17-05-2020, 06:50 AM
మాయ - 12
కిరీటి మాట పూర్తి చెయ్యకుండానే తానెంత తప్పుడు సిట్యుయేషన్ లో ఆ మాట అంటున్నాడో అర్ధం అయిపోయింది. ఒక slow motion మూవీ లాగా ఆ తర్వాతి కొద్ది సెకన్లు అతని మనోఫలకంపై అచ్చు పడిపోయాయి. నవ్వుతున్న శైలు ముఖం కొయ్యబారిపోయింది. కిరీటి భుజం మీదనుంచి ఎవర్నో చూస్తోంది శైలు. వెనకనుండి దబ్బున శబ్దం వచ్చింది. తిరిగి చూస్తే నిక్కుమాంబ వాటర్ టాంక్ పక్కన కూలబడి వున్నది. ఆమె చేతులు ఆమె నోటిని కప్పివేసి వున్నాయి. ఆమె కళ్ళల్లో ఒక హారర్ కనిపిస్తోంది.
కిరీటికి ముందు ఎవర్ని సముదాయించాలో అర్ధం కాలేదు. ఒక సెకను ఊగిసలాడి నిక్కుమాంబ వైపు పరిగెట్టాడు. ఆమె ముందు కూర్చుని ‘అక్కా, ప్లీజ్.. చాలా సారీ అక్కా... ఏదో నోటికొచ్చింది వాగేశాను. క్షమించక్కా’ అంటూ లొడలొడా వాగుతున్నాడు. శైలు పరిగెట్టుకుంటూ వచ్చి వాడ్ని లాగేసి నిక్కీని కౌగిలించుకొని ‘ఓయ్, నువ్వు అలా పక్కన నిలబడు కాసేపు. మాట్లాడకు, పో’ అంటూ కిరీటిని డాబా మీద వేరే మూలకు తరిమేసింది.
పిచ్చి పట్టిన వాడిలా డాబా మీద ఓ మూల తిరిగేస్తున్నాడు కిరీటి. నిన్న ఉత్తరంలో నిక్కీ అన్న పేరు చూశాక ఆ రోజు సంతలో తనని ముద్దెట్టుకున్న అమ్మాయి నిక్కుమాంబే అని సగం నమ్మాడు. ఇవాళ తన రియాక్షన్ చూశాక పూర్తిగా convince అయిపోయాడు. అసలు ఆ టాపిక్ ఎప్పటికీ ఎత్తద్దు అని డిసైడ్ అయి వున్నాడు. ఒక్క సునయనతో తప్ప ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు. ఇప్పుడు నోరుజారి శైలూతో చెప్పేశాడు. చూస్తే శైలు, నిక్కీ మంచి స్నేహితుల్లా వున్నారు. ఇద్దరు ఆడపిల్లలూ కలిసి ఒక మాటంటే తనని ఊళ్ళోనుంచి తన్ని తగలేస్తారు. టెన్షన్ peaks కి వెళ్లిపోతోంది మనవాడికి.
కాసేపాగి శైలు వాడ్ని రమ్మని పిలిచింది. నిక్కీ ఇంకా తల ఎత్తలేదు. At least తను ఏడవట్లేదు. ఎమౌతుందో ఏమో అనుకుంటూ భయం భయంగా వచ్చాడు వాళ్ళిద్దరి దగ్గరికీ. ‘ఏం కావాల్రా నీకు?’ అని అడిగింది శైలు. కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. వెర్రి చూపు ఒకటి చూశాడు.
కొన్ని కొన్ని విషయాల్లో తెలివైన వాడిలా అనిపించినా కొన్ని విషయాల్లో slow ఏమో వీడు అనుకుంది శైలు. ‘నిక్కీతో ఆ రోజు జరిగింది ఎవరికన్నా చెప్పావా’ అంటే తల అడ్డంగా ఊపాడు. ‘సరే, ఇకముందు కూడా ఎవరికీ చెప్పకుండా వుండాలంటే ఏం కావాలి నీకు’ అని అడిగింది శైలు.
‘నాకేమీ వద్దండి. అక్కా ప్లీజ్ ఒకసారి చూడవూ, నాకు నిన్ను నిక్కీ అని పిలుస్తారని నిన్నే తెలిసింది. ఆ రోజు ఏమైందో ఏమిటో నేను ఎవరికీ చెప్పలేదు, చెప్పను కూడా. నీకు తెలుసు కదా నేను అలా వాగే టైప్ కాదని. శైలు గారూ మీరన్నా చెప్పండి. నిన్న జరిగింది కూడా...’ అంటూ ఇంకేదో చెప్పబోయి టప్పున నోరు మూసేశాడు.
ఈ సారి తల పట్టుకోవడం శైలు వంతు అయ్యింది. వీడు అమ్మాయిల విషయంలో hopeless అని ఫిక్స్ అయిపోయింది. ఈలోపు వాడి మాట విని నిక్కీ చివాల్న తల ఎత్తి చూసింది. శైలు రియాక్షన్ చూసి ‘ఏయ్, ఏం చేశాడే నిన్న?’ అని అడిగింది. శైలు ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని ‘ఐతే వీడు పెద్ద కాసనోవా అయినా అయి వుండాలి, లేకపోతే శుద్ధ ముద్దపప్పు ఐనా అయివుండాలి. చిన్నప్పట్నుంచి చూస్తున్నావుగా, నువ్వు చెప్పు ఏ టైపో. మామ దగ్గరికి తీసుకుపోవాలా ఈ పంచాయితీ, లేకపోతే కుర్రాడ్ని వదిలేద్దామా’ అంది.
కిరీటి గుండెలు గుబగుబలాడుతున్నాయి. నిజానికి వాళ్ళ మీద వీడిదే పై చెయ్యి అని, జరిగిందేమీ బయటపెట్టొద్దని బతిమిలాడుకోవాల్సింది వాళ్ళు అని ఆలోచన రావట్లేదు. అది కనిపెట్టి శైలు వాడ్ని కాస్త బెల్లించి నోరు నొక్కేద్దామని try చేస్తోంది.
‘అక్కా’ అంటూ మళ్ళీ ఏదో చెప్పబోతుంటే ‘చంపేస్తాను ఇంకోసారి అక్కా అని పిలిచావంటే. చేసిందంతా చేసేసి అక్కా అంట. అక్కా లేదు అరటికాయ తొక్కా లేదు’ అని ఫైర్ అయ్యింది నిక్కీ. ‘అంతలా చేశాడా’ అంటూ శైలూ సాగదీస్తే ‘నువ్వు చెప్పవే నిన్న నిన్నేమి చేశాడో. తర్వాత నేను చెప్తా’ అంటూ నిక్కీ ధుమధుమలాడింది.
మొత్తానికి తను సేఫ్ అని ఒక నమ్మకం కలిగింది కిరీటికి. ఇక అక్కడ్నుంచి జారుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. ‘సరే ఇక నువ్వు వెళ్లవయ్యా’ అని శైలు అనగానే బ్రతుకు జీవుడా అని పుస్తకాలు పట్టుకొని బయల్దేరాడు.
ఇంతలోకే ‘ఆగు, ఏంటా పుస్తకం’ అంటూ వాడి చేతిలోని పుస్తకాల్ని లాగేసింది శైలు. క్లాసు పుస్తకాల మధ్యలో వాడు సునయన దగ్గర కొన్న Misdirection పుస్తకం బయటకు లాగింది. టకటకా రెండు నిమిషాల్లో ఓ పేజ్ చదివేసి ‘ఇంత ఇంటరెస్టింగ్ పుస్తకం నీకెక్కడిదోయి? ఎంత వరకూ చదివావు దీన్ని’ అని అడిగింది.
‘చదవడానికి try చేశాను కానీ నాకేమీ అర్ధం కాలేదు’ అని సిగ్గుగా చెప్పాడు కిరీటి. ‘హుమ్.. నేనొకసారి చదివి ఇవ్వచ్చా’ అని అడిగితే మొహమాటంగా తలూపాడు. ‘అంత ఇబ్బంది ఐతే వద్దులే’ అంటోంది కానీ పుస్తకం మటుకు వదలట్లేదు శైలు.
కిరీటి శుద్ధ మొద్దావతారం ఐతే కాదు. తను ఎలాంటి danger లోనూ లేనని, పైపెచ్చు వీళ్ళిద్దరూ తన భయం చూసి ఇంకా ఆడుకుంటున్నారని కొంచెం ఆలస్యంగా ఐనా పసిగట్టాడు. తన థియరీ టెస్ట్ చేద్దామని ‘ఇందాక మీరు అడిగినప్పుడు తట్టలేదు కానీ నాకు ఒకటి కావాలండి’ అన్నాడు మెల్లిగా.
‘ఆ ఏంటమ్మా, మళ్ళీ చెప్పు. ఏదో కావాలా?’ అంటూ శైలు రెచ్చిపోబోతుంటే నిక్కీ ఆపి ‘తెగేదాకా లాక్కు’ అని ఆపింది. ‘ఏం కావాల్రా కిరీటీ? పిచ్చిపిచ్చివేమీ అడక్కు. మీ నాన్నకు తెలిస్తే బాగుండదు’ అంటూ కొంచెం లాలనగా కొంచెం బెదిరింపు మిక్స్ చేసి అడిగింది.
‘నాకు ఇంగ్లిష్ నేర్పిస్తారా మీరు ఇద్దరూ? నాకు కూడా ఆ పుస్తకం చదవాలని కోరిక.’
ఊహించని ఈ కోరిక విని అవాక్కయ్యరు ఇద్దరు అమ్మాయిలు. శైలు కళ్ళల్లో ఓ వింత వెలుగు వచ్చింది. ‘అంత స్పెషల్ ఆ ఈ పుస్తకం నీకు’ అంటూ పేజీలు తిరగేస్తోంది. కిరీటీ ఖర్మ కాలి అప్పుడే పుస్తకంలోనుంచి సునయన దగ్గర తీసుకున్న కార్డ్ బయట పడింది.
ఎప్పుడూ దిండు కింద పెట్టుకుని వుంచే కార్డ్ పొరపాట్న నిన్న పుస్తకంలోనే వదిలేశాడు. గబుక్కున వంగి తీసుకునేలోపే శైలు లాగేసింది ఆ కార్డ్ ని. ‘అమ్మో అమ్మో వీడు సామాన్యుడు కాదే నిక్కీ, చూడు ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని love సింబల్స్ గీసి ఇస్తారు’ అంటూ కార్డ్ నిక్కికి ఇచ్చింది.
కిరీటికి ఇక patience చచ్చిపోయింది. ‘అక్కా, ఆ పుస్తకం, ఆ కార్డ్ లేకపోతే ఆ రోజు నైట్ నేను ఆగేవాడ్ని కాదు. ప్లీజ్, ఇలా ఇచ్చేయ్యండి’ అని మెల్లిగా, కానీ ఫర్మ్ గా అడిగాడు. ఏమనుకుందో ఏమో నిక్కీ వాడికి వెంటనే ఇచ్చేసింది కార్డ్. ‘పుస్తకం మీరు చదివి ఇవ్వండి ఫరవాలేదు’ అంటూ బయల్దేరాడు.
‘రేపు వస్తావుగా’ అని శైలు అంటే ఎందుకు అన్నట్టు చూశాడు. ‘ఇంగ్లిష్ నేర్పించమన్నావుగా, రేపట్నుంచి రా’ అని బై చెప్పింది శైలు.
‘కుర్రాడు మంచివాడో ముదురో తెలియట్లేదు’ అంది శైలు. నిక్కీ వాడు వెళ్ళిన వైపే చూస్తోంది. ‘నా మట్టుకు చాలా మంచివాడు. ఆ రోజు జరిగింది మొత్తం నా తప్పే. Senseless గా behave చేశాను. నిజంగా ఏ డామేజ్ జరక్కముందే వాడే నన్ను ఆపాడు తెలుసా’ అంది.
‘డీటైల్స్ చెప్పమ్మా’
‘నిన్న జరిగింది ఏమిటో నువ్వు చెపితే నేను నా కథ చెప్తాను’
మొత్తానికి ఒకరికి ఒకళ్లు కిరీటితో తమ అనుభవాలు పంచుకున్నారు. ‘నాకంటే నీకే ఎక్కువ చేశాడు కదే’ అని శైలు అంటే ‘ఇదేమన్నా పోటీనా. అసలే వాడి ముఖం కూడా చూడలేకపోతున్నాను. చిన్నప్పటినుంచి నా తమ్ముడితో సమానంగా చూశాను. కానీ ఆ రోజు నేను advance అయ్యింది వీడితో అని తెలిసాక ఓ పక్కన రిలీఫ్ గా వుంది. ఇంకొక పక్కన సిగ్గుతో చచ్చిపోవాలని వుంది’ అంది నిక్కీ.