Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నెక్స్ట్ రోజు ఉదయం కూడా చెల్లి 3 గంటలకే లేచి 5 వరకూ చదివి మమ్మల్ని లేపింది . ముగ్గురమూ ఒకరితరువాత మరొకరము తేదీ అయ్యి బయటకువస్తే కార్తీక సంతోషమైన చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ స్వాగతం పలకడంతో , ముగ్గురమూ ఆనందించి గుడ్ మార్నింగ్ చెప్పి అక్కయ్య దర్శనానికై బయలుదేరాము . 

దగ్గరలో ఉన్న చుట్టుప్రక్కల వీధులన్నీ ప్రతి ఇంటినీ వెతకడం పూర్తవ్వడంతో , కొన్ని కిలోమీటర్లు చెల్లి కార్తీక వెనుకాలే సైకిల్ తొక్కుతూ రావడం చూసి బాధతో అన్నయ్యా , రేయ్ ........... మీరు బైకులో రండి మేము సైకిల్ తొక్కుతూ వస్తాము . అవునన్నయ్యా .......... అని కార్తీక కూడా చెప్పింది .

చెల్లెమ్మా ......... మరికొంత దూరమే కదా వెళ్లి ఇక నెమ్మదిగా వీధులన్నీ వేతకడమే , నా చెల్లెళ్లతో సైకిల్ తొక్కిస్తే ఈ హృదయం తట్టుకోగలదా , మీ అన్నయ్యా నీ ప్రియుడుకి ఈ కష్టం అలవాటే చెల్లీ .......... అందులోనూ మన అక్కయ్యను వెతికే కష్టంలో ఉత్సాహం మాటల్లో చెప్పలేము ఏరా .........

అంతే మామ్స్ .......... అంటూ హైఫై కొట్టుకుని వేగంతో తొక్కుతూ నవ్వుతూ చెల్లీ స్కూటీని దాటేసి నవ్వుతూ చెల్లీ మేమే ముందు అంటూ ముందుకువెళ్లిపోయాము . 



 చెల్లి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ......... అంటూ ఆనందిస్తుంటే , అక్కయ్యా ......... అన్నయ్యల కంటే మనమే ముందుకువెళ్లాలి అని చెల్లిని వెనుక నుండి గట్టిగా హత్తుకొని చెప్పింది .

 చెల్లికి ఇలాగే బాగుంది అని అనిపించినా , కార్తీక కోరిక తీర్చాలని అంతేనంటావా కార్తీక అని ఆక్సిలేటర్ తిప్పుతూ వేగం అందుకొని క్షణాల్లో మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది .

అన్నయ్యలూ .......... మేమే ఫస్ట్ మేమే ఫస్ట్ అంటూ కార్తీక ఒకచేతిని ఎత్తి సంతోషించడం చూసి నవ్వుకుని , చెల్లీ రేయ్ జాగ్రత్త అని ఇద్దరమూ కంగారుతో సడెన్ గా వేగం తగ్గించాము .

చెల్లి మిర్రర్ లో చూసి వేగం తగ్గించి మా దగ్గరకు చేరుకుని లవ్ యు అన్నయ్యా , కృష్ణ ......... కార్తీక ఆశపడితేనూ ......... , 

అయితే మేమే ఫస్ట్ అంటూ ఇద్దరమూ చేతులు కొట్టుకుని వేగం అందుకున్నాము .

అక్కయ్యా .......... అన్నయ్యలు కంగారుపడతారు నెమ్మదిగానే వెళ్లు , అన్నయ్యలే ఎప్పుడూ ఫస్ట్ ఉండాలి అని చెప్పింది .

లవ్ యు కార్తీక ఉమ్మా ........ అని అద్దం లో ముద్దుపెట్టింది .

నిన్న ఎక్కడయితే ఆపామో ఆ వీధిని చేరుకునేసరికి అరగంట పట్టింది . ఇక రెండుగా విడిపోయి అక్కయ్య కోసం ఫొటోలతో వేట ప్రారంభుంచాము . 9 గంటలవరకూ ఆ ఏరియా వీధులన్నీ తిరిగినా ఎక్కడా అక్కయ్య జాడ లేకపోవడంతో రోజూలానే అలవాటైపోయిన నిరాశతోనే ఇంటికి చేరుకునేటప్పటికి 10 గంటలు అయ్యింది .



సైకిల్ తొక్కడం వలన ముఖమంతా చెమట పట్టి ఉండటం , ఆఫీస్ కు వెళ్లడం కోసం కారు ఎక్కుతూ చూసిన అంకుల్ , మహేష్ ............ రోజూ సైకిల్లో వెళుతున్నారని మీ అంటీ చెప్పింది , చాలా దూరం వెళ్లినట్లున్నారు , రోజూ ఇలాగే వెళతారు కదూ , కారు కొన్న తరువాత నా ఫేవరేట్ బుల్లెట్ అదిగో అక్కడ కవర్ కప్పబడి కదలకుండా ఉండిపోయింది . మీరెందుకు use చేయరాదు తల్లీ బుల్లెట్ కీస్ తెచ్చి మీ అన్నయ్యలకు ఇవ్వు అనిచెప్పగానే ,

Dad ........... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ నేనే మిమ్మల్ని ఇదేవిషయం అడుగుదామని లోపలికి వస్తున్నాను . ఇంతలో మీరే సంతోషమైన మాట చెప్పారు అని హత్తుకొని పరుగున లోపలికివెళ్లి కీస్ తీసుకొచ్చి , 

అంకుల్ ........... 

అన్నయ్యా .......... నాన్నే ఇష్టంతో ఇచ్చారు అని చేతిలో ఉంచేసివెళ్లి బుల్లెట్ కవర్ తీసేసి , అన్నయ్యా ......... దుమ్ముపట్టింది కొద్దిసమయం ఇచ్చావంటే కొత్తగా మారిపోతుంది అని పాత గుడ్డలు తీసుకొచ్చి ప్రక్కన ఉంచి వైపుతో బుల్లెట్ మొత్తం ఫోర్స్ తో నీటిని కొట్టి , గుడ్డలతో శుభ్రం చెయ్యడం మొదలెట్టింది కార్తీక ,



ఆనందబాస్పాలతో చెల్లి కూడా వెళ్లి లవ్ యు soooooo మచ్ కార్తీక అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి మరొక గుడ్డ అందుకొని చెరొకవైపు నుండి చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో శుభ్రం చేస్తున్నారు .

మహేష్ .......... ఆఫీస్ టైం అయ్యింది , ఇక ఆ బుల్లెట్ మీదే అనుకోండి అనుకోవడమేంటి మీదే , తల్లీ లోపల 5 లీటర్స్ పెట్రోల్ ఉంది మీ అన్నయ్యలకు తెచ్చివ్వు బై అనిచెప్పి వెళ్లారు .

తల్లీ కృష్ణ , కార్తీక .......... టిఫిన్ చేసి క్లీన్ చెయ్యొచ్చు కదా , ఇప్పటికే ఆలస్యం అయ్యింది . 

ఉండమ్మా .......... కృష్ణ అన్నయ్య జాబ్ కు వెళతారు కదా అంతలోపు శుభ్రం చేసేస్తాము . అన్నయ్యలూ మీరు వెళ్లి తినండి అని ఇద్దరూ మరింత ఉత్సాహంతో నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు .

మీరు తినకుండా మీ అన్నయ్యలు తింటారు అంటే నేను నమ్ముతాను అనుకున్నారా ......... కానివ్వండి అని అంటీ కూడా చెయ్యివేసింది .



మేమూ సహాయం చేయబోతే అన్నయ్యలూ ........ మీరు దర్జాగా కాలుమీద కాలువేసుకుని కూర్చోండి అయిపోతుంది అనిచెప్పి అంటీపై ఒకేసారి నీళ్లు చల్లి సంతోషంతో నవ్వుతూ నిమిషాల్లో కొత్తగా తయారుచేసేసి , ముగ్గురూ ఫోజ్ ఇచ్చారు. 

ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని కృష్ణగాడు వెళ్లి ఫోటోలు తీస్తుంటే , చెల్లెళ్ళు సిగ్గుపడుతున్న అంటీని వెళ్లకుండా పట్టేసుకొని బోలెడన్ని ఫోటోలు దిగి , మా ఇద్దరినీ కూడా లాక్కెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు . మీతోపాటు నన్నుకూడా తడిపేశారు అని చెల్లి కార్తీక బుగ్గలపై ప్రేమతో కొట్టి తొందరగా చేంజ్ చేసుకుని రండి టిఫిన్ తిందురు అని అంటీ పరుగున లోపలికి వెళ్లిపోయారు .

చెల్లెళ్ళు డ్రెస్ మార్చుకుని వచ్చాక టిఫిన్ తినేసి , కార్తీక అందించి పెట్రోల్ పోసి కృష్ణగాడు స్టార్ట్ చేయగానే లవ్లీ బుల్లెట్ సౌండ్ రావడంతో ఒకరినొకరు హత్తుకొని జాగ్రత్తగా వెళ్ళిరారా అని బయటవరకూ వాడివెనుకే వెళ్ళాను .

రేయ్ మామా ..........ఇప్పుడు వచ్చే శనివారం నీ హార్ట్ birthday .......,

అంతే పట్టరాని ఆనందంతో బుల్లెట్ దిగి అమాంతం నన్ను కౌగిలించుకుని నీ చె.... ల్లి..... పుట్టినరోజు ......... అని సంతోషంలో మాటలు రానట్లు , రేయ్ రెండు రోజుల్లోనా........ ఈ శనివారం కదా అని ఏదో చెప్పబోయి వెంటనే ఆగిపోయి , రేయ్ మామా .......... ప్లాన్ ఏంటి అని ఉత్సాహంతో అడిగాడు .



రేయ్ ........... నువ్వు నా ప్రాణంరా , నీ birthday మరిచిపోతానా అమ్మతో ఎప్పుడో తెలుసుకుని గుండెల్లో దాచుకున్నాను అయితే నీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అని ఆ ఊహకే ఆనందం రెట్టింపైంది .

రేయ్ చెల్లికి సర్ప్రైజ్ ఇద్దాము . ఎవరెవరు వస్తున్నారో తెలుసా అని మొత్తం వివరించాను . నువ్వు ఏమిచేస్తావంటే వర్క్ కాస్త ముందుగానే పూర్తిచేసి decoration వాళ్ళను కలిసి పైన వరండా మొత్తం అందంగా అలంకరించేలా మాట్లాడు అనిచెప్పాను . 

అమ్మావాళ్ళు వస్తున్నారా ......... లవ్ యు లవ్ యు sooooo మచ్ రా మామా అని కౌగిలిలో నలిపేసి , అది నాకు వదిలేయ్ రా నేను చూసుకుంటాను . నీ చెల్లి....... నా ప్రేమ దేవత జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజు సంబరాన్ని ఎలా జరిపిస్తావో తలుచుకుంటేనే హృదయం పరవశించిపోతోందిరా మామా ......... ఊహకే అందడం లేదు , వెళ్ళొస్తానురా ......... అని డాన్స్ చేస్తూ బుల్లెట్ ఎక్కి వెళ్ళిపోయాడు .

ముందు అంకుల్ పర్మిషన్ తీసుకోవాలని వెంటనే కాల్ చేసాను .

మహేష్ .........

అంకుల్ ......... మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగాను .

ఇప్పుడే ఇంటికి రమ్మంటావా అని చెప్పారు .

థాంక్స్ అంకుల్ .......... అంకుల్ అని చెల్లి పుట్టినరోజును జరుపుకోవాలని అనుకుంటున్నాము . కొంతమంది గెస్ట్స్ ఊరినుండి వస్తున్నారు . కాస్త హడావిడి ఉంటుంది . ముందుగా మీకు తెలిపి పనులు మొదలుపెడదామని ...........

మీరు వద్దు అన్నాకూడా ఏమాత్రం బాధపడము .

మహేష్ నా పెద్ద కూతురు birthday ఫంక్షన్ ను ఆపే దమ్ము ఎవరికి ఉంది . Dj పెడతావా , బ్యాండ్ తో ఏరియా మొత్తం టాప్ లేపుతావా ......... ఇంకా ఏమైనా చేసుకో , ఇల్లుపీకి పందిరివేసి ఎంజాయ్ చెయ్యండి . డిస్టర్బ్ అని చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేనుచూసుకుంటాను . ఏమైనా పనులుంటే నాకుచెప్పండి నేనూ ఉత్సాహంతో చేస్తాను .

పండగ జరపడానికి నా పర్మిషన్ కోసం కాల్ చేస్తావా ......... ఉండు ఇంటికివచ్చాక నీసంగతి చూస్తాను అని సంతోషన్గా నవ్వుకుని మీ ఇష్టం మహేష్ ........ తొలిరోజే చెప్పానుకదా మీ ఇంటిలా ఫీల్ అవ్వమని ఎంజాయ్ .......... దేవుడా ఈరోజు రేపు తొందరగా గడిచిపోయేలా చూడు స్వామి అని ప్రార్థించారు .

థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ ............ అని ఆనందబాస్పాలతో చెప్పాను .



అమితమైన ఆనందంతోపైకి వెళ్ళేసరికి చెల్లి ఏకాగ్రతతో చదువుతుండటం చూసి ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా లాప్టాప్ అందుకొని కిందకువచ్చి కాంపౌండ్ లో చెట్టుకింద కూర్చుని ఆన్లైన్ లో వర్క్ మొదలెట్టాను .

కార్తీక వచ్చి అన్నయ్యా .......... మీకు టీ , అక్కయ్యకు ఎనర్జీ కోసం బూస్ట్ ఇచ్చోస్తాను అని పైకివెళ్లి వెంటనే వచ్చేసి , అన్నయ్యా ......... అక్కయ్య ఎంట్రన్స్ అయ్యేంతవరకూ మీరే డౌట్స్ క్లియర్ చెయ్యాలి , అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు అని స్టడీ చైర్ తీసుకొచ్చి నాప్రక్కనే కూర్చుని ఫస్ట్ ఇయర్ లో డౌట్స్ ను అడుగుతోంటే , వర్క్ మధ్యలో సాఫీగా అర్థమయ్యేట్లు టీచ్ చేస్తుండటం చూసి అంటీ లోలోపలే మురిసిపోయారు . మధ్యాహ్నం లోపు రెండుసార్లు fruit జ్యూస్ ను చెల్లికోసం పంపించి మాకు అందించింది .



మధ్యాహ్నం ఒంటి గంటకు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న కృష్ణగాడి నుండి కాల్ రానే వచ్చింది . కార్తీక ఒక్కనిమిషం అని లేచివెళ్లి చెప్పరా ........ అన్నాను .

రేయ్ మామా ........... ఇక్కడ birthday decoration కే lakhs అడుగుతున్నారు .

వాడు decorations చూపిస్తుంటే ప్రక్కనే ఆర్కిటెక్ట్ ను పట్టుకుని వీడికెందుకు ఇవ్వాలి అంతడబ్బు అని ఆలోచించాను .

లవ్ యు రా మామా ........ యు sure కదా అని అడిగాను .

రేయ్ మామా ........... వీటిని తలదిన్నెలా చెయ్యగలవు , ఇప్పుడు కాదు నీ తొలి స్కెచ్ వేసినప్పుడే నాకు తెలుసురా ......... , సాయంత్రం నీ చెల్లికి తెలియకుండా సిటీలోకివెళ్లి decoration కోసం ఏమేమి అవసరమో అన్నింటినీ తీసుకొచ్చి సమయానికి నీ టాలెంట్ తో అద్భుతమైన decoration చేద్దామురా ....... నిద్రకూడా పోయేదిలేదు .

అయితే వచ్చేయ్ రా ........ అని చెప్పాను .

అన్నయ్యా ......... ఏంటి సర్ప్రైజ్ , decoration అని మాట్లాడుతున్నారు అని కార్తీక అడిగింది .

ష్ ష్ ........ కార్తీక మీ అక్కయ్య వింటుంది . మర్నాడు మీ అక్కయ్య తన జీవితంలో తొలి birthday జరువుకోబోతోంది . బిగ్గెస్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము . ఇందులో నువ్వుకూడా మాకు సహాయం చెయ్యాలి . 

అక్కయ్య birthday .......... wow .......... ఆర్డర్ వెయ్యి అన్నయ్యా .......... ఏమైనా చేస్తాను అని అంతులేని ఆనందంతో బదులిచ్చింది .



కార్తీక ఈరోజు సాయంత్రం నుండి మీ అక్కయ్య పైకి వెళ్లకూడదు . ఏమిచేస్తావో ఏమో నీ రూమ్ నుండి బయటకు రాకూడదు అనిచెప్పాను . ఇక్కడ మరొక సర్ప్రైజ్ నాకుమాత్రమే తెలిసినది ఏమిటంటే ఆరోజే మీ కృష్ణ అన్నయ్య birthday కూడా ...........

అద్భుతం అన్నయ్యా .......... అంటే ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారు అన్నమాట , అంటే కృష్ణ అన్నయ్య దృష్టిలో ఒక్క సర్ప్రైజ్ , మన దృష్టిలో రెండు సర్ప్రైజెస్ ........ సంబరాలు అంబరాన్ని దాటాలి అన్నయ్యా ..............

అలాగే కార్తీక ........... నెక్స్ట్ నువ్వేమిచెయ్యాలో నీకు తెలుసుకదా అని అడిగాను .

మీరే చూస్తారుకదా మా అన్నయ్య నా సహాయం అడిగారు అదిచాలు నాకు అని సంతోషంతో పొంగిపోయింది .

లవ్ యు కార్తీక ........ అని తలపై స్పృశించి పైకివెళ్లి చార్ట్ , పెన్సిల్ , కలర్ పెన్స్ మరియు ప్యాడ్ తీసుకుని అక్కయ్యల ఫొటోకు మరియు చదువుకుంటున్న చెల్లికి ఎదురుగా గోడకు ఆనుకుని కూర్చుని , 

 ప్రాణంలా ఫోటోని , చెల్లినీ చూసి గుండెలపై చేయివేసి కళ్ళుమూసుకుని అక్కయ్యా .......... మీ చెల్లి పుట్టినరోజు decoration స్కెచ్ ను మీరే నాకు చూపించాలి అని కళ్ళుతెరిచి చూస్తే ,

అందమైన నవ్వుతో అన్నయ్యా .......... ప్లాన్ గీస్తున్నారు కదూ అక్కయ్యను తలుచుకుని అని అడిగింది .

మన ప్రాణమైన అక్కయ్యతోపాటు , అక్కయ్యకు తెలియని ఒక ప్రాణమైన చెల్లిని కూడా తలుచుకుని మొదలుపెడుతున్నాను చెల్లీ ..........

లవ్ యు soooo మచ్ అన్నయ్యా ......... మా అన్నయ్య అనుకున్నట్లు ప్లాన్ వెయ్యాలి ఇది మీ అక్కాచెల్లెళ్లుగా నేనే చెబుతున్నాను అని తియ్యని నవ్వుతో మాట్లాడుతుంటే , 

చెల్లిలో అక్కయ్య కూడా కనిపించినట్లు పెన్సిల్ చార్ట్ పై అలా అలా వెళ్లిపోతోంది . కృష్ణగాడు వచ్చేలోపు కలర్ఫుల్ decoration ప్లాన్ రెడీ అయిపోవడం చూసి నాకే ఆశ్చర్యమేసింది . వెంటనే లేచి ఫోటోలోని అక్కయ్య బుగ్గపై మరియు చెల్లి కురులపై ముద్దుపెట్టాను . 

ఏంట్రా మామా .......... అంత ఆనందం అని అడిగాడు .

చెల్లీ ......... ఆకాలేస్తోంది , వర్క్ సమయం కూడా అవుతోంది అని చెప్పడం ఆలస్యం ........., 

కిందకు పరుగుతీసింది .

చెల్లెమ్మా .......... నెమ్మది అని మెట్లదగ్గరికివచ్చి చెల్లి అంటీ ఇంట్లోకి వెళ్లేంతవరకూ చూసి , రేయ్ మామా ..........అని చార్ట్ చూపించాను . 

వాడి ముఖం వెలిగిపోయి ఇది వరండా అంటే మనం నిలబడిన ఖాళీ ప్లేస్ , ఒకే ఒక్క మాట రా మామా ........... అద్భుతం . రేయ్ వాడు 100 కు పైనే డిజైన్స్ చూపించాడురా వాడికి సవాల్ విసురుతున్నాను , ఫంక్షన్ తరువాత పిక్ తీసుకెళ్లి చూపించి వాడి నోరుమూయిస్తాను అని సంతోషం పట్టలేక నన్ను అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పేసాడు .

రేయ్ నీ చెల్లికి తెలియకుండా ఎలారా .......... decorate చెయ్యడం అని కంగారుపడిపోతున్నాడు .

రేయ్ కూల్ రా మామా ......... మొత్తం ప్లాన్ చేసేసాను . ఈరోజు రాత్రి నుండే వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అనిచెప్పాను . రేయ్ పెన్ పేపర్ తీసుకురా ఏమేమికావాలో చెబుతాను అలాగే ల్యాప్ తీసుకురా అని birthday డిజైన్స్ చూసి decorate చెయ్యడానికి ఏమేమి అవసరమో చెబుతుంటే వాడు నోట్ చేసాడు . 

అన్నయ్యా ......... లంచ్ రెడీ అంటీ మీకోసం పాయసం చేసింది , అమృతంలా ఉంది త్వరగా రండి అని కిందనుండే కార్తీకతోపాటు పిలిచింది .

ఇదిగో వచ్చేస్తున్నాము చెల్లీ ........., రేయ్ సాయంత్రం వచ్చేటప్పుడు దొరికినవి తెచ్చేస్తాను , మిగతావి మనిద్దరమూ వెళ్లి సిటీ మొత్తం గాలించయినా తీసుకొద్దాము అని చెప్పి ఉత్సాహంతో కిందకు దిగి తినేసి చెల్లీ వెళ్ళొస్తాను అని పర్సులో కార్డ్ ఉందో లేదో చూసుకుని బయటకు వచ్చాను.

రేయ్ మామా ........ కీస్ అంటూ విసిరి పర్ఫెక్ట్ కండిషన్ రా అంకుల్ బాగా మైంటైన్ చేశారు అనిచెప్పాడు .

నవ్వుకుని బయలుదేరాను . 4 గంటలకు వర్క్ పూర్తిచేసి మొబైల్లో ఏవేవి ఎక్కడ దొరకుతాయో సెర్చ్ చేసి అక్కడిక్కడే దగ్గరలోనే ఉండటంతో 75% తీసుకుని లగేజీ వెహికల్ కోసం రోడ్ ప్రక్కనే వేచిచూస్తుంటే నా అదృష్టానికి గోపి అన్నయ్యే వెహికల్లో వచ్చారు . 

మహేష్ ..........అంటూ దిగివచ్చి కౌగిలించుకుని , వెహికల్ కావాలా ఎంతసేపటి నుండి వేచిచూస్తున్నావు . నీకు ఆరోజే చెప్పానుకదా ఒక్క కాల్ చేస్తే ఎక్కడ ఉన్నా వచ్చేస్తాను అని , మన బంధం గట్టిది అందుకే పైవాడు నన్ను సమయానికి ఈదారిలో పంపించాడు . ఏదీ లగేజీ ఎక్కడ అని అడిగారు . చాలానే ఉన్నాయి అన్నా .......చాలా షాప్ లకు వెళ్లి రెడీగా ఉంచినవి పే చేసి తీసుకువెళ్లాలి .

అయితే పదా ........ నా డ్యూటీ కూడా అయిపోయింది అని ఎక్కించుకుని ఒక్కొక్కటే లాగేజీలో ఎక్కిస్తూ వెళుతూ , shit shit .........ఇక మిగిలినవి ఎక్కడ దొరుకుతాయి అని మొబైల్లో సెర్చ్ చేస్తుండటం చూసి , తమ్ముడూ ఏంటి విషయం అని అడిగారు . అన్నయ్యా ........ కావాల్సినవన్నీ తీసుకున్నాను కొన్ని మాత్రం ఎక్కడ దొరకుతాయో తెలియదు . 

ఏదీ చూపించు అన్నారు . చూసి నేనున్నాను కదా తమ్ముడూ అని ముందు అన్నింటినీ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేసి , పదా వెళదాము అని పోనిచ్చారు .

సంతోషంతో కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా ......... గోపి అన్నయ్య కలిసాడురా , మరొక గంటలో అన్నింటినీ తీసుకుని వచ్చేస్తున్నాను ........ మనం మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు . 

రేయ్ ఆలస్యం అయినప్పుడే అనుకున్నాను . ఇలాంటి ఘనకార్యం తమరు చేస్తుంటారని అందుకే నీ చెల్లి ......... రేయ్ అన్నయ్య బుల్లెట్ జాయిన్ అవుతారు మనం ముగ్గురూ స్కూటీలో అక్కయ్యను వెతుకుదాము పదా అంటేనూ ఉదయం ఆగినదగ్గరనుండీ మొదలెట్టేసాము .

లవ్ యు చెల్లీ .......... అని చెప్పి మురిసిపోయాను . 

అంతేరా ......... మీ అన్నాచెల్లెల్లే అన్నీ ఇలా పూర్తిచేసేయ్యండి అని ఫీల్ అవుతోంటే , 

పోరా ....... చెల్లినీ , కార్తీకను జాగ్రత్తగా చూసుకో అని నవ్వుకుని కట్ చేసాను .

మహేష్ ......... సిటీలో అన్ని decorate షాప్ లకు సప్లై చేసే గోడౌన్ కు తీసుకెళతాను నీకు కావాల్సినవన్నీ ఓకేదగ్గర దొరుకుతాయి కొనవచ్చు లేకపోతే రెంట్ కు కూడా తీసుకోవచ్చు . 

ఇవి కాస్త costly మరియు పెద్దవి అన్నా .......... రెంట్ కే తీసుకుందాము . ఫంక్షన్ తరువాత ఎలాగో మనకు ఉపయోగపడవు అనిచెప్పాను .

నాకు తెలిసినవారు ఉన్నారులే మహేష్ ......... నీకు ఏమేమి కావాలో తీసుకో నేను హామీ ఉంటాను అని మాట్లాడుతూ అక్కడికి చేరుకుని లోపలికివెళ్లాము .

ఏమేమి కావాలో పనిచేసే వ్యక్తికి చూపించడంతో , అన్నీ ఉన్నాయి కొనడానికా రెంటా అని అడిగాడు . 

రెంట్ అని గోపి అన్న బదులిచ్చారు . 

తెలియనివారికి ఎలా ఇచ్చేది అని డౌబ్ట్ పడుతోంటే ,

గోపి మనకు తెలిసినవాడేలే , ఇంతకు ముందు మన ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు అని ఓనర్ చెప్పడంతో అన్నింటినీ వెహికల్లో ఎక్కించారు . బిల్ చూసి ఇంత తక్కువనా థాంక్స్ అన్నా ........ ఈపాటి దానికి వాక్కు lakhs అడిగారు అని అడ్వాన్స్ ఇచ్చేసి 8 గంటలకల్లా ఇంటికిచేరుకున్నాము .

అన్నా ........తొందరగా అన్నింటినీ పైకి షిఫ్ట్ చెయ్యాలి అని ఇద్దరమూ నిమిషాల్లో పైకి మార్చేసి అన్నింటిపై పెద్ద పెద్ద కవర్లను కప్పేసాము .

అన్నయ్యా ......... అని డబ్బుతీసి జేబులో ఉంచేసి థాంక్యూ అంటూ కౌగిలించుకుని మీరు రాకపోయుంటే చాలా ఇబ్బందిపడేవాళ్ళము . గోపి అన్నా మర్నాడు చెల్లెమ్మ పుట్టినరోజు ఫ్యామిలీతోపాటు తప్పకుండా రావాలి ఆరోజు సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది అనిచెప్పాను . 

కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని మహేష్ ......... తప్పకుండా వస్తాము శనివారం సాయంత్రం కదూ అని తన బుక్ లో రాసుకుని సంతోషంతో వెళ్లిపోయారు .



బయటకువచ్చి వాడికి కాల్ చేసి ఎదురువెళ్లాను . మధ్యలో కలిసి ఇద్దరిద్దరమూ ఇంటికి చేరుకున్నాము .

చెల్లి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళుతోంటే , తల్లీ కృష్ణ ......... కింద కామన్ బాత్రూమ్లో నీళ్లు రావడం లేదు మీ అంకుల్ రిపేర్ చేయిస్తారు రెండురోజులు పడుతుందట , ఈ రాత్రి నుండే పని మొదలుపెడతారు పనివాళ్ళు , నీకు చదువుకోవడానికి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈరెండు రోజులూ కార్తీక రూంలోకి షిఫ్ట్ అయిపో అని అంటీ చెప్పారు . 

సరే అంటీ బుక్స్ తీసుకొస్తాను అని పైకి వెళుతోంటే , 

చెల్లీ ......... మేము తెస్తాము కదా అని ఇద్దరమూ సంతోషంతో అంటీకి థాంక్స్ చెబుతూ పైకివెళ్లి బుక్స్ అన్నింటినీ తీసుకొచ్చాము .

అన్నయ్యా ......... ఇంత బరువు మేము మొయ్యలేము మీరే వెళ్లి నారూంలో పెట్టండి అని కార్తీక చెల్లి చేతిని చుట్టేసి నవ్వుతూ చెప్పింది .

తలతో కార్తీక తలపై కొట్టి లోపల ఉంచాము .



మహేష్ , కృష్ణ ........ డిన్నర్ చేసి వెళ్ళండి అనిచెప్పడంతో తినేసి , బయట కృష్ణగాడు చెల్లి బుగ్గలను అందుకొని రాత్రన్తా నువ్వే గుర్తుకువచ్చేలా ఏదైనా ప్రేమతో ఇవ్వమని అడిగాడు .

అంటే ..........నేను కాకుండా వేరెవరో నీ ఊహల్లోకి వస్తున్నారన్నమాట , నేను ప్రక్కన ఉంటేనే నేను లేకపోతే ..........అని చిరుకోపంతో వాడి గుండెలపై వాలిపోయింది .

My dear lovely హార్ట్ .......... నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరికీ స్థానం లేదు అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .

చెల్లి లోలోపలే నవ్వుకుని లవ్ యు రా ........ అంటూ గట్టిగా హత్తుకొని బుగ్గపై కొరికేసింది .

స్స్స్........ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రా , ఇకచూడు పైన ఉత్సాహంతో......... అని ఆగిపోయాడు .

ఉత్సాహంతో.......... ఏంటి రా ........

అదే అదే ఉత్సాహంతో నిన్నే కలవరిస్తూ హాయిగా నిద్రపోతాను అని బదులిచ్చాడు .

గుడ్ నైట్ రా , గుడ్ నైట్ అన్నయ్యా ..........

గుడ్ నైట్ ......... అనిచెప్పి , వాడి భుజాలను నొక్కేస్తూ నవ్వుతూ పైకివెళ్లడం చూసి , చెల్లి సంతోషంతో కార్తీకతోపాటు రూంలోకి వెళ్ళిపోయి బుక్స్ ఓపెన్ చేసింది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-05-2020, 05:21 AM



Users browsing this thread: 184 Guest(s)