25-05-2020, 03:01 PM
మాయ -22
ఉదయం లెక్చరర్లు అందరితోనూ వెళ్తున్న నిక్కీకి బెస్ట్ విషెస్ చెప్పి గెస్ట్ హౌస్ లో కాలు కాలిన పిల్లిలా తిరిగాడు కిరీటి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిక్కీ, శైలు పరిగెట్టుకుంటూ వచ్చి వాడిని చుట్టేశారు. ఇద్దరూ కలిసి ఒకేసారి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే నిక్కీకి రాజా గారు సహాయం చెయ్యబోతున్నారు అన్నదొక్కటే వాడికి ఆ కాకిగోలలో అర్ధమైంది.
కొంతసేపాగి వాళ్ళు సర్దుకున్నాక నిక్కీని హత్తుకొని ‘కంగ్రాట్స్’ అన్నాడు. ‘అంతా నీ వల్లే’ అంటూ అల్లుకుపోయింది వాడిని. ‘ఇంత తేలికగా పని జరుగుతుంది అని ఊహిస్తే మా కాలేజీలో పని చేసేది కూడా లేకుండా డైరెక్ట్ గా వీరిని సహాయం అడిగితే పోయేదేమో’ అన్నాడు.
‘అంత సింపుల్ గా ఏమీ ఒప్పుకోలేదు ఆయన. బోలెడు కండిషన్స్ పెట్టాడు. ఇది నిజంగానే వాళ్ళ కాలేజీలో, యునివర్సిటిలో టాప్ అవునా కాదా అని ఆయనగారి ఆడిటర్ తో చెక్ చేయిస్తారుట. చదువు పూర్తయిన తర్వాత ఆయన చెప్పిన చోట రెండేళ్ళు పని చెయ్యాలట. మీ పాత ఇంగ్లిష్ లెక్చరర్ లాగా నేను పారిపోకూడదని నా చేత మూడేళ్లకు గానూ హామీపత్రం రాయించుకున్నారు. ఈ సంవత్సరం కాలేజీ ఆడిటింగ్ చేస్తున్నారు. అందులో నేను హెల్ప్ చెయ్యాలాట. ఏదో నువ్వు రెండేళ్ళు కళ్ళముందు వుంటావు కదా అని నేను ఒప్పుకున్నాను. ఇదెందుకు ఒప్పుకుందో నాకు తెలీదు’ అని కొంచెం చిరాగ్గా చెప్పింది శైలు.
‘రెండేళ్ళు కాకపోతే మూడేళ్ళైనా ఒప్పుకునే దాన్నే. ఐనా ఆయన ఏదో నీటిపారుదల ప్రాజెక్టులో పనిచెయ్యమంటున్నారు. జనానికి పనికొచ్చే పనే కదా. ఏమీ పర్వాలేదు’ చెప్పింది నిక్కి. ‘ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. చేతనైనన్ని వాటిపైన పేర్లు రాసేసుకుందామనే కుతి’ అంటూ ఉడికిపోయింది శైలు.
కొంచెం టాపిక్ మారిస్తే మంచిది అనుకొని ‘మిగతా వాళ్ళంతా ఏరి?’ అని అడిగాడు కిరీటి. ‘వాళ్ళంతా పిక్నిక్ లో వున్నారు. నీకు విషయం చెబుదామని మేము పరిగెట్టుకొచ్చేశాము’ అంది నిక్కి. ‘నేను కాసేపు పడుకోవాలి. రాత్రి సరిగా నిద్ర పోలేదు’ అని బుగ్గలు ఎర్రబడిపోతూ చెప్పి తుర్రుమంది శైలు.
‘కిరీటీ, దా నీతో కొంచెం మాట్లాడాలి’ అని తన రూమ్ కి తీసుకెళ్లింది నిక్కి. రాత్రి శైలుతో జరిగిన దాని గురించి ఏమన్నా మాట్లాడుతుందో ఏమో ఎలారా భగవంతుడా అనుకుంటూ వెళ్ళాడు.
నిక్కీ వాడిని మంచం మీద కూర్చోబెట్టి వాడి చేతులు తన ఒళ్ళో పెట్టుకొని చెప్పటం మొదలెట్టింది. ‘నీకు ఈ విషయం ఎప్పుడోనే చెప్పాల్సింది. నా గురించి ఏమనుకుంటావో అని భయం వేసి ఎప్పటికప్పుడు వదిలేసేదాన్ని. నువ్వు కూడా నన్ను ఎప్పుడూ గుచ్చి గుచ్చి అడగలేదు ఈ టాపిక్, అందుకు థాంక్స్’ అని బలంగా ఊపిరి తీసుకొని చెప్తోంది.
‘నిన్ను ఆ రోజు సంతలో ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు వేరే అబ్బాయి అనుకున్నాను. ఆ అబ్బాయి ఎవరు అనేది ముఖ్యం కాదు. కాలేజీలో నా వెంట పడే చాలామందిలో ఒకడు. అయితే నేను అలా ఎందుకు behave చేశాను అనేది నీకు తెలియాలి. నేను ఇంక చదువు కొనసాగించలేను అనే ఒక నిజాన్ని ఒప్పుకోలేక వున్న రోజులవి. కాలేజీకి నేనెందుకు రాలేదు అని కనుక్కోవడానికి వాడొక లెటర్ రాశాడు.’
‘ఆ టైమ్ లో నేను మానసికంగా ఎంత బలహీనంగా వున్నానంటే నా కాలేజీ జీవితానికి ఉన్న ఏకైక ఆధారం వాడే అనేంతలా నా మనసు నన్ను మోసం చేసింది. వాడేదో casualగా రాసిన ఉత్తరం పట్టుకొని నేను అది అమర ప్రేమలా ఫీల్ అయిపోయాను. ఫలానా టైమ్ కి ఫలానా చోటుకి మాట్లాడుకుందాం రమ్మని ఉత్తరం రాస్తే రాకపోవడం పక్కన పెట్టు కనీసం జవాబు కూడా రాయలేదు వాడు. పిచ్చిదానిలా నిన్ను మీట్ అయిన చోట రెండు గంటలు వెయిట్ చేశాను. అదుగో అప్పుడొచ్చావు నువ్వు’ చెప్తుంటే నిక్కీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
‘ఈ సోదంతా నీకు ఎందుకు చెబుతున్నానంటే ఎమోషనల్ గా వీక్ గా వున్న అమ్మాయి మనసు ఎలా వుంటుందో నీకు తెలియాలి. ఇన్ని నెలలూ నువ్వు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చావో మాటల్లో చెప్పలేను’ అంటూ వాడిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. కిరీటి మెల్లిగా నిక్కీ కన్నీళ్ళు తుడిచాడు.
‘శైలు అంటే నీకిష్టమా’ సడన్ గా వేరే టాపిక్ లోకి వెళ్లిపోయింది నిక్కి. కిరీటికి ఎలా సమాధానం చెప్పాలో తెలీలేదు. మా ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని కూడా అడుగుతుందేమో తర్వాత ప్రశ్న అని భయపడ్డాడు. ‘మాట్లాడవేంట్రా’ అంటే ‘ఊ’ అని మటుకు అనగలిగాడు.
‘దానికి నువ్వంటే పిచ్చి. నేను పక్కన లేకపోయుంటే మీరిద్దరూ నిన్న దాటిన హద్దు ఎప్పుడో దాటేసేది’ అంది. కిరీటికి ఇదంతా వినటం చాలా ఇబ్బందిగా వుంది. ‘నిక్కీ...’ అంటూ ఏదో చెప్పబోతుంటే ‘అదే హద్దు నేను కూడా నీతో దాటితే నిన్ను నేను వేరేవాళ్లతో ఊహించను కూడా ఊహించలేను’ అంది. కిరీటికి ఏం మాట్లాడాలో తెలియలేదు.
నిక్కీ లాలనగా వాడి గడ్డం పట్టుకొని ‘నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చెప్పట్లేదురా. అది నీ కళ్ల ఎదురుగా కనీసం ఇంకొక రెండేళ్ళు వుంటుంది. నేను నీకు దాదాపు మూడేళ్లు కనిపించను. ఇప్పటిదాకా సెల్ఫిష్ గా నేను నీ ప్రేమను అనుభవించాను. Let me do something for you’ అని వాడి చెయ్యి పట్టుకొని శైలు గదికి తీసుకెళ్లింది.
గదిలోకి వెళ్తే శైలు అప్పుడే ముఖం కడుక్కుని వస్తోంది. అప్పటిదాకా ఏడ్చినట్టు ముఖం ఉబ్బరంగా వుంది. వీళ్ళను చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి కిరీటిని వాటేసుకుంది. ‘చూశావా, ఇంకెప్పుడూ దాన్ని ఏడిపించకు’ అంది నిక్కి. శైలు వాడిని వదిలేసి ‘సారీ, సారీ మీ ఇద్దరి మధ్యలోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు.....’ అంటూ నిక్కీని వాటేసుకొని వుండిపోయింది. ‘వాడంటే నీకెంత ఇష్టమో నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకున్నావా’ అని శైలు తల మీద మొట్టింది నిక్కి.
‘కోపంగా ఉందా మా మీద’ అని అడిగింది నిక్కి. ‘లేదు. కానీ అమ్మాయిలని అర్ధం చేసుకోవడం నా వల్ల కాని పని అని తెలుసుకున్నాను’ అన్నాడు కిరీటి. ముగ్గురూ కలిసి పిక్నిక్ జరిగే చోటుకి వెళ్ళి సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వచ్చారు.
రాత్రికి కిరీటి గదిలోకి మళ్ళీ ఎవరో వచ్చారు. ఈ సారి వచ్చింది నిక్కి. కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కిరీటిని లేపి ‘నీకు మధ్యాహ్నం చెప్పింది ఏదీ అర్ధం కాలేదు అని ఋజువు చేశావు. పోయి దానితో మాట్లాడు’ అని శైలు రూమ్ కి తరిమింది వాడిని. శైలు నిద్ర పోకుండా గదిలో పచార్లు చేస్తోంది. వాడు మెల్లిగా తలుపు తడితే ఉలిక్కిపడి ‘ఎవరూ’ అంది. ‘నేనే’ అన్న కిరీటి మాట విని గబగబా తలుపు తీసి వాడిని లోపలికి లాగింది.
ఇక అక్కడ మాటలు లేవు. మనసులు కలిసిన ఇద్దరు శరీరాలతో ఆ భావాలను పంచుకున్నారు రాత్రంతా. తిరిగి ఊరు చేరుకున్నాక నిక్కీ క్షేమం కోరిన అందరూ సంబరాలు చేసుకున్నారు. మరో నెల రోజుల్లో నిక్కీ వరంగల్ వెళ్లిపోయింది. వీడ్కోలు పలకడానికి పట్నంలోని రైల్వే స్టేషన్ దాకా పెద్ద గుంపుగా వెళ్లారు అందరూ.
వెళ్లిపోయే ముందు రాత్రి కిరీటిని కలిసి వాడు తన జీవితంలో ఎంత స్పెషల్ అనేది చెప్పింది నిక్కీ. స్టేషన్ కి రావద్దు ప్లీజ్ అని అడిగింది. నిన్ను చూస్తే నేను ఏడుపు ఆపుకోలేను అంది. కరెక్ట్ గా సునయన కూడా ఇలాగే అడగడం గుర్తొచ్చి గుండె ఝల్లంది కిరీటికి. ఇప్పుడు సునయన ఎక్కడుందో ఏం చేస్తోందో అనుకున్నాడు.