Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహేష్ ........... తన పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుతావని నిన్నటి నుండి ఎదురుచూస్తున్నాను . next సాటర్డే మహేష్ అని బదులిచ్చారు .

అమ్మా కృష్ణ birthday కూడా ఆరోజే , అంటే ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారు మహేష్ .............

అమ్మా మరి జైలులో ఒక్కసారి కూడా జరుపుకోలేదు .

జైలులో ఉన్నన్ని రోజులూ పుట్టినరోజు వద్దు అమ్మా అని మాట తీసుకుంది మహేష్ .............

అమ్మా అయితే చెల్లి తొలి పుట్టినరోజు అంగరంగవైభవంగా జరపాలనుకుంటున్నాను. మీరు రాగలరా ........... అని అడిగాను . 

మహేష్ అంతకన్నా అదృష్టమా ........... మీకోసం ఎంత దూరమైనా వస్తాను అని బదులివ్వడంతో , థాంక్స్ అమ్మా ..........ఎదురుచూస్తుంటాము . చెల్లికి తెలియనివ్వొద్దు సర్ప్రైజ్ అనిచెప్పాను . 

పెదాలపై చిరునవ్వుతో లోపలికివచ్చి అక్కయ్యా అక్కయ్యా .......... అని తలుచుకుంటూ ఆల్బమ్ గుండెలపై ప్రాణంలా హత్తుకొని నిద్రలోకి జారుకున్నాను.

అన్నయ్యా , అన్నయ్యా ........... అని పిలుస్తూ బుగ్గను స్పృశిస్తూ నవ్వుతున్న చెల్లిని కళ్ళుతెరిచి చూసి , పెదాలపై తియ్యదనంతో చెల్లెమ్మా ......... అప్పుడే తెల్లారిపోయిందా మీ అక్కయ్యను తలుచుకుంటే చాలు సమయమే తెలియదు.......

లేదు అన్నయ్యా ........... 5 గంటలు అయ్యింది . నేను స్నానం చేసి రెడీ అయిపోయాను . నీ ఫ్రెండ్ రెడీ అవుతున్నాడు . తెల్లారేలోపు మీరుకూడా రెడీ అయిపోతే బయలుదేరుదాము . 

ఇంత తెల్లవారుఘామునే ఎక్కడకు చెల్లీ ...........

ఈసమయంలో అయితేనే అక్కయ్యను కనిపెట్టగలం అన్నయ్యా .......... మహిళలంతా ముగ్గులువెయ్యడానికి బయటకు వస్తారు ..............

సూపర్ ఐడియా చెల్లీ ............ ఇదిగో నిమిషాల్లో రెడీ అయ్యివస్తాను , గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా .......అని నుదుటిపై ముద్దుపెట్టిలేచాను .

లవ్లీ గుడ్ మార్నింగ్ అన్నయ్యా ............ అని మెయిన్ డోర్ తెరిచి బయట ఉన్న పాల ప్యాకెట్ అందుకొని వంట గదిలోకివెళ్లింది .



బాత్రూం డోర్ దగ్గరికివెళ్లి రేయ్ ఎంతసేపురా అని చిన్నగా వాడు బయటకు వచ్చేన్తవరకూ డోర్ కొడుతూనే ఉన్నాను . 

తియ్యని కోపంతో బయటకువచ్చి కృష్ణా ......... చెప్పాను కదా నేను బయటకువచ్చాక వీణ్ణి లేపమని అని డొక్కలో సున్నితంగా గుద్ది నవ్వుతుంటే ,

వాణ్ణి బయటకు లాగేసి నవ్వుతూ బాత్రూమ్లోకివెళ్లి అర గంటలో బయటకువచ్చి రోజూ కొత్త డ్రెస్ లే వేసుకుంటూ హాల్లోకి వచ్చాను . 

చెల్లి అందించిన కాఫీ తాగి అప్పుడే తెల్లవారుతుంటే అక్కయ్య మూడు ఫోటోలు ఒక్కొక్కరమూ ఒక్కొక్కటి తీసుకుని ఉత్సాహంతో కిందకు దిగి చెల్లి స్కూటీలో మేము సైకిళ్ళల్లో మొదట మా వీధి మొత్తం బయట పనిచేసుకుంటున్న ముగ్గులు వేస్తున్న స్త్రీలను చూసి నిరాశతో మరియు వాకింగ్ చేస్తున్న వారికి ఫోటో చూపించి చూసారేమోనని అడుగుతూ ముందుకు కదిలాము.



రేయ్ ముగ్గురమూ కలిసి వెతకడం కంటే వేరువేరయ్యి వెతకడం వలన సమయం ఆదా అవుతుంది అని కృష్ణగాడు చెప్పాడు . 

నువ్వు చెల్లి కలిసి వెళ్ళండి , నేను మరొకవైపు వెళతాను . రేయ్ ......... చెల్లికి 10 అడుగుల దూరంలోనే ఉండాలి లేకపోతే .............

తెలుసురా మామా ......... నావీపు విమానం అయిపోతుంది అంటావు అంతేగా అని నవ్వుకుని చెరొకవైపుకూ వెళ్లి వీధివీధులూ వెతుకుతూ 9 గంటలకు ఇంటికి నిరాశతో చేరుకున్నాము . 

అన్నయ్యా .......... అక్కయ్య కనిపిస్తుంది అన్న నమ్మకం నాకుంది . మన అమ్మవారు అక్కయ్యకు తోడుగా ఉండి ఏకష్టం రానీకుండా కాస్తుంటారు అనిచెప్పడంతో , 

నిజంగానా చెల్లీ ..........అని నా పెదాలపై చిరునవ్వు చిగురించడంతో గుండెలపై వాలి, అన్నయ్యా .........ఆకాలేస్తోంది కదూ మ్యాగీ చెయ్యనా అని అడిగింది . 

చెల్లీ మేము కూడా సహాయం చేస్తాము ఏరా అంటూ పైకివెళ్లి మేము అవసరమైనవి కట్ చేస్తుంటే , 

లవ్ యు soooooo మచ్ ముద్దొచ్చేస్తున్నారు ఉమ్మా ఉమ్మా ........... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి, చెల్లి గ్యాస్ వెలిగించి మ్యాగీ తయారుచేస్తుంటే ,



తల్లీ కృష్ణవేణి , కృష్ణ , మహేష్ .............

అంటీ ......... అంటీ మీరు పిలవకండి , నేరుగా లోపలికివచ్చెయ్యండి మీ ఇల్లే కదా అధికాకుండా ఒక్కరోజులోనే మీరు మాకు అత్యంత ఆత్మీయులు అయిపోయారు అని చెల్లి సంతోషంగా లోపలిపిలుచుకునివచ్చింది . 

అయితే మీరుకూడా లోపలికి వచ్చేయ్యాలి సరేనా అని అందరమూ నవ్వుకున్నాము.



తల్లీ కార్తీక లోపలికి రామ్మా .........అని అంటీ పిలిచింది .

తలదించుకునే నెమ్మదిగా లోపలికివచ్చి అంటీ వెనుకాల నిలబడింది . 

తల్లీ మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని , మీ అంకుల్ మీగురించి మొత్తం వివరించాక పశ్చాత్తాపపడి రాత్రన్తా మిమ్మల్ని ఎప్పుడు క్షమాపణలు కోరుదాము అని నిద్రకూడాపోలేదు .

 మీరు గేట్ తీసుకుని బయటకు వెళ్లడం చూసి తనే స్వయంగా మీకోసం స్వీట్ చేసి , అప్పటి నుండి నిమిషానికోసారి మీరు వచ్చారేమోనని గేట్ వైపు మరియు పైకివచ్చి ఒక 100 సార్లు చూసిందేమో ..........

మీరు పైకివెళ్లడం చూసి అమ్మా ........ నాకు ఎలాగో ఉంది నువ్వుకూడా రావే అని లాక్కునివచ్చింది . మీరు తనను క్షమించామని చెప్పేంతవరకూ నన్ను మీ అంకుల్ ని అడుగుకూడా వెయ్యనివ్వదు . ఇది ఒకసారి ఏమైనా అనుకుంటే సాధించేంతవరకూ వదలదు అని ప్రాణంలా మొట్టికాయవేసింది అంటీ .



 రేయ్ నువ్వు వెళ్లి మ్యాగీ సంగతి చూడు అని కృష్ణగాన్ని తోసేయ్యబోతుంటే , కృష్ణ నువ్వుండు నెనుచూస్తాను అని అంటీ వంటగదిలోకి వెళ్లారు .

 కార్తీక మా అన్నయ్య తమాషాకి నిన్ను భయపెట్టాలని అలా బెదరగొట్టేశారు . మా అన్నయ్యా , వీడు ఇంతింత కండలు పెంచినా బుజ్జాయిల మాదిరి , ఇప్పటికీ నేనే తినిపించాలి తెలుసా తినడానికి కూడా రాదు అని చెబుతుంటే ,

కార్తీక తలదించుకునే ముసిముసినవ్వులు నవ్వుతోంది . 

నిన్న నువ్వు చూడలేదు కదూ .......... మీ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా నేనే తినిపించాను కావాలంటే అంటీని , అంకుల్ ను అడుగు .

అవును తల్లీ ............ కృష్ణవేణి తినిపించకపోతే తినను కూడా తినరు . ఇప్పుడు మ్యాగీ కూడా అంతే కావాలంటే నువ్వుకూడా చూడు . 

అంటీ మరొక రెండు ప్యాకేట్స్ వెయ్యండి మీరుకూడా ఇక్కడే తినాలి అని చెల్లి కార్తీక చెయ్యి అందుకొని వంట గదిలోకి వెళుతోంటే ,



నన్నే బెదరగొడతారా .......... ఇక చూసుకోండి అంటూ కన్నుకొట్టి ముసిముసినవ్వులతో వంట గదిలోకి వెళ్ళిపోయింది .

మళ్లీ మొదటికొచ్చేసింది , అంకుల్ మాగురించి చెప్పకుండా ఉండాల్సింది అని మనసులో అనుకున్నాను .

10 నిమిషాల్లో అన్నయ్యా , కృష్ణ ......... రెడీ అంటూ అంటీకి , కార్తీకకు వడ్డించి మాకోసం తీసుకొచ్చి ఫోర్క్ తో తినిపించింది . 



కృష్ణ అక్కయ్యా ......... చెబితే నేను నమ్మలేదు , how స్వీట్ ......... అక్కయ్యా , అక్కయ్యా ........... మీరేనా నేను తినిపించినా తింటారా మహేష్ గారు అని నాకళ్ళల్లోకే చూస్తూ అడిగింది .

చెల్లివైపు తల అడ్డంగా ఊపాను . 

కార్తీక ............ అన్నయ్యకు , 

అక్కయ్యా ........... చూస్తుంటే మీకు అపద్దo చెప్పడానికి రాదని తెలుస్తోంది అని నవ్వుకుని , నాచేతితో నేను తెచ్చిన స్వీట్ తింటేనే మీరు నన్ను క్షమించినట్లు లేకపోతే నేను బాధపడుతూనే ఉంటాను .

అన్నయ్యా .......... ఈ ఒక్కసారి , కార్తీక తినిపించు అనిచెప్పడం ఆలస్యం ,

పట్టరాని ఆనందంతో ముందుకువచ్చి బాక్స్ తెరిచి అందులో ఉన్న స్పూన్ తోనే నోటిదగ్గరకు తీసుకొచ్చింది . 

నా ప్రాణమైన చెల్లిని తప్ప వేరెవరినీ చెల్లీ అని పిలువలేను , నాకు మీరు ఆ బంధంతోనే సమానం గుర్తుంచుకోండి అలాగయితేనే తింటాను .

నాకు కావాల్సింది కూడా మీరు చెల్లీ అని పిలవకపోవడమే , మిమ్మల్ని చూసిన క్షణమే నాలో పులకరింత నేను మీదాన్ని అయిపోయాను అని మనసులో అనుకుని తినిపించింది . 



బాబు మహేష్ మీగురించి మాకు ఒక్కరోజులోనే అర్థమైపోయింది , అది మీకంటే చిన్నది పేరు పెట్టి పిలవండి అని అంటీ చెప్పింది . 

థాంక్స్ అంటీ ......... 

తినిపించింది నేను అయితే థాంక్స్ అమ్మకు చెబుతావేంటి మహేష్ గా......రు .........అని చిరుకోపంతో , ఇంతకీ స్వీట్ ఎలా ఉంది అని అడిగి నా మాట కోసం ఆశతో ఎదురుచూస్తోంది .

బాగుంది అని తలఊపగానే , థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ అని వెంటనే స్పూన్ తో అందుకొని తన నోటిలోకి తీసుకుని అవును soooooo స్వీట్ అని కన్నుకొట్టింది . 

మళ్లీ తినిపించబోతే , కార్తీక అన్నయ్య ఉదయం ఉదయమే స్వీట్ తినరు తరువాత తింటారులే అని అందుకొని ప్రక్కన పెట్టేసి మ్యాగీ తినమని చెప్పింది . 

లవ్ యు చెల్లీ ........... అని తొలిసారి చెల్లి చేసిన మ్యాగీని ఇద్దరమూ ఆవురావురుమంటూ తింటుంటే , చెల్లి తిని అన్నయ్యా ......... అంత పర్ఫెక్ట్ అయితే లేదుగా ...........

ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వి  నా ఏంజెల్ , నా చెల్లి ఏమిచేసినా ఎలాచేసినా మాకు ప్రాణం పొంగిపోతూ ఆ ఆ .......... అని నోరు తెరిచాము .

లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ప్లేట్ పక్కన ఉంచేసి అమాంతం మాఇద్దరినీ హత్తుకుంది . 

లవ్ యు రా , లవ్ యు చెల్లీ .........అని నుదుటిపై ముద్దులుపెట్టి , తరువాత రోజంతా హత్తుకోవచ్చు ఆకలేస్తోంది అని చెప్పగానే ,

లవ్ యు లవ్ యు ............ అని ఆనందబాస్పాలను తుడుచుకుని ప్రేమతో తినిపించింది .



అంటీ మా అనుబంధాన్ని చూసి ఆనందిస్తూ కృష్ణవేణి మొదటిసారి అయినా చాలాబాగా చేసావు తల్లీ ..........అని తినింది .

మహేష్ ........... అక్కయ్యలా నన్ను ఎప్పుడు నీ గుండెలపైకి తీసుకుంటావు అని తీరని కోరికను మనసులో అనుకుంటూ నన్నే తీక్షణంగా చూస్తోంది . 

ఇద్దరమూ ఆతృతతో చెల్లీ నాకు , రేయ్ నాకు అని ఇద్దరమూ తోసుకుంటూ ........ నోళ్లు తెరిచాము . ముందు ఎవరికి మా అన్నయ్యకా ........ నా ప్రియుడికా ........ అని మేమిద్దరమూ తోసుకోవడం చూసి గబుక్కున తనే తినేసి బుజ్జాయిల్లా నెనుచెప్పినట్లు వింటేనే అని అందమైన నవ్వుతో తియ్యని కోపంతో చెప్పింది .

నా చెల్లి మాట , నా ఏంజెల్ మాట మాకు వేదంతో సమానo . చెల్లీ ముందు వాడికి , రేయ్ కృష్ణా ముందు వాడికి ......... అని మళ్ళీ తోసుకోవడం చూసి , మిమ్మల్నీ ...... ఇలాకాదు అంటూ మరొక ఫోర్క్ తీసుకొచ్చి ఇద్దరికీ ఒకేసారి తినిపించి తానూ తిని ముగ్గురమూ సంతోషన్గా నవ్వుకున్నాము .



అంటీ అంకుల్ ఉన్నారా ..........

కింద కాంపౌండ్ లో చల్లని నీడలో ఖాళీగా కూర్చుని పేపర్ తిరగేస్తున్నారు బాబు .

అయితే వస్తున్నాము అని కృష్ణగాన్ని డబ్బు తీసుకురమ్మని చెప్పాను . 

అన్నయ్యా ......... అంతలోపు నేను వంట గది శుభ్రం చేస్తాను అని తిన్న ప్లేట్లను తీసుకెళ్లింది . 

ఇద్దరమూ కిందకు దిగుతోంటే ముందు అంటీతోపాటు వెళుతున్న కార్తీక వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ సిగ్గుపడుతోంది . 

కోపంతో అయినా అర్థమయ్యేలా చెప్పాలి రా .........

రేయ్ అంత అర్థం చేసుకునే వయసు రాలేదనుకుంటాను కాస్త నెమ్మదిగా డీల్ చెయ్యాలి , మనవలన అంటీ అంకుల్ బాధపడకూడదు అని కృష్ణగాడు చెప్పడంతో సరే అవకాశం కోసం ఎదురుచూద్దాము అని అంకుల్ దగ్గరికి వెళ్లి విష్ చేసాము .



Dad నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి పరిగెత్తింది . 

ఆ ........ మహేష్ , కృష్ణ గుడ్ మార్నింగ్ కూర్చోండి అనిచెప్పారు . మహేష్ .......... రేపు ఉదయమే వెళ్లి మీ వాళ్ళ గురించి ఆరా తీస్తాను . సిటీలోని అన్ని ఆఫీస్ లనుండి సమాచారం సేకరిస్తాను . చుట్టుప్రక్కల పల్లెలు కూడా వదలను అని చెప్పారు . 

అంకుల్ రోజురోజుకూ మీ రుణం పెరిగిపోతూనే ఉంది . 

ఎవరికోసం చేస్తున్నాను . మీరు నా సొంతమనుషులు అలా మీరేమీ ఫీల్ అవ్వకండి . 

థాంక్యూ sooooo మచ్ అంకుల్ అని అడ్వాన్స్ , రెంట్ గురించి అడిగాను .

ఇప్పుడే చెప్పాను కదా మీరు .........., కాబట్టి అడ్వాన్స్ అవసరం లేదు మీరు ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి రెంట్ కూడా అవసరం లేదు కానీ మీ ఆత్మాభిమానం నాకు తెలుసు కాబట్టి సగం ఇవ్వండి . ఆ డబ్బుతో నేనేమి చేసుకుంటాను ముగ్గురు కూతుళ్ళలో ఇద్దరికి ఘనంగా పెళ్లిళ్లు చేసాను ఫారిన్ లో హ్యాపీగా ఉన్నారు . ఇక ఇదంతా కార్తీక కోసమే తనకు కూడా పెళ్లి చేసి కృష్ణ రామా అనుకుంటూ హాయిగా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాము .

మీ కోరిక స్వఛ్చమైనది అంకుల్ .............

ఇక లగేజీ షిఫ్ట్ చేసిన కూలీ డబ్బులు ............

ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారా ..........నేనెప్పుడో మరిచిపోయాను . మీరూ మరిచిపోండి . 

మీ అంటీ కాఫీ సూపర్ గా చేస్తుంది అందుకోండి అని సిగ్గులోలికిపోతున్న కార్తీక నుండి అందుకొని మాకు ఇచ్చారు . 

Dad ......... కాఫీ నేనే చేసాను . 

ఏంటి నువ్వు చూసావా నా బంగారుతల్లీ .........మీ అమ్మ తిన్న ప్లేట్ తీసుకురమ్మన్నా తీసుకెళ్లవు . ఉదయం స్వీట్ చేసావు చాలా బాగుంది ఇప్పుడు కాఫీ ...........అని తాగి వాహ్......... లైవ్ యు తల్లీ చాలా చాలా బాగుంది .



Dad మీరుమాత్రమే తాగుతున్నారు . 

మహేష్ , కృష్ణ .......... తాగండి అని ఫోర్స్ చెయ్యడంతో , కార్తీక వైపు చూడకుండా తాగాము . 

అంకుల్ కు డబ్బు ఇచ్చేసి చెల్లీ కోసం బుక్స్ తీసుకురావాలి .........

క్యారి ఆన్ మహేష్ .......... 

Dad .........

ఆ మరిచేపోయాను మహేష్ , మీరు నా తల్లిని క్షమించిన ఆనంద సమయంలో లంచ్ కు ముగ్గురూ వచ్చెయ్యండి .

అంకుల్ ............ 

మహేష్ please please అప్పుడే నాన్ వెజ్ తెచ్చేసాను అనిచెప్పడంతో , 

సరే అంకుల్ అని లేచాము . 

నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని కార్తీక కన్నార్పకుండా చూస్తూ , తలెత్తగానే మీకోసం ప్రాణం పెట్టి అమ్మకు హెల్ప్ చేస్తాను ఒప్పుకున్నందుకు థాంక్యూ soooo మచ్ అని చిలిపిగా కన్నుకొట్టింది . 

చెంప చెల్లుమనిపించాలని కంట్రోల్ చేసుకుని పైకివెళ్లాము . 



రేయ్ కృష్ణ ........... మొబైల్ కు ఏవో mails వచ్చాయి చూడమని చెప్పింది . 

వాడు చూసి రేయ్ మామా .......... ఇది ఆన్ సీజన్ కాబట్టి రోజుకు రెండుమూడు గంటలే పని ఇవ్వగలము మీకు ఇష్టమైతే మధ్యాహ్నం ఎలా చేయాలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డీటెయిల్స్ ఇస్తాము ఆన్లైన్లోకి రాగలరు అని రిప్లై ఇచ్చారు . 

Ok అని , ఉదయం అనుకూలం అని పంపించు ......... మధ్యాహ్నం కావాలంటే మరొక జాబ్ చూసుకుంటాను అనిచెప్పాను . 

చూసుకుందామురా మామా ............

వద్దురా మామా .........చెల్లికి తోడుగా ఒక్కరైనా ఉండాలికదా ..........

అయితే ఒక ఐడియా ............ షిఫ్ట్స్ ప్రకారం ఆన్లైన్లో జాబ్స్ చేద్దాము , మిగిలిన సమయంలో ఒకరము ఇక్కడే ఉండి మరొకరు పార్ట్ టైం జాబ్ చెయ్యొచ్చు . బయట జాబ్ చేస్తూ అక్కయ్యను కూడా వేతకావచ్చు .



ఇది బెస్ట్ ఐడియా అన్నయ్యా .............

చెల్లికి కూడా నచ్చింది కాబట్టి నువ్వు ఉదయం వెళ్లు , నేను మధ్యాహ్నం వెళతాను ..........

సాయంత్రం ముగ్గురమూ ........... సిటీలోని గుళ్లు , పార్క్స్ , షాపింగ్ సెంటర్లకు వెళ్లి అక్కయ్యకోసం వెతుకుదాము అని చెల్లి చెప్పింది . 

చెల్లీ ............ ఉదయం నుండి చదివి చదివి అలసిపోయి ఉంటావు ..........

అన్నయ్యా ........... ఆ సాయంత్రం మిస్ అయిన సమయాన్ని నైట్ కవర్ చేసేస్తాను . మన అక్కయ్యకోసం వేతకడంలో నాకు మరింత ఉత్సాహం వస్తుంది . మరింత బాగా ప్రిపేర్ అవ్వగలను . 

అలా అయితే డన్ అంటూ చేతిని ముందుకుచాపాను . యాహూ ........ అంటూ ఇద్దరూ నా చేతిని కలిపి సంతోషంతో గట్టిగా హత్తుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 29-04-2020, 05:50 AM



Users browsing this thread: 150 Guest(s)