Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
                              ( పెళ్లి)

                             
(ఫ్రెండ్స్ ఈ కథ నీ నేను చండీగఢ్ బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా అప్పుడప్పుడు మన సౌకర్యం కోసం అంతా తెలుగు లోనే రాస్తున్న ఈ కథ లో ఎలాంటి adult content ఉండదు ప్యూర్ లవ్ స్టోరీ ఇంక కథ లోకి వెళితే)


చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ దిగి కాబ్ లో ఇంటికి వెళ్తున్నారు విద్య, వినయ్ పేరు కీ కాబ్ లో పకపక నే కూర్చుని ఉన్న విద్య నుంచి దూరం గా జరిగి కూర్చున్నాడు వినయ్, విద్య ఆ దూరం తొందరగా కరిగి పోవాలి అని ఎదురు చూస్తుంది అప్పుడు కార్ కిటికీ నుంచి అలా బయటకు చూసింది చాలా అందమైన సిటీ అంత అందమైన సిటీ తను ఎప్పుడు చూడలేదు అనే కంటే తను తన ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు అని అనడం లో న్యాయం ఉంది ఎప్పుడు తన సొంత ఊరు దాటి మహా అయితే తీర్థ యాత్రకు తీసుకొని వెళ్లే వాలు తన అమ్మ నాన్న అప్పుడే కార్ ఒక మంచి posh కాలనీ లో ఆగింది వినయ్ కాబ్ వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే విద్య మొత్తం కాలనీ నీ చూస్తూ ఉంది అలాంటి ఒక posh కాలనీ తన జీవితంలో తను చూడలేదు అప్పుడు వినయ్ తన వైపు చూసి చిటికె వేసి లోపలికి పద అని సైగ చేశాడు అప్పుడే వినయ్ పక్క ఇంట్లో ఉండే ఒక సర్దార్జీ అలా వాకింగ్ కోసం బయటికి వచ్చాడు అప్పుడు వినయ్ నీ పలకరించాడు అప్పుడు "ఎవరూ ఆ అమ్మాయి" అని అడిగాడు, దానికి వినయ్ "నా భార్య" అని బదులు ఇచ్చాడు విద్య కూడా ఎంతో మర్యాదగా ఆయనకు నమస్కారం పెట్టింది అంతే ఆ సర్దార్జీ మొత్తం కాలనీ అంతటికి వినిపించేలా "ఏంటి వినయ్ నీ పెళ్ళి కీ పిలవలేదు" అని అన్నాడు దాంతో ఎదురింటి వాళ్లు పక్క ఇంటి వాళ్లు అంత వినయ్ ఇంటి ముందు కీ చేరుకున్నారు అందరూ ఒకటే ప్రశ్న పెళ్లి కీ ఎందుకు పిలవలేదు అని వినయ్ మనసులో "నా పెళ్లి అని నాకూ తెలిస్తే నే కదా మీకు చెప్పడానికి" అని అనుకున్నాడు, కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నారు ఆ సర్దార్జీ భార్య వినయ్ విద్య ఇద్దరికి దిష్టి తీసి లోపలికి పంపింది విద్య కీ ఒక్కసారిగా తన సొంత ఊరు ఫీలింగ్ వచ్చింది.

కానీ ఇంటి లోపలికి వెళ్లగానే బయటి వాతావరణం కీ లోపల చాలా తేడా ఉంది అంత పెద్ద ఇంట్లో మొత్తం నిశబ్దం రాజ్యం ఏలుతుంది ఆ నిశబ్దం విద్య కీ కొత్తగా ఉంది ఎందుకంటే తనది చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఇంట్లో బాబాయ్ పిల్లలు, తన అత్త పిల్లలు అందరితో కలిసి అల్లరి చేస్తూ సందడిగా ఉండే తన ఇంటి వాతావరణం కీ ఈ ఇల్లు చాలా తేడా ఉంది అప్పుడు వినయ్ వచ్చి "నీ రూమ్ అది నా రూమ్ పైన ఉంది ఇంక అది కిచెన్ దాంట్లో మధ్య లో లైన్ వేస్తా నీ సైడ్ వంట నువ్వు చేసుకో నా సైడ్ వంట నేను చేసుకుంటా ఇంట్లో మాత్రం ఫ్రీ గా ఉండు నా రూమ్ లోకి మాత్రం రాకూడదు ఈ 6 నెలల పాటు ఏదైన కోర్సు చేస్తావో లేదా ఇంట్లోనే ఉంటావో నీ ఇష్టం కానీ నాకూ ఇబ్బంది పెట్టోదు"అని చెప్పి పైన తన రూమ్ కీ వెళ్లాడు విద్య కూడా తన రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్ లో షవర్ కింద తడుస్తూ రెండు వారాల క్రితం వరకు తన జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటు ఉంది.

(రెండు వారాల క్రితం)

డిగ్రీ లో కాలేజీ టాపర్ అయ్యింది విద్య తనకి పెద్ద కళలు లేవు తన కుటుంబం తో కలిసి అలాగే సంతోషం గా ఉండాలి అని కాకపోతే కొన్ని రోజులు తను ఏమీ చేసిన ఎవరూ పట్టించుకోకుడదు తన బెస్ట్ ఫ్రెండ్ పింకీ లాగా posh గా మాడర్న్ డ్రస్లు వేసుకొని ఒక కార్ లో సొంతం గా షికారు కు వెళ్లాలి అని అనుకుంది దాంతో పాటు తన కుటుంబం తనకి చాలా ముఖ్యం, ఆ మరుసటి రోజు ఉదయం తను లేచి చూస్తే ఇంట్లో హడావిడి గా ఉంది ఎందుకంటే ఆ రోజు విద్య కీ నిశ్చితార్థం అన్నారు తనకి చెప్పకుండా ఇలా పెళ్లి నిశ్చయించడం తనకి అసలు నచ్చలేదు కానీ తన కుటుంబం లో అందరూ సంతోషంగా ఉండడం చూసి తను కొంచెం ఆలోచిస్తూ ఉంది అప్పుడే తన చెల్లి వచ్చి "అక్క బావ ఫోటో కావాల" అని ఏడిపిస్తూ ఉంది కానీ విద్య అది ఏమీ పట్టించుకోకుండా ఉంది ఆ తర్వాత వాళ్ల పిన్ని, అమ్మ, అత్త అందరూ వచ్చి తనని రెడీ చేసారు ఇంతలో అబ్బాయి వాళ్లు వచ్చారు అని అందరూ కిందకి వెళ్లారు అప్పుడు విద్య దొంగ చాటుగా కిటికీ నుంచి కిందకు చూసింది అప్పుడు కార్ లో నుంచి దిగాడు వినయ్ ఒకసారి వినయ్ నీ చూసి షాక్ అయ్యింది అంతే గుండె లో ఆనందం పొంగింది విద్య ఆ నిశ్చితార్థం అయ్యాక వినయ్ తన జీవితంలోకి రావడం ఆనందం గా ఉంది అప్పుడే వినయ్ విద్య కీ ఫోన్ చేసి రేపు కళ్లుదాం అని అడిగాడు విద్య గుడికి రమ్మని చెప్పింది ఇద్దరు గుడి లో కలిశారు.

అప్పుడు వినయ్ ఏమీ చెప్తాడు అని ఆలోచిస్తూన్న విద్య కీ వినయ్ సడన్ గా "నాకూ పెళ్లి ఇష్టం లేదు నాకూ అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదు నేను పెళ్లి చూపులు అంటే రాను అని మా జేనాన్న హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నాటకం ఆడి నను పిలిచి బలవంతంగా నిశ్చితార్థం చేశారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి నేను నీతో misbehave చేశాను అని చెప్పు తాగుబోతు అని చెప్పు మీ వాళ్లు పెళ్లి కాన్సిల్ చేస్తారు "అని చెప్పాడు వినయ్ చెప్పింది విని విద్య కీ బ్రైన్ ఆగిపోయింది దాంతో కొంచెం తెరుకోని "చూడండి మీ ఫ్యామిలీ కీ మా ఫ్యామిలీ కీ ఊరి లో మంచి పేరు ఉంది కాబట్టి ఇలా చేస్తే పెళ్లి ఆగినందుకు మా ఫ్యామిలీ లో వేరే ఎవరికి పెళ్లి కాదు మీ కారెక్టర్ చెడ్డది అని తెలిస్తే మీ నాన్న పరువు పోతుంది కాబట్టి ఏమీ చేయాలో నువ్వే చెప్పు" అని అడిగింది దానికి వినయ్ తన ఫ్రెండ్ ఒక లేడి లాయర్ కీ ఫోన్ చేసాడు జరిగింది చెప్పి రమ్మని చెప్పాడు అప్పుడు ఆమె వచ్చి ఇద్దరికి రెండు డాక్యుమెంట్ లు ఇచ్చి "మీరు ఇద్దరు ఫ్యామిలీ pressure మీద పెళ్లి చేసుకుంటున్నారు అని మీకు పెళ్లి ఇంటరెస్ట్ లేదు అని పెళ్లి తరువాత ఎలాంటి మానసిక లేదా శారీరక సంబంధం మా మధ్య ఉండదు 6 నెలల తరువాత విడాకులు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇద్దరం ఇష్ట పూర్వకంగా ఈ అగ్రిమెంట్ లో సంతకం పెడుతున్నాం" అని రాసి ఉంది అది చూసి వినయ్ ఏ మాత్రం ఆలోచించకుండా సంతకం పెట్టాడు దాంతో విద్య కూడా వేరే దారి లేక సంతకం పెట్టింది అలా ఒక వారం కీ వాళ్ల పెళ్లి అయ్యింది మొదటి రాత్రి రోజు కూడా విద్య బెడ్ పైన పడుకుంటే వినయ్ పక్కన సోఫా లో పడుకున్నాడు.

ఇలా ఆలోచిస్తున్న విద్య ఫోన్ మొగడంతో బయటికి వచ్చింది అప్పుడు విద్య వాళ్ల నాన్న ఫోన్ చేసాడు "బుజ్జి మీ ఇల్లు ఎక్కడ అమ్మ" అని అడిగాడు, "ఇది sector 16 అంటారు నాన్న ఇక్కడ గురుమీత్ రెసిడెన్షియల్స్ నాన్న ఎందుకు నాన్న" అని అడిగింది, "ఏమీ లేదు రా నిను చూడకుండా కష్టం గా ఉంది అందుకే బావ గారు మేము అంతా కలిసి వస్తున్నాం ఎయిర్ పోర్ట్ లో బయలుదేరాం" అని చెప్పాడు అది విని విద్య షాక్ అయ్యింది వినయ్ పెట్టిన మొదటి రూల్ ఆ ఇంటికి చుట్టాలు ఎవరూ రాకూడదు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 08:26 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 1 Guest(s)