17-06-2020, 06:44 AM
(13-06-2020, 06:55 AM)Chandra228 Wrote: చాలా బాగా రాస్తున్నారు ఒక మంచి కాపీ లా బాగుంది
మీ కామెంట్ పదహారేళ్ళ క్రితం విడుదలైన ఆనంద్ అనే సినిమాని గుర్తుకి తెచ్చింది. సినిమా టాగ్ లైన్ "మంచి కాఫీ లాంటి సినిమా" కు సరిపోయేలా, పోస్టర్ మీద కాఫీ కప్పుతో కమలిని ముఖర్జీ. థాంక్ యు సర్, ఫర్ ది వండర్ఫుల్ కామెంట్.
(15-06-2020, 08:00 AM)bobby Wrote: nice story
నచ్చినందుకు థాంక్స్.
(16-06-2020, 01:46 PM)Chandra228 Wrote: చాలా చక్కగా సాగుతోంది కథ కావ్య శ్రీరామ్ శృంగరం ఎలా ఉండబోతోందో అలాగే చెల్లి కూడా బావ ని ఆట పట్టించడానికి రెడీ గా ఉంది..
"సౌమ్య ఒక చురుకైన అమ్మాయి. చలాకీతనంతో పాటు అల్లరి కూడా ఎక్కువే" అన్న ఒక్క వాక్యంతో ఆమె స్వభావం చెప్పేయొచ్చు. కానీ సంభాషణలతో పాఠకులే పాత్రల మీద ఒక అంచనాకు రాగలికితే, రాసిందంతా వ్యర్థం కాదని సంతోషం. రెగ్యులర్ గా కామెంట్స్ పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నందుకు థాంక్స్ అండి.
(16-06-2020, 05:06 PM)Thewhitewolf89 Wrote: అసలు ఏం కధనం అండి. నాకైతే ఏదైనా Novel చదువుతున్న భావన వస్తుంది.మీరు అనుకుని ఉంటే ఇక్కడ వరకు రాసినదంతా ఒక episode లో రాయొచ్చు . కానీ మీరు మీ కథతో పాటు మీ audience కూడా పాత్రలతో ప్రయాణిించాలనుకున్నారు. అందుకే కధనం పట్టు సడలకుండా సాగుతుంది. "పేరులో ఏముంది" అనే title ఎ
చాలా మందిని ఆకర్షిస్తోంది.That was a clever move...Update కోసం wait చేస్తూ ఉంటాను.
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇంతవరకు రాసింది ఒక ఎపిసోడ్ లో క్లుప్తంగా రాయొచ్చు. కానీ ఏ ఉద్దేశ్యంతో రాసానో అది సఫలీకృతం అయ్యిందని మీ కామెంట్ ద్వారా తెలిపారు. యు మేడ్ మై డే. కధ పేరు మీద చాలా మంది కామెంట్ చేసారు. చివరలో ఒక వివరణ రాస్తాను.
తరువాతి అప్డేట్ ఇంకో పది నిముషాల్లో అప్లోడ్ చేస్తాను.