Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#11
అటు సంస్కృతములోను ఇటు ఇంగ్లీషులోను ఉన్న విషయాలని కలుపుకుని వాటిని దేశభాషల్లోకి అనువాదం చేసి అందరికీ అర్థమయ్యే తెలుగులో పుస్తకాలని రాయించాలని ఆయన ఆలోచన. ఈ అభిప్రాయాలు 1862 వరకు ఎవరికీ తెలియకుండా వుండిపోయాయి. ఆ తరవాత కూడా గ్రాంథిక వ్యావహారిక భాషావివాదాలలో ముద్దునరసింహం నాయుడు చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు విస్మరించబడ్డాయి.
  1. ఆధునిక విజ్ఞానము; ప్రాచీన గ్రంథాలలో వుండే సమాచారము, ఇంగ్లీషు పుస్తకాల్లో వుండే సమాచారము రెండూ కలిపి, ఆలోచనాపూర్వకంగా సమన్వయించి పాఠ్య గ్రంథాలలో రాయాలి.
  2. ఆ వాక్య గ్రంథాలలో రాసే తెలుగు ఎలా వుండాలో చెప్పే నియమాలతో ఒక ‘పత్రిక’ తయారు చెయ్యాలి.
  3. ఇంగ్లీషు లోను, సంస్కృతం లోను వుండే పుస్తకాల లోని విషయాలు తెలుగు లోకి తర్జుమా చేయించాలి కాబట్టి ఆ భాషల్లో సమర్థులైన వాళ్లని ఈ పనికి నియమించాలి.
ఈ మూడు విషయాలు అప్పటికే కాదు, ఇప్పటికి కూడా ఎవరికీ తట్టడం లేదు. ఆ పుస్తకాన్ని చూసి గిడుగు రామమూర్తి ముద్దునరసింహం నాయుడు మనవడైన ముద్దుకృష్ణ దగ్గర దాన్ని ప్రశంసించారు కాని ఎందుచేతనో ఆ పుస్తకం ప్రసక్తి కానీ, ఆయన పేరు కానీ గిడుగు రామమూర్తి తమ పుస్తకాల్లో, వ్యాసాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మేము ఆయన చెప్పిన విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాం. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా బోధపడాలంటే ఆ పూర్తి పుస్తకం చదవాలి.

[ఈ పుస్తకాన్ని ఈ సంచికలో ప్రకటించి ఈమాట గ్రంథాలయంలో చేరుస్తున్నాం. దీనిని టైపు చేసి ఇచ్చిన వాడపల్లి శాయిగారికి మా కృతజ్ఞతలు. – సం.]
ముద్దునరసింహం నాయుని పుస్తకం అచ్చయిన నలభయి ఏళ్ళకి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల పనిని గూర్చి సమీక్షించడానికి సెప్టెంబరు, 1901లో సిమ్లాలో పదహారు రోజుల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం తరువాత, అప్పటివరకూ జరిగిన విద్యాభివృద్ధిని గురించి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసేందుకు ఒక సంఘాన్ని 1902లో నియమించాడు. ఆ సంఘం ఉద్దేశం బొంబాయి, మద్రాసు, కలకత్తా నగరాలలో 1852లో ఏర్పాటు చేసిన మూడు విశ్వవిద్యాలయాలలోను తయారయిన పట్టభద్రులు ఏమి చేశారో పరిశీలించడం. అక్కడ తయారయిన పట్టభద్రులు తమ తమ ప్రాంతీయ భాషల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని, ఆధునిక భావాలను ప్రచారం చేయగలరని ప్రభుత్వం భావించింది. కానీ ఈ సమావేశంలో పాల్గొన్న విద్యావంతులు 1905 సంవత్సరంలో సమర్పించిన నివేదికని బట్టి చూస్తే విశ్వవిద్యాలయాలలో తయారయిన విద్యావంతులు ప్రాంతీయ భాషలలో ఏ రకమైన కృషి చేయలేదని బోధపడుతుంది. వాళ్లందరూ ఇంగ్లీషులో విద్య నేర్చుకున్నారు, వాళ్ల వాళ్ల సొంత భాషల్లో వాళ్లకి ఏ రకమైన శిక్షణా లేదు. అందుచేత సొంత భాషల్లో ఏమీ రాయలేరు. దానితో పాటు ప్రాంతీయ భాషల్లో ఇంగ్లీషులో వున్న కొత్త విషయాలు చెప్పడానికి కావలిసిన మాటలు కూడా లేవు. దీనికంతటికీ కారణం విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషని నిర్లక్ష్యం చేయడమే. ప్రాంతీయ భాషలు ఈ విశ్వవిద్యాలయాలలో బోధనా భాషగా ఎప్పుడూ లేవు. ఈ చర్చల ఆధారంగా కర్జన్ విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలు నేర్పడం మొదలు పెట్టాలని, ప్రాంతీయ భాషల్లో వ్యాసరచన ఇంగ్లీషునించి ప్రాంతీయ భాషలోకి అనువాదం ప్రత్యేక అంశాలుగా ప్రవేశపెట్టాలని నిర్ణయాలు చేశాడు. ఈ నిర్ణయాలు 21 మార్చ్ 1904 నాటినుండి చట్ట రూపంలో అమలులోకి వచ్చాయి. కానీ ఈ చట్టాన్ని ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న ఆర్. జి. భండార్కర్, బి. కె. బోస్ లను మినహాయించి భారతీయులందరూ వ్యతిరేకించారు, ముఖ్యంగా గోపాలకృష్ణ గోఖలే, అశుతోష్ ముఖోపాధ్యాయ ఈ చర్చలు జరిగిన రెండు సంవత్సరాల పాటు తీవ్రంగా ప్రతిఘటించారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తోందని ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి ప్రవేశించి వాటిని కూడా పాడు చేయదలుచుకుందని గోపాలకృష్ణ గోఖలే వాదన.

కర్జన్ బిల్లు ఫలితంగా కాలేజీ ఫైనలు బోర్డ్ వాళ్లు 1909లో ఒక నిర్ణయం చేశారు. తెలుగులో వున్న రెండు రకాల తెలుగు శైలుల్ని గుర్తులో పెట్టుకుని కాబోలు విద్యార్థులు పరీక్షల్లో మోడర్న్ లేదా క్లాసికల్ తెలుగు రెండింటిలో ఏ శైలిలోనయినా రాయవచ్చునని అనుమతిచ్చారు.. వాళ్ల అభిప్రాయంలో మోడర్న్ తెలుగు అంటే బ్రౌన్ రీడర్ లోను, ఆర్డెన్ తెలుగు గ్రామరు లోని మొదటి భాగం లోను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర లోను ఉన్న రకమైన భాష. దీన్ని వాళ్లు వ్యావహారిక భాష అనలేదు. మోడర్న్ తెలుగు భాష అని మాత్రమే అన్నారు. ఈ మోడర్న్ అన్న మాటకి అర్థం వివరించి చెప్పినవాళ్లు ఎవరూ లేరు. అంతే కాదు, ఈ పుస్తకాలు చదివిన విద్యార్థులు ఈ పుస్తకాలలో వున్న భాషలోనే సమాధానాలు రాయాలా లేకపోతే ఇంకే శైలిలోనయినా సమాధానాలు రాయవచ్చా అన్న దాని గురించి మనకి ఏమీ తెలియదు.

ఒక పక్క కర్జన్ బిల్లు పైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత సాగుతుండగా ఆధునిక గ్రంథాల పేరుతో సెట్టి లక్ష్మీనరసింహం రాసిన గ్రీకు మిత్తులు, వేదం వెంకటాచలయ్య రాసిన విధిలేక వైద్యుడు కాలేజీ ఫైనలు విద్యార్ధులకు నాన్-డిటెయిల్డ్ పాఠ్యగ్రంథాలుగా పెట్టారు. ముఖ్యంగా గ్రీకు మిత్తులు పుస్తకంలో వాడిన భాష, అంతకన్నా ఆ పుస్తకానికి పి. టి. శ్రీనివాస అయ్యంగార్ రాసిన ముందుమాట పండితుల కోపానికి గురయ్యింది. అలాగే శ్రీనివాస అయ్యంగార్ ప్రాంతీయ భాషల గురించి రాసిన (Death or Life: A plea for the Vernaculars, 1909) అన్న 41 పేజీల చిన్న పుస్తకం కూడా ఆధునిక విద్యావిధానం పైన వాదనలు మరింత వేడెక్కటానికి దోహదపడింది.

ఆధునిక గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా పెట్టాలనే కొత్త నియమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని తాము రాసిన పుస్తకాలని పాఠ్యగ్రంథాలుగా చేయించుకోవాలనే వాళ్లు కొందరు వుండేవాళ్లు. సెట్టి లక్ష్మీనరసింహం, వేదం వెంకటాచలయ్య ఆ కోవలో వాళ్లేనా? కాకపోతే వీళ్ల పుస్తకాలకి ఆధునిక గ్రంథాలుగా గుర్తింపు కాని వాటి పట్ల ఆమోదం కాని లేకుండా ఇవి పాఠ్య గ్రంథాలుగా ఎలా ప్రవేశపెట్టబడ్డాయి అనే ప్రశ్నకి సమాధానం దొరకదు. ఉదాహరణకి విధిలేక వైద్యుడులో వేదం వేంకటాచలయ్య రాసిన వాక్యాలు చూడండి:
Quote:తిమ్మా. – మరండి అందరంటుండారు, ఇట్టాటి కొత్త మందు లెట్టుండాయో కనుక్కోవాల్నని రోగుల కిచ్చి సంపేస్తారంట వొయిద్దులు. ఇంకా యెక్కవమందిని సంపితేనేగాని గొప్ప వొయిద్దుడు కాడంట. అందుశాత యీలైనప్పుడల్లా యిట్టాటి మందులిచ్చి సంపేస్తుంటారంటండి మా వొంటి బీదవోల్లను.

జాన. – ఔను, వింతేమి? ఆమెకు యిష్టంలేని వానికి ఆమె నిస్తనంటిరి. ఆమె కోరుకున్న లింగంనాయని కేల ఆమె నీరాదూ అంటా. ఆయన కిస్తే ఆమె సుకం గుంటది. ఆయనేమో ఈమెను ఇప్పుడూ యెంత రోగంతో ఉణ్ణా చేసుకుంటాడు; నిశ్చయం.

దీనితో తెలుగు సాహిత్యంలో మంచి పుస్తకాలు మీకేమీ దొరకలేదా అని పండితులు ప్రశ్నలు లేవదీశారు. అక్కడితో ఆగక, ఈ పుస్తకాల వల్ల తెలుగు భాష పాడైపోతుందని జయంతి రామయ్య పంతులు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. రామయ్య పంతులు మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రంగానే నడిచింది. ఆయనకి వున్న అధికార స్థానం బహుశా ఉపకరించడం వల్ల కావచ్చు, ఈ ఉద్యమానికి పెద్ద పెద్ద జమీందార్ల సహకారం ఆయనకి లభించింది. గ్రామ్యభాషలో వున్న గ్రీకు మిత్తులు, విధిలేక వైద్యుడు లాంటి చవకబారు పుస్తకాల్ని పిల్లలకి పాఠ్య గ్రంధాలు చెయ్యడాన్ని నిరసిస్తూ తెలుగు దేశంలో చాలా వూళ్లలో సభలు, పెద్ద ఎత్తులో సంతకాల సేకరణలు జరిగాయి. ఈ సభలలో పెద్ద పెద్ద పండితులు–కాశీభట్ల బ్రహ్మయ్యరావు, కాశీ కృష్ణాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, వీరేశలింగం, చెళ్లపిళ్ల వెంకటరావు, మొదలైనవాళ్లు పాల్గొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మద్రాసు విశ్వవిద్యాలయ సిండికేట్ ఒక సంఘాన్ని (Telugu Composition Committee) నియమించింది. ఈ సంఘం చాలాసార్లు సమావేశమై 20 సెఫ్టెంబర్ 1912న వ్యావహారిక భాష వాడుకకు అనుకూలంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తరువాత ఒక నెల రోజులకు ఆధునిక భాష అంటే ఏమిటో ఒక వివరణ కూడా ప్రకటించారు. ఈ రెండు సవరణలు జరిగిన మూడు నెలల లోపే మరొక సవరణ తెచ్చిపెట్టారు. ఇదంతా తీవ్రమైన గందరగోళానికి దారితీసింది.

ఇదే సమయంలో, అప్పటిదాకా ఉన్న ఎఫ్.ఎ. (F.A) పరీక్షకు బదులు రెండేళ్ళ పరిమితితో ఇంటర్‌మీడియట్ చదువులు ప్రవేశ పెట్టబడ్డాయి. ఇంటర్ పరీక్షలలో వ్యాసరచనకు అనుసరించవలసిన శైలి గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటయింది. దీనికి ‘ఇంటర్‌మీడియట్ కాంపోజిషన్ కమిటీ’ అని పేరు. ఈ కమిటీవారు 1911-1914 మధ్య కాలంలో ఏడు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుగుతున్న కాలంలో వ్యావహారిక భాష అమలుకి వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. 1914వ సంవత్సరం జూన్-జూలై నెలల్లో గ్రాంథికవాదులు (పండితులు) 24 ఊళ్ళలో సభలు జరిపి, దాదాపు పదివేల సంతకాలతో ప్రభుత్వానికి ఈ పుస్తకాలకి వ్యతిరేకంగా ఒక మహజరు సమర్పించారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి, తెలుగులో విద్యార్థులు, మోడర్న్ తెలుగు, క్లాసికల్ తెలుగు, ఈ రెండింటిలో ఏ భాషలోనైనా రాయవచ్చుననే వెసులుబాటుని 11 ఆగస్టు 1914 నాడు ఉపసంహరించుకుంది. దీన్ని గ్రాంథికవాదులు పెద్ద విజయంగా సంబరపడ్డారు.


 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 01-07-2020, 08:44 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)