Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
#1
ప్రియమైన పాఠకులకు,

నమస్కారం. ఒక కథ రాయాలని నాకు ఎప్పటి నుండో ఉంది. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఆలోచన వచ్చి మొదలు పెట్టినా, కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. దేనికైనా సమయం సందర్భం రావాలి అంటారు. ఈ కోవిడ్ మహమ్మారి వల్ల చాలా మందికి గోప్యత కరువైతే, ఇంటినుంచి పని వల్ల నాకు కొంత కలిసి వచ్చింది. ఇతరుల కధలు చదవటమే కాదు, ఒక కధ ద్వారా ఈ ఫోరమ్ కి చేయూత నివ్వాలని కోరిక. చివరకు నా కోరిక తీరే సమయం వచ్చింది.

రచయితల మీద ఈ ఫోరమ్ లో ముఖ్యంగా రెండు ఫిర్యాదులు. 

మొదటిది, అసంపూర్ణ కధలు. చాలా కధలు, అందులో కొన్ని పాఠకులకు బాగా నచ్చినవి (నాకు నచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి) అసంపూర్తిగా మిగిలి పోయాయి. నేను చెబుతున్నది ఇక ఆ రచయితలు మళ్ళా వచ్చి పూర్తి చేస్తారు అన్న ఆశ లేనివి (కానీ ఎక్కడో వస్తారేమో అన్న ఆశ మినుకు మినుకు మని ఉంటుంది). ఉద్దేశ పూర్వకంగా చేశారని అనుకోను కానీ, ఏ కష్టం వచ్చిందో అని అనుకుంటూ ఉంటాను. ఈ సమస్య నా కథకు ఉండదు. మీరు కామెంట్స్ పెట్టిన, పెట్టకబోయిన, బాగో లేదన్న సరే కథ పూర్తి చేస్తాను (నా నియంత్రణలో లేని కారణాలు వల్ల తప్ప) అని హామీ ఇస్తున్నాను. ఒక ప్లాన్ ప్రకారం పోతున్నాను. అంతా అనుకున్నట్టు జరిగితే చివర్లో ఆ పధకం ఏమిటో  వివరిస్తాను, అందరికి కాకపోయినా కొంతమంది ఔత్సాహిక రచయితలకు ఉపయోగపడచ్చు.

రెండవది, అప్డేట్ ల మధ్య చాలా ఎక్కువ సమయం. వారానికి కనీసం ఒక అప్డేట్ కోసం ఎదురు చూడటం సబబే అని అనికొంటున్నాను. కొన్ని కధలకు కొన్ని వారాల పాటు అప్డేట్లు లేక అప్డేట్ ప్లీజ్ అన్న కామెంట్స్ చాలా వున్నాయి. గణాంకాలు తెలియవు కానీ "సూపర్" కానీ "అప్డేట్ ప్లీజ్", ఈ రెండింటిలో ఏదో ఒకటి అత్యంత తరుచుగా రాయబడే కామెంట్ అయ్యుండాలి. అనారోగ్యం, మూడ్, గోప్యత, కుటుంబంలో సమస్యలు, పని ఒత్తిడి ఇలా రక రకాల కారణాల వల్ల చాలా మందికి కుదరక పోవచ్చు. కొంత మంది రచయితలు కారణాలు చెప్పినప్పుడు పాఠకులు కూడా సహృదయంతో ఆదరించి ప్రోత్సాహించిన సందర్భాలు ఎన్నో. వారానికి కనీసం ఒకటి, వీలయితే రెండు అప్డేట్లు పెడతాను. అప్డేట్ పెట్టి వారం రోజులు అయితే కానీ "అప్డేట్ ప్లీజ్" అని అడగ వద్దని కోరుతున్నాను. బహుశా మీకు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు అనే అనుకుంటున్నాను.

పాఠకుల మీద రచయితల ప్రధానమైన ఫిర్యాదు, కామెంట్స్ ద్వారా ఎక్కువ మంది అభిప్రాయం తెలియచేయరని. కథ రాయటం చాలా సమయంతో కూడిన పని. ఈ కథ రాయడం కోసం నేను కొన్ని వారాలుగా కధలు చదవటమే ఆపేసా. ఉన్న కొద్ది సమయం కథ రాయడానికి ఉపయోగించా. ముఖ్యంగా ఏమి ఆశించకుండా, ఎన్నో ప్రయాసల కోర్చి, అంత సమయం వెచ్చించి రాయడం కేవలం ఆత్మ సంతృపి కోసం అనుకొంటాను. పాఠకుల అభిప్రాయం ఒక టానిక్ లా ఉత్తేజాన్నిస్తుంది. అలాగే సద్విమర్శలు ఏమైనా ఉంటె సరి చేసుకొనే అవకాశం ఉంది. కామెంట్స్ పెట్టమని పదే పదే కోరి విసిగించను. కానీ పాఠకుల కామెంట్స్ రచయితలకు గొప్ప ప్రోత్సహం అని మరోసారి చెబుతున్నాను. ముందే చెప్పినట్టు ఈ కధకు కామెంట్స్ పెట్టిన పెట్టకపోయిన నేను కథ పూర్తి చేస్తాను. కానీ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి రాయాలా వద్దా అనేది మీరిచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఆధార పడి ఉంటుంది. మీకు నచ్చితే కొంచెం సమయం తీసుకొని అభిప్రాయం తెలియ చేయండి. అలాగే విమర్శలు కూడా ఆహ్వానమే.

ఇప్పుడు మీకు అందిస్తున్న కథ చిన్నది. సంవత్సరాలపాటు నడవదు. నా ఉద్దేశ్యంలో కొన్ని నెలల్లోనే పూర్తి అవ్వాలి. మొదట కేవలం ఒక రొమాంటిక్ కధలా మాత్రమే రాద్దామనుకున్నాను. ఈ ఫోరమ్ థీమ్ ను దృష్టిలో పెట్టుకొని శృంగార కధగా మార్చాను. మరీ శృంగారం ఎక్కువ ఆశించవద్దు. అసలు మొదట కొన్ని ఎపిసోడ్స్ వరకు శృంగారమే ఉండదు. చాలా వరకు తెలుగులో వాడుక పదాలతో రాయడానికి ప్రయత్నించా. అవసరమైన చోట ఆంగ్లంలో చాలా తక్కువ సంభాషణలు ఉన్నాయి.

కాకి పిల్ల కాకికి ముద్దు. ప్రతి రచయిత ఒక మంచి కథ అందించాలనే తపనతోనే రాస్తారు. అలా అని అన్ని కధలు పాఠకులకు నచ్చాలని లేదు. నా కథ కూడా. కానీ ఒక విషయం చెప్పదలచుకున్నాను. రాసిన ప్రతి మాట, వాక్యం ఒకటికి రెండు సార్లు చదివి, తప్పులు సరి చేసి, నచ్చకపోతే మార్చి, అస్సలు నచ్చకపోతే తీసి వేసి, కంటిన్యూయిటీ దెబ్బ తినకుండా చూసుకుంటూ చాలా సమయం వెచ్చించి రాసాను. కథాంశం నచ్చకపోతే చేయ గలిగింది ఏమి లేదు. అది తప్ప వేరే ఏమైనా సరే నచ్చక పొతే వివరంగా చెప్పండి. ముందుకు వెళుతున్న కొద్ది సరిచేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నచ్చితే, ఎందుకు నచ్చిందో ఒకటి రెండు మాటలు రాయండి. నేను రాసింది గుర్తించారో లేదో తెలుస్తుంది. అంతే అదే నేను కోరేది.

చివరగా ఈ ఫోరమ్ ద్వారా చాలా మంది స్నేహితులయ్యారు. చాలా మంది ద్వారా నాకు తెలియని విషయాలు చాలా తెలుసు కొన్నాను. కొంతమంది అసలు పేర్లు కూడా తెలీదు అయినా బాగా సన్నిహితులయ్యారు. ఎంతవరకు వచ్చింది మీ కథ అంటూ అడుగుతూ ప్రోత్సహించిన వారు కొందరు. ఆ అగ్యాత స్నేహితులందిరికి, వారి ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

అష్ట ప్రయాసలకోర్చి ఈ సైట్ నిర్వహణ ద్వారా మనందరికీ ఒక ప్లాట్ ఫార్మ్ కల్పించిన సరిత్ కి (ప్రమేయం ఉన్న ఇతరులకి)  అభినందనలు తెలియ చేస్తున్నాను.

మొదటి అప్డేట్ శనివారం ఇస్తాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
పేరులో ఏముంది - by prasthanam - 28-05-2020, 11:00 AM



Users browsing this thread: 1 Guest(s)