసఞ్ఙునులూ కార్చిన రసాల్లో కొట్టుకుపోయేవారని పాఠకులకంటే రచయితలకే బాగాతెలుసు) ... శక్తికిమించిన పని.
అందరూ శృంగారకథలు చదువుతారు
కొంతమందే వాటిని భద్రపర్చగల్గుతారు
అందులో కొందరే ఇతరులకందిస్తారు
ఎంతమంది శాశ్వతత్వాన్నివ్వాలనిచూస్తారు?
దీన్నిబట్టే ప్రసాద్ గారెంత అరుదైనకోవకు చెందివారో చెప్పనవసరం లేదంటాను.
నేనూ కొన్ని నాదగ్గరున్న నవలల్ని, కథల్నీ స్కాన్ చేసి అందించాను. కానీ అవన్ని హనుమంతుడిముందు కుప్పిగంతులే!
నేను సంకల్పించిన ఈ మహాయాగంలో ప్రసాద్ గారితో ఓడిపోవాడం నాకెంతో గర్వంగా ఉంది.
అందరూ కోరుకున్నట్లు... ఎన్నెస్ కుసుమ , నాచర్ల , మధు, మొదలగువారి రచనలూ మనల్నందర్నీ అలరిచగలవని నా ఆశ.!
అసలు శృంగార కథల్ని ఎలా రాయాలో అనేకంటే.....ఎలా రాయకూడదో అని నేర్పించే ఆ కథలు నిజంగా మరపురానివనీ, మార్గదర్శకమైనవనీ ఈ కాలం రచయితలు తప్పక గ్రహిస్తారనుకుంటున్నాను.
వారియాగమిలాగే సాగాలని...మిగతా కథాదాతలకూ స్పూర్తి నింపాలని...మనసారా ఆశిస్తున్నాను....
సర్వేజనా సరస-కథాస్రవంతి ప్రాప్తిరస్తు!
సర్వే సరసకథా-హర్తా ధాతృత్వమస్తు !!
ప్రసాద్ గారి అభిమాని....
సరసశ్రీ