06-06-2020, 07:39 AM
హిస్టరీ క్లాసులాగా అనిపించినా నా ఆనందం కోసం ఇది చదవండి.
పాశ్చాత్య చరిత్రకారులు బలవంతంగా మనకు బి.సి., ఎ.డి. అని కాలాన్ని విభజించి రాయడం అలవాటు చేశారు. నేను జీసస్ యొక్క ప్రాముఖ్యతనో, ఆయన మహిమనో శంకించటం లేదు. అనేక రకాలుగా కాలాన్ని గణించుకుంటూ వస్తున్న విభిన్న నాగరికతలు ఈ బలవంతపు రుద్దుడుతో తమ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడుతున్నాయి. ఈజిప్ట్, చైనా, సింధు నాగరికతలు జీసస్ కంటే వేల సంవత్సరాలు పురాతనమైనవి. యేం, పాశ్చాత్యులు నేర్పకపోతే వీళ్ళకి కాలాన్ని ఎలా గణించాలో తెలీదా?
ఒక ఉదాహరణ - మన తెలుగు వారి పంచాంగం ఎంత elegant అంటే మాటల్లో చెప్పడానికి వీలు కాదు. కాలాన్ని గణించడంలో అత్యుత్తమమైన మార్గాల్లో ఇది ఒకటి. ఈ సోది అంతా ఎందుకంటే మన చరిత్రకారుల్లో కొందరికి భయం ఎక్కువ. B.C. లో జరిగిన చరిత్ర, అప్పటి సంఘటనల గురించి రాయాలంటే వీరికి నామోషీ. ఆధారాలున్నా కూడా మన దేశంలో బయటపడుతున్న చారిత్రిక కట్టడాల వయసు వందల సంవత్సరాలు ముందుకి జరిపేసి క్రీస్తు శకం 7, 8 శతాబ్దాలు అని రాసేస్తారు. సిగ్గు సిగ్గు.
సింధు నాగరికతకూ, అంతకు ముందు వెల్లివిరిసిన నాగరికతల్లోనూ సూర్యుడికి ప్రత్యేక స్థానం వుంది. ఇక మన వేదాల సంగతి చెప్పనవసరం లేదు.
మనందరం పాఠ్యపుస్తకాల్లో ఓ పేరు వినే వుంటాం. హ్యూఎన్ త్సాంగ్ అని. 6వ శతాబ్దంలో అఖండ భారతదేశంలో విరివిగా పర్యటించాడు ఆయన. ముల్తాన్ (సెహ్వాగ్ triple century చేసిన చోటు) నగరంలో ఇప్పుడు శిధిలావస్థలో ఒక సూర్యుడి గుడి వుంది. హ్యూఎన్ త్సాంగ్ ఆ గుడి గురించి రాస్తూ బంగారంతో తయారు చేసిన సూర్యుడి విగ్రహం గురించి, కెంపులతో తయారైన ఆయన కనుల గురించీ, రత్నాలు, రాశులు పొదిగిన తలుపులు, బంగారం తాపడం చేసిన శిఖరం గురించీ రాశాడు. ఇది చారిత్రిక నిజం. నేను కల్పించింది కాదు. Wikipedia లో చదవండి కావాలంటే. ఈ గుడిని 5వ శతాబ్దం (B.C.) లో కట్టారన్నది ఒక అంచనా.
9వ శతాబ్దం మొదలుకొని 15వ శతాబ్దం దాకా పాశ్చాత్యులు క్రూసేడుల పేరుతో మరణహోమాన్ని జరుపుకుంటూ వుంటే మనదేశంలో అమోఘమైన రాజవంశాలు వర్ధిల్లాయి. దురదృష్టవశాత్తూ మొఘలాయిల చొరబాట్లు ఎదుర్కోవడంలో చాలా కాలాన్ని గడిపేశారు. లేకుంటే మన నాగరికత ఇంకెంత అభివృద్ధి చెంది వుండేదో.
10వ శతాబ్దంలోనో 12వ శతాబ్దంలోనో కోణార్క్ సూర్యమందిర నిర్మాణం జరిగింది. కట్టించినవారు తూర్పు గాంగేయులు. ఈ గుడి కూడా ఇప్పుడు శిధిలావస్థలో వుంది. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటి ఇది. దినము, వారము, మాసము, సంవత్సరము ఇవన్నీ కూడా రాతి నిర్మాణాల్లో కళ్ళకు కట్టినట్టు చూపారు ఈ గుడిలో. ఇది కూడా fact. నా కల్పితం కాదు. అయితే మొగలాయిల దాడుల్లో దెబ్బతిన్న మందిరాల్లో ఇది కూడా ఒకటి. ఈ తూర్పు గాంగేయులు పూరీ జగన్నాథ ఆలయాన్ని కూడా కట్టించారు.
శిధిలమైపోయిన మన నిర్మాణ సంపదల గురించి చదివి చదివీ విసుగెత్తిపోయి ‘ఒక్క నిర్మాణమైనా బతికి బట్టకట్టి వుంటే?’ అన్న ఊహాలోంచి పుట్టింది నా ఈ కథ. ఇలా అప్పుడప్పుడూ ఏదో ఒక సోది చెబుతూ వుంటాను, భరించండి.
ఈ స్వస్తి అంతా రాసేవాడిని కాదు. ఐతే గిరీశం గారు మనం ఏమన్నా రాస్తే జనాలకి ఉపయోగకరంగా వుండాలి అన్నారు. వారి మాట ఫాలో అయిపోయాను. మీకేమన్నా complaints వుంటే ఆయనతో చెప్పుకోండి. (joking gireesam sir, thanks for your suggestions, encouragement)