17-12-2019, 11:05 PM
(16-12-2019, 09:06 PM)lingam Wrote:సిరిపురపు గారూ, లోటసీటరు గారూ,సరిత్, ఇతర మిత్రులారా,
అనుకోని అవాంతరాల వల్ల స్కానింగు పని కొన్ని రోజులపాటు ఆపాల్సి వచ్చింది.
జనవరి 25 తర్వాత మళ్ళీ యధావిధంగా ప్రారంభం చేస్తాను.
ఆలస్యాన్ని సహృదయంతో స్వీకరిస్తారని నమంతున్నాను.
మీలింగం
హమ్మయ్య! ఇప్పుడు మనసు కుదుట పడింది. కొన్నాళ్ళు మీరు కనిపించకపోయేసరికి ఎవరో ఆప్తమిత్రుడు తప్పిపోయినట్టనిపించింది. పుస్తకాల స్నేహం అలాంటిది.
లింగం గారూ! మీకు హేట్సాఫ్! మీరిచ్చిన పుస్తకాలు ఎంత విలువైనవో మిత్రులు చాలామంది గ్రహించినట్టు లేదు. ఎన్నెన్ని తెలుగు పుస్తకాలు, పత్రికలు ఆ పాతరోజుల్లో పాఠకులకు అందుబాటులో వుండేవో కొన్ని - కాదు కాదు - అనేకం మీరు మచ్చు చూపించారు. వాటిలో చాలా పత్రికలు నేను చూడను కూడా చూడలేదు. కొన్నిటి పేర్లు విన్నాను కానీ అవెలా వుండేవో తెలీదు. ఉదాహరణకు నాకు కృష్ణమోహన్ గారు 'సంసారం ' పత్రిక నడిపారని తెలీదు. విశ్వప్రసాద్ గారివి కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయిన నవలలు 'నర్తకి ', 'వేశ్య ' వంటివి మొదట ఈ పత్రికల్లో సీరియల్స్ గా వచ్చాయని తెలీదు. గిరిజ శ్రీభగవాన్ గారు ఆరోజుల్లో శృంగార నవలలని పిలిచిన పుస్తకాలు రాశారని తెలీదు. అసలివన్నీ ఎరోటిక్ నవలలు కానే కావు. కొవ్వలిగారికి కొద్దిగా అమలిన శృంగారం కలిపిన సాంఘిక నవలలు. ఆ నవలల్ని ఏమని పిలవాలో వాటిలోనే వుంది - అవన్నీ 'మహోజ్వల ' నవలలు. తర్వాతి రోజుల్లో సుప్రసిద్ధ రచయితలుగా పేరుపడ్డవారు కూడా ఈ పత్రికల్లో రాశారు. చిన్న చిన్న ఊళ్ళ్లలో చదువురానివారిని కూడా పాఠకులుగా చేసి కొన్ని లక్షలమందిని పఠితలుగా తయారు చేసిన ఘనత వీటికుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో టైం మిషన్ లో కూర్చొని పూర్వపు రోజుల్లోకి ప్రయాణం చేసినట్టుంది.
థాంక్ యూ!
థాంక్ యూ వెరీమచ్!