Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#71
తను pregnant అని తెలియగానే స్వీటీ లో కొంచెం కంగారు, కొంచెం భయం వేసింది ఇప్పుడు ఈ విషయం తన అక్క బావ కీ తెలిస్తే ఎలా అని అనుకుంది కానీ ఆ విషయం దాచి పెట్టాలి అని మాత్రం అనుకోలేదు ఎలాగైనా ఇంట్లో చెప్పాలి అని డిసైడ్ అయ్యింది కార్ లో ఇంటికి వెళుతున్న అంత సేపు తను దీని గురించే ఆలోచిస్తూ ఉంది, ఇంటికి వెళ్లాక స్వీటీ తన అక్క సంధ్య, బావ రవి నీ ఇద్దరిని కూర్చోబేటి వాళ్ల కొడుకు లడ్డూ నీ రూమ్ లోకి పంపించి తను pregnant అనే విషయం చెప్పింది దాంతో ఇద్దరు షాక్ అయ్యారు


సంధ్య : ఎమ్ మాట్లాడుతూన్నావు స్వీటీ

స్వీటీ : నిజం అక్క మీకు దీని వల్ల ఏమైన ఇబ్బంది అంటే చెప్పండి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా

సంధ్య : పిచ్చి దాన ఇది అంతా నువ్వు సంపాదించిన అస్తి నేను ఆశ్చర్య పోతుంది నువ్వు శ్రీని తప్ప ఎవరినీ లవ్ చేయలేదు కదా మరి ఇది ఎలా

స్వీటీ : దీనికి కారణం కూడా శ్రీని

సంధ్య : అవునా ఎప్పుడు ఎలాగే

స్వీటీ : రెండు నెలల క్రితం నేను చరణ్ పెళ్లి కీ వెళ్లా కదా అప్పుడు జరిగింది

సంధ్య : మరి ఇప్పుడు శ్రీని కీ ఈ విషయం తెలుసా

స్వీటీ : తెలియదు చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు

రవి : అది ఏంటి స్వీటీ చెప్పక పోతే ఎలా

స్వీటీ : బావ ఇందులో వాడి తప్పు లేదు ఆ రోజు నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది వదిలేయండి నేను నా బిడ్డ జాగ్రత్తగా ఉంటాం నా ప్రేమ లో నిజాయితీ ఉంటే ఎలాగైనా వాడు నా దగ్గరికి వస్తాడు సరే నేను కొద్ది సేపు పడుకుంటా అని తన రూమ్ లోకి వెళ్లి టివి పెట్టుకొని చూస్తూ ఉంది అప్పుడే టివి లో శ్రీని గురించి ఇంటర్వ్యూ వస్తుంది.

"వరల్డ్ బైక్ రేసింగ్ చాంపియన్ షిప్ లో గెలిచిన శ్రీనివాస్ చక్రవర్తి తో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ" అంటూ ఒక యాంకర్ మాట్లాడుతూ ఉంది,
"శ్రీనివాస్ చక్రవర్తి గారు 4 సంవత్సరాల క్రితం వరకు మీరు ఒక సాధారణ బైక్ మెకానిక్ అప్పుడప్పుడు కొన్ని బైక్ రేస్ లో పాల్గొనడం అంతే తప్ప ఒకేసారి ఇంత సక్సెస్ కీ ఎలా చేరుకో గలిగారు " అని అడిగింది.

దానికి శ్రీనివాస్ నవ్వుతూ "దీనికి కారణం ముగ్గురు నా మేనేజర్ అంతేకాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్, అంతేకాకుండా ఇంకో స్పెషల్ పర్సన్ తన గురించి నేను ఎలాంటి విషయాలు చెప్పలేను, నా స్పాన్సర్ ప్రమోద్ సిన్హా, వీలు లేక పోయి ఉంటే నేను ఇంకా బైక్ మెకానిక్ గానే ఉండే వాడిని" అని చెప్పాడు దాంతో స్వీటీ శ్రీని చెప్పిన ఆ స్పెషల్ పర్సన్ తనే అని తెలుసుకుంది, అంటే శ్రీని తనని ఎప్పటికీ మరిచిపోలేదు అని అర్థం అయ్యింది.

ఆ తరువాత "మీరు ఎప్పుడు గెలవాడానికి ఏమీ చేస్తారు " అని అడిగింది యాంకర్ దానికి శ్రీని "నేను బైక్ స్టార్ట్ చేసి లాప్ చివర లక్ష్యం వైపు చూడను అక్కడ రేస్ తరువాత నాకూ ఇచ్చే ట్రోఫీ గెలిచే దృశ్యం మాత్రమే చూస్తా అంతే" అని చెప్పాడు అప్పుడు శ్రీని స్పాన్సర్ ప్రమోద్ సిన్హా వచ్చి మీడియా ముందు శ్రీని నీ కౌగిలించుకున్నాడు "మా బిజినెస్ రిలేషన్స్ నీ మేము ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ గా మార్చుకోబోతున్నాం మా అమ్మాయి లాస్య నీ శ్రీని కీ ఇచ్చి పెళ్లి చేయబోతున్నా" అని చెప్పాడు ఇది జరిగే లోపే స్వీటీ తన pregnancy గురించి చరణ్ కీ మెసేజ్ చేసింది ఎప్పుడైతే ప్రమోద్ తన కూతురి పెళ్లి శ్రీని తో అన్నాడో అప్పుడు స్వీటీ మెసేజ్ డేలిట్ చేయబోయేంది కానీ కుదరలేదు ఇక్కడ ప్రమోద్ చెప్పిన విషయం విని శ్రీని కూడా షాక్ లో ఉన్నాడు.

అప్పుడే కొంతమంది రేసర్స్ శ్రీని తో ఒక friendly రేస్ కీ పిలిచారు కానీ శ్రీని మెదడులో స్వీటీ జ్ఞాపకాలు తను కొని వస్తున్నాయి మొదటి సారి తనని చూసిన రోజు మొన్న చరణ్ పెళ్లి లో తనకు పెట్టిన ముద్దు అని గుర్తుకు వస్తున్నాయి అయిన అలాగే బైక్ నడుపుతూ వెళ్తుండగా లాప్ finishing దగ్గరికి రాగానే తను ట్రోఫీ తీసుకుంటున్నటు కనిపించడం లేదు తన ముందు నుంచి స్వీటీ వెళ్తున్నటు కనిపించింది దాంతో బ్రేక్ వేస్తే బైక్ జారీ ఎగిరి పడ్డాడు డైరెక్ట్ గా వెళ్లి ఆడియన్స్ gallery లో ఉండే బెస్మేంట్ కీ తగులుకున్నాడు. 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-06-2020, 08:27 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 9 Guest(s)