Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
#29
ఎపిసోడ్ 3

ఆ విషయమై తరువాత రెండు రోజులు బాగా ఆలోచించింది. తల్లి తండ్రుల ప్రోత్సహం, మద్దత్తు తన కెప్పుడు ఉంటుంది. కెరీర్ పరంగా తనను సపోర్ట్ చేసేవాడు వస్తే ఇంకా ఎదురు చూడ్డం అనవసరమని పించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చినా మనస్సులోనే దాచుకుంది.

ఒక వారం తరువాత భార్య సమక్షంలో కూతుర్ని మరోసారి కదిపాడు,"ఏమి ఆలోచించావమ్మా, పెళ్లి గురించి."
"నాకు ఏమి చెయ్యాలన్న దాని మీద స్పష్టత లేదు నాన్న. నా నిర్ణయాలకు సహకరించే వారు దొరికితే నాకు ఓకే."
"అలాగేనమ్మా. చెప్పానుగా నీకు నచ్చితేనే అని. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఒక స్పష్టత రావచ్చు. నీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటే, నాకు గాని అమ్మకు గాని చెప్పు."
"నాకు ప్రత్యేకంగా ఏమి లేవు నాన్న. మీరు ఫిజికల్ కేరక్టర్స్, చదువు, ఉద్యోగం, సంపాదన అలాంటి వాటి మీద వెదక కలరు కాని, అతని నడవడిక, మనస్తత్వం తెలియవు కదా నాన్న."

కూతురి మెచ్యూరిటీ కి ఆనందపడిన రాజారావు, "లేదమ్మా. మనకి ఒక అభిప్రాయం వస్తే తెలిసిన వాళ్ళ ద్వారా వాకబు చేయించవచ్చు." అలా అన్నాడే కాని, కూతురు చెప్పిన దాంట్లో ఉన్న నిజం తెలుసు. ఎంత వాకబు చేసినా కాని, కొన్ని విషయాలు కలిసి ఉంటేనే కాని తెలియవు.

ఆ క్షణం నుంచి రోజులో వీలయినంత సమయం భార్య, భర్త లిద్దరూ కూతురి పెళ్లి గురించే  ఆలోచించ సాగారు. ముందుగా తమ చుట్టాల్లో కావ్యకు సరి పడే వారు ఉన్నారా అని చూసారు. డబ్బు లేకపోయినా సరే బాగా చదువుకొని మంచి ఈడు, జోడు అయితే చాలు అని అనుకున్నా, అలాంటి వారు ఎవ్వరు కనపడక పోవడంతో బయటి సంభందం చేయాలని నిశ్చయించారు.

సౌమ్య కాలేజ్ కి వెళ్లిన తరువాత, కావ్య ఒక్కతే మిగిలింది. ఊరికే ఉండటం ఎందుకని కావ్య తండ్రి కంపెనీలోనే ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్ గా చేరింది. రోజు ఉదయం నాలుగు గంటలు పనిచేయడం, మధ్యాహ్నం ఇంటికి రావడం ఏమైనా మ్యాగజైన్స్ చదువుతూ పగటి కలల్లో తేలిపోవడం పరిపాటి అయ్యింది. మధ్యలో స్నేహితుల పెళ్లిళ్లు జరిగితే వెళ్లి వచ్చింది. ఆ పెళ్లి వ్యవహారం చూసిన కొద్దీ ఊహలు మరింత ఎక్కువయ్యాయి.  ఎవరిదైనా సంసారంలో పొరపొచ్చాలు లేక డివోర్స్ లాంటి విషయాలు తెలిస్తే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేది, తన కెలాంటి వాడు వస్తాడో అని. కాని అంతలోనే ఒక పిచ్చి నమ్మకం కలిగేది, మంచి వాడే వస్తాడని. పగలే వెన్నెల, జగమే ఊయల అన్నట్టుగా మధుర మైన తీపి ఊహలతో ఒక రంగుల ప్రపంచంలో తేలి పోసాగింది.

******************

దిగితే కాని లోతు తెలియదు అన్నారు. దేవుడి దయవల్ల అన్ని వున్నతమ కూతురికి పెళ్లి సంభంధం తేలిగ్గా కుదుర్చు కోవచ్చు అనుకొన్న వారికి అది మరీ అంత సులభతరం కాదని తొందరగానే అవగాహన అయ్యింది. సరదాగా ఒకటి రెండు సంవత్సరాలు అయితే అమెరికా ఓకే కాని, అక్కడ స్థిర పడడం ఇష్టం లేదని కావ్య నిష్కర్షగా చెప్పడంతో, అమెరికా లో స్థిర పడిన వారి సంభందాలు, గ్రీన్ కార్డు ప్రాసెస్ లో వున్న వారివి వదులు కొన్నారు. ఒకందుకు వాళ్లిద్దరూ సంతోష పడ్డారు. కూతురు తమకు దగ్గరలోనే ఇండియా లో ఉండబోతున్నందుకు. వాళ్లకు జాతకం పై అంత నమ్మకం లేకపోయిన, అవతల వాళ్ళ నమ్మకాల వలన  జాతకాలు కలవక కొన్ని ముందుకు నడవ లేదు. కొన్ని ప్రైవేట్ గా వాకబు చేయిస్తే, కుర్రాళ్ళ మీద చెడ్డ అభిప్రాయలు  వ్యక్తం కావడం తో డ్రాప్ చేసుకొన్నారు. 

అంత కాసి వడ పోసిన తరువాత రెండు, మూడు సంబంధాలు పెళ్లి చూపుల వరకు వచ్చాయి. మొదటి సంభందం బిజినెస్ లో తమ కంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్న స్నేహితుడి కొడుకు. అబ్బాయి అందగాడు, తండ్రి బిజినెస్ చూస్తున్నాడు. హైదరాబాద్ లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపుల తర్వాత అబ్బాయి, అమ్మాయితో కలసి మాట్లాడు తానంటే, తమకు అలాంటి ఆలోచన ఉండటంతో సరే అన్నారు. సాయంకాలం కుర్రాడు BMW కారులో ఇంటికి వచ్చి పిక్ అప్ చేసుకొని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళదాం అని కావ్య అభిప్రాయం అడక్కుండా నేరుగా ఒక పబ్ కు తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాలెట్ పార్కింగ్ లో అతన్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసి అతను అక్కడ రెగ్యులర్ అని అభిప్రాయ పడింది. అతని మీటింగ్ ప్లేస్ ఛాయస్ తోనే ఒక నెగటివ్ ఇంప్రెస్సును తో ఉన్న కావ్య కు, పబ్ లోపల అతన్ని కలిసిన ఫ్రెండ్స్ 'బ్రో, హూ ఈజ్ దిస్ న్యూ బేబ్' అని అడగడం, అలాగే కొంత మంది అమ్మాయిలు మందు తాగుతూ హలో చెప్పడాలు చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. తన తండ్రి అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడు. డ్రింకింగ్ అలవాటుతో ప్రాబ్లెమ్ లేకపోయినా, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవాల్సిన ఆ సందర్భానికి అతను ఎంచుకున్న ఛాయస్, అతని ఫ్రెండ్స్ సర్కిల్ చూసి డిసైడ్ అయిపొయింది. ఇంక అక్కడ ఉండటం ఇష్ట లేక, కొంచెం సేపట్లో అతను డ్రాప్ చేస్తానన్నా తనతో తిరిగి వెళ్లడం ఇష్టం లేక గుడ్ బై చెప్పి క్యాబ్ లో ఇంటికి వచ్చేసింది.

అంతా విన్న తండ్రి, "మంచి పని చేశావమ్మా. సారీ ఇలా అవుతుందనుకోలేదు", అని ఆపాలేజిటిక్  గా అన్నాడు.

"నువ్వెందుకు నాన్న బాధ పడటం అతను అలా చేస్తే", అని సర్ది చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది. పెళ్లి తలంపు వచ్చిన తరువాత మొదటి సారి అన్య మనస్కంగా ఆలోచిస్తూ నిదుర పోయింది.

కూతురు చేసినా దాంట్లో తప్పేమి లేకపోయినా అవతలి వారికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డ రాజారావుకు అతని స్నేహితుడు నుంచి 11 పీఎం కి కాల్ వచ్చింది.

"ఇప్పుడే మా వాడు ఇంటికి వచ్చాడు. వాడు చాలా ఫాస్ట్. మంచి అమ్మాయి కోడలుగా రాబోతుందని సంతోష పడ్డాము. కాని వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ లేదు. సారీ. విష్ యు అల్ ది బెస్ట్ విత్ యువర్ సెర్చ్", అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు.

******************

రెండో సంభందం అబ్బాయి వాళ్ళు ధనికులే కాని ఒక సంవత్సరం క్రితం వ్యాపారం లో దెబ్బ తిన్నారు. ఎంత నష్టం జరిగిందో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినా, వాళ్ళ సర్కిల్ లో విన్నది ప్రకారం చాలా దెబ్బ తిన్నారని తెలిసింది. అయినా పట్టించుకోలేదు. అబ్బాయి బాగా చదువు కున్నాడు, సహాయం చేస్తే పైకి లాగొచ్చు అన్న అభిప్రాయంతో ముందుకు వెళ్లారు. పెళ్లి చూపుల్లో అబ్బాయి బాగా మాట్లాడటంతో బాగుంది అనుకొన్నారు.  బయట మొదటి సారీ వాళ్లిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కొంచెం సేపు మాములుగా మాట్లాడిన, తరువాత అతని మాటలన్నీ తను బిజినెస్ ఎలా పైకి తీసుకు రావాలనుకుంటున్నాడో, తన ఫైనాన్స్ బాక్గ్రౌండ్తో అతనికి తను ఎలా సపోర్ట్ చేయవచ్చో చెబుతుంటే కొంచెం సెల్ఫ్ సెంటర్డ్ అనిపించింది. ఎందుకైనా మంచిదని తండ్రి సహాయంతో రెండో సారీ అతన్ని కలిసింది. రెండో మీటింగ్ లో కూడా తన భవిషత్తు పధకాలు, ఎలా తను స్వల్ప వ్యవధి లోనే ఒక బిజినెస్ టైకూన్ అయి తమ పేరు నిలబెట్టు కోవాలనుకుంటున్నాడో అన్న దాని మీదే సంభాషణ నడిచింది. తను చదివిన చదువు వల్ల ఒక్క విషయం మాత్రం స్పష్టం అయ్యింది తనకి, ఆ అబ్బాయి వ్యాపార పథకాలన్నీ తమ వివాహం ద్వారా రాబోయే కట్నం, ఆ తరువాత నాన్నగారి ఫైనాన్సియల్ సపోర్ట్ మీద ఆధార పడ్డవేనని. జీవన గమనంలో భార్య సహాయం ఆశించడంలో తప్పు లేదు కాని, తన ఇష్టమేమిటో తనతో చర్చించిక పోవడం కూడా రుచించ లేదు. తల్లి తండ్రులతో తన ఎనాలిసిస్ చెప్పి ఆ సంభందం కూడా రిజెక్ట్ చేసింది. 

తమ సర్కిల్ లో వెదికిన సంభందాల్లో చాలా వరకు డొనేషన్లతో లేక డబ్బులతో విదేశాల్లో చదివి తండ్రి వ్యాపారాల్లో చేరిన వారు కావడంతో, ఆర్ధిక స్తోమతు వున్న స్వతహాగా తెలివితేటలు లేకపోతె కష్టం అని  రాజారావుకి పూర్తిగా నచ్చక కొన్ని వదులు కొన్నారు. 

కాల క్రమంలో రెండు నెలలు పైగా గడిచి పోయాయి. కాని భార్య, భర్త తొందర పడ తల్చుకోలేదు. అలాగే వచ్చిన ప్రొపొసల్స్ ని రిజెక్ట్ చేస్తున్నా కూతురి మీద కూడా ఏ మాత్రం వత్తిడి తేలేదు. మధ్య వర్తుల ద్వారా సంభందాలు చూస్తూనే ఉన్నారు. అన్ని రకాలుగా నచ్చితే కాని కూతురితో డిస్కస్ చేయకూడదనుకొన్నారు. అలాంటి సమయంలో మధ్యవర్తి కాకినాడ నుంచి ఒక సంభందం తీసుకు వచ్చాడు. అబ్బాయి తండ్రి జూనియర్ కాలేజీ లో మాథ్స్ లెక్చరర్. అబ్బాయి ఐఐటీ చెన్నయి లో బి.టెక్. కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికా లోని కోర్నెల్ యూనివర్సిటీ లో MS చేసాడు. మూడేళ్ళపాటు బే ఏరియా లోని ఒక స్తార్ట్ అప్ కంపెనీ లో పని చేసి, ఒక సంవత్సరం క్రితమే ఇండియా కు తిరిగి వచ్చి ఆ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో పెట్టిన బ్రాంచ్ లో టెక్నికల్ లీడ్ గా పని చేస్తున్నాడు. ముప్పై ఐదు లక్షల ప్యాకేజి. ఫోటో లో కూడా కుర్రాడు చూడ్డానికి బాగుండటం తో చాలా ఇంప్రెస్స్ అయ్యారు భార్య భర్త లిద్దరు. మధ్య తరగతిలో పుట్టి పేరెన్నిక గన్న ఆ రెండు యూనివర్సిటీలలో చదివాడు అంటేనే ఆ కుర్రాడి మేధో సంపత్తి మీద ఒక అంచనా కు వచ్చాడు. ఎందుకనో గాని మనస్సులో ఫిక్స్ అయ్యాడు, ఈ సంభందం ఖాయం అని. మధ్యవర్తి వారి ఆర్థిక పరిస్థితి మీద డీటెయిల్స్ చెబుతున్నపెద్దగా ఎక్కించుకోలేదు. డిన్నర్ తరువాత అబ్బాయి ఫోటోతో పాటు బయోడేటా కూతురికి ఇచ్చి మరుసటి రోజు తన అభిప్రాయం చెప్పమన్నాడు.

అతని బయో చదివిన కావ్య, తండ్రి లాగే చాలా ఇంప్రెస్స్ అయ్యింది. ఐఐటీ, కోర్నెల్ లాంటి టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడమే చాలా కష్టం. చాలా తెలివైన వాడు అయ్యుండాలి అనుకొంది. అమెరికాలో దిగిన ఆ రెండు ఫోటోలు చూసి బాగున్నాడు అనుకొంది. అప్పటికే జరిగిన పెళ్లి చూపుల అనుభవంతో చూద్దాం ఇది ఎక్కడ దాకా పోతుందో అనుకొంది. పడుకో బోతు అతని పేరు ఏమిటా అని పేపర్ మళ్ళా చూసింది. 

"శ్రీరామ్… సౌండ్స్ గుడ్", అని మనస్సులోనే అనుకొని, "గుడ్ నైట్ శ్రీరామ్"అని పైకి అంటూ దుప్పట్లో దూరింది.
[+] 9 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 05-06-2020, 06:21 AM



Users browsing this thread: 25 Guest(s)