27-01-2020, 10:44 PM
(This post was last modified: 27-01-2020, 10:54 PM by lotuseater. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-01-2020, 12:51 PM)lingam Wrote:పెద్ద రమణి 01
వెల్‌కం బేక్ లింగంగారూ!
సో, అదంతా ఇలా మొదలైందన్నమాట!
'రమణి ' తొలిసంచిక ఈ జన్మలో చూడగలననుకోలేదు.
'రసికప్రియ ', 'మన్మధ ', 'మదన ' - ఈ పరంపరలోనే 'రమణి ' కూడా వచ్చింది. తెలుగులో ఎరోటిక్ రచనలకు కొత్త స్టాండర్డ్ కల్పించిందనడంలో సందేహం లేదు. తొలిసంచిక వెల రూ.0-80 పైసలు. పెద్ద సంచిక డిమాండు పెరిగిపోవడంతో చిన్న సంచిక కూడా వచ్చింది.
'రమణి ' తొలి ఎడిటర్ విజయబాపినీడుగారు మొదట్లో గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాశారు. వీరి డిటెక్టివ్ పేరు చంద్రమోహన్. విజయబాపినీడుగా మారిన తర్వాతే వీరికి దశ తిరిగిందంటారు. ఆ తర్వాత పత్రికా రంగంలో వీరు సృష్టించిన సంచలనం మరువలేనిది. 'బొమ్మరిల్లు ', 'విజయ ' పత్రికలు సాధించిన ఘనవిజయాల గురించి చాలామంది పాఠకులకు తెలిసే వుంటుంది. చిన్న పిల్లలకీ, పెద్దవారికీ, శృంగారప్రియులకూ పత్రికలు నిర్వహించి ఆ రంగంలో పండిపోయినవారిని కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. 'బొమ్మరిల్లు ' తో పిల్లలకు సెక్స్ నేర్పిస్తారా అని ఎవరో అడిగారట కూడా. 'బొమ్మరిల్లు ' ఎంత బాగా పోయేదో చెప్పనలవి కాదు.
ఆ తర్వాత సినిమా రంగంలో రచయితగా ప్రవేశించి క్రమంగా దర్శకనిర్మాత స్థాయికి ఎదిగారు.
శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పేరుతో చాలా సినిమాలు తీశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ మొదటి సినిమా పేరు కూడా 'బొమ్మరిల్లు ' అనే గుర్తు. పొరపాటైతే ఎవరైనా సవరించగలరు. 'పట్నం వచ్చిన పతివ్రతలు ' సినిమాలో నూతన్ ప్రసాద్ ని ఎవరు మర్చిపోగలరు?
' మెగా స్టార్ ' చిరంజీవి గారితో మెగా హిట్స్ అందించారు. 'గ్యాంగ్ లీడర్ ' లాంటి సోషియో యాక్షన్ థ్రిల్లర్స్ తో పాటు 'మగమహారాజు ' లాంటి సెంటిమెంటల్ సోషల్ మాస్టర్ పీస్ తీశారు. వాటితోపాటే రాజేంద్రప్రసాద్ తో 'నాకూ పెళ్ళాం కావాలి ' వంటి హాస్యరసగుళికలూ అందించారు. వైవిధ్యానికి మరోపేరు విజయబాపినీడుగారు.
డబ్బుతో ఆటలాడ్డమంటే తనకు చాలా భయమని ఒక ఇంటర్ వ్యూలో చెప్పారు. అందుకే అన్నింటా జాగ్రత్త పాటించేవారు. ఆ జాగ్రత్తే ఆయన విజయానికి సోపానం వేసింది. 'విజయ ' బాపినీడుగా ఆయన సార్థకనామధేయులు. గత సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన దేహయాత్రతో పాటే తమ విజయయాత్ర కూడా చాలించారు.
విజయబాపినీడుగారి జ్ఞాపకాలకిది నివాళి.