16-05-2020, 04:11 AM
మాయ - 11
గోరు ఇంట్లో రాజన్న, రమణాచారి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నారు. నరసు గుమ్మం చాటున నుంచుని కళ్ళు ఒత్తుకుంటోంది. కిరీటి అక్కడికి వెళ్ళి ‘పిన్నీ, ప్రెసిడెంటు గారి మేనకోడలు ఊళ్ళో వుంది. వాళ్ళావిడ వచ్చేలోపు ఒక మూడు రోజులు అక్కని తనకి తోడుగా ఏమన్నా పంపిస్తావా?’ అని అడిగాడు.
‘అట్టాగేరా అయ్యా, ఆయమ్మికి దెబ్బ తగిల్నాదంటనే.. ఎట్లున్నాది?’
‘పెద్ద దెబ్బేమీ కాదులే పిన్నీ. ఏదో కొంచెం గీరుకుపోయింది అంతే. రక్తం చూసేసరికి అందరూ కంగారు పడ్డారు.’
‘ఆ గదిలో పరుండాది, తీస్కపో బిడ్డా’ అని లోపలికి వెళ్లబోతున్న వాడిని ఆపి ‘గోరు ఏడ వుండాడయ్యా’ అని మెల్లిగా అడిగింది.
‘రంగ దగ్గర వున్నాడు, ఏమీ పర్లేదు. వాడికి రంగ ointment కూడా ఏదో రాశాడు. రేపటికల్లా సర్దుకుంటాడు’ అని ఆమెని ఓదార్చి నిక్కుమాంబ గదిలోకి వెళ్ళాడు.
నిక్కుమాంబ ఏదో పుస్తకం చదువుకుంటోంది. కిరీటి శైలు విషయం టూకీగా చెప్పి ఒక రెండు మూడు రోజులు ఆమెకు తోడుగా వుంటుందేమో అని అడిగాడు. ‘శైలుకి దెబ్బ తగిలిందా, ఇదిగో వస్తున్నా వుండు. ఓ రెండు జతల బట్టలు తెచ్చుకోనీ’ అంటూ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లింది.
కిరీటి తన తండ్రి దగ్గరకు వెళ్దామని వెనుతిరిగాడు. ఏదో శబ్దం అయ్యి వెనక్కు చూస్తే నిక్కుమాంబ పుస్తకం కింద పడి వుంది. అనాలోచితంగా ఆ కింద పడిన పుస్తకాన్ని తీసి పైన పెడుతుంటే అందులోనుంచి ఒక ఉత్తరం బయటకు పడింది. దాన్ని తీసి పుస్తకంలో పెడుతున్న క్రమంలో అక్కడ వున్న పేరు చూసి కిరీటి గుండె దడదడలాడింది.
‘డియర్ నిక్కీ’ అంటూ ప్రారంభమయిన వుత్తరంలో మిగతా అక్షరాలేవీ వాడి కళ్ళకు ఆనలేదు. కళ్ళముందు ఏవో నక్షత్రాలు తిరుగుతున్నాయి మనవాడికి. నిక్కీ, తనకు మొదటి ముద్దు ఇచ్చిన అమ్మాయి, తనతో almost హద్దులు దాటి ముందుకు వెళ్లబోయిన అమ్మాయి… ఎవర్నైతే సునయనతో పాటు ప్రతిరోజూ కలల్లో చూస్తున్నాడో ఆ నిక్కీ తనను చిన్నప్పటినుంచీ తన తమ్ముడిలాగా చూసుకుంటున్న నిక్కుమాంబ యేనా!
ఒక trance లో వున్న వాడిలా ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. నరసు నిక్కుమాంబతో కలిసి బయటకు వచ్చి ‘అమ్మిని కాస్త పెసిడెంటు గోరి ఇంటికాడ దిగబెట్టిరా బిడ్డా’ అని పంపించింది. కిరీటి తల ఎత్తి నిక్కీ వంక చూడలేకపోతున్నాడు. ఒకటి రెండు సార్లు ఆమె ఏదో అడిగితే ఊ, ఆ తప్పితే ఏమీ సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నాడు.
ప్రెసిడెంటు గారి ఇంటికి చేరుకునే సరికి మంచి panic లో వున్నాడు. ఆ రోజు సంతలో జరిగిన విషయం అక్క దగ్గర ఎలా అవాయిడ్ చెయ్యాలో, ఒక వేళ ఆ టాపిక్ వస్తే ఏం మాట్లాడాలో తెలీక గింజుకుంటున్నాడు. నిక్కుమాంబ మళ్ళీ ఏదో అడిగింది. ఈ సారి కొంచెం తేరుకుని ‘ఆ ఏంటక్కా’ అన్నాడు.
‘నువ్వు నాతో సరిగ్గా ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నానురా! ఇందాకట్నుంచి try చేస్తున్నాను. ఒక దానికి సమాధానం చెప్పవు. అంత కోపమారా నేనంటే. నేనేమీ వాడ్ని కొట్టించాలని చెయ్యలేదురా. అయ్య తాగివస్తాడని కల్లో కూడా అనుకోలేదు’ అంటూ కళ్ళు తుడుచుకుంటోంది. దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు కిరీటి.
‘అదేమీ లేదు అక్కా ప్లీజ్’ అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. ఇంతలోనే కరెంటు షాక్ కొట్టినవాడిలా చెయ్యి వెనక్కు లాగేసుకున్నాడు. ‘పొద్దుట్నుంచీ ఓ రెండు స్పూన్లు పరమాన్నం తప్పితే ఏమీ తినలేదు. మైండ్ సరిగా పనిచెయ్యట్లేదు’ అంటూ కవర్ చేశాడు.
కిరీటి బుగ్గ మీద చెయ్యి వేసి ‘వాడికి ఎలా వుందిరా’ అని అడిగింది. ఆమె స్పర్శకి వీడికి ఏదేదో అయిపోతోంది. బలవంతాన మాట కూడగట్టుకొని ‘బానే వున్నాడు. పొద్దున నీ మీద అరిచానని బాధపడుతున్నాడు’ అన్నాడు.
‘సరే పద’ అంటూ వాడి చెయ్యి పట్టుకొని ప్రెసిడెంటు గారి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఎందుకో తలెత్తి చూస్తే డాబా మీదనుంచి శైలు తననే చూస్తోంది. లోపలికి వెళ్తే ప్రెసిడెంటు గారు నిక్కుమాంబని చూసి సంతోషించారు. ‘ఇన్నాల్లకి పనికొచ్చే పనోటి చేశావు రా’ అని కిరీటి భుజం తట్టి నిక్కుమాంబతో ‘అమ్మీ, ఈ తూరి నా వొల్ల కాలేదే ఫీజు సంగతి. నన్నొగ్గెయ్యమ్మా’ అన్నారు.
‘పెద్దయ్యా, నువ్వు లేకపోతే ఇక్కడిదాకా కూడా వచ్చేదాన్ని కాదు. అంతా అయిపోలేదులే. కొన్నాళ్లు పోతే అయ్య ఏదోవిధంగా సర్దుతానన్నాడు డబ్బులు’ అంటూ ఓదార్చి ‘ఏది శైలు, ఎక్కడ దాక్కుంది’ అంది.
‘నేనెందుకు దాక్కుంటానే, డాబా మీద బట్టలు తెద్దామని వెళ్ళాను’ అంటూ శైలు వచ్చింది.
‘ఇక నేను వెళ్తాను’ అంటే శైలూ, పెద్దాయనా కిరీటిని ఆపేసి భోజనం పెట్టి పంపించారు. వెళ్ళేటప్పుడు శైలు ‘రేపు రావోయి మర్చిపోకుండా’ అని ఆర్డర్ వేసింది. ‘మళ్ళీ ఈ ఊళ్ళో బతుకుదామనే నీ మాట కాదని? ఏరా అమ్మాయి మాట ఇన్నావుగా, కాలేజీ నుంచి ఇంటికి పోయి పుస్తకాలు ఇడిసేసి ఐదు నిమిషాల్లో ఈడుండాల రేపు’ అని బెల్లించి పంపించారు పెద్దాయన.
గోరుని చూసి వాడు బాగానే వున్నాడని కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి చేరుకున్న కిరీటి అలసటతో మొద్దు నిద్ర పోయాడు. కలల్లో ఈ సారి ముగ్గురు అమ్మాయిలు! శైలు, నిక్కీ వీడికి చెరో బుగ్గ మీద ముద్దు పెడుతుంటే సునయన దూరంనుంచి కోపంగా చూస్తోంది. ఎంత విడిపించుకుందామన్నా వీళ్ళు ఇద్దరూ వదలట్లేదు. వీడు పెనుగులాడిన కొద్దీ వాళ్ళు ఇంకా పెనవేసుకుంటున్నారు. నిమిష నిమిషానికి వాళ్ళ ఇద్దరి ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నాయి. ‘హూం’ అని సునయన వెనుతిరిగి వెళ్లిపోతుంటే గబుక్కున మెలకువ వచ్చేసింది కిరీటికి.
మరుసటి రోజు సాయంత్రం కాలేజీ నుంచి డైరెక్ట్ గా శైలు దగ్గరికి వెళ్ళాడు. ఇంటికిపోతే మళ్ళీ ఇల్లు కదలాలని అనిపించదు కాబట్టి ఈ పనేదో చూస్కొని వెళ్దామని ప్రెసిడెంటు గారింటికి వెళ్ళాడు. శైలు డాబా మీదనుంచి చెయ్యి ఊపి ‘పైకి రావోయి’ అంటూ పిలిచింది.
డాబా మీద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది. ఇంటి పెరట్లోనుంచి ఏపుగా పెరిగిన మామిడిచెట్టు కొమ్మలు కావల్సినంత నీడని ఇస్తున్నాయి. పెద్ద వాటర్ టాంక్, బట్టలారేసుకోడానికి ఓ రెండు లైన్లు తాళ్ళు కట్టి వున్నాయి. శైలు తలకి ఇంకా కట్టు కట్టుకొనే వుంది. రమణాచారి వచ్చినట్టున్నాడు ఈ సారి గాజుగుడ్డ కట్టుంది ఆమె తలకి.
‘ఇప్పుడెలా వుందండి’ అంటూ పలకరించాడు. ‘నాకు బాగానే వుంది కానీ నువ్వు చేసే పనులే ఏమీ బాలేవు’ అంటూ యాక్షన్ లోకి దిగిపోయింది శైలు.
ఊహించని ఈ దాడికి కిరీటి నివ్వెరపోయాడు. నిన్న జరిగింది ఈవిడ ఇంకా వదల్లేదు అనుకుంటూ చుట్టు పక్కల ఇళ్లేమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని ‘కొంచెం మెల్లిగా అండీ. రోడ్డున పోయే వాళ్ళు వింటే నేనేదో చేస్తున్నా అనుకుంటారు’ అన్నాడు.
‘చేసేదంతా నిన్న చేసేసి ఇప్పుడు మెల్లిగా అంట. ఎందుకురా నిన్న మా నిక్కీ ఏడుస్తోంది?’ అని గద్దించింది.
ఓహ్ ఇది దాని గురించా అని సమాధానపడి ‘అది చాలా చిన్న misunderstanding అండీ. కావాలంటే అక్కనే అడగండి’ అన్నాడు.
‘దాన్నడిగితే అది జాలి గుండేసుకొని మా వాడు ఏమీ చెయ్యలేదనే చెప్తుంది. నన్ను చేసినట్టే దాన్నీ ఏదో చేసుంటావు’ అంటూ నవ్వుతూ వాడి చేతి మీద కొట్టింది శైలు.
ఎందుకన్నాడో తెలీదు కానీ ‘నేను మీ నిక్కీని ఏమీ చెయ్యలేదండీ. తనే నన్ను ముద్దు పెట్టుకుంది’ అంటూ నోరు జారాడు. అలా నోరు జారడం కిరీటి జీవితంలో ఏమేమి మార్పులు తెచ్చిందో కథాక్రమంలో చూద్దాం.