Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
శ్రీమతి గారూ .......... పైకివెళ్లి వాటర్ పైప్స్ దగ్గరుండి రిపేర్ చేయిస్తాను అని కార్తీక రూంలో ఉన్న చెల్లికి వినిపించేలా అంకుల్ మాట్లాడారు .

ఎంతసమయం అయినా పర్లేదు వాళ్లకు హెల్ప్ ........ కాదు కాదు ఆర్డర్స్ వేస్తూ పనిచేయించండి అని లోలోపలే నవ్వుకుని బదులిచ్చింది అంటీ .



కార్తీక ......... లైట్ ఉంటే నిద్రపట్టదా ఆఫ్ చెయ్యి నేను తరువాత చదువుకుంటానులే అని చెల్లి చెప్పింది .

బెడ్ పై పాటలు వింటున్న కార్తీక చెల్లి దగ్గరకువెళ్లి లైట్ ఉంటే నిద్రపట్టకపోయినా , అక్కయ్యా ......... నాకు లైట్ ఆఫ్ చేస్తే చాలా భయం నేనెప్పుడూ లైట్ on చేసుకునే పడుకుంటాను కాబట్టి మీరు ఏమాత్రం బాధపడకుండా హాయిగా చదువుకోవచ్చు . నాకు నిద్రపట్టేంతవరకూ హాయిగా పాటలు వింటాను . నిద్రవచ్చినప్పుడు మీ ఒడిలో తలవాల్చి పడుకోవచ్చా అక్కయ్యా ........ అని ప్రేమతో అడిగింది .

చెల్లి ఒకచేతితో కార్తీక బుగ్గను స్పృశించి నుదుటిపై ముద్దుపెట్టింది .

యాహూ ........... లవ్ యు అక్కయ్యా , ఇక మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి చెల్లిప్రక్కనే ఉంచి , అమ్మ కొద్దిసేపటి తరువాత పాలు తీసుకొస్తుంది ఇంకా ఏమైనా అవసరం అయితే ఆర్డర్ వెయ్యండి అని చెల్లి కురులపై నవ్వుతూ ముద్దుపెట్టి బెడ్ పై పాటలు వింటూ కూర్చుంది .



అంకుల్ పైకివచ్చి మహేష్ , కృష్ణ ......... నాకూ ఏదైనా పనిచెప్పండి అని అడిగారు .

అంకుల్ ......... రండి అని లోపలికివెళ్లి చైర్ తీసుకొచ్చి , మీరు కూర్చుని మేము ఎలా చేస్తున్నామో , సరిగ్గా బ్యాలన్స్ చేస్తున్నామో లేదో చెప్పండి మేము అన్నీ పూర్తిచేస్తాము అనిచెప్పాము .

మహేష్ ......... నాకు వయసైపోయింది కూర్చో అంటున్నావు కదూ......... 

మీవయసులో ఏమేమిచేసేవాల్లమో మీ ఊరిలో ఉన్న మీ అంకుల్ ని అడగండి అని కుర్చీ ప్రక్కనపెట్టేసి మాకు సహాయం చేస్తున్నారు .

నవ్వుకుని అంకుల్ కు decoration స్కెచ్ చూపించి వివరించాను. 

మహేష్ .......... ఇలాంటి decoration ఇంతవరకూ చూడలేదు , సూపర్ అంతే ఎక్కడిది అని అడిగారు .



అంకుల్ ........ మీకు చెప్పలేదు కదూ మహేష్ born ఆర్కిటెక్ట్ అని కృష్ణ గర్వపడుతూ చెప్పాను .

Wow మహేష్ .......... అని భుజం తట్టి ఇప్పుడు నీలాంటి వాళ్లకు బయట మాంచి డిమాండ్ ఉంది , ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటావు అని సంతోషించారు .

రేయ్ లైట్స్ మరియు ఫ్లవర్స్ రేపు సెట్ చేద్దాము మిగతావి తీసుకురా అని అంకుల్ 11 గంటలవరకూ సహాయం చేసారు . 

అంకుల్ మీకు నిద్రవస్తున్నట్లు ఉంది అని చేతినిపట్టుకొని కిందవరకూ వదిలేసి అంటీ పైకి తీసుకొస్తున్న టీ అందుకొని గుడ్ నైట్ అంటీ మీరు నిద్రపోండి అనిచెప్పి పైకివచ్చి టీ తాగగానే నిద్రమబ్బు మొత్తం ఎగిరిపోయి ఉత్సాహంతో సగం పనిని పూర్తిచేసి ఉదయం ఎప్పుడో లోపలికివెళ్లి హాల్ లోనే పడుకుండిపోయాము . 

 రేయ్ చెల్లి బట్టలకోసం పైకి వస్తుందేమోరా .......... అని కృష్ణగాడిని లేపాను .

అంతే లేచి రెండురోజులకు తనకు కావాల్సిన బట్టలను తీసుకెళ్లి గుమ్మం ప్రక్కనే ఉన్న టేబుల్ పై ఉంచి , చెల్లికి మెసేజ్ చేసి కాసేపు పడుకున్నాము .



చెల్లికి ఎక్కడా అనుమానం రాకుండా రోజూలానే 6 గంటలలోపు రెడీ అయ్యి నలుగురమూ అక్కయ్యకోసం ఈసారి సైకిళ్ళల్లో కాకుండా బుల్లెట్ లో వెళ్ళాము . రోజూలానే నిరాశతో ఇంటికి చేరుకుని టిఫిన్ చేసి చెల్లిని అక్కడే వదిలేసి కృషగాడు వరుసగా రెండురోజులు సెలవు పెట్టినా part టైం జాబ్ కు వెళుతున్నట్లు చెల్లికి చెప్పి , రేయ్ మామా ........ ఈరోజు బుల్లెట్ అవసరం లేదు అనిచెప్పి , కార్తీక మీ అక్కయ్య బయటకు రాకూడదు అని సైగచేసి ఇద్దరమూ పైకివెళ్లి సాయంత్రం లోపు లైట్స్ , ఫ్లవర్స్ అలంకరణ తప్ప మిగిలిన decoration మొత్తం పూర్తిచేసాము . మధ్యలో చెల్లికి తెలియకుండా నేనూ కృష్ణగాడు వెళ్లి ఒక కేక్ ........... చెల్లికి , వాడికి తెలియకుండా నేనూ కార్తీక వెళ్లి మరొక కేక్ ఆర్డర్ ఇచ్చి , రేపు సాయంత్రం బిగ్గెస్ట్ కేక్ రెడీ చెయ్యమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాను .



రేయ్ మామా అదిరిపోయింది రా ........., నువ్వు కోరుకున్నట్లుగానే మన సంపాదన ఈ చివరి రూపాయితో అన్నీ పూర్తిచేసాము .

రేయ్ మామా ......... ఆమాట నేను ఊరికే చెప్పానురా , ఇంకా ఖర్చుపెట్టాల్సింది చాలా ఉంది , మనం వెళ్ళిరాగానే వెళ్లి ఎన్నిరకాల పూలు ఉన్నాయో అన్నిరకాల పూల బుట్టలు తీసుకొచ్చేయ్ . చివరి అలంకరణ కూడా 12 గంటలలోపు పూర్తిచేసేద్దాము అనిచెప్పాను .

కనీసం ఈ పనైనా నాకుచెప్పావు మంచిది , ఇప్పుడే ఇలా ఉంది ఇక పూలతో , లైటింగ్స్ తో ........... ఊహకే అందడం లేదురా ........ అని భుజం చుట్టూ చేతినివేసి మురిసిపోతున్నాడు . 

అవును మహేష్ ......... చూస్తుంటే నాకే birthday జరుపుకోవాలన్నంత ఆశ కలుగుతోంది .

అంకుల్ ఇంకా పూర్తవ్వలేదు లైట్స్ , ఫ్లవర్స్ తో టచప్ ఇచ్చామంటే మమ్మల్ని కిందకు తొసైనా మీ పుట్టినరోజు జరుపుకుంటారు అని చెల్లీ , కార్తీక బయటకు రావడం చూసి అంకుల్.......... అక్కయ్య కోసం వెళ్ళొస్తాము అనిచెప్పాను . 

Sorry మహేష్ .......... ఇంత టెక్నాలజీ ఉన్నా మేము , హైద్రాబాద్ లోని ఆఫీస్ లలో పనిచేసేవాళ్ళు మీ అక్కయ్య ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయాము అని బాధతో చెప్పారు . 

అంకుల్ మీరు ఎంత try చేశారో చేస్తున్నారో మాకు తెలుసు , అక్కయ్య తన ఐడెంటిటీ మార్చుకుని ఉండవచ్చు లేదా పెళ్లయ్యాక అత్తామావయ్యలు పేరు మార్చి ఉండవచ్చు ........... ఇలా ఎన్నో కారణాలు . మీరు బాధపడకండి అక్కయ్యను ఇప్పుడు కాకపోతే మా ప్రాణం పోయేలోపైనా చేరుకుంటాము అని మాకు నమ్మకం ఉంది అని బదులిచ్చాను .

కృష్ణగాడు నా భుజం చుట్టూ చేతినివేసి త్వరలోనే కలుస్తామురా ......... అని ఉత్సాహాన్ని ఇచ్చాడు .

అంకుల్ బుల్లెట్ ఇచ్చారు .......... వెతకడం ఇంకా సులభతరం అయ్యింది మాకు , మీరు కూర్చుని ఏమైనా పొరపాట్లు ఉంటే రాగానే చెప్పండి సెట్ చేసేద్దాము .

చెల్లీ .......... వచ్చేస్తున్నాము అని వాళ్ళతోపాటు మరొక ఏరియా లో వెతకడం మొదలెట్టాము . మళ్లీ నిరాశతోనే ఇంటికి చేరుకున్నాము . 

అన్నయ్యా ........అని నా గుండెలపై వాలి చెల్లి బాధపడుతోంటే , 

మరికొద్దిసేపట్లో పుట్టబోతున్న చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం ఇష్టంలేక , చెల్లీ ....... అని నవ్వుతూ నుదుటిపై ముద్దుపెట్టి కృష్ణగాడికి సైగచేసాను .

రేయ్ మామా ......... చిన్న పని ఉంది ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని చెల్లి కురులపై ముద్దుపెట్టి బుల్లెట్ లో వెళ్ళాడు .

తల్లీ ......... మీ స్వచ్ఛమైన మనసుకు ఆ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు . ఇప్పటివరకూ మీ అక్కయ్య కనిపించలేదంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది అని నా నమ్మకం . ఏదీజరిగినా మనమంచికే అని ఓదార్చి లోపలికి పిలుచుకొనివెళ్లారు . మహేష్ .........కృష్ణ రాగానే మీ అంకుల్ తోపాటు భోజనం చెయ్యడానికి రండి అనిచెప్పారు .



పైకివెళ్లి decoration చూసి ఆనందిస్తున్న అంకుల్ ని చూసి , అంకుల్ anything not right అని అడిగాను .

రెండు గంటలుగా భూతద్దంలో వెతికినా ఎక్కడా అలాంటిది కనిపించలేదు పర్ఫెక్ట్ మహేష్ ......... అని భుజం పై చేతినివేశారు .

నాకోసం అలాచెబుతున్నారు అంకుల్ మీరు థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అని చుట్టూ చిన్న డస్ట్ కూడా లేకుండా శుభ్రం చేసాను . 

గంట తరువాత లగేజీ వెహికల్ తోపాటు కృష్ణగాడు వచ్చి విజిల్ వేయడంతో కిందకువెళ్లి అన్నింటినీ పైకి మార్చేసి రేయ్ ఇక 3 గంటల సమయం మాత్రమే ఉంది అనిచెప్పాను .

ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు మొదలుపెట్టేద్దామురా ...........

ఓ ఓ ఓ .......... ముందు కడుపునిండా తినేసి తరువాత మీఇష్టం రండి అని కిందకుపిలుచుకునివెళ్లి శ్రీమతిగారూ అని కేకవేశారు .

అంటీ , చెల్లెమ్మ , కార్తీక ........ రూంలోనుండి బయటకువచ్చారు . చెల్లి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఇద్దరమూ సంతోషించి , అంటీకి కార్తీకకు థాంక్స్ చెప్పేసి తృప్తిగా చెల్లి చేతితో తినేసి పైకివెళుతూ అంకుల్ పైకి అని సైగచేసాను .

బయటకువచ్చి  మహేష్ , కృష్ణ .......... మీరు ఎవరికోసమైతే అంత కష్టపడ్డారో మొదటగా తనే చూడటం భావ్యం ......... , మీ మనసులో కూడా అదే ఉంటుందని నాకు తెలుసు ........

అంకుల్ ............

I am soooooo happy మహేష్ .......... వేరే ఏదైనా పని ఉంటే చెప్పండి చేసేస్తాను.

Dad .......... మనం వెళ్లి అన్నయ్యా వాళ్ళు ఆర్డర్ చేసిన కేక్ తీసుకొద్దాము అని కార్తీక గుర్తుచేసింది .

ఈ హడావిడిలో కేక్ సంగతే మరిచిపోయాము గుర్తుచేయాలని తెలియదా అని వాడి వీపుపై గుద్ది ......... కార్తీక నువ్వు సూపర్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నాను .

చచ్చానురోయి అంటూ వీపు రాసుకుంటుంటే నవ్వుకుని లవ్ యు రా మామా .......అని భుజం చుట్టూ చేతినివేశాను .

తల్లీ కారు తాళాలు తీసుకురా వెళ్ళొద్దాము అని వెళ్లారు . కార్తీక లోపలకు పరిగెత్తి అక్కయ్యా ........ మీరు చదువుతూ ఉండండి , నాన్నకు బయట చిన్న పని వెళ్ళేసి వస్తాము అమ్మా జాగ్రత్త అనిచెప్పి వెల్8ది .



రేయ్ లెట్స్ ఫినిష్ ఇట్ అంటూ ఉత్సాహంతో పైకివెళ్లి ఫ్రెష్ రంగురంగుల పూలను చూసి సంతోషించి మొదట decoration సెట్ మొత్తం లైట్స్ మరియు పూలతో చూడగానే మనసు పులకించేలా అందంగా అలంకరించి , సెట్ లోపలకు అడుగుపెట్టగానే పూల కమ్మటి సువాసనకు మరియు లైటింగ్ అందాలకు కృష్ణగాడు తనను తాను మైమరిచిపోయి రేయ్ మామా నాకే స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉంది, ఇక నీ చెల్లి చూసిందంటే అన్నయ్యా ......... ఇందుకోసమే ఈ సంతోషం కోసమేనేమో నేను పుట్టినప్పటి నుండి పుట్టినరోజు జరుపుకోలేదు అని తనను తాను మరిచిపోయి పారవశ్యంలోకి వెళ్లిపోతుందిరా ..........

ఇదంతా చేసింది నువ్వేనని చెబుతానులేరా ......... 

ఇక అంతే తన సర్వస్వాన్ని ..........వద్దులే నాకు సిగ్గేస్తోంది . అయినా నీ చెల్లి నేను చేశానంటే నమ్మదులేరా .......... 

నవ్వుకుని నువ్వు ఆ రెండు క్రాకర్స్ బాక్సస్ మరియు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ........ చెల్లి మెట్లు ఎక్కి ఇక్కడ నిలబడుతుంది కాబట్టి మన decoration వెనుక కింద నుండి మూడువైపులా అలా ఆకాశంలోకి ఎగిరేలా కిందకువెళ్లి సెట్ చెయ్యి , ఇక ఇంటి ముందుభాగం మొత్తం లైటింగ్స్ వేసి , మిగిలిన సగం పూలతో ఏమిచెయ్యాలో నాకు తెలుసు .......... రేయ్ ఇంకా చూస్తున్నావేంటి ........

లవ్ యు రా మామా .......... ఒకటి తరువాత మరొక సర్ప్రైజ్ తో నీ చెల్లికి ఊపిరాడనీయకుండా చేసేస్తావా ఏంటి అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి హాల్లో ఉంచినవి కిందకు తీసుకెళ్లాడు . 

సమయం చూసుకుంటూ ఇంటికి ఎదురుగా నిలబడి చూస్తే అన్నిరకాల లేటెస్ట్ సీరియల్ లైట్స్ తో ఇల్లు మొత్తం వెలిగిపోయేలా సెట్ చేసి , పూలు మొత్తం ఒక్కటీ మిగలకుండా వాడి బుట్టలను లోపల హాల్లో ఒకదానిపై మరొకటి ఉంచి , మొబైల్ తీసి రేయ్ మామా గేట్ దగ్గర నిలబడమనిచెప్పి ప్లగ్ పెట్టి స్విచ్ on చేసాను . 

అంతే ఇల్లుమొత్తం విద్యుద్దీపాలతో వెలిగిపోవడం , అధిచూసి వాడి ముఖం తెరుచుకున్న నోటితో కళ్ళతో వెలిగిపోవడం చూసి నవ్వుకుని , రేయ్ రేయ్ ........ ఉన్నావా లేక .......... అని గట్టిగా నవ్వాను . 

మామా ............ స్వర్గాన్ని నేలపైకి తీసుకొచ్చావు కదరా .......... అని పైకి పరిగెత్తుకుంటూ వచ్చి పూలను చూసి నెమ్మదిగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని ఫ్లాట్ రా నీ చెల్లిచూసి కొన్నిక్షణాలపాటు ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు అని నన్ను అమాంతం పైకెత్తేసి తిప్పుతూనేఉన్నాడు .



కార్తీక ఒక కేక్ తీసుకొచ్చి మొత్తం చూసి షాక్ లో కదలకుండా చివరి మెట్టు దగ్గరే ఉండిపోయింది .

కార్తీక , కార్తీక ......... అని భుజం తాకగానే , అన్నయ్యలూ ....... అంటూ పడిపోబోతుంటే పట్టుకున్నాము .

అన్నయ్యలూ .......... ఇది మన ఇళ్లేనా లేక నేనేమైనా ఒక కొత్త అబ్దుతమైన లోకానికి వచ్చేసానా .......... అని అడుగువెయ్యబోయి , పాదాలకు మెత్తగా తాకగానే చూసి వద్దు వద్దు మా అక్కయ్యే తొలి అడుగుపెట్టాలి అని కేక్ క్యాండీల్స్ అందించి , అన్నయ్యా .......... అక్కయ్య ఎందుకో ఈరోజు 11 :30 అయినా చదువుతూనే ఉంది సరిగ్గా రెండు నిమిషాల ముందు పైకి పిలుచుకొనివస్తాను , ఎటువంటి సర్ప్రైజెస్ ఇస్తారో మీఇష్టం చూసి తరించడానికి పరవసించిపోవడానికి అక్కయ్య సిద్ధం అని అమితమైన ఆనందంతో కిందకువెళ్ళింది . 

సరైన సమయానికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా రెండు మూడుసార్లు లైట్స్ ఆఫ్ చేసి on చేసి పర్ఫెక్ట్ అని కృష్ణగాడిని పట్టారానిసంతోషంతో హత్తుకొని 15 నిమిషాలముందు decoration మధ్యలో టేబుల్ ఉంచి దానిపై కొత్త దుప్పటి కప్పి లైట్స్ పూలతో అందంగా అలంకరించి కేక్ ఉంచి , రేయ్ మామా మా బుజ్జి చెల్లి ఫస్ట్ birthday కాబట్టి ఒకే ఒక క్యాండిల్ మరియు కేక్ మధ్యలో ఫ్లవర్ స్పార్కిల్ క్యాండిల్ ఉంచాను . కేక్ పై happy birthday from లవర్ అండ్ బ్రదర్ అని చదివి లవ్లీ రా మామా అని వెనుక నుండి హత్తుకొని మురిసిపోయాడు . దీనికే ఇలా అయితే రియల్ సర్ప్రైజ్ చూసి నన్ను వీడు ఏమిచేస్తాడో భయమేస్తోంది అని గుటకలు మింగుతూ వాడివైపుచూసాను .

ఏంట్రా మామా అలాఉన్నావు ..........

రేయ్ నీకు నాపై అభిమానాన్ని ప్రేమను కాస్త కంట్రోల్ చేసుకుంటాను అని మాటివ్వరా అని అడిగాను .

రేయ్ ఏంట్రా మామా అదెలా కంట్రోల్ చేసుకుంటాను కిందకు దించరా చెయ్యి అని చేతిపై దెబ్బవేశాడు .

అయిపోయాను .......... అని మనసులో అనుకుని నవ్వుకున్నాను .



బయటకువచ్చి ok నా రా అని అడిగాను .

OK ఏంటిరా .......... కళ్ళు జిగెలుమంటుంటేనూ అంటూ మళ్లీ ఎత్తేశాడు . 

రేయ్ ఇందుకేరా మామా .......... కాస్త కొద్దిసేపు కంట్రోల్ చేసుకోరా అన్నది అంటూ గడ్డాన్ని పట్టుకుని బ్రతిమాలను .

ఇంతలో కార్తీక నుండి కాల్ అన్నయ్యా .......... 5 నిమిషాల్లో అక్కయ్య వచ్చేస్తుంది అని కాల్ చేసి చిన్నగా చెప్పింది . 

సమయం చూసి రేయ్ నీ ప్రియురాలు వచ్చే సమయం అయ్యింది కింద ఎలా సెట్ చేసావో చూసొస్తాను అని కిందకువెళ్లి చూసి రేయ్ సరైన సమయంలో వెలిగించడానికి ఒకరు ఇక్కడే ఉండాలి నేనిక్కడే ...........

రేయ్ మామా .......... అవసరం లేదు రిమోట్ ఇచ్చారు , నువ్వు ముందు పైకిరారా అని రాగానే కొట్టి నువ్వు కింద ఉంటే ఎలారా ......... అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .

లవ్ యు రా మామా .......... its టైం అంటూ స్విచ్ ఆఫ్ చేసేసాను అంతే మొత్తం చిమ్మచీకటి అయిపోయింది .



12 గంటలకు రెండు నిమిషాలముందు coming అన్నయ్యలూ get రెడీ అని కింద గేట్ తెరుచుకున్న చప్పుడు వినిపించగానే అలెర్ట్ అయిపోయాము .

కార్తీక ఎక్కడికి ......... ఇప్పటికే నీకు ఆలస్యం అయ్యింది రోజూ 10 గంటలకే పడుకుంటావు కదా , ఇంత చీకటిలో పైకి ఎందుకు అన్నయ్యా , కృష్ణా హాయిగా నిద్రపోతుంటారు ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం రా మనం కూడా వెళ్లి పడుకుందాము . 

ష్ ష్ ......... అక్కయ్యా .........

నాకు చీకటి అంటే భయం చెల్లీ ..........

కార్తీక నవ్వుకుని భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకోండి . మా అన్నయ్యలు ఉన్న ఇంటిలో ఎంత చీకటి ఉన్నా నాకేమీ భయం లేదు అని కార్తీక చెల్లి చేతిని పట్టుకుని చివరిమెట్టువరకూ వచ్చేసారు .



My డియర్ లవ్లీ హార్ట్ ........... ఒక్క స్టెప్ వేసి అక్కడే ఆగిపో అని కృష్ణగాడి వాయిస్ ..........

రేయ్ ........ ఇంత చీకటిలో ఏమిచేస్తున్నావురా అని పైకెక్కి , కార్తీక పాదాలకింద మెత్తగా ఉంది అనిచెప్పింది . 

30 29 28 27 ..........

అడుగుతుంటే నంబర్స్ కౌంట్ చేస్తున్నావు ........... ఇక్కడ మూడువైపుల నుండి పూల పరిమళం వొళ్ళంతా గిలిగింతలుపెడుతోంది అని కార్తీకను గట్టిగా హత్తుకొని చిలిపినవ్వులు నవ్వుతోంది .

అక్కయ్యా .......... ఈ రొమాంటిక్ వాసనలో నన్నుకాదు మీ ప్రియుణ్ణి కౌగిలించుకుంటే అందం ఆనందం అని ఇద్దరూ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .



కృష్ణగాడు అప్పకుండా 8 7 6 5 4 3 2 1 ............. ఒకేసారి ముగ్గురమూ పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణా ........, పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లెమ్మా అని అక్కయ్యను కూడా తలుచుకుని మీ శుభాకాంక్షలు కూడా నేనే తెలుపుతున్నాను అక్కయ్యా  ......., కార్తీక హ్యాపీ birthday అక్కయ్యా ........... అంటూనే నేను లైట్స్ స్విచ్ , కృష్ణగాడు రిమోట్ నొక్కగానే , ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోవడం - ఎదురుగా birthday సెలబ్రేషన్ decoration - దానివెనుక సుయ్ సుయ్ సుయ్ మంటూ క్రేకర్స్ ఆకాశంలోకి వెళ్లి పేలి అద్భుతమైన స్పార్కిల్స్ తో ఆకాశంలో అందాలను ఆవిష్కరించడం ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ మూడువైపులా నెమ్మదిగా గాలిలోకి ఎగరడం చూస్తూ చేతులనూ తన బుగ్గలపై వేసుకుని అంతులేని ఆశ్చర్యపు సంతోషంతో కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయింది . కార్తీక అయితే మైమరిచిపోయి చెల్లిని సైడ్ నుండి హత్తుకొని భుజం పై తలవాల్చి ఆ దృశ్యాలను చెల్లితోపాటు ఎంజాయ్ చేస్తోంది .

చేతినిపైకెత్తి దారం లాగాగానే , ఇద్దరిపై పైనుండి పూల వర్షం కురిసింది .



Wow ............. అంటూ చెల్లి చుట్టూ తిరిగి పూలను చేతితో అందుకొని ఎగరేసుకుంటూ అంతులేని ఆనందంతో పూలుపరిచిన నేలపై పరుగునవచ్చి ఇద్దరినీ ఒకేసారి హత్తుకొని లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ..........అని వాడి పెదాలపై ముద్దుపెట్టేసింది .

వాడు మైమరిచిపోతోంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లీ ......... నా నుండీ మరియు మన అక్కయ్య నుండి అనిచెప్పి వాడివైపు చూస్తే ఇంకా అలానే ఉండటంతో రేయ్ మామా అని భుజం కదిలించాను . 

లవ్ యు ......... కాదు కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు my loveliest ఏంజెల్ అని ఒకేసారి ఇద్దరమూ చెల్లీ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాము .

మా ముగ్గురిపై పూల వర్షం కురవడంతో ఆశ్చర్యంతో చూస్తే ఎదురుగా అంటీ అంకుల్ కార్తీక ముగ్గరూ మాపై పూలు చల్లుతూ హ్యాపీ birthday తల్లీ కృష్ణ అని విష్ చేశారు.



ఆనందబాస్పాలతో వాళ్ళవైపు తిరిగి మా ఇద్దరి చేతులనూ చుట్టేసి భుజం పై చెరొకముద్దుపెట్టి , లవ్ యు అంటీ థాంక్స్ అంకుల్ లవ్ యు కార్తీక అని మురిసిపోతూ మావైపు మార్చి మార్చి ప్రాణంలా చూస్తోంది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-05-2020, 05:22 AM



Users browsing this thread: 15 Guest(s)