01-07-2020, 07:30 PM
చిన్నయ సూరి
పరవస్తు చిన్నయ 1809లో, సాతానులు అనే చాత్తాద వైష్ణవ సంప్రదాయంలోని కుటుంబంలో పుట్టాడు. నిడదవోలు వెంకటరావుగారు రాసిన చిన్నయ సూరి జీవితము ప్రకారం చిన్నయ పదహారేళ్ళొచ్చేదాకా అక్షర జ్ఞానం లేకుండా పెరిగాడు. ఎప్పుడో ఒకసారి కంచి రామానుజాచార్యులుగారు చదువుసంధ్యలు లేని ఈ కుర్రవాణ్ణి తిడితే అప్పట్నించీ చదువు కోవడం మొదలు పెట్టి సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో గట్టి పట్టు సాధించాడు. అప్పుడు పండితులకందరికీ కుంఫిణీ ప్రభుత్వమే పెద్ద ఆధారం. మున్షీలుగాను, ఇంగ్లీషువారికి తెలుగు పాఠాలు నేర్పించే ట్యూటర్లు గాను, కొద్దిమొత్తాలకే ఈ పండితులు ఉద్యోగాలు కుదుర్చుకొనేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి, పండితుల ఆర్ధిక పరిస్థితుల గురించి మనకు సరయిన సమాచారం లేదు. కాని, కుంఫిణీవాళ్ళు ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఒక తెలుగు పండితుడికి ఒక మోస్తరు ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇచ్చేవారని తెలుసు. (ఈ కళాశాల 1840లో మూసివేయబడి, ఆ తరువాత ప్రెసిడెన్సీ హైకాలేజీగా మారింది.) మొట్టమొదట ఆ ఉద్యోగంలో వేదం పట్టాభిరామరావుగారు, ఆయనకు సహాయకుడిగా రావిపాటి గురుమూర్తి రావుగారు నియమించబడ్డారు. ఏ ఉద్యోగాలు లేని పండితులకి ఈ రెండు ఉద్యోగాలు గొప్ప పదవుల కిందే లెక్క. కోటలో ఉన్న కాలేజీలో తెలుగు పండితుడికి నెలకు 70 రూపాయిలు జీతం ఇచ్చేవారు. (వేదం పట్టాభిరామరావుగారికి 175 రూపాయిల జీతం వచ్చేదని నిడదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు.) పుదూరి సీతారామరావుగారు 1847లో రిటైరు అయిన తరువాత ఆ తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత ఇంగ్లీషు కూడా వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ అర్జీ పెట్టుకున్నాడు.
ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌నాట్. అర్జీ పెట్టుకున్న చిన్నయని ఒక పండిత సభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గినవాళ్లకే ఆ ఉద్యోగం వస్తుంది. చిన్నయని, ఆ ఉద్యోగానికే అర్జీ పంపిన పురాణం హయగ్రీవరావుని, పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్ధుడు అని పండిత సభ వారు నిర్ణయించారు. అప్పటి కాలమాన పరిస్థితులు మనకి అంతగా తెలియవు కానీ పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, బ్రాహ్మణ కులంలో పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది (చూ: ఆరుద్ర, స.ఆం.సా. పు:28-29 సం.10, 1990; బూదరాజు రాధాకృష్ణ, పరవస్తు చిన్నయ సూరి, పు. 12, 1995). పండితులందరూ రావు అనే బిరుదు పెట్టుకునేవారు. కేవలం వైదీకులే కాకుండా నియోగి అయినా రావిపాటి గురుమూర్తి కూడా రావు అనే పేరే పెట్టుకున్నాడు. చిన్నయకి రావు అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌నాట్ అడిగాడట. తాను అబ్రాహ్మణుడవటం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది అన్నాట్ట. అర్బత్‌నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం సూరి అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒక్కటి ఇంగ్లండు నుంచి తెప్పించి చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతొ ప్రచారం లోకి వచ్చాడు. చిన్నయ సూరి బాలవ్యాకరణానికి పూర్వం సూత్రాంధ్రవ్యాకరణం అని, పద్యాంధ్రవ్యాకరణం అని, ఆంధ్రశబ్దానుశాసనం అని అనేక వ్యాకరణాలు రాసి పెట్టుకున్నాడు. కానీ తెలుగులో చివరికి బాలవ్యాకరణమనే పేరుతొ 1858లో ఒక వ్యాకరణం ప్రకటించాడు. ఇది చిన్నయ సూరి దృష్టిలో కేవలం చిన్న పిల్లల కోసం రాసిన వ్యాకరణం.
“మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం
దెనిఁగించి యిది ఘటించితి
ననయము బాలావబోధ మగు భంగిఁదగన్
తెనుఁగునకు శబ్దలక్షణ
మనయం బరయంగ వేడ్క నందినవారల్
తనరఁగ నీవ్యాకరణం
బున మూలంబయినకృతిని బోలఁ గనఁదగున్”
అని చిన్నయ సూరి ఆ వ్యాకరణం చివర పద్యాల్లో రాసుకున్నాడు. (బాలవ్యాకరణము, దూసి రామమూర్తిరావు వ్యాఖ్యానంతో, వావిళ్ల, మద్రాసు, 1937.)