Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
#38
ఎపిసోడ్ 4


మరుసటి రోజు కావ్య కూడా సరే అని అనడంతో తల్లితండ్రులిద్దరు ఊపిరి పీల్చుకొన్నారు. ఆ రోజు సాయంత్రమే మధ్యవర్తిని పిలిచి ఆయన చేతిలో ఖర్చులు కుంచండి అంటూ పది వేలు ఇచ్చి, తాము ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు ఇంకెవరికి ఈ సంబంధ విశేషాలు చెప్పొద్దూ అంటూ కూతురి ఫోటోలతో పాటు, తమ డీటెయిల్స్ ఉన్న కాగితాలు ఇచ్చి కాకినాడకు ఆ రోజే పంపించాడు. మరుసటి రోజు మధ్యవర్తి అబ్బాయి పేరెంట్స్ కు అమ్మాయి డీటెయిల్స్, ఫోటోలు అంద చేశానని అప్డేట్ ఇచ్చాడు. వారికి అమ్మాయి బాగా నచ్చిందని తన ముందే అనుకున్నారని, అబ్బాయికి తన ముందే మొబైల్ లో ఫోటోలు తీసి WhatsApp లో షేర్ చేశారని, వారాంతంలో అబ్బాయితో ఫోన్ చేసి ఏ విషయం చెబుతామని అని చెప్పటంతో సంతోషించాడు రాజారావు. భోజనాల టేబుల్ దగ్గర ఏదో భార్యకు అప్డేట్ ఇస్తున్నట్టు చెప్పాడు,"మన అమ్మాయి వాళ్లకు బాగా నచ్చిందట. ఆదివారం లోపు అబ్బాయితో కనుక్కొని చెబుతా మన్నారు". ఈ సంభందం అంటే తండ్రికి చాలా ఇష్టంగా ఉందని ఆయన మాటల ద్వారా పసిగట్టింది.  

శనివారం వచ్చింది. మధ్య వర్తి ఫోన్ గురించి ఎదురు చూడ సాగారు. తన రూమ్ లోనే వున్న ఎందుకో తండ్రి సెల్ మోగుతుంటే అక్కడి నుంచేనా అని. కాని అడగలేని పరిస్థితి. రాజారావు కూడా తన మనస్సులోని ఆలోచనల అలజడిని బయటకు కన్పించకుండా కూల్ గా డాడీ కూల్ అన్నట్టున్నాడు. రెండు దశాబ్దాలకు పై బడిన సంసారంలో భర్త మనస్సు తెలిసిన జానకి తనలోనే నవ్వుకుంటూ, కాని ఏమి తెలియనట్టు ఇంటి పనిలో నిమగ్నమయ్యింది. శనివారం వెళ్ళింది ఆదివారం వచ్చింది. సాయంత్రం నాలుగు వరకు ఫోన్ రాక పోవడంతో, మధ్య వర్తికి తానె ఫోన్ చేసి కనుక్కొందామా అనుకొన్నాడు. కాని తన ఆత్రం భార్య, కూతురికి తెలిసి పోతుందని మిన్నకున్నాడు. వంట మనిషి ఉన్న అప్పుడప్పుడు జానకి కూడా వంట చేస్తుంది. పకోడీలు చేసి తండ్రి, కూతుళ్ళనిద్దరిని డైనింగ్ టేబుల్ వద్దకు పిలిచింది. పకోడిలు  తింటుండగా సెల్ ఫోన్ మోగింది. తింటున్న పకోడీ శబ్దం రాకుండా నములుతూ, ఒక చెవి తండ్రి మాటల మీద కేంద్రీకరించింది కావ్య.

"చెప్పండి... వెరీ గుడ్...  వెరీ గుడ్ న్యూస్... నేను ఇప్పుడే మాట్లాడతాను… హ.. అలాగే. తప్పకుండా. మీరు రావటానికి ప్రయత్నించండి. దాన్ని గురించి మీరేమి వర్రీ కాకండి. ఐ విల్ టేక్ కేర్... థాంక్స్…" అంటూ పెట్టేసారు.

అవతలి వారి సంభాషణ వినపడకపోయిన విషయం అర్ధం అయ్యింది అక్కడే ఉన్న తల్లి కూతుళ్ళ కిద్దరికి.
అయినా ఆయన చెబితే వింటే బాగుంటుంది అన్నట్టు,"ఏమని చెప్పారు" అని అడిగింది జానకి.
అప్పటివరకు కుడి చేతిలో ఉన్న పకోడీని నోట్లో పెట్టుకొని తొందరగా నమిలి తిని చెప్పాడు,"అబ్బాయి కూడా ఓకే అన్నాట్ట. నన్ను ఫోన్ చేసి వారితో డైరెక్ట్ గా మాట్లాడమన్నారు"

ఆ వార్త నింపిన ఆనందంతో ఇక పకోడీలు తినకుండా, టీ తాగి వాళ్లతో మాట్లాడతా అంటూ పైనున్న తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. పెళ్ళికొడుకు తండ్రి ప్రసాద్ రావు కు ఫోన్ చేసి, పెళ్లి చూపులకు రమ్మని ఆహ్వానించాడు. మంచి రోజు చూసుకొని వస్తామని అంటే, అలా ఫోన్లో మాట్లాడుతూ క్యాలెండరు చూసి పది రోజుల్లో దశమి బాగుంది అంటే ఓకే చేసాడు. ఉదయం పది గంటలకు వర్జము ముగియడంతో పదిన్నర తర్వాత కలిసేట్టు నిర్ణయించుకొన్నారు.

కొడుకుతో మాట్లాడి శనివారం వాళ్లిద్దరూ హైదరాబాద్ చేరుకునేట్టు, మంగళ వారం సాయంకాలం విజయవాడ చేరుకొని మరుసటి రోజు పెళ్లి చూపులకు వెళ్లొచ్చు అని డిసైడ్ చేసుకుని ట్రైన్ రిజర్వేషన్స్ చేసుకున్నారు. మరుసటి రోజే రాజారావుకి ఫోన్ చేసి కంఫర్మ్ చేయడంతో స్టేషన్ కు కారు పంపిస్తానని ఆఫర్ చేసాడు. "వద్దండి. అబ్బాయితో కోఆర్డినేట్ చేసుకొని మేము వచ్చేస్తాము.", అని సున్నితంగా తిరస్కరించాడు ప్రసాద రావు. 

ఆ వారం రోజుల్లో శ్రీరామ్ పని చేసే కంపెనీ గురించి, అతని గురించి వాకబు చేయటానికి ప్రయత్నించాడు రాజారావు తన మేనేజర్ ద్వారా. ఇలాంటి విషయాల్లో సిద్దహస్తుడైన ఆయన Microsoft కంపెనీ లో పనిచేస్తున్న శ్రీరామ్ జూనియర్ బ్యాచ్ అబ్బాయి ద్వారా కొన్ని వివరాలు లాగాడు. శ్రీరామ్ పని చేస్తున్నకంపెనీ స్టార్ట్ అప్  కావడంతో అది చాలా మందికి తెలియదు. కాని ఆ కంపెనీ సెక్యూరిటీ సంస్థ ఎంప్లాయ్ ద్వారా కొన్ని విషయాలు సేకరించాడు. మొత్తం మీద శ్రీరామ్ గురించి తెలివైన వాడని, కంపెనీలో మంచి పేరుంది అన్న ఫీడ్ బ్యాక్ రావడంతో అదే విషయం ఆనందంగా భార్యకు, కూతురికి చెప్పాడు. అందరూ బుధవారం గురించి ఎదురుచూడ సాగారు.

కానీ ఆ శుక్రవారం ఒక బెంగుళూరు కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ కొనడానికి ఎవాల్యూయేట్ చేయాలన్న రిక్వెస్ట్ US హెడ్క్వార్టర్స్ నుంచి రావడం తో, శ్రీరామ్ టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ కావటంతో వాళ్ళ కంపెనీ సీఈఓ తనతో బెంగుళూరు రమ్మని అడిగాడు శ్రీరామ్ ని, సోమవారం నాడు. రెండు రోజుల తర్వాత పెళ్లి చూపులు, అమ్మాయి వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చాం ఎలా అని ఆలోచించి చివరకు అది మంచి అవకాశం అని వెళ్ళడానికే డిసైడ్ అయ్యాడు. సోమవారం మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లి గురువారం ఈవెనింగ్ ఫ్లైట్ కి వచ్చేలా రిజర్వేషన్స్ చేశారు కంపెనీ వాళ్ళు. 

శనివారం ఉదయం శ్రీరామ్ స్టేషన్ కు వెళ్లి తల్లి తండ్రులను పిక్ చేసుకొని గచ్చిబౌలి లోని తన అపార్ట్మెంట్ కి తీసుకు వచ్చాడు. శ్రీరామ్ ఆ త్రిబెడ్ రూమ్ ప్లాట్ కొనుక్కొని ఆరు నెలలు అయ్యింది. ఎవరో కొనుక్కొని ఇంటీరియర్స్ చేయించుకొని, ఆ అపార్ట్మెంట్లోకి మారుదామనుకొనే లోపల అమెరికా వెళదామని డిసైడ్ అవ్వటంతో అమ్మేశారు. అంతా వైట్ మనీ కావాలి అంటే అపార్ట్మెంట్ కొనే వేటలో ఉన్న శ్రీరామ్ మంచిరేటుకు వస్తుందని కొంత తన సేవింగ్స్ తో, మిగిలింది లోన్ తీసుకొని కొనేసాడు. తమ చేతుల మీదుగానే గృహ ప్రవేశం చేయించారు. దాని తరువాత వాళ్ళు రావడం ఇప్పుడే. ఇల్లంతా లగ్జరీ గా కాకపోయినా డీసెంట్ గా ఫర్నిష్ చేసుకొన్నాడు. తాము వస్తామని తెలిసి అన్ని రెడీ గా పెట్టాడు, పాలతో సహా.  వీడిని చేసుకునే పిల్ల అదృష్టవంతురాలు అని మనసులోనే అనుకొంది లలిత. తను తెచ్చిన పచ్చళ్ళు అవి తీసి వంట గదిలో సర్ది, స్నానాలు చేసి దోశలు తిని, కాఫీ తాగి కూర్చున్నారు. 

కంపెనీ పని వల్ల తను రావడానికి వీలు కావట్లేదు అని, "మీరు చూసి రండి. నచ్చితే తర్వాత నేను వెడతాను" అని చెప్పాడు. అనుకున్నట్టుగా కొడుకు కూడా తమతో వస్తే బాగుంటుంది అనుకున్నా, కొడుకు చెప్పాడంటే అది ముఖ్యమైన పని అయ్యుంటుంది అని అలాగే అన్నాడు.
[+] 7 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 07-06-2020, 07:07 AM



Users browsing this thread: 24 Guest(s)