30-04-2020, 07:41 AM
మాయ - 3
Coins తోనూ, పేకముక్కలతోనూ చిన్న చిన్న ట్రిక్స్ చేసి చూపించింది ఆ అమ్మాయి. ‘ఎలా వున్నాయి?’ అని నవ్వుతూ అడిగింది. బాగానే వున్నాయి అని మొహమాటానికి చెప్పబోయి కిరీటి ఎందుకో ఆగిపోయాడు. ‘మీరేమీ అనుకోనంటే, అంత ఇంప్రెసివ్ గా అయితే ఏమీ లేవండి’ అన్నాడు మెల్లిగా.
తనేమన్నా అనుకుంటుందేమో అని apprehensiveగా తననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి మటుకు అలా ఏమీ అనుకోకుండా కొంత తీక్షణంగా ఆలోచించి కిరీటి వంక చూసి ‘అయితే ఇదుగో మీకోసం ఒక నిజమైన మ్యాజిక్ ట్రిక్. A serious trick for a serious man’ అంది. కిరీటికి బుర్ర తిరిగిపోయింది. ఆ రోజుల్లో పెంచలాపురంలాంటి పల్లెటూళ్ళో అమ్మాయిలు చదువుకోవడమే ఒక గొప్ప విషయం. అలాంటిది ఈ అమ్మాయి ఇంగ్లిష్ ఇంత అలవోకగా మాట్లాడేసరికి stun అయిపోయాడు. దానితోపాటు ఇప్పుడు చేయబోయే సీరియస్ ట్రిక్ ఏమై వుంటుందా అని చూస్తున్నాడు.
ఆ అమ్మాయి చేతిలో మళ్ళీ పేకముక్కల deck వున్నది. దానిని చాలా వాటంగా shuffle చేసి బల్లపై పెట్టింది. కిరీటి కళ్ళల్లోకి చూస్తూ ‘ఈ deck లో ఒక చిన్న లోపం వుంది. అదేమిటో చూసి నాకు చెప్పు. నీకెంత టైమ్ కావాలంటే అంతా టైమ్ తీసుకో’ అని తన కుర్చీలో జారగిలబడి కూర్చుంది. ఆ అంగట్లో కిరీటి కూర్చోడానికి వేరే కుర్చీ లేదు. నిలబడే ఆ పేక ముక్కల్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. ముందు ముక్కల్ని లెక్కపెట్టాడు. 53 ముక్కలు వున్నాయి అందులో. 52 ముక్కలు కాక ఒక జోకర్ కూడా వున్నదని తోచింది కిరీటికి. ఇక వెనక్కు తిప్పి ముక్కల్ని తేరిపార చూస్తే ఆఠీన్ రాణి ముక్కలో కొన్ని హార్ట్ సింబల్స్ మిస్ అయ్యాయి.
ఆ ముక్కని ఆ అమ్మాయి ముందు పెట్టి ‘ఈ ముక్కలో సింబల్స్ సరిగా లేవు’ అని చెప్పాడు. తను చిరునవ్వుతో ‘కరెక్ట్ గానే పట్టావు’ అని చెప్పి ఒక పెన్నుతో ఆ ముక్క మీద హార్ట్ సింబల్స్ గీసింది. ‘ఇప్పుడు ముక్కల్ని మళ్ళీ కలిపి బల్ల మీద పరువు ఆ deckని’ అని కిరీటికి చెప్పింది. కిరీటి కూడా కుతూహలంగా ట్రిక్ ఏమై వుంటుందా అని తను చెప్పినట్లే చేశాడు.
ఆ అమ్మాయి ఇప్పుడు కుర్చీలో కొంచెం ముందుకి కూర్చుని కిరీటి పరిచిన ముక్కల్ని తీక్షణంగా చూస్తోంది. బల్లకి ఇటువైపు నిలబడ్డ కిరీటికి గుండె ఆగినంత పనయ్యింది. కుర్చీలో తను కొంచెం ముందుకి వంగడంతో తన షర్ట్ లో వున్న ఎద సంపద కనిపించీ కనిపించనట్టు వూరిస్తోంది. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి అందాలని అంత దగ్గరగా చూడడం అదే కిరీటికి. పల్లెటూరు కావడంతో అప్పుడప్పుడు గోదాట్లో తానాలాడే కన్నెపిల్లల్ని దొంగచాటుగా చూడడం, తడికచాటు దొంగచూపులు లాంటివి కామనే అయినా, ఒక అమ్మాయిని ఇంత నిశితంగా నింపాదిగా చూడడం ఇదే మొదలు అతనికి. తెల్లగా, మిసమిసలాడుతూ కనువిందు చేస్తున్నాయి ఆ అందాలు. ఇంకా కొంచెం ముందుకు వంగితే ముచ్చికల రంగు తెలిసేదేమో కానీ కిరీటికే చూడడానికి భయం వేస్తోంది.
ముక్కల్ని కాసేపు తేరిపారా చూసి ఆ అమ్మాయి ‘ఎడమవైపు నుంచి ఏడవ ముక్క’ అన్నది. కిరీటి గబుక్కున తన చూపు తిప్పుకొని ‘హా..ఏంటి?’ అన్నాడు. ‘అయ్యో మాలోకమా, నేను నేను పెన్నుతో సరిచేసిన ముక్క ఎడమవైపు నుంచి ఏడవది’ అన్నది. కిరీటి ఆమె చూపించిన ముక్కని తీసి చూశాడు. కరెక్ట్ గా గెస్ చేసింది. ఇది కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు కిరీటికి.
అతడి మైండ్లో వున్న భావనని చదివేసినట్టు ఆ అమ్మాయి ‘ఈ సారి ఇంకొంచెం కొత్తగా చేద్దాము’ అని కుర్చీలో మగరాయుడిలా కాళ్ళు చెరోవైపు వేసి వెనక్కు తిరిగి కూర్చుంది. పొడవాటి జుట్టు అడ్డం లేకపోవడంతో తన మెడ, తన సన్నటి నడుము, తీరైన పిరుదుల షేప్ చూసి కిరీటికి బుగ్గల్లోనుంచి ఆవిర్లు వస్తున్నాయి. అమ్మాయిల్ని చూసి సొల్లు కార్చుకునే టైప్ కాదు అతడు. ఈ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ వుంది. అది కిరీటిని వివశుడ్ని చేస్తోంది.
మళ్ళీ ఇందాకటి లాగానే ముక్కల్ని కలిపి పరచమంది. ఈ సారి వెనక్కు తిరగకుండానే ‘కుడివైపు నుంచి మూడవ ముక్క’ అని చెప్పింది. కిరీటి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కనీసం ఆ అమ్మాయి ముక్కల్ని కలపలేదు. కలిపి ముక్కల్ని పరిచాక చూడనుకూడా చూడలేదు. కరెక్ట్ గా ఎలా చెప్పిందా అని ఆలోచనలో వుండిపోయాడు. ఇంకొక మూడు సార్లు అలాగే కనీసం ముక్కల్ని చూడకుండా ఆ ట్రిక్ రిపీట్ చేసిందా అమ్మాయి.
‘ఇది చాలా బాగుందండీ, ఈ ట్రిక్ నాకు నేర్పిస్తారా?’ అని అడిగాడు కిరీటి. తను నవ్వుతూ అంగట్లోని బుక్ షెల్ఫ్ వైపు చెయ్యి జాపింది. అక్కడున్న పుస్తకాల్లో ఇలాంటి ట్రిక్స్ చాలా వున్నాయి అని చెప్పింది. ‘అలా కాదు, మీరు నేర్పిస్తారా’ అని అడిగితే ‘నేను ఈ ట్రిక్ నేర్చుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం సాధన చెయ్యాల్సివచ్చింది. మరి అన్నాళ్లూ నాతో వుండిపోతావా’ అని నవ్వుతూ అడిగింది.
‘లేదండీ...ఇంకొక్కసారి ఈ ట్రిక్ చెయ్యండి. నేను మీ దగ్గర పుస్తకం కొంటాను’ అని చెప్పాడు కిరీటి. ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కు తిరిగి కూర్చుంది. ఇంకొక్కసారి తనివితీరా ఆమె షేపుల్ని చూశాడు. మళ్ళీ కరెక్ట్ గానే గెస్ చేసింది.
తను అంతకు ముందు తిరగేస్తున్న ‘Misdirection’ పుస్తకం కొంటాను అని చెప్పాడు. ఆ అమ్మాయి లేచి వెళ్ళి పుస్తకం తెచ్చిఇచ్చింది. కిరీటి డబ్బులు ఇస్తూ ‘మీ పేరు?’ అని అడిగాడు. కుడి బుగ్గలో చిన్న సొట్ట పడేలా నవ్వి ‘ఎవరి పేరన్నా అడిగేముందు మీ పేరు చెప్పాలి’ అంది. కిరీటి తన పేరు చెప్పగా ‘సునయన’ అని చెప్పింది. ‘మంచి పేరు. మీకు కరెక్ట్ గా సరిపోయిందండి. మీ కళ్ళు చాలా బాగుంటాయి’ అని కిరీటి అనేసరికి చురుగ్గా చూసింది.
ఎక్కువ మాట్లాడేశానేమో అని గబుక్కున పుస్తకం తీసుకొని ‘బై సునయన’ అని చెప్పేసి వెళ్లిపోయాడు.
కిరీటి వెళ్ళిపోయిన తర్వాత ఆ అంగట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ‘కుర్రాడు మంచి చురుకైనవాడు’ అన్నాడు సునయనతో. ‘చూడ్డానికి కొంచెం క్యూట్ గా అయితే వున్నాడు. ఈ పల్లెటూళ్ళల్లో షార్ప్ మైండ్స్ వుండేది చాలా తక్కువ ధనుంజయ్’ అంటూ మళ్ళీ బల్ల మీద తల పెట్టి పడుకోబోయింది.
‘హా, సునయనా, నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి బేబీ. ఏదీ, నువ్వు సెట్ చేసిన కార్డ్?’ అని అడిగాడు.
సునయన ఆశ్చర్యంతో తన ముందు పరిచి వున్న ముక్కల్ని కెలికి చూసింది. నిజంగానే తన కార్డ్ అందులో లేదు. ‘నో..అతను..’ అంటుంటే, ధనుంజయ్ నవ్వి ‘నువ్వు పుస్తకం తీసుకురావడానికి వెళ్లినప్పుడు తీసుకున్నాడు’ అని చెప్పాడు.
అక్కడ కిరీటి తన స్నేహితుల్ని కలిసేముందు సునయన పెన్నుతో హార్ట్ సింబల్ గీసిన ముక్కని జాగ్రత్త చేద్దామని రెండు అంగట్ల మధ్యలో నిలబడి ఆ ముక్కని పుస్తకంలోంచి తీసి జేబులో పెట్టుకుంటుండగా ఎవరో అతని చెయ్యి పట్టుకొని గబుక్కున అంగట్ల మధ్య వున్న చీకటి సందులోకి లాగేశారు.