Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన ఇంటికి వాస్తు అవసరం రాకుండా వుండాలంటే... ?
#1
??????? ??

మన ఇంటికి వాస్తు అవసరం      
                రాకుండా వుండాలంటే... ?
                       ➖➖➖

*హృదయాన్ని తాకిన ఓ చక్కని కథ తప్పక మీ అందరితో పంచుకోవాలని అనిపిస్తోంది!*✍

   విశాఖపట్నంకి చెందిన మునుస్వామి వ్యాపార వేత్త,      వ్యాపారంలో     బాగా సంపాదించి స్థిరపడిన పెద్దమనిషి. 
 
    సంపాదించిన ఆస్తిలో కొంతభాగంతో  వారు  విశాఖపట్నం శివారు  పల్లెటూరు లో    కొంతభూమిని కొని,     అక్కడ ఒక 3అంతస్తులఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డి వైపు    ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.    వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే   100ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది.    నిజానికి ఆయన ఆఆస్తి కొన్నదికూడా ముఖ్యంగా ఆపెద్దమామిడిచెట్టును చూసి ముచ్చట పడే,ఎందుకంటే వారిభార్యకు మామిడి పళ్ళు అంటే చెప్పలేనంత ఇష్టం. 

       ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయంలో మునుస్వామిగారి  శ్రేయోభి లాషులు కొందరు, వాస్తు చూపించుకుని ఇంటికి తగినమార్పులు      చేయించుకో మని వారికి గట్టిగా సలహా ఇచ్చారు. 

    అయితే వాస్తుపై పెద్దగా నమ్మకంలేని వ్యక్తి మునుస్వామి గారు.  ఐతే   ఈసారి  ఆశ్చర్యకరంగా వారి ఆత్మప్రభోదం మేర కు వారు ఒక వాస్తు పండితుని   సలహా కొరకు ఆరా తీసి     హైదరాబాద్ నుండీ ఒకగొప్పవాస్తు విద్వాన్ ని పిలిపించారు. ఆ వాస్తు పండితులు ఎవరోకాదు- పేరు మోసిన గొప్ప వాస్తు శాస్త్రవేత్త.   వాస్తుపై  30ఏళ్లకు మించిన వృత్తిపరమైన గొప్ప అనుభవజ్ఞులు శ్రీవీరారెడ్డిగారు.

  వారు వైజాగ్ వచ్చాక భోజనానంతరం మునుస్వామిగారి    సొంత డ్రైవింగ్ లో  ఇద్దరూ వైజాగ్ శివారు  బయలుదేరారు.
కొంతప్రయాణం తర్వాత వారు   వెళ్తున్న దారిలో మునుస్వామి గారు        కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి,   వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్నకొన్నికార్లకు దారివ్వడం చూసిన రెడ్డిగారు  చిరునవ్వుతో "స్వామి గారూ!    మీ డ్రైవింగ్   నిజంగా  చాలా సురక్షితమైనది" అన్నారు.

   దానికి స్వామిగారు నవ్వుతూ"అయ్యా! వారికి ఏదోఅత్యవసరపని అయి ఉండ వచ్చు,  అందుకే తొందరలో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం     దారి ఇవ్వడం   మన  ధర్మం కదండీ!" అన్నారు.

        అక్కడనుండి  చినగంట్యాడ అనే చిన్న పల్లెటూరు సమీపించింది.అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో స్వామిగారు   కారు వేగం తగ్గించి  స్లోగా నడుపుతున్నారు.  

   ఇంతలోహఠాత్తుగా ఒకకొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా        పరిగె త్తాడు.గమనించిన స్వామిగారు అతడ్ని తప్పించి తనకారును మరింత  నెమ్మది గా పోనిస్తున్నారు.

   అది ఎవరికోసమో ఎదురు  చూస్తున్న ట్లుగా    ఉంది.   ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా  అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు

    ఈసారి   ఆశ్చర్యపోవడం   రెడ్డిగారు వంతైంది. ఆయన "సార్!   ఇలా ఇంకో పిల్లాడు   మరలా   వస్తాడని     మీరెలా ఊహించారు?" అని ప్రశ్నించారు.

    స్వామిగారు నవ్వుతూ "పిల్లలెప్పుడూ  అంతేకదండి!  ఒకడి వెంట   మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా?" అన్నారు.

    ఆ మాట విన్న రెడ్డిగారు ఆనందంగా బ్రొటనవేలుపైకెత్తిచూపిస్తూ మీరు దాన్ని  ఊహించి నడపడం  నిజానికి  మీ గొప్ప దనం"   అని   స్వామిగారిని    అభినం దించారు.

    కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారు లోంచి    వారు   క్రిందికి  దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా 7,8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ    పైకి   ఎగిరాయి!      అది చూసిన స్వామిగారు,  రెడ్డిగారిని    ఆపి, "సర్! మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు    ఇక్కడే      ఆగి    వెళదాం!ఏమంటారు?"అన్నారు.

     రెడ్డిగారు"ఏమండీ ఎందుకు?"

      స్వామిగారు   నవ్వుతూ.. . "అక్కడ దొడ్డివైపు   ఎవరో   కొంతమంది పిల్లలు చెట్టెక్కి   మామిడిపళ్ళు కోస్తున్నట్లుంది.
మనం కనుక   హఠాత్తుగా  వెళ్తే   వాళ్ళు మనల్ని చూసి భయపడి    చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు. ఎందుకండీ అనవసరంగా అంతలా   వాళ్ళని భయ పెట్టి సాధించేదేముంది" అన్నారు.

       వీరారెడ్డి గారు  కొంతసేపు మ్రాన్పడి పోయారు.ఆపైనెమ్మదిగా ఇలాఅన్నారు.
"ఈఇంటికి ఎటువంటి వాస్తు మార్పు-చేర్పులు అవసరం లేదు !"

     ఈసారి ఆశ్చర్యపోవడం స్వామిగారి వంతైంది..."ఏంఎందుకండి?"

       "ఏ ప్రదేశం అయినా,     మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే,  సహజం గానే     అది   ఉత్తమమైన   వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు." అన్నారు రెడ్డిగారు.

                      ???

*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల యొక్క  శ్రేయస్సు,    సంక్షేమం కోరు కుంటాయో, ఆఫలితం లబ్దిపొందే వారికే కాక,   అది మనకి  కూడా మంచి చేస్తుంది.*

   అయితే ప్రత్యేకించి 'ఎల్లప్పుడూ అన్ని  
సమయాల్లోనూ     ఇతరుల   సంక్షేమం కాంక్షించే వ్యక్తి    వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మారి పోతాడు.'    

          *ఇది ఓగొప్ప వాస్తువిద్వాన్  వారి అభిప్రాయం.

     *మరి మీ అందరికీ కూడా ఇకపై మీ ఇంటికి  వాస్తు పండితుని   అవసరం రాకూడదని ఆశిస్తున్నా!✍

  ?లోకా సమస్తా సుఖినోభవన్తు?


?????? ?????
Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మన ఇంటికి వాస్తు అవసరం రాకుండా వుండాలంటే... ? - by Yuvak - 26-02-2019, 05:51 PM



Users browsing this thread: 1 Guest(s)