31-05-2020, 03:36 PM
మాయ - 26
ఈసారి బ్యాచ్ లో నీలి వజ్రాలు మాత్రమే వుంటాయి అని చెప్పి పంపింది మాలిని. Hope diamond, Blue Moon వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు నీలి రంగువే. డిసౌజా దగ్గరుండేవి అంత పెద్దవి కాకపోయినా రంగు అరుదైనది కాబట్టి వాటిలో ఒకటో రెండో సంపాదించగలిగినా కొన్ని లక్షలు వెనకెయ్యొచ్చు అని నూరిపోసింది. వాటిని ఎలా పరిశీలించాలో, expert లా ఎలా నటించాలో కొంత చెప్పి పంపింది. ఇప్పుడు తనకెదురుగా కూర్చున్న డిసౌజా ఎందుకు తెల్ల వజ్రాలు అవీ ఇంత చిన్నచిన్న వాటిని తనకందించాడో తెలియడం లేదు సునయనకు.
వినయ్, మాలిని తనకు ఎంత తప్పుడు సమాచారం ఇచ్చారో చూసి తలతిరిగింది సునయనకు. తన అసహాయ స్థితి, stupidity చూసి తనపై తనకే కోపం వచ్చింది. ఇలా తనకు హాఫ్ నాలెడ్జ్ వున్న ఈ సిట్యుయేషన్ చాలా dangerous అని, వెంటనే బయటపడాలి అని అనుకుంది. వజ్రాలు ఆ క్షణంలో ఆమెకు secondary అనిపించాయి. కానీ అక్కడనుండి వెళ్ళాలి అంటే ఒక బలమైన కారణం కావాలి. చేవలేని దానిలా ఇప్పటిదాకా డిసౌజాను సంతోషపరచడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే అతగాడినుంచి ఏమీ అవసరం లేదు అని ఫిక్స్ అయ్యిందో ఇక వేరే రూట్ లో వెళ్దామని నిశ్చయించుకుంది.
ఎదురుగుండా కూర్చున్న డిసౌజా ఆమెనే తినేసేలా చూస్తున్నాడు ఇంకా. ‘నేను బాగున్నానా మిస్టర్ డిసౌజా’ అని అడిగింది. అనుకోని ప్రశ్నకు కంగుతిన్నా వెంటనే తేరుకొని పిట్ట రూట్ లోకి వచ్చేసిందేమో అనుకొని ఒక నవ్వు నవ్వాడు. ‘సెక్సీగా కూడా వున్నాను కదూ’ అంటూ టేబుల్ పై తన ఉరోజాలు ఆనించి అడిగింది. ఇక డిసౌజా pretense అంతా వదిలేసి ఆబగా చూస్తూ యెస్ అన్నాడు.
‘సో, మీరు నా లుక్స్ దాటి నన్ను ఒక ప్రొఫెషనల్ గా చూడలేక పోతున్నారన్నమాట’ అనేసరికి అతడి మొహంలో రంగులు మారాయి. తేరుకునే అవకాశం ఇవ్వకుండా సునయన ఎటాక్ కొనసాగిస్తోంది. ‘సూరత్ ఇక్కడికి దాదాపు 1500 km దూరం. కేవలం మీ పనిమీద నేను అంతదూరం ప్రయాణం చేసి వచ్చాను. మీరు చూపించిన ఈ వజ్రాలను inspect చేయించదలచుకుంటే సూరత్ నుంచి నాలాంటి వాళ్ళను రప్పించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ వజ్రాల బాక్స్ ను మూసేసింది. ‘మీ goods నాకు చూపించడం మీకిష్టంలేదని అర్ధం అయింది నాకు. As a professional, నాకు కూడా కొంత pride వుంది. దయచేసి ఇంకెప్పుడూ మా ఏజెన్సీని కాంటాక్ట్ చెయ్యకండి’ అంటూ తన loupe బాగ్ లో వేసుకొని తలుపు దగ్గరకు వెళ్ళి నుంచుంది.
డిసౌజా ముఖంలో కనిపిస్తున్న భావాలు చూస్తుంటే ఆమెకు భయం వేస్తోంది. మనిషిని చూస్తే బద్దలవబోయే అగ్నిపర్వతంలా వున్నాడు. శారీరకంగా దాడి చేస్తే ఎలా కాచుకోవాలో అని లెక్కించుకుంటోంది. దేవుడే పంపించాడా అన్నట్టు ఎవరో తలుపు తట్టారు. ‘I told you not to disturb me’ అంటూ ఒక అరుపు అరిచాడు డిసౌజా. కానీ బయటనుండీ ఇంకా ఎవరో తలుపు తడుతూనే వున్నారు. సునయన కొంచెం పక్కకు తప్పుకుని నిలబడింది. ఇదొక్కటే ఇక్కడ్నుంచి బయటపడడానికి గోల్డెన్ ఛాన్స్ అని లోపల ప్రేయర్ చేసుకుంటోంది.
డిసౌజా మొత్తానికి తలుపు తెరిచాడు. కానీ సునయన బయటకు వెళ్లకుండా అడ్డం నుంచుని వున్నాడు. బయటనుంచి చిన్న చిన్న మాటలు వినిపిస్తున్నాయి. మాటల్లో నీనా డిసౌజా అనే పేరు వినగానే చలిజ్వరం వచ్చినదానిలా ఊగిపోయింది ఒకసారి. సుందర్ వచ్చాడు అని అర్ధం అయింది. పూర్తిగా తెగించి లేని బింకం తెచ్చిపెట్టుకుని ‘ప్రయాణంలో hiccup అని చెప్పాను కదా. అదే మాటర్ అనుకుంటా’ అంది డిసౌజాతో. అతడామెను తేరిపార చూసి ‘come with me’ అంటూ కిందకు తీసుకెళ్ళాడు.
సుందర్ నిజంగానే వున్నాడక్కడ. మనిషి ఇంకా పూర్తిగా తేరుకున్నట్టు లేదు సునయన వాడిన స్ప్రే ప్రభావం నుంచి. ఉండుండి అతడి తల వాలిపోతోంది. మధ్యలో ‘ఎటాక్’, ‘నీనా డిసౌజా’, ‘వార్నింగ్’ అంటూ పొడిపొడి పదాలు పలుకుతున్నాడు. ‘Explain’ అని ఒక్క మాట అని ఊరుకున్నాడు డిసౌజా.
‘రాత్రి ఘాట్ రోడ్డులో ఎవరో మమ్మల్ని ఎటాక్ చేశారు. వాళ్లలో ఒకామెను మిగతా వాళ్ళు నీనా డిసౌజా అని పిలిచారు. అతను నా అసిస్టెంట్. నన్ను కాపాడి తను దెబ్బలు తిన్నాడు. వర్క్ మిస్ అవకూడదని అతన్ని హోటల్ లో వుంచి నేను మీ దగ్గరికి వచ్చాను. పూర్ ఫెలో, నిద్ర లేచి నేను పక్కన లేకపోవడం చూసి ఇక్కడికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటా’ అంటూ నోటికొచ్చిన కథ అల్లేసింది సునయన.
సుందర్ అవతారం, అతని బట్టలు, తల మీద వున్న కట్టు చూసి చివరకు తల పంకించాడు డిసౌజా. ‘నా డియర్ సిస్టర్ ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు. నో వండర్ నువ్వంత షార్ప్ గా రియాక్ట్ అయ్యావు పైన. మనం మళ్ళీ ఈవెనింగ్ కలుద్దాం. నీ దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి’ అంటూ తన స్టాఫ్ కు వాళ్ళిద్దరినీ అప్పగించి కోపంగా వెళ్లిపోయాడు ఫ్రాన్స్-వా డిసౌజా.
కొద్ది నిమిషాల తర్వాత విల్లాలో ఎవరూ ‘మాలిని కపూర్’ ను చూడలేదు. సునయన సుందర్ కారును అక్కడే వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయింది. విల్లా నుండి దూరంగా నడుస్తూ తలపైనున్న విగ్ తీసిపారేసింది. ముఖానికున్న మేకప్ చెరిపేసుకుంది. జనాలు ఎవరూ లేని చోట తను వేసుకున్న బట్టలు తీసేసి చేతిలో వున్న హాండ్ బాగ్ లోంచి ఒక పాత స్కర్ట్, టీ షర్ట్ తీసి వేసుకుంది. కళ్ళలో వున్న కాంటాక్ట్ లెన్స్ తీసి పారేసింది. బాగ్ కూడా అక్కడే వదిలేసింది. కానీ అందులోని loupe మాత్రం తనదగ్గరే అట్టిపెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ కిరీటి ఏ అమ్మాయినైతే చూసి మోజు పడ్డాడో ఆ సునయన మళ్ళీ ప్రత్యక్షమయింది.
తీరిగ్గా తన స్టడీ లోకి వెళ్ళిన డిసౌజా బాక్స్ లో ఐదు వజ్రాలు మిస్ అవడం చూసి శివాలెత్తిపోయాడు. కోపం తీరాక cold blooded గా ఆలోచించాడు. సునయన రూపాన్ని గుర్తున్నంతవరకూ వివరించి తన మనుషుల్ని ఉసిగొల్పాడు. సుందర్ తేరుకున్నాక అతడు చెప్పినదాన్ని బట్టి ఆమెకు ఒకటి కంటే ఎక్కువ రూపాలు వుండొచ్చు అని తెలుసుకున్నాడు. వజ్రాల వ్యాపారంతో సంబంధం వున్న మాలిని కపూర్ అనే ప్రతి ఒక్క మనిషినీ పట్టుకురమ్మని డబ్బు వెదజల్లాడు. దేశంలో ఎక్కడైనా సరే ఎవరన్నా అమ్మాయి వజ్రాలు అమ్మజూపితే తనకు తెలియాలని ఆర్డర్ వేశాడు.
సునయన కోసం వేట మొదలైంది. వినయ్ గాంగ్ తో ఇక ఏ సంబంధం పెట్టుకోకుండా మళ్ళీ తెలుగుగడ్డకి చేరుకుంది సునయన. చేతిలో ఐదు వజ్రాలున్నా వాటిని ఉపయోగించే ధైర్యం మటుకు చేయలేదు. భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది.
మనం మళ్ళీ పెంచలాపురం వెళ్లాల్సిన సమయం వచ్చింది....