Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
శ్రీని అరెస్ట్ అవ్వడానికీ స్వీటీ pregnancy గురించి బయటికి రావడానికి ముఖ్యమైన వ్యక్తి లాస్య, లాస్య ఒక మాడల్ మిస్ కర్ణాటక గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మిస్ ఇండియా కోసం ప్రయత్నం చేస్తోంది లాస్య చిన్నప్పటి నుంచి కాలు కందకుండా పెరిగింది స్కూల్ లో తన స్కూల్ బాగ్, లంచ్ బాగ్ రెండు తన డ్రైవర్ మోసుకొని వచ్చి క్లాస్ లో పెట్టి వెళ్లేవాడు ఒక రోజు ఒక మేడమ్ తన డ్రైవర్ మోసుకొని వస్తున్న బాగ్ నీ లాస్య తో మోపించింది అందుకు కోపంతో లాస్య ఆ టీచర్ కూతురు తన క్లాస్ అవ్వడం తో ఒక రోజు ఆ అమ్మాయిని స్కూల్ వదిలిన తర్వాత అందరూ హడావిడి గా ఇంటికి వెళ్తుండగా వాళ్లు ఉన్న మూడవ అంతస్తు నుంచి కిందకు తోసింది, అలా లాస్య కీ ఎవరైన అడ్డు వస్తే వాళ్ళని నాశనం చేయడం తన పని మిస్ కర్ణాటక పోటీలో కూడా తనకు అడ్డు వచ్చిన వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి మరీ టైటిల్ సంపాదించింది.


ఎప్పుడైతే శ్రీని నీ వాళ్ల నాన్న ఆఫీస్ లో చూసిందో అప్పుడే వాడికి ఫ్లాట్ అయిపోయింది దాంతో శ్రీని యూత్ ఐకాన్ అయ్యాడో తన గ్లామర్ కీ వాడి ఫాలోయింగ్ తోడైతే మిస్ ఇండియా పోటీలో గట్టి ఫాలోయింగ్ ఉంటుంది అనుకోని వాళ్ల నాన్న తో ఆ రోజు టివి లో అలా చెప్పించింది ఆ తర్వాత ఎప్పుడైతే శ్రీని స్వీటీ తో selfie దిగి పోస్ట్ viral అయ్యిందో దాంతో లాస్య కీ కోపం కట్టలు తెచ్చుకుంది దానికి తోడు వాళ్ల నాన్న ప్రమోద్ కూడా శ్రీని కీ మద్దతు ఇవ్వడం ఇంకా కోపం తెప్పించింది దాంతో స్వీటీ కీ సంబంధించిన అని విషయాలు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా సంపాదించింది దాంతో ఎలాగైనా sympathy తో గెలవాలి అని, స్వీటీ శ్రీని నీ మోసం చేసి ఎవరి వల్లో వచ్చిన కడుపు శ్రీని వల్ల వచ్చింది అని నమ్మించి అతని కలిసి డ్రామా ఆడుతుంది అని ఒక సోషల్ మీడియా వెబ్సైట్ కీ డబ్బులు ఇచ్చి పోస్టు చేయించింది ఇది శ్రీని కీ తెలిసే లోపు ఎలాగైనా వాడిని తన చేతిలో పెట్టుకోవాలి అని ఆ రోజు సాయంత్రం పార్టీ కీ పిలిచింది అప్పుడు ఇద్దరు బాగా పార్టీ లో ఎంజాయ్ చేస్తుండగా

శ్రీని : థాంక్ యు లాస్య అర్థం చేసుకున్నావు

లాస్య : పర్లేదు మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు come on let's have drinks

శ్రీని : నో నేను తాగను పైగా నేను under medication లో ఉన్న కుదరదు

లాస్య : సరే అయితే కూల్ డ్రింక్ తాగు అని చెప్పి బార్ టెండర్ నీ పిలిచి వాడికి ఒక రెండు వేళ్లు ఇచ్చి ఒక డ్రగ్స్ ప్యాక్ ఇచ్చి డ్రింక్ లో కలిపి తీసుకొని రమ్మని చెప్పింది వాడు అలాగే తెచ్చాడు అది తాగిన తరువాత శ్రీని మైకం లోకి వెళ్లాడు. 

దాంతో శ్రీని కార్ లోనే తన గెస్ట్ హౌస్ తీసుకొని వెళ్లి వాళ్లు ఒక రాత్రి అంతా కలిసి ఉన్నట్లు ఫోటో తీసి లీక్ చేసి viral చేయాలి అని ప్లాన్ చేసింది కాకపోతే అనుకోకుండా లాస్య కూడా ఫుల్ గా తాగడం వల్ల కార్ కీ అడ్డంగా వచ్చిన ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్లిపోయింది తను అనుకున్న ప్లాన్ ఇప్పుడు జరిగింది ఇంకొకటి అని లాస్య స్టీరింగ్, గేర్ రాడ్ పైన తన వేలి ముద్రలు చెరిపేసి శ్రీని నీ ఇంట్లో వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు cctv ద్వారా శ్రీని కార్ నీ identify చేసి అతని అరెస్ట్ చేశారు, ఇది అంతా తెలిసి కూడా ప్రమోద్ సిన్హా మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఎంత అయిన తన కూతురు అనే కడుపు తీపి తో అలాగే మౌనంగా ఉండి పోయాడు, శ్రీని అరెస్ట్ గురించి తెలిసి స్వీటీ షాక్ అయ్యింది అప్పుడే లాస్య కూడా తన మీద sympathy పెరిగే లాగా ఒక వీడియో వదిలింది దాంతో లాస్య ఫ్యాన్స్, శ్రీని ఫ్యాన్స్ స్వీటీ ఇంటి పైన దాడి చేశారు అప్పుడు ఒకే సారి ఇంత stress రావడంతో స్వీటీ కీ కడుపు లో నొప్పి వచ్చింది దాంతో తనని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లారు చెక్ చేసి అను "ఇంతకీ మించి టెన్షన్, కానీ ప్రెజర్ వస్తే miscarriage అవ్వచ్చు" అని చెప్పింది దాంతో అందరూ కంగారు పడ్డారు అప్పుడే టివి లో "ఇండియన్ రేసర్ శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ శ్రీని చేసిన hit and run కేసు లో అతనికి సపోర్ట్ గా వాదించకుడదు అని బెంగళూరు లాయర్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు ఒక వేళ ఎవరైనా వారి నిర్ణయం కాదు అని కేసు వాదిస్తే వాళ్ల పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకొని వాళ్ల లైసెన్స్ కాన్సిల్ చేయిస్తాం అని చెప్పారు "అని టివి లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అది చూసిన స్వీటీ ఆ కేసు తను ఫైట్ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 20-06-2020, 08:20 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)