Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కొద్దిసేపు అందరితో సంతోషంగా మాట్లాడిన తరువాత , పెద్దయ్యా .......... సాయంత్రం వరకూ బోర్ కొడుతుంది సిటీలోని ఫేమస్ ప్రదేశాలను చూసి రండి అనిచెప్పాను .

ఆ ప్రదేశాలను చూసి కలిగే ఆనందం కంటే మా దేవుడితో కాలక్షేపం వలన మరింత సంతోషం మాకు అనిబదులిచ్చారు .

అయితే అమ్మావాళ్లను అయినా పంపిస్తాను . అన్నయ్యలూ మీలో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు రెడీ అవ్వండి అనిచెప్పి పైకివెళ్లి అమ్మలూ రెడీ అవ్వండి వీడు , చెల్లీ గుడికి తీసుకెళతారు అనిచెప్పాను .

రేయ్ మామా , అన్నయ్యా .......... 

రేయ్ , చెల్లెమ్మా ....... ఇక ఏమీ మాట్లాడకండి ఇక్కడ కొద్దిగా పని ఉంది సంతోషన్గా వెళ్ళిరండి అని బ్రతిమాలి ఒప్పించి అంటీవాళ్ళతో సహా బస్ దగ్గరకు చేరుకున్నాము .

మా తల్లి మా బస్ లో ఎక్కాలి మా బస్ లో ఎక్కాలి అని అమ్మావాళ్ళు ఒకటే పట్టుపట్టారు . 

 చెల్లి ఏ బస్ ఎక్కాలో తెలియక అన్నయ్యా .........అని గుండెలపై వాలి నాకు అందరితోపాటు వెళ్లాలని ఉంది అనిచెప్పింది . నవ్వుకుని డ్రైవర్ల దగ్గరకువెళ్లి అన్నా ........... గంటకొకసారి బస్ లను ఆపి వీరిద్దరినీ ఒక్కొక్క బస్ లో మార్చి తీసుకెళ్లగలరా అని అడిగాను .

తమ్ముడూ మహేష్ .......... ఆర్డర్ వెయ్యి అని బదులివ్వడంతో థాంక్స్ చెప్పాను .

 లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ......... ఐడియా సూపర్ వెళ్ళొస్తాము అని కృష్ణగాడి గుండెలపై వాలిపోయి కార్తీక చేతినిపట్టుకొని అమ్మా అంటీవాళ్ళతోపాటు వెళ్లి ఫస్ట్ బస్ లో ఎక్కారు .

ఆ బస్ లోని అమ్మావాళ్ళంతా మా బంగారానికి మీరంటేనే ప్రాణం అని సంతోషంతో మిగతా బస్ లోని అమ్మలను ఎగతాలిచేస్తూ కేకలు వేస్తుంటే , 

చెల్లి నవ్వుకుని మీలోమీకు పోటీనా అని ఆపి మిగతా బస్ లోని అమ్మావాళ్లకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మొదటగా బిర్లామందిర్ వెళ్ళండి అన్నా అని కృష్ణగాడు చెప్పాడు .

రైట్ తమ్ముడూ కృష్ణ .........అని పోనిచ్చారు .

అన్నా నా పేరు ....... మీకు .........

మీ ఊరివాళ్ళంతా బస్ ఎక్కిన దగ్గరనుండి మీ గురించే మాట్లాడుతూనే ఉన్నారు హైద్రాబాద్ వచ్చేన్తవరకూ ..........అని నవ్వుతూ సమాధానమిచ్చాడు .

కృష్ణగాడు మురిసిపోయి వెళ్లి చెల్లి ప్రక్కనే కూర్చున్నాడు .



కృష్ణా ........... మా తల్లి బస్ లో ఉండబోయేది గంటసేపే అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది . నువ్వు రోజూ ప్రక్కనే ఉంటావుకదా ......... ఈ గంటసేపు మాకు వదిలెయ్యి అని ముసిముసినవ్వులు నవ్వుతూ కోరారు .

చెల్లి నవ్వుకుని వెల్లనా ........ అని అడిగి , సరే అనడంతో , బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి వెనుకకు వెళ్ళింది .

అంతే అమ్మావాళ్ళంతా తమ తమ బ్యాగులలో నుండి స్వీట్స్ తీసి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ అని చెల్లిముందు ఉంచారు . మా ప్రాణమైన మీకోసం ఇష్టంతో ఇంట్లోనే చేసాము అని అన్నిరకాల స్వీట్స్ ముందు ఉంచారు .

చెల్లి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు soooooo మచ్ అమ్మలూ ........... అందరి అమ్మల స్వీట్ రుచి చూడాలి కాబట్టి కొద్దికొద్దిగా తింటాను అనిచెప్పి తినింది .

కృష్ణ నీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అని విష్ చేసి వాడితోపాటు అమ్మా , మేడం , అంటీ వాళ్లకు అందించారు .

మొదటి గంటసేపు అమ్మావాళ్ళతో కబుర్లు , ముచ్చట్లతో ఆపకుండా నవ్వుతూనే క్షణంలో గడిచిపోయినట్లు బస్ ఆగింది . అయ్యో అప్పుడే గంట అయిపోయిందా అని అమ్మవాళ్ళు బాధపడుతుంటే ,

అవును అమ్మలూ ......... కానీ ఇప్పుడే పంపాల్సిన అవసరం లేదు బిర్లామందిర్ చేరుకున్నాము . దర్శనం చేసుకునివచ్చాక ఇక తప్పదు అని బదులిచ్చాడు .



అందరూ చెల్లిని మధ్యలో ఉంచుకుని దిగారు . 

మిగతా బస్ లోని అమ్మావాళ్ళు మీకు అలా కలిసొచ్చింది అని అసూయతో వాళ్లవైపు చూస్తోంటే , వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ బిర్లామందిర్ దర్శించుకున్నారు .

తల్లీ ........ మాలానే అంతసేపు ప్రార్థించావు ఏమి కోరిక కోరుకున్నావు అని అడిగారు.

అమ్మలూ మీ మనసులోనిదే , మీరు భక్తితో కోరుకున్నదే .......... మా వాసంతి అక్కయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అతి త్వరలోనే అన్నయ్యకు కనిపించాలని , ఇద్దరూ కలిసి మనఊరిలో అడుగుపెట్టాలి అనిచెప్పింది .

అందరి కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి చుట్టేసి హత్తుకొని ప్రక్కనే ఉన్నవాళ్లు నుదుటిపై ముద్దుపెట్టి పరవశించిపోయి మళ్లీ మొదటి బస్ లోనే ఎక్కించబోతుంటే ,



అంతేలేదు ......... ఏదో ఉద్వేగంతో మళ్లీ ఎక్కించుకోవాలని భలే ప్లాన్ వేశారు . ఇక్కడ చూడండి అని వాళ్ళవైపు చూస్తే అప్పటికే అమ్మావాళ్ళు , మేడం వాళ్ళు , కృష్ణగాడిని ఈ గ్యాప్ లో హైజాక్ చేసేసారు .

చెల్లి నవ్వుని ఆపుకొని అమ్మలూ .......... మాటంటే మాటే , లేకపోతే అన్నయ్యకు మాటోస్తుంది అని ఇద్దరు ముగ్గురు అమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి రెండవ బస్ దగ్గరకు వెళ్ళింది . 

ఇప్పుడు మా టైం అని మొదటి బస్ మరియు వెనుక బస్ లను వెక్కిరించి చెల్లినీ అమ్మావాళ్లను ఎక్కించుకుని , same మాటలు కృష్ణగాడికి అని అందరూ అమ్మలూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తీశారు . 

అంటే వెనుక బస్ లోని అమ్మావాళ్ళు కూడా స్వీట్స్ అని కొద్దికొద్దిగా టేస్ట్ చేసింది .

తల్లీ బాలేవా ..........

చాలా రుచిగా ఉన్నాయమ్మా ......... కానీ మొదటి బస్ లోనే బాగా తినేసాము మరియు నెక్స్ట్ బస్ లలో కూడా తినిపించడానికి అమ్మావాళ్ళు రెడీగా ఉన్నారు అందుకే ,

అంటే వాళ్లకోసం ......... మేము అలిగాము , బుంగమూతిపెట్టుకున్నాము . మా వాసంతి తల్లి సేవ చేసుకునే భాగ్యం మాకు ఎలాగో లేదు . మా మహేష్ రెండో ప్రాణమైన మా బంగారు తల్లినైనా సేవించుకుందాము అంటే ...........



లవ్ యు లవ్ యు అమ్మా ......... తింటానులే అని సగం లడ్డూ తినేసి మరొక అమ్మ స్వీట్ అందుకోబోతుంటే చాలులే తల్లీ .......... , వెనుక ఉన్న బస్ వాళ్ళు కూడా మా అక్కాచెల్లెల్లే కదా తినకపోతే బాధపడతారు . అన్నీ మీకోసమే రోజూ తినండి అని చల్లగా ఉండు తల్లీ అని దీవించారు .

లవ్ యు అమ్మా ......... అని ఒక అమ్మ గుండెలపై వాలిపోయి నెక్స్ట్ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం విహారయాత్ర సందర్శించి మరొక బస్ ఎక్కారు .



ట్యాంక్ బండ్ దగ్గరలోని ముఖ్యమైన ప్రదేశాలను వీక్షించి మధ్యాహ్నం రెండు గంటలకు ఒక పార్క్ లో ఊరి నుండి తీసుకొచ్చిన భోజనం తినేసి , అక్కడ చెల్లి మరొక బస్ లో గోల్కొండ ఫోర్ట్ చేరుకుని రెండు గంటలపాటు మొత్తం వీక్షించి , అటునుండి మరొక బస్ లో చార్మినార్ దర్శించి 6 గంటలకు చివరి బస్ లో అమ్మావాళ్ళు ప్రేమతో విషెస్ తెలిపి అందించిన స్వీట్స్ తినేసి 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు .

బస్ లోనుండే విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇల్లు మరియు కాంపౌండ్ ను చూసి ఆశ్చర్యపోయి కిందకు దిగి లోపలికివచ్చి decoration చూసి సంతోషమైన షాక్ లో కన్నార్పకుండా అలా గేట్ దగ్గరే నిలబడిపోయారు .

అక్కా , చెల్లీ ......... మేముకూడా చూడాలికదా అని ముందుకు తోసి లోపలికి వస్తున్న అమ్మావాళ్లను చూసి వారి భర్తలు నవ్వుకుని , శ్రీమతి గార్లూ.......... మన దేవుడే సృష్టించాడు . మేమంతా చిన్న చిన్న సహాయం చేసాము తెలుసా అని గర్వపడుతూ చెప్పి పొంగిపోయారు .



స్టేజి స్క్రీన్ పై " పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ - కృష్ణ " అని రాసి స్టేజీపై step wise కేక్ పూలతో లైటింగ్స్ తో అద్భుతంగా arrange చేసి ఉండటం , అందరమూ చప్పట్లతో విషెస్ తెలుపుతూ ఆహ్వానిస్తుండటం చూసి ఇద్దరూ పరవశించిపోయు అన్నయ్యా ......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది . మరొకవైపు బిరియానీ ఘుమఘుమలు పిచ్చెక్కిస్తున్నాయి 

రేయ్ , చెల్లెమ్మా .......... పైకి వెళ్లి రెడీ అయ్యిరండి . మీకోసం అక్కయ్యను తలుచుకుని బెడ్ పై గిఫ్ట్స్ కొన్నాను అనిచెప్పాను .

Wow .......... అని సంతోషంతో మరింత గట్టిగా హత్తుకొని పొంగిపోయింది .

అమ్మలూ ......... మీరుకూడా వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి అనిచెప్పడంతో , అంటీ ఇంటిలో ఉన్న అన్ని బాత్రూములలోకి దారించి చూపించారు .



అన్నయ్యా ......... వెంటనే వచ్చేస్తాము . కొత్త డ్రెస్ సూపర్ అని చెప్పి పైకివెళ్లారు .

బెడ్ పై from వాసంతి అక్కయ్య అని ఉన్న గిఫ్ట్ ఓపెన్ చేసి చెల్లికోసం పింక్ లెహంగా, చైన్ రంగులు గాజులు పట్టీలు, కృష్ణగాడికి కొత్త బట్టలు చూసి సంతోషంతో లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అని పేరుని గుండెలపై హత్తుకొని ఫ్రెష్ అయ్యి ఒకరిచేతులను మరొకరు పట్టుకుని కిందకువచ్చారు .

ఇద్దరినీ చూడటానికి రెండుకళ్ళూ సరిపోవడం లేదు . బ్యూటిఫుల్ లవ్లీ సూపర్ ........ అంటూ అప్పటికే వచ్చిన అమ్మావాళ్ళు సంతోషించి దిష్టి తీశారు . 

అన్నయ్యా .......... అక్కయ్య గిఫ్ట్ హృదయాన్ని పరవశింపజేసింది లవ్ యు soooo మచ్ అని మురుసిపోతోంది .

చెల్లీ , రేయ్ ......... అందరూ ఎదురుచూస్తున్నారు వెళ్లి కేక్ కట్ చెయ్యండి అనిచెప్పాను .



అన్నయ్యా ......... మీరుకూడా రండి అని చేతిని అందుకుంది .

అమ్మలూ , మేడం ......... అని చెల్లిచేతిని అందించాను .

అమ్మావాళ్ళు స్వయంగా స్టేజీపైకి తీసుకెళ్లి ప్రాణంలా ముద్దులుపెట్టి ఇద్దరితో కేక్ కట్ చేయించగానే , వారిపై పూల వర్షం , ఆకాశంలో క్రేకర్స్ , బయట బాణాసంచా , అందరమూ చప్పట్లతో birthday విషెస్ తెలిపాము .

అమ్మావాళ్ళు చెల్లి బుగ్గలపై , చెల్లి వాళ్ళ బుగ్గలపై క్రీమ్ పూసుకుని ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోయాను . కార్తీకతోపాటు చాలా మంది ఆ సంబరాన్ని తమ ఫోన్లలో బంధిస్తున్నారు .

చెల్లి కేక్ తీసుకుని మొదట నాకు తినిపించడానికి వస్తుంటే , నేనే వెళ్లి అమ్మావాళ్లకు మేడం వాళ్లకు తినిపించేలా చేసాను . అమ్మావాళ్ళ నుండి కింద ఉన్న అమ్మావాళ్ళు ఊరిజనం వెళ్లి విషెస్ తెలిపి బస్ లో ఉంచిన గిఫ్ట్స్ ఫ్యామిలీతోపాటు వచ్చి అందించారు . ఆ గిఫ్ట్ లతో ఒక రూమ్ మొత్తం నిండిపోయేలా ఉంది . 



ఆవెంటనే dj లైట్స్ తో సౌండ్ రాగానే కృష్ణగాడు చెల్లిచేతిని అందుకొని అందరి మధ్యలోకివచ్చి డాన్స్ మొదలెట్టాడు . చుట్టూ వాళ్లకు తెలియకుండానే ఉత్సాహం వచ్చేసి సిగ్గుపడుతున్న అమ్మావాళ్ళ మరియు వాళ్ళ పిల్లల చేతులు అందుకొని జీవితంలో తొలిసారి డాన్స్ చేస్తూ మరింత సిగ్గుతో , తమ ప్రక్కనే అక్కా చెల్లెళ్ళు కూడా డాన్స్ చేస్తుండటం చూసి నవ్వుకుని ఎంజాయ్ చేశారు . 

అంకుల్ వాళ్ళు అమ్మా , అంటీ చేతులను అందుకొని ప్రేమతో ముద్దులుపెట్టి డాన్స్ చెయ్యడం , విశ్వ సర్ ను కూడా పిలవడంతో మేడం చేతిని అందుకొని అలా అలా ప్రతి ఒక్కరూ డాన్స్ ఎంజాయ్ చేశారు . 



పెద్దయ్యా , అన్నయ్యతోపాటు చప్పట్లు కొడుతూ చూసి ఎంజాయ్ చేస్తుంటే , జైలర్ అమ్మ వచ్చి నాన్నా మహేష్ నాకు కూడా డాన్స్ చెయ్యాలని ఉంది అని చెయ్యి చెప్పడంతో , 

Love to అమ్మా ........ అని చేతిపై తియ్యని ముద్దుపెట్టి , చెల్లిదగ్గరకు పిలుచుకొనివెళ్లి , అమ్మను చుట్లు తిప్పుతూ డాన్స్ చేయించడం చూసి లవ్ యు అన్నయ్యా ......... అమ్మా లవ్లీ డాన్స్ అని అమ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ కృష్ణగాడి చేతులను అందుకొని dj లైటింగ్ dj మ్యూజిక్ తగ్గట్లు తనివితీరేంతవరకూ డాన్స్ చేసి డిన్నర్ హైద్రాబాద్ బిరియానీ చికెన్ ఐటమ్స్ కుమ్మేసారు .

అర్ధరాత్రివరకూ సంబరాలలో మునిగితేలి , నాన్నా మహేష్ నా బంగారు తల్లి ఆనందం చూసి ఈ హృదయం పులకించిపోయింది అని అమ్మా , మేడం వాళ్ళు అంతులేని ఆనందంతో ఈరోజును మా జీవితాంతం గుర్తుంచుకుంటాము ఫ్లైట్ సమయం అవుతోంది వెళ్ళొస్తాము అనిచెప్పగానే , 

చెల్లీ కళ్ళల్లో నీళ్లతో అమ్మను , మేడం చేతులనూ గట్టిగా చుట్టేసింది .

ఇలా బాధపడతావనే తల్లీ అర్ధరాత్రి తరువాత ఫ్లైట్ బుక్ చేసాము . నీ పుట్టినరోజు నాడు కన్నీళ్లు తెప్పించలేదు అని గుండెలపై హత్తుకొని , ఎక్కడకు వెళుతున్నాము . ఒక్క కాల్ చేస్తే గంటల్లో నీముందు వాలిపోమూ.......... అయినా మేము వెళ్ళిపోయాక నీ అన్నయ్యా , ప్రియుడి ప్రేమలో మెమసలు గుర్తుకే రాము అని అందరితోపాటు చెల్లికూడా నవ్వడంతో ,

అయితే నిజమే చెల్లీ మనం గుర్తుకు కూడా రాము అని చెల్లి నుదిటిపై ముద్దులుపెట్టి వెళ్ళొస్తాము తల్లీ అని కౌగిలించుకున్నారు .

చెల్లి లోపలికివెళ్లి రెండు గిఫ్ట్స్ తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అందించి ముద్దులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోయింది .

మహేష్ .......... ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యమని విశ్వ సర్ కౌగిలించుకుని క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోయారు . 



తరువాత చాలా ఉద్వేగాల మధ్య సునీతమ్మ , చెల్లి అత్తయ్య , అమ్మావాళ్ళంతా చెల్లిని కౌగిలించున్నారు .

పెద్దయ్యా , అంకుల్ , అన్నయ్యా , ఊరిజనమంతా ......... మహేష్ ఇంత సంతోషాన్ని మళ్లీ 9 సంవత్సరాల తరువాత రుచి చూసాము అని ఆనందంతో చెప్పారు .

అంకుల్ వాళ్ళు , అమ్మా అంటీ సంతోషాలతో విడిపోయి ఊరికి పయనమయ్యారు .

ట్రాక్టర్లలో వెళ్లే అన్నయ్యలకు జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వీడ్కోలు పలికాము .

వాళ్ళు వెళ్ళిపోయాక చెల్లి మామూలుస్థితికి రావడానికి గంట పైనే పట్టింది .

రేయ్ మామా పైకి తీసుకెళ్లు అనిచెప్పి , అంకుల్ తోపాటు వెళ్లి క్యాటరింగ్ వాళ్లకు ఆడిగినమొత్తాన్నీ సంతోషంతో పే చేసి పంపించాము .



అన్నయ్యా , రేయ్ మామా ......... అంటూ చెరొకవైపు హత్తుకొని ఒక్కమాట లవ్ యు sooooooo మచ్ అని మాటల్లో వర్ణించలేని ఆనందంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టేశారు .

కరెక్ట్ సమయానికి కార్తీక ఫోటోతీసి dad mom .......... చూడండి అన్నయ్య ఎలా సిగ్గుపడుతున్నాడోనని చూపించి నవ్వుతున్నారు .

ఏదీ ఏదీ కార్తీక నాకు చూపించు అని చూసి సంతోషంతో నవ్వుతోంటే , అక్కయ్య ఆనందమే కనిపించి అలా చూస్తుండిపోయాను .

కృష్ణగాడు వెళ్లి గేట్ కు తాళం వేసి , అంకుల్ అంటీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి మేము శుభ్రం చేసేస్తాము అనిచెప్పాడు .

గుడ్ నైట్ బాయ్స్ , కృష్ణ అనిచెప్పి అంటీ కార్తీకతోపాటు లోపలికి వెళుతోంటే , ముందుకువెళ్లి అమాంతం అంకుల్ ను కౌగిలించుకుని థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ , ఈ సెలబ్రేషన్ మీరు లేకపోయుంటే లేదు అని ఉద్వేగంతో చెప్పాను .

మహేష్ ఏంటిది మీరు నా బిడ్డలు ......... అంటే మీరు మమ్మల్ని పరాయివాళ్ళలా చూస్తున్నారు కదూ ........ శ్రీమతి గారూ నేను హార్ట్ అయ్యాను . 

బాగా హార్ట్ అయ్యారు పాపం అని అంటీ , కార్తీక నవ్వడంతో ........

నాతోపాటు అంకుల్ కూడా నవ్వేశారు .

అంకుల్ లవ్ యు ..........  



ఇప్పుడు నేను హ్యాపీ అని పరక తీసుకుని శుభ్రం చెయ్యడం మొదలెట్టారు .

అంకుల్ .........

మళ్లీ ........

లేదు లేదు అని అందరమూ కలిసి కొన్ని నిమిషాల్లో మొత్తం శుభ్రం చేసి డస్ట్ బిన్స్ నింపేసి finshed అంటూ చేతులెత్తి కొట్టుకుని గుడ్ నైట్ చెప్పుకుని , బాబు మహేష్ ఉదయం వరకూ ఈ లైటింగ్స్ అలాగే ఉండనీ ......... మన కృష్ణ - కృష్ణ ల సంతోషం లాగా వెలిగిపోతూనే ఉండాలి అనిచెప్పారు .

అలాగే అంకుల్ అని చెల్లీ కృష్ణగాడి చేతులను అందుకొని ఇల్లుమొత్తం పడేలా చివరి సెల్ఫీ తీసుకుని పైకి నడిచాము . 



అన్నయ్యా ......... అక్కయ్య పుట్టినరోజును దీనికి 100 రెట్లుగా సెలబ్రేట్ చేసుకోవాలి మనం అని చెల్లి మాట్లాడుతోంటే ,

అప్పుడు గుర్తొచ్చాయి అంటీ చెప్పిన మాటలు " ఏది జరిగినా అంతా మన మంచికేనని " నిజమే చెల్లిచెప్పినట్లుగా సంబరం జరుపుకోవాలంటే చాలా డబ్బులు అవసరం . అక్కయ్యను నేలమీద పాదం ఉంచకుండా ప్రాణంలా చూసుకోవాలంటే హృదయాంలో అంతులేని ప్రేమతోపాటు జేబులో డబ్బుకూడా ఉండాలి . Yes yes ............ అక్కయ్యను చేరుకునేలోపు అక్కయ్య కోరిక ప్రకారం గొప్పస్తాయికి చేరుకోవాలి . అక్కయ్యను ........ సునీతక్కయ్యకు ఒక బాబు కాబట్టి అక్కయ్యకు కూడా పిల్లలు ఉంటారు వారిని కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను .

అన్నయ్యా , అన్నయ్యా ........ అక్కయ్య గురించి మాట్లాడుతోంటే ఏమిటి ఆలోచిస్తున్నారు , ఎవరి గురించి ఆలోచిస్తున్నారు .

మన అక్కయ్య గురించే చెల్లీ ......... అని గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణం లా ముద్దుపెట్టి , మీ అక్కయ్య పుట్టినరోజు నువ్వు కోరినట్లుగా జరపాలంటే మన అక్కయ్య కోరినట్లుగా మనం చాలా సాధించాలి చెల్లీ .......... 

అలాగే అన్నయ్యా ............ మన అక్కయ్య గర్వపడేలా కష్టపడదాము అని ఇంట్లోకివెళ్లి ముగ్గురమూ సంతోషంతో హత్తుకొని గుడ్ నైట్ చెప్పేసి చెల్లీ రేపు ఆదివారం మధ్యాహ్నం వరకూ లేచేది లేదు మీ అక్కయ్యకోసం సాయంత్రం వెళదాము అనిచెప్పాను .

సరే అన్నయ్యా ......... గుడ్ నైట్ అని చెబుతుండగానే వాడు అమాంతం ఎత్తుకుని బుగ్గపై ముద్దుపెడుతూ బెడ్రూం లోకి వెళ్ళిపోయాడు .

రేయ్ ........ కాస్త ఆగు అక్కయ్య డ్రెస్ నలిగిపోతుంది అని దిగి వాడిని అటువైపు తిరగమనిచెప్పి నైట్ డ్రెస్ లోకి మారిపోయి , డ్రెస్ ను జాగ్రత్తగా మడిచేసి వాడి గుండెలపై వాలిపోయింది .

లవ్ యు both అని కూలర్ on చేసుకుని అక్కయ్యల ఫోటో అందుకొని బెడ్ పై వాలిపోయి అక్కతో మాట్లాడుతూ మా మధ్య జరిగిన చిలిపి సంఘటనలను గుర్తుచేసుకుంటూ తియ్యని జలదరింపులతో పెదాలపై చిరునవ్వుతో ఫోటోని గుండెలపై ఉంచుకుని హాయిగా నిద్రలోకిజారుకున్నాను.



తరువాతి రోజు నేను లేచేసరికి 12 గంటలు అయ్యింది . చెల్లి నా ప్రక్కనే కూర్చుని నా కురులను స్పృశిస్తూ చదువుతోంది .

గుడ్ మార్నింగ్ .......... కాదు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్యా అని , అన్నయ్యా ......... కాఫీ వేడిచేసుకొస్తాను అని లేచి వంట గదిలోకివెళ్లింది .

ఒళ్ళు విరుస్తూ లేచి కూర్చున్నాను . ఎదురుగా కార్తీక ముసిముసినవ్వులతో అన్నయ్యా ........ గుడ్ mor........ కాదు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పింది .

కార్తీక మీ అక్కయ్య ఎప్పుడు లేచింది అని కళ్ళు నలుపుకుంటూ అడిగాను .



ఉదయం 6 గంటలకే .........

కార్తీక ......... అంటూ ఆపడానికి బయటకువచ్చింది .

అంతలోపే , అక్కయ్య 6 గంటలకే లేచి రోజూలానే అక్కయ్యకోసం వెళ్లి 9 గంటలకు వచ్చారు ఇద్దరూ , మీకోసం టిఫిన్ కూడా చెయ్యకుండా చదువుకుంటూ మిమ్మల్ని జోకొడుతున్నారు మీరేమో బుజ్జిపిల్లాడిలా హాయిగా నిద్రపోతున్నారు .

అన్నయ్యా .......... అక్కడ రెండు ఊళ్లకు మీరు బుజ్జి దేవుడు అంట కదా ........ అని సంతోషంతో నవ్వుతోంది .

అవును కార్తీక .......... అక్కయ్యతో ఉంటేనే నాకు ఆ స్థానం లేకపోతే సున్నా ........ , నా జీవితమే వ్యర్థం అని బాధపడుతోంటే , 

చెల్లి పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని తన గుండెలపై హత్తుకుంది .

అక్కయ్యా ......... నావల్లనే అని కార్తీక కళ్ళల్లో నీళ్ళు చూసి , వెంటనే నా కన్నీళ్లను తుడుచుకుని , చెల్లెమ్మా కాఫీ అని అడిగాను .

కార్తీక కన్నీళ్లను తుడిచి తలపై ప్రేమతో ముద్దుపెట్టి , కార్తీక మీ అన్నయ్యకు నీచేతులతోనే అందివ్వు అని కాఫీ ఇచ్చింది . 

అన్నయ్యా .......... అని బాధపడుతూనే అందించింది .

లవ్ యు కార్తీక , అక్కయ్య గురించి ఆలోచన వస్తేనే ఎమోషనల్ అయిపోతాను నీకు తెలుసుకదా అని నవ్వించి చదువుకోమని చెప్పి , కాఫీ తాగుతూ బయటకువచ్చాను.



కృష్ణగాడు , గోపి అన్న decoration మొత్తం వేరుచేసి రెంట్ కు తీసుకున్నవాటిని వెహికల్లోకి చేరుస్తున్నారు . కాఫీ తాగేసి నేనూ ఒకచెయ్యి వెయ్యబోతే , 

మహేష్ .......... మేము చూసుకుంటాము నువ్వు ఫ్రెష్ అవ్వు అనిచెప్పారు .

అవునురా మామా ......... అని కృష్ణగాడూ చెప్పాడు .

గోపి అన్నా ......... నిన్న రాలేదు .........

Sorry తమ్ముడూ ....... ఉదయం పనిమీద కరీంనగర్ వెళ్ళానా , వెహికల్ హ్యాండ్ ఇచ్చేసింది . ఇక్కడేమో మీ వదిన పిల్లలు రెడీ కూడా అయిపోయారు అని బాధతో చెప్పాడు .

సరే అన్నా ........ త్వరలో మళ్లీ కలుద్దాము అయితే అని వెహికల్లోకి షిఫ్ట్ చేసి రేయ్ అక్కడ దించేసి డబ్బు ఇచ్చెయ్ అనిచెప్పాను . వాడు వెహికల్ వెనుకే బుల్లెట్ లో వెళ్ళాడు . 

పైకివచ్చి ఫ్రెష్ అయ్యి , లవ్ యు soooo మచ్ చెల్లీ .......... మీ అక్కయ్య ఎక్కడా కనిపించలేదు కదూ ........ ఎందుకో మన అమ్మవారు మనకు కఠిన పరీక్షలు పెడుతున్నారు అని బెడ్ పై కూర్చుని ఆల్బమ్ తిరగేస్తున్నాను.

ఏమి బాదులివ్వాలో తెలియక చెల్లి మౌనంగా ఉండిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-05-2020, 05:24 AM



Users browsing this thread: 187 Guest(s)