01-07-2020, 08:10 PM
ఈ సందర్భంలో శిష్టు కృష్ణమూర్తి కవిని గురించి చెప్పుకోవాలి. ఆయన చిన్నయ సూరికి సమకాలికుడు. ఈయన గురజాడ శ్రీరామమూర్తి లెక్క ప్రకారం 1800-1877 ప్రాంతంలో జీవించాడు. ఈయన సంస్కృతంలోను, తెలుగులోను, సంగీతంలోను గొప్ప ప్రజ్ఞ కలవాడు. పురాణం చెప్పేటప్పుడు మధ్యలో పుస్తకం మూసేసి సొంతంగా పద్యాలు ఆశువుగా చెప్తూ మళ్ళా కొంచెంసేపు తరవాత పుస్తకం తెరిచి పద్యాలు చదివేవాడని, వినేవాళ్లకి ఆ రెండు రచనలు ఒకే రకంగా వుండేవని ఒక ప్రసిద్ధి ఉండేది. దానితో పాటు వసుచరిత్రలో పద్యాలకి ఎనిమిదేసి అర్థాలు చెప్పేవాడని ఒక వాడుక కూడా వుంది. ఈయన రకరకాల జమిందార్లను కలుసుకుని వాళ్లందరి దగ్గరా కొన్నేసి సంవత్సరాలు జీవించాడు. ఈయన చాలా పుస్తకాలు రాశాడని పేరుంది కాని సర్వకామదా పరిణయం ఒక్క దానిని గురించే కవిజీవితములలో గురజాడ శ్రీరామమూర్తి కొద్దిగా ప్రస్తావించారు. ఆ పుస్తకంలో పిండిప్రోలు లక్ష్మణకవి చాలా తప్పులు పట్టుకున్నాడని కూడా శ్రీరామమూర్తి రాశారు. శిష్టు కృష్ణమూర్తి కవి గొప్ప వైణికుడట. ఆయన వీణావాయిద్యాన్ని గురించి చెప్పిన ఒక పెద్ద ఉత్పలమాలిక శ్రీరామమూర్తి ఉదాహరించారు. కృష్ణమూర్తి కవి పెద్దపెద్ద ఉత్పలమాలికలు ఆశువుగా రచించడంలో నేర్పరి.
కృష్ణమూర్తి కవిని గురించి ప్రచారంలో వున్న కథల్లో ఒక కథ ఇక్కడ చెప్పడం అవసరం. కృష్ణమూర్తి కవి మాడుగులలో వుండగా అక్కడి జమిందారు కొడుకు జగన్నాథుడు అనే వాడు ఒక గుర్రం మీద మోజుపడి కొందామనుకున్నాడు. కానీ అశ్వశాస్త్రవేత్తలు దాని మెడ కింద గోగు(అంటే యేమిటో మాకు తెలియదు-ర.) ఉందని, అది ఒక దోషమని చెప్పారట. అయినా ఆ కుర్రవాడు ఆ గుర్రాన్ని వదిలిపెట్టలేక కృష్ణమూర్తి కవికి కనుసన్న చేసి, ‘ఈ కవిగారు అశ్వశాస్త్రంలో చాలా పండితుడు, ఈయన దగ్గర ఉన్న పుస్తకాలలో యేముందో కనుక్కుందాం’ అని అన్నాడట. ఆ జమిందారు కృష్ణమూర్తి కవిని మీదగ్గర ఉన్న అశ్వశాస్త్రంలో యేముందో చెప్పండి అని అడిగితే కృష్ణమూర్తి కవి చూసి మీకు రేపు చెప్తాను అన్నారట. ఈ జగన్నాథుడనే అబ్బాయి కృష్ణమూర్తి కవి ఇంటికి వెళ్లి మీరు గాని ఆ గుర్రంలో దోషమేమీలేదని చెప్పినట్లైతే మీకు బోలెడు డబ్బిస్తానని ఆశ పెట్టాడట. కృష్ణమూర్తి కవి రాత్రికిరాత్రి కొన్ని వందల శ్లోకాలతో అశ్వశాస్త్రం చెప్పారట. ఆయన మనవడు కృష్ణమూర్తి కవి దగ్గరున్న పాతతాటాకులు తీసుకుని ఆ శ్లోకాలన్నిటినీ ఆ తాటాకులమీద రాశాడట. సంస్కృతంలో నారద మహాముని ఒక మహారాజుకు చెప్పినట్లున్న ఈ శాస్త్రం జమిందారుకు చూపించి అటువంటి గుర్రానికి అటువంటి గోగు ఉండటం దోషం కాదు సరికదా దానివల్ల చాలా శుభాలే కలుగుతాయని కృష్ణమూర్తి కవి ఋజువు చేశారట. కృష్ణమూర్తి కవి ఈ పుస్తకాన్ని ఆశువుగా చెప్తునప్పుడు స్వయంగా అక్కడ ఉండి విన్న అప్పట్లో ఇరవైయేళ్ళ ఒక యువకుడి ద్వారా కవిజీవితాలు రాసిన గురజాడ శ్రీరామమూర్తి ఈ కథనంతటినీ తెలుసుకున్నారు.
కాళహస్తి ఆస్థానంలో పని చేసేటప్పుడు ఒకసారి, వెంకటగిరి సంస్థానంలో మరోసారి, శిష్టు కృష్ణమూర్తి చిన్నయ సూరితో ఘర్షణ పడినట్లు వేదం వెంకటరాయరావు మనవడి ద్వారా తెలుస్తోంది. చిన్నయ సూరి బాలవ్యాకరణం అంత శాస్త్రసమర్థంగా వుండడం, ఈ సాతాని పండితుడు బ్రాహ్మణులని తలదన్నేలా వ్యాకరణ నిర్మాణం చెయ్యడం శిష్టు కృష్ణమూర్తి కవికి నచ్చలేదు. ఈ విధంగా చిన్నయ సూరి మీద అసూయ పడిన కృష్ణమూర్తి కవి బాలవ్యాకరణం చిన్నయ సూరి స్వతంత్రంగా రాసింది కాదని, అది హరికారికలకి అనువాదమని ఒక వాదం తెచ్చిపెట్టాడు. హరికారికలు హరిభట్టు అన్న ఆయన రాశాడని అధర్వణుడు చెప్పడమే కాని నిజంగా ఆ గ్రంథం ఎవరూ చూడలేదు. చిన్నయ సూరి బాలవ్యాకరణాన్ని అనుసరించి, కృష్ణమూర్తి కవి సంస్కృతంలో ఆ గ్రంథాన్ని తానే రాసి చూపించాడు. శిష్టు కృష్ణమూర్తి చేసిన ఈ పని మంచి పని కాదని, అలాంటి ‘అసత్యవాదము చేయఁగూడదని’ వేదం వెంకటరమణరావు హెచ్చరించారట.
ఈ కథ ఆ కాలంలో ఎవరు నమ్మారో తెలియదు కానీ తరవాత చాలా సంవత్సరాలకి కల్లూరి వేంకట రామరావు తన బాలవ్యాకరణం వ్యాఖ్యానం గుప్తార్థప్రకాశికలో (1915, 1929) మాత్రం ఇది నిజమని చాలా బలంగా ప్రతిపాదించారు. వేంకటరామరావు ప్రకటించిన గుప్తార్థప్రకాశిక టైటిల్ పేజిలోనే ఈ విషయం స్పష్టంగా వుంటుంది (బ్రహ్మశ్రీ శిష్టు కృష్ణమూర్తిరావు పండితవర్యప్రణీత హరికారికాంధ్రీభూత పరవస్తు చిన్నయసూరికర్తృక బాలవ్యాకరణంబునకు వ్యాఖ్యానము.)
వేంకటరామరావు ఇలా వాదించడానికి ఒక కారణముందని అంటారు. కల్లూరి వేంకటరామరావు తన వ్యాఖ్యానం రాస్తున్న రోజుల్లో ఆయన శిష్యుడైన సుంకర రంగయ్య అనే కుమ్మరి కులస్తుడు ఆయనకు లేఖకుడిగా పని చేశాడు. ఆ పుస్తకంలో మొదటి భాగాన్ని–కారక పరిఛ్ఛేదంలో చివరి వరకు ఉన్నదానిని– రాసి, ఆ ప్రతికి శుద్ధప్రతి తయారుచేస్తానని తీసుకెళ్ళి తన పేరుతో ఈ రంగయ్య ప్రకటించుకున్నాడు. ఈ లోపున వేంకటరామరావుకి శిష్టు కృష్ణమూర్తి రావు మనవడు (తాతగారి పేరే గల ఆయన) తన తాతగారు రాసిన హరికారికల రాతప్రతిని వేంకటరామరావుకి సర్వాధికారాలతో (స్టాంపు పేపరు మీద రాసి) దానంగా ఇచ్చాడు. అది చదివిన వేంకటరామరావుకి అది బాలవ్యాకరణానికి మూలగ్రంథం అని, బాలవ్యాకరణం కేవలం దానికి అనువాదమే అనీ నమ్మకంగా అనిపించింది. రంగయ్య వంటి శూద్రుడి మీది కోపాన్ని శూద్రుడైన చిన్నయ సూరి మీదికి మళ్ళించారు వేంకటరామరావు. అప్పట్నుంచి పండితలోకంలో చిన్నయ సూరి పట్ల అపప్రథ మొదలయింది.
బ్రాహ్మణ పండితులు ఆ వాదాన్ని ఆధారంగా చేసుకుని చిన్నయ సూరికి నిజంగా ఏమీ రాదని అతని పేరుని చిన్న+అసూరి (చిన్న అపండితుడు) అనీ, పర-వస్తు చిత్+నయ సూరి (ఇతరుల వస్తువులు దొంగిలించుటలో పండితుడు) అని అతని గురించి హాస్యంగా అనుకునేవారట.
దువ్వూరి వెంకటరమణరావు ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికలో కల్లూరి వేంకటరామరావు వాదాన్ని ఖండిస్తూ,ఒక పెద్ద వ్యాసం ప్రకటించి, రమణీయం అన్న పేరుతో రాసిన తన బాలవ్యాకరణంలో ఈ అపప్రప్రథలనన్నింటినీ ఖండించి చిన్నయ సూరి పాండిత్యాన్ని, అతని భాషా సౌందర్యాన్ని, అతని మౌలికతని బలంగా సమర్థించేదాకా చిన్నయ సూరి పేరు కళంకరహితంగా పండితలోకంలో స్థిరపడలేదు.