Thread Rating:
  • 33 Vote(s) - 2.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
గోపి .......... లోకల్ టాప్ బ్రాండ్స్ మొదలుకుని మొత్తం ఫారిన్ బ్రాండ్స్ ఉన్నాయి , నీ ఇష్టం అనిచెప్పారు .

ఫారిన్ సర్ .......... జీవితంలో ఒక్కసారైనా డ్రింక్ చెయ్యాలని ఆశ అని సిగ్గుపడుతూ చెప్పాడు .

డ్రింక్ this one 50 ఇయర్స్ ఓల్డ్ వైన్ అంటూ పెగ్స్ కలిపారు . మహేష్ రమేష్ ........ సాఫ్ట్ డ్రింక్స్ అని ఫ్రిడ్జ్ తెరిచి చూపించి వాళ్లకు కావాల్సిన ఐస్ క్యూబ్స్ తీసుకున్నారు .

పనిమనిషి మేడం వాళ్ళు పంపించిన చికెన్ ,మటన్ ......... ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకొచ్చి అందించి వెళ్లిపోతుంటే ,

అన్నా ......... సర్ ను రక్షించిన హీరో మీరు , సర్ .........

ఆ గణేష్ ........ ఎంజాయ్ అని పెగ్ అందించారు .

సర్ ...........

సర్ లేదు ఏమీ లేదు , ఈరోజు మన గెస్ట్స్ వీళ్ళు , వీళ్ళు ఏది కోరితే అది మనం తీర్చాల్సిందే అని చేతికి అందించి ఎంజాయ్ చేశారు .

వదిన మాటకు విలువిచ్చినట్లు గోపి అన్న రెండు పెగ్గులతో స్టాప్ చేసి బయటకువచ్చాము . అప్పటికే డైనింగ్ టేబుల్ పై డిన్నర్ రెడీ చేసి ఆహ్వానించడంతో సర్ వాళ్ళతోపాటు కూర్చున్నాము . 

Our బ్యూటిఫుల్ ఏంజెల్ మీ అన్నయ్య ప్రక్కనే కూర్చుని తినిపించు పాపం తినడానికి కూడా రాని బుజ్జాయి అని నవ్వుకుని మేడం వాళ్లే స్వయంగా అందరికీ వడ్డించి , mahesh చాలా గ్యాప్ వచ్చింది ఉప్పు కారం సరిపోకపోతే ........... అనేంతలో ,

అందరితోపాటు చెల్లి చేతితో తిని , మ్మ్మ్మ్మ్.....మ్మ్మ్మ్మ్........సూపర్ మేడం అని నోటిలో ఉండగానే వేళ్ళతో సైగచేసి చూపించాము .

థాంక్స్ మహేష్ అంటూ మురిసిపోయి ఆడిగిమరీ అందరికీ వడ్డించారు .

తృప్తిగా తిని సర్ మీరు చెప్పినది నిజమే మా అమ్మ గుర్తుకువచ్చింది థాంక్యూ sooooo మచ్ మేడం అని చెప్పడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు . 

తరువాత మేడం వాళ్లకు వాళ్ళు వారించినా వినకుండా చెల్లీ , వదిన , సునీత ,నా బుజ్జి గర్ల్ ఫ్రెండ్ వడ్డించారు .

తరువాత అందరమూ సర్ వాళ్ళ కాంపౌండ్ లో మాట్లాడుకుంటూ కూర్చున్నాము .

మేడం అన్నయ్యావాళ్ళు నిన్న రాత్రినే ప్లాన్ రెడీ చెయ్యడంతో బిజీ అయిపోయారు అనిచెప్పింది .

మహేష్ , రమేష్ ......... ఆఫీస్ లో ఎలాగో నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తారు , ఇంటిలోనైనా రెస్ట్ తీసుకోవచ్చుకదా  అని మేడం వాళ్ళు చెప్పారు .

థాంక్యూ sooooo మచ్ యంగ్ మ్యాన్ ........... ఆ ఐదు ప్రాజెక్టు లలో ఏ ఒక్కటి మనకు వచ్చినా మనం ట్రాక్ లో ఉండొచ్చు , ఇక మన కంపెనీని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఉద్వేగంతో చెప్పారు .

అన్నయ్యా .......... ఒకటేనా అని బుంగమూతిపెట్టి అడిగింది చెల్లి.

నువ్వు చెప్పు చెల్లీ ......... ఎన్ని కావాలో అని ఎవరికీ కనిపించకుండా సైగచేసాను .

ఐదుకు ఐదు అని సైగచేసింది .

అంతలో సమయం 10 అవ్వడంతో సర్ , మేడం వెళ్ళొస్తాము అని లేచాను .

చెల్లికి అర్థమై అవును వెళ్ళాలి అని ఆప్యాతల కౌగిలింతల తరువాత రెండు కార్లలో అపార్ట్మెంట్ చేరుకున్నాము .



 కారు దిగివచ్చి అన్నయ్యా .......... అంటూ నాచేతిని చుట్టేసి ఐదూ మనమే సాధించగలమా అని అడిగింది . ఎందుకంటే అది నా కోరిక కాదు మీ బుజ్జిపాపాయి కోరిక అని తియ్యని నవ్వుతో చెప్పింది .

అవునా చెల్లీ అని ఆనందంతో పొంగిపోయి చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , నా బుజ్జి పాపాయి తొలి కోరిక చాలా చాలా పెద్దదే కానీ దానికి తగ్గట్లు 24/7 ఇష్టంతో కృషిచేస్తాము చెల్లీ అని ఇంట్లోకి చేరి చెల్లిని సోఫాలో కూర్చోబెట్టి , తాగడానికి నీళ్లు అందించి , రూంలోకివెళ్లి చార్ట్ పెన్సిల్ తీసుకొచ్చి చెల్లి ఎదురుగా మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ ఐదుకు ఐదూ కావాలా అయితే all the best చెప్పు అని చెల్లికి పెన్సిల్ అందించాను . 

లవ్ యు అన్నయ్యా ........... మీ బుజ్జి పాపాయి తరుపున అంటూ అందమైన నవ్వుతో VVK అని సైన్ చేసింది.

చెల్లీ ............

అన్నయ్యా .......... సర్ప్రైజ్ , ఇదిగో మీ బుజ్జి పాపాయి  all the best చెప్పేసింది అని కదిలినట్లు నా చేతిని అందుకొని కడుపుపై ఉంచుకుని పరవశించిపోతోంది . 

లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ ముద్దుల వర్షం కురిపించి , నీకోసం నీ మామ ............

అన్నయ్యా ........ మామ కాదు , ఫ్రెండ్స్ లా మాట్లాడుకోండి ఎందుకనేది మీ బుజ్జిపాపాయి మీ చేతిలోకి చేరాక చెబుతాను .

సర్ప్రైజ్ ........... too గుడ్ , బుజ్జిపాప ఈరోజు నుండీ మనం ఫ్రెండ్స్ అని స్పృశించి నా బుజ్జి ఫ్రెండ్ తొలికోరికను తీర్చడమే నా లక్ష్యం గుడ్ నైట్ అమ్మ వెచ్చని కడుపులో హాయిగా నిద్రపో మనం ఉదయం కలుద్దాము అనిచెప్పి కృష్ణగాడివైపు సైగచెయ్యగానే, అమాంతం ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయాడు .



ఆనందంతో చార్ట్ సైన్ పై ప్రాణంలా ముద్దుపెట్టి , అక్కయ్యా ..........  , రూంలోకివెళుతూ రమేష్ are you there అని మెసేజ్ పంపించాను .

ALways మహేష్ .......... అంటూ వీడియో కాల్ చేసాడు . రమేష్ ......... ఒక టెండర్ కాదు ఐదుకు ఐదు ప్రాజెక్ట్స్ మనమే సాధిస్తాము అని నా ప్రాణం కంటే ఎక్కువైన ఫ్రెండ్ కు మాటిచ్చేసాను .

అయితే సాధించినట్లే యాహూ ........... అని సంతోషంతో కేకవేసి , మహేష్ నేనూ మాటిస్తున్నాను రేపటి నుండి టెండెర్స్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ నైట్స్ అపార్ట్మెంట్ కే వచ్చేస్తాను .

థాంక్యూ sooooo మచ్ రమేష్ , ఇప్పుడు మరింత ధైర్యం వచ్చింది అని సుమారు రెండు గంటలపాటు వర్క్ చేసి పడుకున్నాము .



తరువాతిరోజు నుండి తెల్లవారుఘామునే అక్కయ్యకోసం - ఇంటికి రాగానే చెల్లి కాలేజ్ కు వెళ్లేంతవరకూ నా బుజ్జి ఫ్రెండ్ తో తియ్యని సరదా ముచ్చట్లు , చెల్లి అందమైన నవ్వులు - సాయంత్రం వరకూ ఆఫీస్ - మళ్లీ ఇంటికిరాగానే నా బుజ్జి ఫ్రెండ్ కు రోజూ రెండు గిఫ్ట్స్ , టాయ్స్ అందించడం - తన కదలికలకు మరియు పెరుగుదలకు చెల్లి పరవశించిపోవడం అధిచూసి మరింత ఉత్సాహంతో అక్కయ్యను బుజ్జిపాపను తలుచుకుని రమేష్ తోపాటు అర్ధరాత్రివరకూ ఇద్దరి ఆలోచనలు , ఊహలతో మొదటి మూడువారాలపాటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం తరువాత మూడు వారాలు ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ కోసం ప్లాన్స్ , ఫైల్ రెడీ చేసి నెక్స్ట్ వారం రోజులు వాటిని అనుసంధానం చేసి కోట్ల విలువైన 3డి ప్రింటింగ్ మెషీన్ తెప్పించి 3d నమూనాలను కూడా రెడీ చేసి టెండర్ date కు వారం ముందుగానే రెడీ అయిపోవడం మేనేజర్ గారు రోజూ గమనిస్తూ అంతులేని ఆనందంతో మమ్మల్ని కౌగిలించుకుని నేరుగా చైర్మన్స్ మేడం వాళ్ళను పిలుచుకొనివచ్చి చూపించారు .



అద్భుతం మహాద్భుతం అని ఫ్రీజ్ అయిపోయినట్లు చాలాసేపు అలాచూస్తుండిపోయారు . మేనేజర్ .......... ఇలా ప్లాన్ చేస్తున్నారని అస్సలు ఊహించనేలేదు , proud of you guys అని సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకుని ఇక మనకు టెండర్ ఎలా రాదో చూద్దాము అని ఆ వారం రోజులు construct చెయ్యడానికి అయ్యే ఖర్చుని అనుభవం ఉన్న మా కంపెనీ ఆఫీసర్స్ తో కలిసి కోట్ రెడీ చేసి టాప్ సీక్రెట్ గా ఉంచాము .

టెండర్ date రానేవచ్చింది . అక్కయ్య అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని నా బుజ్జి ఫ్రెండ్ దగ్గరకు చేరుకుని విషయం చెప్పాను . 

చెల్లి నవ్వుని చూస్తేనే అర్థమైపోతోంది నా బుజ్జిఫ్రెండ్ all the best చెప్పిందని , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ప్రాణంలా తాకి వెళ్ళొస్తాను అని ముద్దుపెట్టాను .

అన్నయ్యా , రేయ్ ......... all the best అని చెరొకవైపు హత్తుకొని చెప్పారు .

లవ్ యు ......... అని అక్కయ్యను చూస్తూ చెల్లి నుదిటిపై ముద్దుపెట్టి ఆఫీస్ చేరుకుని ప్లాన్స్ , నమూనా మరియు అమౌంట్ కోట్ తోపాటు టెండర్ ఆఫీస్ కు చేరుకున్నాము.



పార్కింగ్ దగ్గర సవాళ్లు ప్రతిసవాళ్ళతో ముఖ్యన్గా భరద్వాజ్ టాప్ 5 కంపెనీల వాళ్ళ ఛాలెంజ్ లతో లోపలికివెళ్లాము . 10 గంటలలోపు టెండర్ ప్రక్రియ పూర్తవ్వడం , ఎవరి కంపెనీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధీమాతో ఉత్కంఠతల మధ్యన అదేరోజు సాయంత్రం 5 గంటలకు టెండర్ ఆఫీసర్ వచ్చి రెండు టెండర్లు మా కంపెనీనే పొందినట్లు అనౌన్స్ చేయగానే , 

నాకు నా బుజ్జిపాపాయి , అక్కయ్య గుర్తుకువచ్చి కళ్ళల్లో సంతోషమైన చెమ్మ చేరింది. చైర్మన్స్ మేనేజర్ కొంతమంది స్టాఫ్ .........నమ్మలేనట్లు షాక్ లోనుండి తేరుకుని మహేష్ రమేష్ సాధించాము అని అమాంతం పైకెత్తేసి సంబరాలు చేసుకోవడం చూసి , తట్టుకోలేక కోపంతో ఏకంగా టెండర్ ఆఫీసర్లనే తిడుతూ వెళ్లిపోయారు .

చైర్మన్స్ మేడం వాళ్లకు , మేనేజర్ ఆఫీస్ కు , నేను చెల్లికి కాల్ చేసాను .........

ఎత్తి యాహూ ............. కంగ్రాట్స్ లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అని అంతులేని ఆనందంతో విష్ చేస్తుంటే , 

చెల్లీ ............ మీరు తరువాత , ముందు నా బుల్లి బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడాలి అనిచెప్పాను .

అమ్మో ......... ఇప్పుడే ఇలా ఉంటే మీరిద్దరూ కలిశాక ఇక మా అన్నయ్య మమ్మల్ని మరిచిపోయేలా ఉన్నారురా అని కృష్ణగాడికి చెప్పి మురిసిపోతోంది .

అన్నయ్యా ........... మాట్లాడు నీ బుజ్జి ఫ్రెండ్ తోనే అని స్పీకర్ on చేసింది .

My డియర్ లవ్లీ లిటిల్ ఫ్రెండ్ .......... అనేంతలో ,

అన్నయ్యా .......... మీ ఫ్రెండ్ కు అర్థమైపోయిందిలే , సంతోషంతో లోపల డాన్స్ చేస్తున్నట్లుంది అనిచెప్పడంతో , 

ఉమ్మా ............ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులిచ్చి ఆనందంతో పొంగిపోతూ మాట్లాడుతుంటే ,

టెండర్ పొందిన వాళ్ళను పిలవడంతో మహేష్ , రమేష్ రండి అంటూ పిలవడంతో , ఫ్రెండ్ ఇక్కడ ఫినిష్ చేసుకుని నీకోసం లవ్లీ టెడ్డి బేర్ తీసుకొస్తాను ..........

అన్నయ్యా .......... వీలైనంత తొందరగా రమ్మని చెబుతోంది .

లవ్ టు .......... my ఫ్రెండ్ అని మరొకముద్దుపెట్టి , ఆఫీస్ లోపలికివెళ్లాము .



లోపల ఆఫీసర్స్ తోపాటు కలెక్టర్ గారు కూడా ఉన్నారు . చైర్మన్స్ కు కంగ్రాట్స్ చెప్పి చేతులుకలిపారు . అద్భుతాన్నే ఆవిష్కరించారు . ఇంత డిటైల్డ్ ప్లాన్ ఇప్పటివరకూ చూడలేదు . నాతోపాటు మా ఆఫీసర్స్ అందరికీ చూడగానే నచ్చేసింది అని పొగడ్తల వర్షం కురిపించారు .

థాంక్యూ sooooo మచ్ సర్ , that క్రెడిట్ గోస్ టూ our ఆర్కిటెక్ట్ రమేష్ , మహేష్ ........... ఆని పరిచయం చేసారు .

Wow soooooo యంగ్ ............

Yes సర్ .......... ఈ financial ఇయర్ లో వీళ్ళు సాధించిన థర్డ్ టెండర్ సర్ అని టెండర్ ఆఫీసర్ చెప్పడంతో , 

వెల్డన్ యంగ్ మ్యాన్ అని మమ్మల్ని అభినందించారు కలెక్టర్ గారు .

చాలా సంతోషించాము .

సర్ .......... మీకు ఇంటరెస్ట్ ఉంటే ఈ ప్లాన్ 3డి మోడల్ కూడా తయారుచేశారు మా ఆర్కిటెక్ట్స్ అని శివరాం సర్ చెప్పారు .

వెంటనే చూసేయ్యాలి పేపర్ పైనే ఇలా ఉంటే ఇక నమూనా ......... అని ఆతృతతో చెప్పడంతో ,

ఎస్క్యూస్ మీ సర్ అని మేనేజర్ గారు బయటకువెళ్లి 20 మంది స్టాఫ్ తోపాటు జాగ్రత్తగా తీసుకొచ్చి పెద్ద పెద్ద టేబుల్ పై ఉంచారు .

మేనేజర్ గారు గర్వపడుతూ వైట్ cloth వేరుచేసారు .

అంతే ఆశ్చర్యపోయి కుర్చీలలోనుండి పైకిలేచి వారికి తెలియకుండానే అడుగులు అటువైపుపడ్డాయి . 10 నిమిషాలపాటు మొత్తం చుట్టూ తిరుగుతూ పదే పదే చూసి ఫెంటాస్టిక్ యంగ్ మ్యాన్ అద్భుతాన్నే ఆవిష్కరించారు . ఇదికానీ ఇలానే నిర్మితమైతే one of the best అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవుతుంది అని సంతోషించి వెంటనే మొదలెట్టేయ్యండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను . నేను ఇక్కడ సర్వీస్ లో ఉండగానే పూర్తవ్వాలి అని చైర్మన్స్ ను కోరారు .

Sure సర్ ........... అని బదులివ్వగానే ,

ఆఫీసర్స్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేయండి సీల్ వేసి సంతకం చేసేస్తాను . కమాన్ యంగ్ మ్యాన్ మీరుకూడా కూర్చోండి అని కలెక్టర్ గారే స్వయంగా ఆహ్వానించడంతో అందరూ చాలా ఆనందించాము . 
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-05-2020, 06:08 AM



Users browsing this thread: 46 Guest(s)