Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పెద్ద బాలశిక్ష
#2
అలనాడు బాలబాలికలు తప్పక నేర్చుకోవలసిన శిక్షణగా బాలశిక్ష ఉండేది. అందులోని
విషయాలని ఆకళింపు చేసుకుంటూనే కంఠతా పట్టే పద్ధతి ఓ సంప్రదాయంగా ఉండేది.

అక్షరాలని దిద్దుతూ క్రమక్రమంగా చిన్నచిన్న పదాలను నేర్చుకోవడం, పెద్ద పదాలని
తెలుసుకోవడం, నీతి సూక్తులు, నీతి కధలు, పద్యాలు, పాటలు, గణితం (లెక్కలు),
పరిసరాల పరిజ్ఞానం, భౌగోళిక అంశాలు, ... ... ఇలా అనేక అంశాల కలయికతో
బాలల శిక్షణ రూపొందించబడింది.

నేటి కాలంలో మనలో కొందరికి ఆరు ఋతువుల పేర్లే సరిగ్గా గుర్తుకి రావడం కష్టం.
ఇక అరవై తెలుగు సంవత్సరాల పేర్లని క్రమం తప్పకుండా, తడబడకుండా చెప్పగలిగేవారు
ఉంటారో - లేదో ! పంచాంగంలోని అంశాలు ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, ...

తరచి చూసుకుంటే - మనకి తెలిసిన పరిజ్ఞానము కొంతే - తెలుసుకోవలసింది ఎంతో !

బాలబాలికలకి నేడు నేర్పిస్తున్న ప్రాధమిక విద్యలో పైన ప్రస్తావించుకున్నటువంటి
అంశాలకి తగిన ప్రాముఖ్యత లేదు. ఏవైనా అంశాలని కంఠతా పట్టించినా పరీక్షల్లో
మార్కులు పొందటానికే ప్రాధాన్యత. జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడాలని తపన
చెంది అందుకు తగిన ప్రయత్నం చేయగలిగేవారు కొందరైనా ఉండాలని ఆశిద్దాం.
[+] 1 user Likes ~rp's post
Like Reply


Messages In This Thread
RE: పెద్ద బాలశిక్ష - by ~rp - 28-11-2018, 09:27 PM
RE: పెద్ద బాలశిక్ష - by Cool Boy - 21-12-2018, 11:03 AM



Users browsing this thread: 2 Guest(s)