04-09-2019, 03:36 AM
(01-08-2019, 12:30 AM)lotuseater Wrote: ఎలా సాధ్యపడింది లింగం గారూ?
ఎక్కడ దొరికింది మీకీ నిధి?
ఓహ్!
కొన్ని దశాబ్దాలనుంచి తడుముకుంటున్న ప్రశ్నకు ఒక్కసారిగా సమాధానం దొరికినట్లయింది.
మొదటినుంచీ శృంగారసాహిత్యాభిమానులు దాదాపుగా ఖాయం చేసుకున్న విషయం సరసశ్రీగారి ఛాలెంజితో ఒకేసారి ప్రశ్నార్థకమై కూర్చుంది. సరసశ్రీగారి విశ్లేషణ వచ్చేంతవరకూ నేను కూడా కూడా ఎన్నెస్ కుసుమ, నాచర్ల సూర్యనారాయణ ఒక్కరనే నమ్ముతూ వచ్చాను. ఆ నమ్మకానికి కారణం - ఎన్ని వందల పుస్తకాల్లో కలిపేసినా ఒక్క వాక్యంతోనే ఇది ఎన్నెస్ కుసుమ లేదా నాచర్ల వారి రచనే అని పట్టిచ్చే శైలి. అది తప్ప వేరే రుజువేమీ లేదు. అయితే పుస్తకాభిమానులకు అంతకు మించిన రుజువేం అక్కర్లేదనుకుంటాను. కానీ సరసశ్రీ గారి విశ్లేషణ నా నమ్మకాన్ని పటాపంచలు చేసింది. చాలా బలమైన విశ్లేషణ అది. ఎన్నెస్ కుసుమ గారు రచయిత్రి అనీ, నాచర్లవారు రచయిత అనీ శక్తివంతంగా వాదించారు సరసశ్రీగారు. దానికి వారు ఆయా రచనల్లో తార్కాణాలు కూడా చూపించారు. ఇద్దరూ ఒక్కరేనని ఆదినుంచీ నమ్ముతూనే వస్తున్న నేను కూడా సందేహంలో పడ్డాను. అవునేమో, రెండుపేర్లూ ఒకరివి కావేమో అనిపించేంత దూరం వెళ్ళింది వ్యవహారం. అసలు విషయం తెలుసుకోవడానికి లింగంగారూ, సిరిపురపువారూ వర్సగా ఇస్తున్న నవలల్ని పరిశిలిస్తూనే వున్నాను.
ఆ రెండుపేర్లూ ఒకరివేనని లింగంగారు చెప్పినప్పుడు కూడా వారూ నాలాగే శైలినిబట్టి చెబుతున్నారేమోననే అనుకున్నాను. ఇప్పుడు తిరుగులేని రుజువుతో ముందుకొచ్చారు లింగంగారు. లింగంగారికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే అవుతుంది.
అయినా ఒక సందేహం మాత్రం నన్నింకా పీడిస్తూనే వుంది. శైలి ఎంత ఒకటిగా వున్నా కథనంలో కొన్ని అంశాలు ఇద్దరూ ఒకటి కాదేమోననే అభిప్రాయానికి తావిస్తూనే వున్నాయి. సరశ్రీగారు చూపిన ఎన్నెస్ కుసుమగారు అభిమానులకు రాసిన 'స్వీట్ లెటర్ ' లో ('స్పేర్ బస్ ' నవల చివరలో వుంటుంది చూడండి) తాను గృహిణినని, తమ శ్రీవారి అనుమతితోనే ఈ నవలలు రాస్తున్నాననీ తెలియజేస్తున్న లేఖ అబద్ధమని అనుకోవాలా? ఎన్నెస్ కుసుమ పేరుతో వచ్చిన కొన్ని నవలల్లో నెల్లూరు భాష వాడినట్లుగా అనిపిస్తుంది. మరికొన్ని నవలల్లో ఏలూరు లేదా వైజాగు భాషతోపాటు అక్కడి ఊళ్ళు కూడా దర్శనమిస్తాయి. అది కూడా ఎన్నెస్ కుసుమగారూ నాచర్లవారూ ఒక్కరు కారేమో అనే అనుమానం కలిగిస్తాయి.
ఏది ఏమయినా లింగం గారు చూపించిన రుజువుతో ఇప్పుడా మీమాంసకంతా తెర పడింది.
కానీ, లింగం గారూ! నాచర్లవారి లెటర్ హెడ్ లో అడ్రసు కొంచెమైనా మాస్క్ చేసి చూపించాల్సింది కాదా? ఎందుకంటే ట్రాలర్స్ వారిని వేధించే అవకాశం వుంది కదా! ఒకవేళ వారిప్పుడు ఆ అడ్రసులో లేకపోయినా, వున్నవారిని ఇబ్బందిపెట్టే పరిస్థితులు వస్తాయేమో!
కానీ నాకు మాత్రం ఇది నిధే!
మరోసారి కృతజ్ఞతలు.
రసప్రియులకు వేవేల వందనాలు!
బావిలో కప్పవంటి నాలాంటి చిన్నవారికి అనుభవఙుల కర/కామదీపాలు అనుసరణీయాలు
ఒక్క రుజువుతో ఎన్నో అనుమానాలు పటాపంచలయినట్టయ్యింది.
కేవలం ఒకే ఒక యెన్నెస్ కుసుమ పేర్న ఉన్న పేజీ , ఇంకా మనస్సులోని కథాసంఘటనా,సంభాషణా-సన్నివేశాలననుసరించి చెప్పడమేగాని అంతకుమించి ఏమీ తెలియనివాన్ని.
కాబట్టి అప్పుడు నా తరఫున వాదనకన్నా లభించిన ఆధారాన్ని ప్రాఙ్నులకందించడం ముఖ్యోద్దేశము.
ఏమైనా అసలనుమానానికి తెర పడినా కొసరు వెలికి వచ్చి కవ్విస్తూ-వెక్కిరిస్తున్నట్టనిపిస్తుంది
అవేమిటంటే...
1) ఒక సోషల్ వర్కర్ అయ్యుండీ, అలా స్వచ్ఛందంగా పేరుని బయట పెట్టి ఆ కథలు రాసేస్తాడా? అవీ అనేకమైన్నన్ని. అదీ ఆ కాలంలో ?!
2) చట్టనికి వెరుపు, సమాజానికీ మరుపూ , భావి కుటుంబం పరువూ ఒదిలేస్తారా?? అదీ అంత పెద్ద/గొప్ప రచయిత .... నాకైతే అనుమానమే
3) ఇక కుసుమ పేరుతో వచ్చిన ఆ లేఖ ... మరి నాచెర్లవారే రాస్తూ... తన భార్య అనుమతితోనే రాస్తున్నట్టు చెప్పటం ఉద్దేశ్యమా? ఎందుకంటే ఆ రచనల్లో ఒక స్త్రీ పాత్ర ప్రస్ఫుటమని చెప్పవచ్చు. అది ఒక మగవాడిగా మనం అవలీలగా చెప్పేయగలం.
ఇవన్నీ నా అనుమానాలు!
మహాకవుల కృతులు తరచూ తరచి తరచి తలచి తలచీ అనుభవించడమే అనుభవైకవేద్యం అని విశ్వనాధవారన్నట్టు ఇదీ నా అనందంకోసమేనేమో!?
పొడమరే రసలుబ్ధులీవసుధాస్థలిన్ ...... అన్నట్టు ఈ తర్కాన్నీ అనుభవించేవారున్నారా?
మీ
సరసశ్రీ