13-06-2020, 09:44 AM
ఎపిసోడ్ 6
పెళ్లి చూపులవ్వగానే తిన్నగా హోటల్ కి చేరుకొన్నారు ప్రసాద్ దంపతులు. వాళ్లకి కావ్య బాగా నచ్చింది. శ్రీరామ్ కి నచ్చి సంభందం కుదిరితే బాగుణ్ణు అని అనుకొన్నారు. వాడికి ఫోన్ చేసి చెప్పండి అని లలిత అన్నప్పటికీ "పనిలో ఉంటాడు. రేపు సాయంత్రం ఫోన్ చేద్దాములే"అని వారించాడు. ఆ సాయంత్రమే కాకినాడ వెళ్లి పోయారు.
గురువారం రాత్రి కొడుక్కి ఫోన్ చేసాడు ప్రసాద్ రావు. శ్రీరామ్ హలో చెప్పగానే స్పీకర్ ఫోన్ ఆన్ చేసాడు భార్య కూడా వింటుందని.
"నిన్నే ఫోన్ చేద్దామనుకున్నామురా. కానీ పనిలో బిజీగా ఉంటావని చెయ్యలేదు. అమ్మాయి తల్లి తండ్రులు కూడా చాలా మంచి వారు. మమల్ని బాగా రిసీవ్ చేసుకొన్నారు. అమ్మాయి కూడా చాలా బాగుంది అణుకువ ఉన్న పిల్ల. మాకు అన్ని విధాలా బాగుంది. కాకపొతే బాగా ధనవంతులు",అన్నాడు ఏమి దాచకుండా
"మీకు ముందే చెప్పా కదా నాన్న. మరీ అంత డబ్బున్నవాళ్ళు ఒద్దని. తరువాత మనం, ఆ అమ్మాయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని."
"మధ్యవర్తి కాస్త ఉన్నవారు అన్నాడు కాని మరి అంత ధనవంతులు అనుకోలేదురా. అమ్మాయికి అస్సలు గర్వం లేదు. నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది."అన్నాడు కొడుక్కి కొంచెం నచ్చ చెప్పేధోరణితో.
భర్తకు తోడు తనూ ఒక మాట సాయం చేద్దామని రంగంలోకి దిగింది లలిత. "వాళ్లకు మనకు చుట్టరికం కుదిరింది కూడాను. అసలు ఇంతకాలం కలుసుకోకుండా ఎలా ఉన్నామని అన్నారు మీ మామగారు. మనం సంభందం అంటే బాగా ఇష్టంగా ఉన్నారని తెలుస్తోంది. నీవు వచ్చి చూస్తావని మాటిచ్చాము. వెళ్లకపోతే బాగుండదు."అంటూ కొంచెం నొక్కింది.
"అంత ధనికుల సంభందం చేసుకుంటే మీరు దూరమై పోయే అవకాశం ఉంది. ఇద్దరూ అమ్మాయిలు అంటున్నారు. ఒక్కోసారి వాళ్ళ వ్యాపారాలకు అల్లుళ్ళని వారసులుగా పెట్టు కోవాలనుకొంటారు నాన్న", అంటూ పెళ్లి సంభందాలు వెదికే ముందు తాను చెప్పిన ఆందోళనను మళ్ళా చెప్పాడు శ్రీరామ్.
అలా కొంచెం సేపు మాట్లాడుకొని, చివరకు తాము ఫోన్ చెయ్యకుండా, వాళ్ళంతట వాళ్లే ముందుకు వస్తే వాళ్లకి ఇష్టం ఉన్నట్టు అని, మాట ఇచ్చినందుకన్నా అప్పుడు శ్రీరామ్ తప్పక వెళ్లాలని చెప్పి ముగించారు ప్రసాద్రావు దంపుతులు.
********
శుక్రవారం వాళ్ళ ఫోన్ గురించి ఎదురు చూస్తూ గడిపాడు రాజారావు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత భర్త కొంచెం మూడీగా ఉండటం చూసి అక్కడనుంచి ఫోన్ రాలేదని గ్రహించి, అతనిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమయ్యిందని అడగలేదు. ఒక పక్క కూతుర్ని గమనిస్తుంది. అది కూడా పొద్దున్నంతా పైకి, కిందికి తిరగడం, హాల్లో ఊరికే టీవీ చానెల్స్ మారుస్తుండడం గమనించింది. భోజనాలయిన తరువాత కావ్య తన రూమ్ కి వెళ్ళిపోయింది. అన్ని సర్దుకొని హాల్లో కూర్చున్నారు.
"అమ్మాయిని బుధవారం చూసారు, అబ్బాయితో కనీసం నిన్న మాట్లాడి వుంటారు. మరీ ఇవ్వాళ్ళయినా మనకి ఫోన్ చెయ్యాలి కదా."అన్నాడు తన ఆత్రుత కనపడనీయకుండా.
"అబ్బాయితో మాట్లాటడం కుదర లేదేమో. లేకపోతె మీకు ఖాళీగా ఉంటుంది వారాంతం లో చేద్దామని ఆగారేమో", అంది సమాధాన పరుస్తూ.
"నేనే ఫోన్ చేసి కనుక్కుంటా", అంటూ మొబైల్ తీసాడు.
"ఒక్క నిముషం. రేపు ఎలాగూ శనివారం. ఆయనకు కాలేజీ ఉండదేమో. మన పురుషోత్తమ రావు గార్ని పంపించి కనుక్కుంటే బాగుంటుంది కదా. ఆయన చెప్పిందాన్ని బట్టి అప్పుడు మీరు మాట్లాడొచ్చు."
మధ్యవర్తి ద్వారా కనుక్కునే మంచి ఆలోచన తనకి ఇచ్చినందుకు అభినందనగా ఆమె చెయ్యి మృదువుగా నొక్కి, వెంటనే మధ్యవర్తికి ఫోన్ చేసి కాకినాడ వెళ్లి కనుక్కొని ఫోన్ చేయండని చెప్పాడు. అలాగే వాళ్ళ సంభందం అంటే తమకు బాగా ఇష్టంగా ఉందని కూడా నొక్కి చెప్పమన్నాడు.
అక్కడ ప్రసాద్ రావు దంపతులు కూడా రాజారావు దగ్గర్నుంచి కాని మధ్యవర్తి దగ్గరనుంచి ఫోన్ రాకపోతే కొంచెం ఆదుర్దా పడ్డారు. తనే చెబుతానన్నాడు, మరి వాళ్ళు తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అని ఒక డౌట్. పోనీ తనే చేద్దామా అని అనుకొన్నాడు ప్రసాద్ రావు. కాని కొడుక్కి ఇచ్చిన మాటతో ఆగిపోయాడు.
శనివారం సాయంత్రం మధ్యవర్తి వచ్చేసరికి ఇద్దరూ తేలిక పడ్డారు. అమ్మాయి వాళ్లు తమ సంభందం అంటే ఇష్టం ఉన్నట్టు చెప్పడంతో ఆనంద పడ్డారు. ఇంకో సారి అబ్బాయితో మాట్లాడి నేనే ఫోన్ చేసి చెప్తా అని మధ్యవర్తికి చెప్పడంతో, అతను సెలవు తీసుకోని, వెంటనే ఆ విషయాన్ని ఫోన్ లో చేరవేసాడు. అబ్బాయి తల్లితండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారని చెప్పడంతో హాయిగా నిద్రపోయాడు రాజారావు ఆ రాత్రి.
ఆదివారం ఉదయం ప్రసాద్ రావు ఫోన్ చేసి చెప్పాడు, "నేనే మీకు ఆదివారం చేద్దామనుకుంటున్నాను, ఖాళీగా ఉంటారు కదా అని. ఈ లోపులే మధ్యవర్తి వచ్చారు"అంటూ తన ఆలస్యానికి వివరణ ఇచ్చుకున్నాడు.
"పరవాలేదు. మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చు"అన్నాడు కాబోయే వియ్యంకుడికి మరింత స్వేచ్ఛ, చనువు ఇస్తూ.
"మా వాడికి అన్ని చెప్పాము. మధ్యలో నేనెందుకు. మీరే మా వాడితో మాట్లాడి తేదీ, సమయం ఫిక్స్ చెయ్యండి."అన్నాడు రాజారావు డైరెక్ట్ మాట్లాడితే శ్రీరామ్ కూడా అడ్డు చెప్పకుండా వెళతాడని.
"తప్పకుండా. ఇప్పుడే మాట్లాడతాను. మీరు అబ్బాయి నెంబర్ మెసేజ్ చెయ్యండి", అంటూ ఫోన్ పెట్టి భార్యకు అప్డేట్ ఇచ్చాడు, కావ్య వినేలాగా.
ప్రసాద్ రావు దగ్గర నుంచి sms రాగానే శ్రీరామ్ కి ఫోన్ చేసి వచ్చే శనివారం ఉదయం పది తర్వాత వాళ్ళింటిలోనే కలుసుకునేట్టు ఫిక్స్ చేయారు. తమ గెస్ట్ హౌస్ లో ఉండవచ్చని రాజారావు ఆఫర్ చేసిన సున్నితంగా తిరస్కరించి అన్ని తాను చూసుకొంటానని చెప్పాడు. కాల్ అయిన వెంటనే తన కార్ లో వెడదామని డిసైడ్ అయ్యి, శుక్రవారం రాత్రికి హోటల్ క్వాలిటీ DV Manor హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు.
డేట్ ఫిక్స్ కావడంతో శనివారం కోసం ఎదురు చూడసాగారు అందరూ.
*****************