13-06-2020, 06:43 AM
మాయ - 33
ధనుంజయ్ గురించిన కల వచ్చిన రోజు నుంచీ కిరీటి చాలా మూడీగా వుంటున్నాడు. వాడలా ఎందుకు వున్నాడో తెలుసుకుందామంటే శైలుకి ఊళ్ళో వాడితో ఏకాంతంగా మాట్లాడటం కుదరట్లేదు. కాలేజీలో ఎన్నిసార్లు అడిగినా వాడు నోరువిప్పి ఇది విషయం అని చెప్పట్లేదు. చివరికి తన ప్రపంచం తల్లకిందులయ్యే ఒక విషయం శైలు చెప్పేసరికి వాడా మూడ్ లోంచి బయటకు వచ్చాడు.
ఆ వివరం తెలుసుకోవడానికి కొన్ని రోజులు వెనక్కు వెళ్దాము.............
రాణి రత్నమాంబ కాలేజీలో ఆడిట్ మొదలైంది. రాజావారి దగ్గర్నుంచి వచ్చే డబ్బుల్లో ఏ కాస్త తగ్గినా తమ జీతాలకే ఎసరు కాబట్టి లెక్చరర్లు అందరూ టెన్షన్ తో ఆడిటర్ గారికి ఏం కావాలంటే అవి సమకూరుస్తున్నారు. వచ్చిన ఆడిటర్ పేరు శేఖర్ అని తెలుసుకుంది శైలు. క్రితంసారి రాజా గారి దగ్గరకు వెళ్లినప్పుడు చూడటమే అతన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు కాలేజీలో కనిపించాడు. అతడికి సహాయం చెయ్యమని ప్రసాదవర్మ గారు అడగటం గుర్తొచ్చి మాట కలిపింది.
‘నేను సోమ, బుధ వారాల్లో మధ్యాహ్నం పూట ఖాళీగా వుంటాను. మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి’ అంది. ‘తప్పకుండా, థాంక్స్’ అని ఒక మాట అని ఊరుకున్నాడు. శేఖర్ తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రిన్సిపాల్ గారి గదిలో కాలేజీ అక్కౌంట్ పుస్తకాలు ముందేసుకొని కుస్తీ పడుతున్నాడు. అప్పుడప్పుడూ క్లాస్ రూముల్లోకి వచ్చి విద్యార్ధుల హాజరు శాతం ఎలా వుందో నోట్ చేసుకొని వెళ్తున్నాడు.
మంచి కుర్రాడిలానే వున్నాడు శేఖర్. కాలేజీ స్టాఫ్ అందరితోనూ polite గా, కాకపోతే కొంచెం పొడిపొడిగా మాట్లాడుతాడు మనిషి. పోనీ అది కిరీటి లాగా సహజంగా వున్న సిగ్గు వల్లా అంటే అలా అనిపించట్లేదు శైలుకి. శైలుకి ఎందుకో తేడాగా వుంది ఆ అబ్బాయిని చూస్తే.
ఓ రోజు చాలా అందంగా ముస్తాబయ్యి వచ్చింది కాలేజీకి. స్వతహాగా అందగత్తె కాబట్టి ఎలా వున్నా చూపు తిప్పుకోలేరు కుర్రాళ్ళు. అవాళ ఎందుకో కొంచెం శ్రద్ధ పెట్టి తయారయింది. కిరీటి వున్న క్లాసులో పాఠం చెప్పి స్టాఫ్ రూమ్ కి వెళ్తోంది. ఓ కారిడార్ లో ఎవరూ లేనిచోట సడన్ గా కిరీటి వెనకనుంచి వచ్చి ‘చాలా బాగున్నారు మేడమ్, ఇలా వస్తే క్లాసులో లెసన్ ఏం వింటారు పిల్లలు’ అని ఆమె నడుముని నొక్కి ఆమె పెదాలను తన పెదాలతో అలా స్పృశించి వెళ్లిపోయాడు.
ఒళ్ళు జలదరించింది శైలుకి. చాలా రోజుల తర్వాత వాడి చెయ్యి తగిలెసరికి తిమ్మిరిగా వుంది వంట్లో. సరిగా చేతికంది వుంటే వాడి పెదాల్ని కొరుక్కు తినేసేది. అలా అగ్గి రాజేసి వెళ్లిపోయేసరికి పిచ్చి కోపం వచ్చింది. ‘రేయ్ పోకిరి వెధవా, ఎంత ధైర్యంరా నీకు’ అని శైలు అరిస్తే ఒక సన్నటి నవ్వు నవ్వి వెళ్లిపోయాడు. తర్వాత కాసేపు గాల్లో తేలిపోయింది శైలు. ఎలా స్టాఫ్ రూమ్ కి వచ్చి పడిందో, తర్వాత ఏం చేసిందో గుర్తు లేదు తనకి.
కొంతసేపటి తర్వాత అటెండర్ వచ్చి శేఖర్ పిలుస్తున్నాడు అని చెబితే ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్లింది. ‘శైలు గారూ, రిపోర్ట్ సగం పైగా పూర్తి అయింది. మీరు కొంచెం నా నోట్స్ చూసి అక్కడక్కడా వున్న గాప్స్ ఫిల్ చేస్తారా? మీకేమన్నా సహాయం కావాలంటే నేనిక్కడే వుంటాను’ అన్నాడు శేఖర్.
అలాగేనని చెప్పి యాంత్రికంగా తన పని తాను చేసుకుపోతోంది శైలు.
కొంతసేపాగక ఎందుకో తలెత్తి చూస్తే శేఖర్ తనవైపే చూస్తూ దొరికిపోయాడు. తానది గమనించినట్టు బయటపడలేదు శైలు. ఇంకొక రెండు మూడు సార్లు అలాగే చూసిన తర్వాత అప్పుడు వెలిగింది శైలుకి ఈ అబ్బాయి ఎందుకు తేడాగా అనిపిస్తున్నాడో. కాలేజీకి వచ్చిన దగ్గర్నుంచి తనను ఎన్నోసార్లు ఇలాగే దొంగచాటుగా గమనించడం ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. మిగతా విషయాల్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా తప్పుగా వెయ్యడు కాబట్టి తను దాన్ని పట్టించుకోలేదు ఎప్పుడూ.
మొత్తానికి తను రాస్తున్న రిపోర్ట్ పూర్తిచేసి అతని దగ్గరికి వెళ్ళి దాన్ని అందించింది. తలెత్తకుండానే ‘థాంక్స్ శైలు గారూ. మిగిలిన పని నేను చూసుకుంటాను’ అన్నాడు. గట్టిగా ఊపిరి పీల్చి ‘ఒకసారి ఇలా చూడండి’ అంది. తలెత్తి ఆశ్చర్యం నిండిన కళ్ళతో శైలు వంక చూశాడు అతను. ‘మీరు నాతో డైరెక్ట్ గా ఏమన్నా చెప్పాలంటే చెప్పొచ్చు. దొంగచూపులు చూడకండి’ అంది.
‘ఉఫ్..’ అంటూ చేతిలోని పెన్ టేబుల్ మీద పడేసి కణతలు రుద్దుకుంటున్నాడు శేఖర్. ‘కూర్చోండి శైలు గారూ, ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలి’ అన్నాడు. ఏం చెప్తాడో విందామని కూర్చుంది. ‘ముందుగా మీకు సారీ చెప్పాలి. మా నాన్నకి ఎన్నోసార్లు చెప్పాను, ఇలా అప్రోచ్ అవటం కరెక్ట్ కాదు అని. But ఒప్పించలేకపోయాను. ఇక ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు’ అంటుంటే guarded గా వింటోంది శైలు.
‘నా పేరు చంద్రశేఖర్ వర్మ’ అంటూ చెయ్యి జాపాడు. అసంకల్పితంగా షేక్ హాండ్ ఇచ్చింది. ‘రాజా ప్రసాద వర్మ గారు మా నాన్న. మిమ్మల్ని మా ఎస్టేట్ లో చూసిన దగ్గర్నుంచీ వారు మీ మీద మంచి అభిప్రాయంతో వున్నారు. అసలెప్పుడోనే మీ పెద్దవాళ్లతో మన పెళ్లి విషయం మాట్లాడాల్సింది. నేనే మీ మనసు తెలుసుకోకుండా అలా చెయ్యడం బాగోదు అని చెప్పాను’ అంటుంటే శైలుకి బుర్ర తిరిగిపోతోంది.
‘కాలేజీ ఆడిట్ మీ కోసమే చేశాను అనుకొనేరు. కాదు, ఇది ఎప్పట్నుంచో నా లిస్ట్ లో వున్న పని. ఇదొక్కటే కాదు, మా ఆస్తులన్నిటినీ ఆడిట్ చేస్తున్నాను’ అని చెప్పుకుపోతున్నాడు. ‘రాజులు, రాజ్యాలు ఎప్పుడో పోయాయి. మా నాన్నగారిని అందరూ రాజా వారు అని పిలుస్తున్నారు అంటే అది ఆయన చేసిన మంచి పనులకి ఇచ్చే గౌరవం. ఆ టైటిల్ ఆయనతో ఆగిపోతే బాగుంటుంది అని నా వుద్దేశం.’
‘మా అమ్మ చాలా ముందుచూపు గల మనిషి. మా కుటుంబాన్ని, మా ఆస్తులని ఒక మంచి దారిలో నడిపించింది. అలాగే నాకు కాబోయే భార్య కూడా responsible పర్సన్ అయి వుండాలనేది నాదీ, మా నాన్నగారిదీ కోరిక. మీ చదువు, ఒద్దిక చూసి వారు ఇష్టపడ్డారు. ముందే చెప్పానుగా, నేనే అడ్డం పడ్డాను’ అని చిన్నగా నవ్వాడు.
శైలుకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. రాజా వారు కబురంపితే తన మామ ఇంకో మాటకి అవకాశం లేకుండా పెళ్లి జరిపించేస్తాడు. మరి కిరీటి? అని ఒక చిన్న వాయిస్ ఆమె మదిలో మెదిలింది. ఒక్కసారి తుళ్లిపడింది. ఆమె మౌనాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడో శేఖరే మళ్ళీ మాట కలిపాడు. ‘కాలేజీలో నా పని అయిపోయాక సావధానంగా మీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ మీరు extraordinarily beautiful. అప్పుడప్పుడూ తొంగి చూడకుండా వుండలేకపోయాను. ఇవాళ మరీ బాగున్నారు’ అంటే స్త్రీ సహజమైన సిగ్గుతో శైలు బుగ్గలు ఎర్రబడ్డాయి.
‘నేనింకొక రెండు మూడు రోజుల్లో వెనక్కి వెళ్లిపోతాను. మళ్ళీ రాను. మీక్కావల్సినంత టైమ్ తీసుకోండి. ఒకవేళ మీకు మా కుటుంబంలో భాగం అవడం ఇష్టం ఐతే కబురంపండి. మనం కొన్నిసార్లు కలుద్దాం. నేనెలాంటి వాడినో మీకుకూడా తెలియాలి కదా’ అంటే శైలు మూగగా చూసింది. ‘ఈ విషయం డైరెక్ట్ గా చెప్తాను అన్నాను. మా నాన్న మిమ్మల్ని కొన్నాళ్లు observe చేసి తర్వాత ఈ విషయం ఎత్తమన్నారు. మీకిబ్బంది అయి వుంటే సారీ’ అన్నాడు.