14-05-2020, 05:03 AM
మాయ - 10
‘చాలా నీరసంగా వుంది ఏమన్నా తిన్నదా లేదా పొద్దుట్నుంచి’ అని అడిగితే ప్రెసిడెంటు గారు వ్రతం సంగతి చెప్పారు. ‘ఏ దేవుడయ్యా స్వామీ కడుపు మాడ్చుకోమని చెప్పింది? ఒరేయ్ ముందు కొంచెం glucose, అది కనిపించకపోతే పంచదార నీళ్ళో కలుపుకురా పో’ అని రమణాచారి కిరీటిని కిచెన్లోకి పంపాడు.
‘ఇందా glucose నీళ్ళు’ అంటూ మానవాడు బయటకి వచ్చేసరికి రమణాచారి ఒక్కడే వున్నాడు. ‘ఆయన వాళ్ళావిడకి telegram ఇవ్వడానికి వెళ్లాడ్రా. ఇలా వచ్చి శైలూకి ఓ స్పూన్ తో మెల్లిగా ఆ నీళ్ళు పట్టించు’ అని చెప్పాడు. ఈవిడ పేరు శైలు నా అనుకున్నాడు కిరీటి.
వాళ్ళ నాన్న శైలు తలకింద కొన్ని తలగళ్ళు పెట్టి ఎత్తు చెయ్యగా వచ్చి ఆమెకు మెల్లిగా నీళ్ళు అందించడం మొదలెట్టాడు. ఇంతలో రాజన్న విషయం గుర్తొచ్చి చెపితే రమణాచారి బాధతో తల పంకించాడు. ‘నే వెళ్ళి చూస్తాలే. అమ్మాయి కళ్ళు తెరిచేవరకు వుండి ఏమన్నా తినిపించు’ అని చెప్పి వెళ్ళాడు.
కొంతసేపటికి శైలు అటూ ఇటూ కదుల్తూ కళ్ళు తెరిచింది. ఎదురుగుండా వున్న కిరీటిని చూసి ‘ఏమైంది’ అని హీనస్వరంతో అడిగింది. ‘మీరు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారండి. ఇప్పుడు ఏమన్నా తినాలి’ అంటే ‘పరమాన్నం’ అని ఒక మాట అని మళ్ళీ కళ్ళు మూసుకుంది.
దేవుడి గది వైపు వెళ్ళి చిన్న గిన్నెలో పరమాన్నం వేసి తీసుకొచ్చాడు కిరీటి. ఈ లోగా శైలు కొంచెం సర్దుకుని కూర్చుని వుంది. ఆ కాస్త పనికే మళ్ళీ భారంగా ఊపిరి పీలుస్తోంది. గిన్నె తన చేతికి ఇచ్చేద్దామ్ అనుకున్న వాడు కాస్తా కుర్చీ ఆమె పక్కకు జరుపుకొని ‘శైలూ గారూ, ఇందా కొంచెం తినండి ఓపిక వస్తుంది’ అని ఆమె నోటికి స్పూన్ తో అందించబోయాడు.
‘ముందు నువ్వు’ అంటూ తల ఊపింది. ‘కళ్ళు తిరిగి పడిపోయింది మీరండీ. ఇంద’ అంటూ మళ్ళీ అందించబోతే మట్టి బుర్ర అన్నట్టు ఒక చూపు చూసి ‘వ్రతం’ అని ఒక మాట అని మళ్ళీ ఊపిరి ఎగబీలుస్తోంది.
ఓర్నాయనో అనుకోని తను ఒక స్పూన్ తిని ఆమెకు తినిపించడం మొదలెట్టాడు. ఆ టైమ్ లో అది ఎంగిలి స్పూన్ అన్న ధ్యాస కూడా లేదు ఇద్దరికీ. కొంచెం పరమాన్నం తిని ఇంకొంచెం glucose నీళ్ళు తాగిన తర్వాత శైలు తేరుకుంది. మాగన్నుగా ఒక కునుకు వేసి ఈసారి కొంచెం తేరుకొని alert గా కూర్చుంది. నాన్న కానీ ప్రెసిడెంటు గారు కానీ రాకపోతారా అని ముళ్ళ మీద కూర్చున్నట్టు వున్నాడు మనవాడు. ఎందుకంటే తన ఒంటి మీదకు బట్టలు ఎలా వచ్చాయి అని శైలు అడిగితే ఏం చెప్పాలో ఆ టాపిక్ ఎలా మాట్లాడాలో ఏమీ తెలియక కంగారులో వున్నాడు.
కానీ ఆ రోజు టైమ్ బాగున్నట్టు లేదు వాడికి. ‘అవునూ, ఎలా జరిగింది ఇది అసలు’ అని తనలో తానే మాట్లాడుకుంటోంది శైలు. మొత్తం సంఘటన నెమరేసుకున్న తర్వాత ఆమె ముఖం కోపంతోనో సిగ్గుతోనో ఎర్రగా కందిపోవటం గమనించాడు. ‘ప్రెసిడెంటు గారు ఎక్కడున్నారో చూసొస్తానండి’ అంటూ తప్పించుకోబోతే చెయ్యి పట్టుకొని ఆపేసింది శైలు.
‘ఏం చేశావ్, ఏం చూశావ్’ అని ఒక్క మాటతో వాడి నోటికి, కాళ్ళకి తాళం వేసేసింది. నీళ్ళు నముల్తూ అక్కడే నిలబడిపోయాడు. ‘నాంచకు, చెప్పు’ అని గద్దించింది. ఇంకా నీరసంగానే వుందేమో కోపంగా బదులు కీచుగా ఫన్నీగా వచ్చింది ఆమె వాయిస్. అనుకోకుండా ఒక నవ్వు ఎగదన్నుకొచ్చింది కిరీటికి. ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నాడు. వాడి అవస్థ చూసి శైలు కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. కాసేపట్లో ఆ నవ్వు ఆమె కళ్ళల్లో కన్నీరైంది.
కిరీటి ఆమె పక్కన మోకాళ్ళ మీద కూర్చొని ‘శైలు గారూ, నేనేమీ తప్పుగా చూడలేదండీ. ఆ టైమ్ లో ఇంక ఏమీ చెయ్యడానికి ఛాన్స్ లేదు’ అని నచ్చచెపుతున్నాడు. ‘మరి నాకు ఇక్కడ ఎందుకు మంట పుడుతోంది? పట్టుకున్నావా?’ అంటూ తన ఎద సంపద వైపు vague గా వేలు చూపించింది. గుటకలు మింగి ‘మీకు బట్టలు వేసేటప్పుడు నా గోరు గీరుకుందండి’ అన్నాడు.
‘ఇక్కడే వుండు మామ వచ్చేదాకా’ అని కూర్చోపెట్టింది. కిరీటి ముఖం పాలిపోవటం చూసి అనునయంగా బుగ్గ మీద చెయ్యి వేసి ‘నేనేమీ చెయ్యను. ఇబ్బంది పడకు. ఇప్పటిదాకా నాకు హెల్ప్ చేసినందుకు థాంక్స్ కూడా చెప్పలేదు, థాంక్స్’ అంది. ఆడవాళ్ళ చేతులు ఇంత మెత్తగా ఎలా వుంటాయి అనుకున్నాడు కిరీటి. ఆ స్పర్శతో ఆమె ఏం చెబుతోందో కూడా వినట్లేదు.
ప్రెసిడెంటు గారు ఆదరాబాదరగా పరిగెట్టుకొచ్చి వాడ్ని ఇంకా uncomfortable కాకుండా కాపాడాడు. ‘Telegram ఇచ్చేసినాను. మీ అత్త ఓ మూడ్రోజుల్లో ఈడుంటాది. ఏరా మళ్ళీ కాళ్ళకు చక్రాలు కట్టుకుపొయ్యాడా మీ బాబు’ అంటూ సుడిగాలిలా లోపలికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.
‘ఓ గంటలో మళ్ళీ వస్తాడు పెద్దాయనా. మీకు పరావాలేదంటే నేను వెళ్తానండి శైలు గారు’ అంటూ బయల్దేరబోయాడు. ‘పర్వా వుంది అంటే ఏం చేస్తావు’ అని నవ్వుతూ అడిగింది. ప్రెసిడెంటు గారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ‘నా బిడ్డతోటా నీ ఆటలు, కూకోరా’ అంటూ మళ్ళీ ఆపేశారు.
‘ఈ కుర్రాడు మంచి వాడేనా మామా’ అని అడిగితే ‘థూ, ఈ నాయాలు వట్టి గాలి నా కొడుకు. అచ్చోసిన ఆంబోతల్లే ఊరి మీద పడి తిరుగుతుంటాడు. ఈడికో ఎదవ బాచి. ఈడి బాబు ఇంకా మాయగాడు. మనకి పది ఎకరాలు బాకీ’ అంటూ మళ్ళీ నవ్వుతున్నాడు.
‘సరే ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రేపు రావోయి, నీతో మాట్లాడాలి’ అని శైలు అంటే బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు కిరీటి. ఇల్లు దాటకముందే ప్రెసిడెంటు వచ్చి వాడ్ని వాటేసుకున్నారు. ‘అది నా ముద్దుల మేనకోడల్రా. ఏతన్నా ఐతే నా పానం పోయేది. లేకుంటే మా ఇల్లాలు నా పానం తీసేసేది. ఇంటి పనిమనిషి ముసిల్దిరా, నా బిడ్డకి తోడుగా ఓ మూడ్రోలు ఎవరన్నా సూడమను మీ అయ్యని. పనిమనిషిగా కాదు, ఓ తోడు అంతే’ అని వాడ్ని భుజం తట్టి పంపారు.
ఇంటికి వెళ్తుంటే కిరీటికి గోరు అక్క గుర్తుకు వచ్చింది. ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనుంచి బయటకు వచ్చి వుంటే ఆమెకు కూడా మనశ్శాంతి కలుగుతుందేమో అడిగి చూద్దాం అని వాడి ఇంటి వైపు వెళ్ళాడు.